[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- మప్పితం, మర్యాద
సమాధానం: ఘరానా
- దంపతుల కోరిక
సమాధానం: పాపాయి
- దీనితో రోమన్ హిస్టరీ ప్రారంభం కాలేదు
సమాధానం: మనుచరిత్ర
- మందూ, ఇదీ!
సమాధానం: మాకూ
- ఋణం నిప్పు కాదు, నీరు
సమాధానం: అప్పు
- ఈ ప్రొడ్యూసరుకి తల్లిలేదు
సమాధానం: నిర్మాత
- నేటి వీడు రేపటి రేడు కావచ్చు.
సమాధానం: బాలుడు
- విధి ఇదంటారు
సమాధానం: బలీయం
- తాళం లేని తాళం
సమాధానం: పాతాళం
- మాసకానితిథి
సమాధానం: అమాస
- పూజారి మాత్రం ఇవ్వడు
సమాధానం: వరం
- పిల్లికూన వెయ్యి రూపాయలు
సమాధానం: సంచి
- సంఘటనలు
సమాధానం: జరగడాలు
- ఆహా
సమాధానం: అబ్బురం
- నిజం మొదలు నీలుగు
సమాధానం: నిక్కువం
నిలువు
- ఒకటైతే స్త్రీ, రెండైతే ప్చ్!
సమాధానం: రామ
- నామాట, అదే అందరినోటా
సమాధానం: నానుడి
- పలాయన వాదుల నినాదం
సమాధానం: పారిపో
- అడుక్కోవడం అభినయించడానికా
సమాధానం: పాత్ర
- “కన్యాశుల్కం” లో ఒక ఇంటి పేరు
సమాధానం: నేమాని
- సెలవియ్యండి, ఇలాంటి మాటలు
సమాధానం: చెప్పుడు
- నామవాచకం పదిలో రెండు
సమాధానం: కూర్మావతారం
- ఇందులో విభక్తి లోపంలేదు
సమాధానం: అలుక్సమాసం
- అష్టపది (ఛందస్పుకాదు)
సమాధానం: సాలీడు
- భీముడు, ఆంజనేయుడు
సమాధానం: పావని
- మంత్రీ! లయంతో నీ ఆఫీసు
సమాధానం: సచివా
- గోరువంక
సమాధానం: కురరం
- దొరకడానికి పోతేకద? అక్కడే ఉంది స్వర్గం
సమాధానం: కడాని
- ఇలాగా అల్లడం జడ
సమాధానం: జబ్బు
- వెలితి, 11 నిలువులో చూడు.
సమాధానం: లుక్కు