అడ్డం
- కుడినుంచి ఎడమకు తినే విందు
సమాధానం: తమెఆ - పచ్చిదానిమ్మ ఒరగబెట్టే రుచి
సమాధానం: ఒగరు - శైలమే చిహ్నమయితే ఇక మరపే రాదు
సమాధానం: కొండగురుతు. గురుతు వస్తే మరపురానట్టే కదా! - నడుము అంధకారంలో కలిసిపోయింది
సమాధానం: చీకటి. కటి అంటే నడుము. - పిల్లలపై ప్రేమ బహు రుచిమంతం
సమాధానం: కడుపుతీపి. కడు అంటే బహు(చాలా) - అణువంత వజ్రంతో దోసెలు వేసుకుందాం
సమాధానం: రవ్వ. రవ్వ అంటే అణువు, వజ్రం అనే అర్థాలున్నాయి. - చేయందిస్తే తోడుకోవడమే
సమాధానం: చేదుడు - దేవుళ్ళ లంచాలు
సమాధానం: ముడుపులు - ఘాటైన రుచిగల మాట
సమాధానం: నుడికారం - గడ్డి తినడానికి కూడా పన్ను కట్టాలా!
సమాధానం: పుల్లరి. పుల్లరి అంటే గడ్డిపైన వేసే పన్ను. - అడ్డదిడ్డంగా పడితే విప్పడం కష్టమే
సమాధానం: డిము - క్షారనిక్షేపములో వేసే శిక్ష
సమాధానం: ఉప్పుపాతర. క్షార=ఉప్పు, నిక్షేపము=పాతర. - భారవి కవిత్వంలో కనిపించే కంచుకం
సమాధానం: రవిక - చూచాయగా వంకాయను చూస్తే, తెల్లచొక్కాపై వెంకటేశం వేసుకొనే తుండుగుడ్డ కనిపిస్తుంది
సమాధానం: కాయగావంచా. ఇది అన్నిటికన్నా కష్టమైన పదం! “మన పిల్లల్ని వెంకటేశంలాగ కాయగావంచా, తెల్లచొక్కాయితో పంపించడానికి వల్లకాదు గదా?” అని గిరీశం బుచ్చమ్మతో అంటాడు. ‘చూచాయగా వంకాయ’లో ఆ పదం అనాగ్రామ్. - వికృతమైన దృఢత్వం
సమాధానం: దిట్టము - 23 దీనికి ప్రత్యేకత ఇస్తుంది. కావాలంటే 5, 9, 12, 16, 18, 23 చూడండి.
సమాధానం: పచ్చడి
నిలువు
- తలచీ తలచీ శిరోభారం కలిగింది
సమాధానం: తలచీదర - ఆకలేసిందంటే, ఆ! కొన్నానంటావేంటి కొంటెవాడా
సమాధానం: ఆకొంటిని - కాముని కత్తి
సమాధానం: చిగురుకైదువు - తల్లికి జీవితమంతా పండగే!
సమాధానం: బతుకమ్మ - కత్తిమూతతో ఆడుకొనే అందగాడు
సమాధానం: ఒరపులాడు. ఒర=కత్తిమూత. - కాస్తంత తిరగబడింది
సమాధానం: రుసపి - సవ్యసాచికైనా ఒకోసారి తడబాటు తప్పదు
సమాధానం: వ్వకడి - ఆర్ద్రమైన బంగారం
సమాధానం: పుత్తడి. ఆర్ద్రమైన అంటే తడి కలిగినది. - … పండగకాదు
సమాధానం: ఇల్లలకగానే - కాకము పాణిగ్రహణం చేసిన పుణ్యక్షేత్రం
సమాధానం: కాణిపాకము - ఈయన వ్యవసాయం మిట్టూరోడికే ఎరుక
సమాధానం: మునికన్నడి. మునికన్నడి సేద్యం నామిని నవల. - రైతు మొదటి సగం సగమే!
సమాధానం: అరకాడు. అంటే రైతు. - ఇది చిరిగితే రాజారామమోహనరావుగారి కథ పుడుతుంది
సమాధానం: తెరచాప. ‘తెరచాప చిరిగింది’ వి. రాజారామమోహనరావుగారి కథ - ఈ వేడుక ప్రత్యేకం 27
సమాధానం: ఉగాది