గడినుడి – 32

క్రితం సంచికలోని గడినుడి-31కి మొదటి ఇరవై రోజుల్లో ఎనమిదిమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. ఈ సారి గడినుడి నింపడంలో కలిగిన సాంకేతిక అసౌకర్యానికి చింతిస్తున్నాము. ఇకపై అటువంటి అవాంతరాలు రాకుండా జాగ్రత్త పడతాము. పోయిన నెల గడినుడికి అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు:
  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. అగడి ప్రతిభ
  3. బండారు పద్మ
  4. వైదేహి అక్కిపెద్ది
  5. సుభద్ర వేదుల
  6. భమిడిపాటి సూర్యలక్ష్మి
  7. ముకుందుల బాలసుబ్రమణ్యం
  8. ఆళ్ళ రామారావు
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-31 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: జూన్ 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.
గడినింపేదిశ: ➡
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

అడ్డం

  1. మేరుపర్వతం బంగారుకొండ (6)
  2. మీరు తర్వాత ఏమిస్తారో తెలిపే శాసనం తిరిగి వ్రాయండి. అనుమానాలు వీడండి (4)
  3. మీ ఇంటి సామాను ఇక్కడ దాచుకోవచ్చు (3)
  4. శోకంలో గల మార్పు కోరిక కలిగిస్తుంది (3)
  5. ఇప్పటి సమాచారము (5)
  6. ఇంటిద్వారం వాలి తలకి తగిలింది (5)
  7. యముడి కళ్ళు మొదట వెతికే హస్తభూషణము (4)
  8. పుట్టుకైనా చావైనా అంటు తప్పదు (4)
  9. సైనికులు చేసేది కనగా గడ్డ చక్కెర కనిపించింది (3)
  10. చంద్రజ్యోతి పగలువత్తి (3)
  11. అటుపిమ్మట నాగార్జున సాగర్ నీటిమీద కట్టినదాని తోక తెగింది (3)
  12. ఒక తారతో సూర్యుడు కలిస్తే సంవత్సరం పుడుతుంది (4)
  13. ఏవి బాతులో, ఏది నుయ్యో అద్దంలో చూస్తేకాని తెలీదు (4)
  14. ఇంటిచుట్టూ కట్టిన గోడ (3)
  15. వృద్ధ బల్లి (3)
  16. సీత సారాయి (3)
  17. అయ్యో! అంటే స్త్రీలు (4)
  18. ఋషి కొండ (4)
  19. అసురశిల్పి ముందు కృపా కరుణ కలవాడు (5)
  20. లయ ఏకాకి కాకపోతే తాంబూలానికి పరిమళాన్నిస్తుంది (5)
  21. ఉదాహరణకి పద్మవిభూషణ్ (3)
  22. ఎటునుండి చూసినా మోకాలే (3)
  23. కరువున సేవకుడు అవసరమా? (4)
  24. సుభద్ర సగము తయారైతే గంగ దిగొస్తుంది (6)

నిలువు

  1. స్వప్నంలో దేవతలు ప్రసన్నమై ఇచ్చేది కలిస్తే కలత మిగుల్తుంది (4)
  2. తగిలించి తమాషాచూసి కడుపునింపుకుంటాడు (5)
  3. మల్లయుద్ధ పోటీ పట్టు విశేషం (5)
  4. దొంగిలించినసొమ్ములోపించింది (3)
  5. మునిమాత తప్పు మన్నింపబడినది (4)
  6. మేక పొగ (6)
  7. లక్ష్మి (6)
  8. ప్రకృతి భీభత్సాల్ని ముందుగా హెచ్చరించేది (6)
  9. తురంగము (3)
  10. పైరు మధ్యమ చిక్కు ప్రశ్న (3)
  11. రాత్రి పువ్వు మధ్యలో ఒక సంవత్సరం (4)
  12. కుబుసము ఒలిస్తే పాము కొట్టేది (2)
  13. గోవు మధ్య గంతువేస్తే అతిథి వస్తాడా? (4)
  14. జంజాటములో దొందు పోతే మూడుగంటలు (2)
  15. కోమలి నీ అసలు రంగు బయటపెడుతుంది (3)
  16. శౌర్యం అధికబలం (3)
  17. వైద్యుడు రాకముందే రోగికి చెయ్యాల్సింది (6)
  18. కల్లుకుండ సరిగ్గ పట్టుకుని ముకుందమనరా! (6)
  19. దీనికి చావులేదు (6)
  20. ఈ చిత్తగించడం అంటే పారిపోవడం (5)
  21. మర్యాద తెలియనివాడికి ఉండేది (5)
  22. అతడు మనవాడే ఎందుకు సందేహం? (4)
  23. అభిముఖము అంటే ఏమిటో ఎరుగదు (4)
  24. రాజు భర్త (3)