గడి నుడి – 16

గడినుడి 15 పూర్తిగా నింపినది ఈసారి కామాక్షి గారు ఒక్కరే. కామాక్షి గారికి అభినందనలు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల, 2. పి.వి.ఎస్. కార్తీక్ చంద్ర 3. జి.బి.టి. సుందరి 4. హేమంత్ గోటేటి 5. హరిణి దిగుమర్తి. వీరికీ మా అభినందనలు. గడి నుడి – 15 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఫిబ్రవరి 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే, లేకుంటే ముగింపు తేదీ దాటగానే, గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. బలం విశేషంగా బోల్తాపడి జాగుకు కారణమైంది
  2. సవరణ చేస్తే చక్కనౌతుంది
  3. శ్రీశ్రీ సాక్షిగా ఊరికే
  4. కలం కవి మీద తిరగబడి చెదిరిపోయింది
  5. హారతవడంలో పద్ధతి
  6. వాహనం కాదు. గర్భగుడి పైకప్పు మీదుండేది
  7. ఒక దేశమంత పెద్ద ఇల్లు
  8. కవి రమ్యంగా వర్ణించదగిన కంచుకం
  9. ముక్కంటి
  10. ఇక్కడి మాన్యాలు ఎవరికీ కాబట్టవు
  11. ఆంధ్రమహాభారతకర్తలు
  12. విజయా వారి ప్రొడక్షను. పేరే కాదు సినిమా కూడా పెద్దదే.
  13. దగ్గరికొచ్చా
  14. 23 నిలువు కుదరకపోవడం
  15. ఒక కట్టడం, ఒక సాధనం
  16. డుతుసుద్రీమా
  17. అడ్డం 19తో కలిసి సామెత సంపూర్ణం
  18. పింగాణీ పాత్రలు తయారుచేసే మట్టి
  19. కుమార భీమేశ్వరుడి ఆరామం
  20. పాత కంపెనీలో చేసిన మహాపాపం
  21. షష్టిపూర్తి సంవత్సరం
  22. మనిషి రుచి మరిగిన రాక్షసుల ట్రేడ్ మార్క్ డయలాగా?
  23. సద్దపిండితో చేసిన సంగటి
  24. క్యాంపు
  25. భ్రాంతి
  26. లోతైన కవళిక
  27. పీనాసితనం
  28. శివుడిని పెళ్ళాడిన పార్వతి

నిలువు

  1. అడ్డం 41 లాంటిదే, సాధారణంగా పెళ్ళివారిది
  2. బలిపీఠం
  3. వనం దగ్గర సర్దుకున్న నోరు
  4. అర్థాలంకారాల్లో ఒకటి
  5. “రామసేతు” నిర్మాణంలో పాలుపంచుకున్న బుడుత
  6. పడుగుపేకలను కూర్చే పలక
  7. మనోల్లాసకరమైన జాతర!
  8. కొండనాలుక
  9. కృప అనే పేరు టాలెమీకి ఇలా వినబడింది కాబోలు
  10. తులసి భర్త
  11. పనీపాటా లేకుండా
  12. చీలు, విడిపోవు
  13. కడలి
  14. చేపట్టు
  15. పేరులో చా(వు), కల్లు కలిసిన ఊరు
  16. చేకొని
  17. చాసో రాసిన గవిరి కథ
  18. ఈ ఊరు బిస్కట్లకు కూడా ప్రసిద్ధి
  19. మేనల్లుడి దెబ్బకు తలకిందులుగా పడిన శిశుహంతకుడు
  20. ఈ విమర్శల పదును స్టార్ ఫాన్సుకు బాగా తెలిసొచ్చింది
  21. ఇవి శతకోటట
  22. మట్టిబొమ్మ
  23. యుద్ధభూమి
  24. ఆయుష్షు తీరాక ఆర్కైవులో చేరేది
  25. కారును కలిపేసుకుంటుంది కాన చిట్టిని కూడా
  26. వారం నడుమ కనిపించే జంతువు
  27. సమంగా ఉండడం
  28. టీకా తోడి వివరణ