రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట మే 2013 సంచికకు స్వాగతం!

పి. బి. శ్రీనివాస్ (22 సెప్టెంబర్ 1930 – 14 ఏప్రిల్ 2013): పిబిఎస్‌గా సంగీతాభిమానులకు చిరపరిచితుడు, దక్షిణభారత సినీసంగీతానికి కలికితురాయి అయిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ కేవలం గాయకుడే కాదు, బహుభాషాకోవిదుడు, సాహిత్యవేత్త కూడా. సహృదయుడు, అజాతశత్రువు, ఆయన స్మృతికి నివాళిగా జెజ్జాల మోహనరావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, పరుచూరి శ్రీనివాస్‌లు సమర్పిస్తున్న బహుభాషా సినీగీతభరిత వ్యాసం ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్; ఆ సంగీత కళానిధి జీవితాన్ని, ఆయన ఛందో విజ్ఞానాన్ని సంగ్రహంగా పరిచయం చేస్తూ ఏల్చూరి మురళీధర రావు వ్యాసం సంగీత సాహిత్య శ్రీ నివాసుడు; భారతదేశంలో కవి పుస్తకాన్ని రచించడు, పుస్తకమే కవిని రచిస్తుంది. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు అంటూ తన సిద్ధాంతానికి మరికొంత వివరణ ఇస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు.


ఈ సంచికలో: ఇంద్రాణి, సాయి పద్మ, స్వాతికుమారి, ఎలనాగ, దేశికాచార్యులు, భాస్కర్, తః తః, సత్యనారాయణల, మల్లావధాని, మోహన రావుల కవితలు; గౌరి కృపానందన్, శర్మ దంతుర్తి, శారదల కథలు; రాళ్ళపల్లి సుందరం, సురేశ్ కొలిచాల, భరణి కొల్లిపర, పి. బి. శ్రీనివాస్‌ల వ్యాసాలు; బృందావనరావు సమర్పించే నాకు నచ్చిన పద్యం…

Good Bye.

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

ఎనిమిదేండ్లకు పైగా ఈమాట ముఖ్యసంపాదకుడిగా శ్రమించిన వేలూరి వేంకటేశ్వర రావుగారు ఈ సంచికతో సంపాదకీయ బాధ్యతలనుండి వైదొలిగారు. వారికి మా హార్దిక కృతజ్ఞతలు. వారు ఇప్పటికీ ఎప్పటికీ ఈమాట కుటుంబ పెద్దలే. వారి మాట మాకు శిరోధార్యమే. – సం.

10

నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం

రచన: చీమలమర్రి బృందావనరావు

మోహావేశం రావాలంటే పరిసరాలూ ఆహ్లాదకరంగా ఉండాలి కదా. పర్యావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చేది వసంతం కాక మరేమిటి? అందుకనే వసంతుణ్ణి వెంటపెట్టుకుని వచ్చాడు మన్మధుడు. వెన్నెల రాత్రుల్లో ఆ పూలూ, పరిమళాలూ లోకాన్ని సౌందర్యంతో ముంచెత్తుతుండగా తను పూల బాణాలు సంధిస్తే — శివుడయ్యేది కాని, మరెవరయ్యేది కాని — ఇక తిరుగేముంది అనుకున్నాడు మన్మధుడు.

4

కతికితే అతకదు

రచన: ఆర్. శర్మ దంతుర్తి

ఫోటోలో అమ్మాయ్ నవ్వుతోంది. తీరిగ్గా రామం కాయితం మీద రాసేడు తాను అడగవల్సిన ప్రశ్నలూ అవీ. 1) వంట వచ్చా? ఛ, ఛ. మొదట్లోనే వంట గురించి అడగడం బాగుండదు. కొట్టేసి మళ్ళీ మొదలెట్టేడు. 1) మీ పేరు? ఏడిసినట్టుంది. తనకి పేరు తెల్సీ అడగడం ఏం బావుంటుంది? (కొట్టేసి మళ్ళీ,) 1) మీరు ఏమి చేస్తున్నారు ఇప్పుడు?

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 12

పై గదిలో ప్రేమికుడు

రచన: శారద
మూలం: P. G. Wodehouse

కళాకారుల్లో స్నేహాలు తొందరగా పెరుగుతాయి. గంట సేపట్లో అతని పేరు సి.జీవి అనీ, ఈ పెయింటింగు అతనికి బ్రతుకుతెరువేమీ కాదనీ, ఎక్కడో చిన్న వుద్యోగం లాటిది చేస్తున్నాడనీ తెలుసుకుంది. మాట్లాడుతున్నకొద్దీ అతనామెకి నచ్చసాగాడు. తన బొమ్మలు అంత ఘోరంగా వున్నందుకు అతనేమీ పెద్ద నొచ్చుకున్నట్టు లేదు. అది ఆమెకి వింతగా అనిపించినా, నచ్చింది.

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 25

వదిన

రచన: గౌరి కృపానందన్
మూలం: ఐరావతం

తను తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు, వారానికోసారి శని వారం రోజు ఇంగ్లీషు సినిమా చూడటం అలవాటు అట. మా అన్నయ్య సినిమాకి వెళ్ళనే వెళ్ళడు. ఏడాదికి ఒకసారో రెండు సార్లో వెళ్ళినా ఏ చిరంజీవి సినిమాకో వెళ్తాడు. అందు వల్ల నేను, మా వదిన కలిసి కొన్ని సార్లు శని వారాలు ఇంగ్లీషు సినిమాకి వెళ్ళడం అలవాటయ్యింది.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 7

ఆకుపై నిలిచిన వానచినుకులు

రచన: అవినేని భాస్కర్
మూలం: వైరముత్తు

నీ ఊరు దగ్గరయ్యేకొద్దీ
ఎదగూటిలో ప్రాణం కాగుతూవుంది
నిలుచున్న చెట్లు నడుస్తున్నట్టూ
నడిచే వాహనం ఆగున్నట్టూ
అబద్ధం చెప్తుంది రహదారి!
పురివిప్పి ఆడుతున్నాయి
నెరవేరని కలలు!

5

టోపీలు పెట్టబడును

రచన: బండి సత్యనారాయణ

వేసవిలో వెన్నెల వాన
శీతంలో నిప్పులవర్షం
అన్నీ గోచరమే
ఏ ఎండకి ఆ గొడుగు పట్టే దేశంలో
సామాన్యుడికి
ప్రతి కాలమూ టోపీల కాలమే

2

చతురదూతిక

రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు

అతనితీరును గనుచున్న యామె తరళ
నేత్రము లతని కనులతో మైత్రి నెఱపె;
అంత మందాక్షమందాక్ష యగుచు నామె
వెన్కవెన్కకు తగ్గుచు వెడలసాగె.

6

మంత్ర భాషణం

రచన: ఎలనాగ

సూటిదనం మొహం చాటేసి
ముసుగేసుకున్న పదచిత్రాల కన్నెల
ముద్దొచ్చే మోహన రూపాలెన్నో –
జల్లెడ లోంచి జారిపోయే నీళ్ళు
అందనితనపు అశాంతిలో ముంచేస్తయ్

1

జాతర

రచన: సాయి పద్మ

నెరవేరని కాంక్షలతో సహజీవనం
కన్నీరుతో చిరునవ్వుతో సహజీవనం
పట్టువిడుపులు తెలియని స్వార్ధపు బిగింపులతో
జనం మెచ్చిన చట్రాలతో సహజీవనం

9

సిరినివాస వృత్తము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

ప్రతివాది భయంకర శ్రీనివాస్‌ గొప్ప గాయకులు మాత్రమే కాదు, గొప్ప కవి కూడ. వారు 26 అక్షరములకన్న ఎక్కువ అక్షరములు గల వృత్తములను, సార్థక నామ వృత్తములను సృష్టించియున్నారు. వారి స్మృతి చిహ్నముగా వారి పేరుతో పాదమునకు 34 అక్షరములు గల సి-రి-ని-వా-స వృత్తమును కల్పించి వారిపై ఒక పద్యమును వ్రాసినాను.

14

పుష్పవివేకము

రచన: గరికపాటి మల్లావధాని

పుష్పవల్లి సరోజాక్షి పూవుఁబోణి
మొల్ల మల్లిక మొదలైన ముద్దు పేర్ల
గాటముగ మాపయింగూర్మిఁ జాటుకొనెడు
నమృత హృదయులు గారె మీయాడువారు.

2

ఊపిరిపాటకు చూపేదీ?

రచన: స్వాతికుమారి బండ్లమూడి

మేల్కొలుపుతూ వినబడ్డాడతను
వేకువల్ని వణికించే వేణువుగా.
గాలి మడుగులో
రాగాల జాడలు పట్టుకుని
వెదుక్కుంటూ వెళ్ళి చూశానతన్ని.

3

లెక్కల పాఠం

రచన: తఃతః

ఎక్కాలు మొదలు ఎమ్మే దాటి పోయినా
లెక్కల పాఠం ప్రతి దానికీ
పది తలలు
అయినా అది గంట కొట్టంగానే
నీ క్లాస్ రూం లోకి చులాగ్గావచ్చేస్తుంది
ముందు గుమ్మం లోంచి
ముని వేషంలో.

3

మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు

రచన: వెల్చేరు నారాయణరావు

అక్షరాలా ఎవరు పుస్తకాన్ని రాశారు అన్నది తెలుసుకోవాలనే ప్రయత్నం తెలుగు సాహిత్యం కాని సంస్కృత సాహిత్యం కాని ఇతర భారతీయ సాహిత్యాలు కాని చెయ్యలేదు. కవి అంటే పుస్తకానికి తన పేరుతో కవితా గౌరవాన్ని కల్పించేవాడు అని అర్థం. ఆ పుస్తకానికి పాఠకులు చెప్పుకున్న అర్థానికి అనువైన జీవిత చరిత్ర కలవాడు అని అర్థం. అంతేకాని అక్షరాలా ఆ పుస్తకాన్ని రాసిన వాడు అని అర్థం కాదు.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 14

మల్లే పూల్ మల్లే పూల్

రచన: పాలపర్తి ఇంద్రాణి

బడ్డీ కొట్టు దగ్గర
గోల్డ్ స్పాట్ జింగ్ ధింగ్
బారు జడ అమ్మాయి
చలివేంద్రం దప్పికమ్మ
గిరుక్కున తిరిగి చూశారు

8

ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్, విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈ ఈ నొక్కి చదవండి...

పిబిఎస్ నటులకు సరిపోయే గాయకుల గాత్రం అనేదాన్ని గురించి అది ప్రేక్షకుల, శ్రోతల భ్రమ మాత్రమే అంటాడు. రాజకుమార్‌కు తన గొంతు సరిపోవడం, అలాగే తాను సామాన్యంగా ఘంటసాల మత్రమే పాడే ఎన్.టి. రామారావు, నాగేశ్వర రావులకు పాడితే నప్పదు అనే భ్రమ కూడా అలాంటిదే.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 45

సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం

రచన: భరణి కొల్లిపర
మూలం:
ఈ ఈ నొక్కి చదవండి...

మనకు కావలసింది ఒక ప్రజాతంత్రమైన సాహితీ విమర్శ. ఆక్సిజన్ కొరవడిన సాహితీ సభల ఇరుకు గదుల నుంచి ఈ చర్చలను బయటకు తెచ్చి కాఫీ హౌసుల్లోను, కమ్యూనిటి హాళ్ళల్లోను, ఇంకా గ్రామాల్లోని కూడళ్ళల్లోకి పునఃపరిచయం చేయాలి. శతాబ్దాలుగా జగన్నాథ్ దాస్ రచించిన ఒడియా భాగవతం నలుగురు కూడే స్థానాల్లో చదవబడి చర్చించబడ్డది.

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 2

హాయిగ పాడుదునా?

రచన: పి. బి. శ్రీనివాస్
ఈ ఈ నొక్కి చదవండి...

సాలూరి రా.రా భలే తమాషా మనిషి. విచిత్రమైన వ్యక్తి. ఎవరితోనైనా ఇట్టే పరిచయం చేసేసుకుని సరదాగా మాటాడేయగలిగే శక్తి వుంది. ఆ ధోరణిలో నవ్వుతూ నవ్వుతూనే నసాళానికి అంటిపోయే జోకులు బ్రేకు లేకుండానే స్వీట్ కేకుల్లా తెగవేయగలిగే నేర్పువుంది. నిరాడంబరజీవి.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 3

పలుకుబడి – కాలమానము II

రచన: సురేశ్ కొలిచాల

వేదకాలం నుంచి మనకు సెకండులో ఒక కోటివంతు కాలం నుండి 40 లక్షల కోట్ల సంవత్సరాల దాకా లెక్క పెట్టగలిగే కాలమానం ఉండేదని చెప్పే వెబ్‌సైట్లు ఇంటర్నెట్టులో కోకొల్లలు. అలాగే, వేదాలలో (సూర్య)కాంతి వేగాన్ని కూడా విలువకట్టి చెప్పారని, అది నేటి శాస్త్రవేత్తలు ఆధునిక పద్ధతులను ఉపయోగించి కనిపెట్టిన విలువకు ఉరమరగా సరిపోతుందనీ గర్వంగా చెప్పుకోవడం కూడా కొన్ని సైట్లలో కనిపిస్తుంది.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 16

సంగీత సాహిత్య శ్రీనివాసుడు

రచన: ఏల్చూరి మురళీధరరావు
ఈ ఈ నొక్కి చదవండి...

శ్రీనివాస్ సంగీత మేళకర్త రాగాల స్వరలక్షణాన్ని గుర్తుంచుకోవటానికి ఒక ‘డైమండ్ కీ’ సూత్రాన్ని రూపొందించారు. ఇది విద్యార్థులకు రాగస్వరూపాన్ని సులభంగా నేర్పాలని చేసిన ప్రయత్నం. వెంటనే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, డి.కె. పట్టమ్మాళ్, విశ్వనాథన్, వంటి మహావిద్వాంసులు శ్రీనివాస్‌ని ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 25

తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం

రచన: రాళ్ళపల్లి సుందరం

ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.

1

చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు

రచన: పి. బి. శ్రీనివాస్
ఈ ఈ నొక్కి చదవండి...

ఎన్నో ఆంగ్లపదాలు ఆయా ప్రాంతీయ భాషల పదాలలో యధాతథంగా చోటుచేసుకుని ఆయా భాషలకి చెందిన పదాలలాగే ఈనాటికి చెలామణి అవుతూ వుండడం రసజ్ఞులు గమనిస్తూనే వున్నారు. ఓ డియర్, వై ఫియర్, కం నియర్‌ లాంటి రైమ్స్ అన్ని భారతీయ భాషా చిత్రాల గీతికలోనూ వాడబడడం పరిపాటి అయిపోయింది.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 1
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.