రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మళ్ళీ రాని అవకాశం

రచన: రామభద్ర డొక్కా
నవంబర్ 2001

కోల్పోవద్దు మరో అవకాశం
రాకపోవచ్చు తిరిగి నీ కోసం..

మనసు విప్పి మాటాడడానికీ,
ఒక మంచి మాటను చెప్పడానికీ,
ప్రేమిస్తున్నానని తెలుపుతూ,
ఒక సందేశం పంపించడానికీ..  …. కోల్పోవద్దు మరో అవకాశం ….

ఎంతో దూరాన వున్న,
అమ్మానాన్నల కోసం,
వారం, వారం ఫోనులో,
వార్తలు తెలిపే లేఖలో..  …. కోల్పోవద్దు మరో అవకాశం ….

ప్రేమించే వ్యక్తి కొరకు,
ప్రతి నిమిషం తపియిస్తూ,
ప్రేమను పంచుతూ బ్రతికే,
జీవిత భాగస్వామితో..   …. కోల్పోవద్దు మరో అవకాశం ….

అన్నా తమ్ముళ్ళు, సుతులు,
ఆప్తులు, మితృలు, హితులూ,
ఆపదలో నున్నప్పుడు,
నీ సహాయమర్థించినపుడు..  …. కోల్పోవద్దు మరో అవకాశం ….

ముక్కూ, మొఖమూ తెలియని,
అనాథలభాగ్య జీవులు,
మంచి మనిషిగా నీలో,
దైవాన్నే చూసినపుడు..   …. కోల్పోవద్దు మరో అవకాశం ….

వంచన పొందిన వారూ,
మనసులు చెదిరిన వారూ,
నీపై నమ్మకముంచీ,
నీ మాటకు విలువిస్తే..   …. కోల్పోవద్దు మరో అవకాశం ….

అందరికీ రానిది ఆ,
అవకాశం వచ్చిందా
అదే ఒక అదృష్టం,
కర్తవ్యం నెరవేర్చే,
స్థితిలో నువ్వుంటే,
నీదే పుచ్చిన పుణ్యం..   …. కోల్పోవద్దు మరో అవకాశం ….

మనసారా స్పందిస్తూ,
మమతలనే అందిస్తూ,
ఓ “థేంక్‌ యూ”, ఒక “సారీ”,
“ఐ లవ్‌ యూ” చెప్పేందుకు..  …. కోల్పోవద్దు మరో అవకాశం ….

అంతరాత్మను తొక్కి పట్టి,
అపాలజీ చెప్పి పెట్టి,
ఆవేశం, గర్వం తో,
అహంకార పర్వంలో..   …. కోల్పోవద్దు మరో అవకాశం ….

వచ్చిన దానిని వదిలీ,
ఎదురుచూడకు మరో సారి,
అతి విలువైన క్షణాల మధ్య,
ఉండొచ్చు కొన్ని జీవిత కాలాల వ్యవధి.. …. కోల్పోవద్దు మరో అవకాశం ….

ఆలసించబోకుమసలు,
ఆచరణను మరచీ,
కలగా కరిగే బ్రతుకున,
కావచ్చునిదే (నీ) ఆఖరి మజిలీ.. …. కోల్పోవద్దు మరో అవకాశం ….

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మళ్ళీ రాని అవకాశం
  • శ్రీ వరసిద్ధి వినాయక పద్యమాల
  • సీతారాముడి “శివదర్పణం”
  • పాఠాలూపీఠాలూ
  • సశేషమ్‌

ఇటువంటివే…

  1. మళ్ళీ అదే సంచిక
  2. మళ్ళీ కొత్తగా…
  3. మళ్ళీ మొదటికి
  4. మళ్ళీ ఇన్నాళ్ళకి
  5. బుచ్చిగాడి మళ్ళీ పెళ్ళి

నవంబర్ 2001 సంచికలో ...

  • “బొంబాయి కథలు” : అంబల్ల జనార్దన్‌
  • అహం బ్రహ్మాస్మి
  • ఒంటరి
  • ఒక జనవరి శుక్రవారం, లోకస్ట్‌ వాక్‌ కార్నర్లో
  • ఒక్క క్షణం
  • కంచిలోతామరలు
  • కలకీ కలకీ మధ్య
  • కవిత్వం, ఆధునికత, సాహిత్యం
  • కోత
  • చిక్కడు, దొరకడు
  • టెక్నాలజీ!కోవాడిస్‌
  • ట్రాఫిక్‌ జామ్‌
  • డాట్కామ్‌ మాయోపశమన వ్రతము
  • తానా బహుమతి కథల మరో విశ్లేషణ
  • నవంబర్ 2001
  • మళ్ళీ రాని అవకాశం
  • మెటమార్ఫసిస్‌
  • వాయుగుండం
  • విశ్వకవిత: ట్రంబుల్‌ స్టిక్నీ
  • సాహిత్య వ్యవస్థలో సంశయావస్థ
  • సూపర్‌ నోవా
  • హైకూలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

హైకూలు
విశ్వకవిత: ట్రంబుల్‌ స్టిక్నీ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.