అడ్డం
- మాటలమడుగులో దయతో కాలు పెట్టండి, అంటున్నారీవిడ (6)
సమాధానం: మెర్సీమార్గరెట్ - చిట్టగాంగ్ విప్లవం లోని చైతన్యం (6)
సమాధానం: పింగళిచైతన్య - వత్తి చూస్తే ప్రతిదీ కాలేదే (2)
సమాధానం: ప్రత్తి - అటుగా అకులన్నీ మేసినది ఆడు మేకా? పాడు మేక కదా! (2)
సమాధానం: జఅ - మరకతములో పండునది(4)
సమాధానం: కమతము - పీలగా ఉన్న కడపటిది కన్నది (4)
సమాధానం: పీడకల - సగం తెరిచినదే ప్రచురించినది (4)
సమాధానం: ముద్రితము - ముద్దుతోడిదే (4)
సమాధానం: మురిపెము - గాల్లో ఎగిరేదే (3)
సమాధానం: విహంగ - మంచంకోళ్ళలా ముగ్గురున్నది వీరే (5)
సమాధానం: పంచపాండవులు - ఏ కాలమైతేనేమి కొంగతపస్సు దొంగదే (6)
సమాధానం: కాలనేమిజపం - అటుదిటుగా మెరిసిన పాశం (2)
సమాధానం: శంపా - చివర ఉకారము లేనిది, ఊపిరిత్తులకిబ్బంది, రుచికాదు (3)
సమాధానం: వగర - 20 నిలువు దెబ్బకి కకావికలైన జనం (2)
సమాధానం: జాప్ర - ఆకులున్న కుటీరమే (4)
సమాధానం: పర్ణశాల - తెరచినా, మూసినా జంటే, రెండే (4)
సమాధానం: కనుదోయి - అస్తవ్యస్తంగా ఉన్నా వంద ఉంటేనే లెక్క (4)
సమాధానం: తశకము - ఒరే! వగలు కాదురా బాబూ! ఎప్పుడూనూ (4)
సమాధానం: రేవగలు - గొప్ప మహారాజును గురించి రాసిన గొప్ప కావ్యం, ఉత్తమం (6)
సమాధానం: పురుషోత్తముడు - ఒకటైతే నంది అవార్డు, ఎక్కువున్నాయి కనక సాహిత్య అకాడమీ అవార్డు … బంగారంలా ఉండేవి(6)
సమాధానం: స్వర్ణకమలాలు
నిలువు
- తిరిపెమెత్తి పూత పూయచ్చా? (2)
సమాధానం: మెత్తి - తిరగేసి పూసినదా? (3)
సమాధానం: మాలామ - తొలిమాసపు పున్నమికి క కలిపితే ఆ మాసమే (3)
సమాధానం: చైత్రిక - తలతీసి తిరగేస్తే ఎంత రాజైనా ఏమవుతాడు? చెలికత్తె కాక? పాపం! ( 2)
సమాధానం: న్యజ - ఈయన రాజ్‌పథ్ మీద నిలబడి జాతికి సొందేషాలిచ్చేవారు (6)
సమాధానం: ప్రణబ్‌ముఖర్జీ - సత్తాలేక ఊరేగేవాడు (6)
సమాధానం: ఉత్సవవిగ్రహం - ఆక్షేపణకు తావులేని క్షిపణివీరుడు (6)
సమాధానం: అబ్దుల్‌కలామ్ - పుల్లావుకు ఎర్రరంగు వేస్తే బావుంది (4)
సమాధానం: కపిలము - సమూలము సరిచేసి కుదిస్తే బాగా దంచుతుంది (4)
సమాధానం: ముసలము - లత మీద చీముంటుంది కానీ లతే చీమవుతుందా (4)
సమాధానం: పీలకము - కిందనించి ఎడ్లని అదిలించాలి (4)
సమాధానం: లకోనిము - విలువదిలిన బాణం రేటెక్కువ (3)
సమాధానం: విలువ - దకారము కాని చతుష్టయము (3)
సమాధానం: గకార - మన అన్నవరం సత్తెన్న ని చూసి శబరిమల చేరిందా? (2)
సమాధానం: పంపా - పులిలా పవర్ స్టార్ విసిరినది (2)
సమాధానం: పంజా - పేరు పూర్తిగా లేకపోయినా ఈశ్వరకృపగల తొలిపౌరుడు, (6)
సమాధానం: శంకర్‌దయాళ్ - ఆకాశంలో పూచిందా, అందుతుందా, అసలుందా? (6)
సమాధానం: గగనకుసుమం - మొదటి మహిళకి ఈ పాటి ప్రతిభ వద్దూ? (6)
సమాధానం: ప్రతిభాపాటిల్ - ప్రదీప్ సర్కార్ లోలిత కు పెళ్ళయింది (4)
సమాధానం: పరిణీత - మళ్ళీ ప్రకాశించేదే (4)
సమాధానం: లసితము - భర్త, మామలతో మాజీ విశ్వసుందరి ఆటా, పాటా (4)
సమాధానం: కజరారే - ఉడుములకతి దగ్గరగా, కాస్త వేరుగా వినిపించే కష్టాలు (4)
సమాధానం: యిడువులు - ఎటునించైనా ఇన్నే ఉపచారాలు (3)
సమాధానం: శడషో - తలలేక తిరుగాడిన కీర్తి సరిగమల్లోనా? (3)
సమాధానం: గరిమ