రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మళ్ళీ మొదటికి

రచన: నారాయణస్వామి
జనవరి 2003

ఒక గొప్ప ప్రారంభం కోసం
అన్వేషణ
పేలవమైన ముగింపుగా
కొట్టుమిట్టాడుతుంది

వేయి తుపాకుల ముందుకూడా
తలవంచని ధైర్యం
తోవ తెలియని తనంతో
నీరు కారిపోతుంది

తుఫాను ప్రచండతను
ఊపిరిగా పీల్చిన యవ్వనం
పత్రహరితం పరాధీనమై
చిరుగాలులకు సైతం
కంపించి పోతుంది

వాగునీటి గలగలల
పరిమళాలు వెదజల్లిన
వెన్నెల రాత్రుల అమాయకత్వం
విచ్చుకత్తులు దూసిన పేటెంట్ల మధ్య
అస్తిత్వం కోల్పోతుంది

కొత్త ఆకాశాల కోసం
అరమోడ్పు కళ్ళతో తపించిన
నెలవంక
గ్లోబలైజేషన్‌ స్వప్న రాహిత్యం లో
వెలవెల పోతుంది

భవిష్యత్తుపై
ప్రేమతో
వర్తమానాన్ని ధిక్కరించిన
ఆకాంక్ష
చరిత్ర చీకటినీడల్లో
గతం కన్నీటి మరకగా
మిగిలిపోతుంది

మార్కెట్‌ మాయాజాలంలో
ప్రతి మజిలీ దగ్గర
చౌరస్తా అయిపోయిన ప్రయాణం
తిరిగి తిరిగి ప్రారంభానికే
చేరిపోతుంది
ంంంంంంంంంంం

అపరిచిత జీవితం

కలల ధూళి ఎగసి
కన్నీరు గర గర లాడకుండా
నల్లని రేబాన్‌ కూలిన్గ్‌ గ్లాసెస్‌ పెట్టొచ్చు

రాత్రి దుఃఖం
నిద్రలేమి  కత్తులై కోయకుండా
ఎలెక్ట్రిక్‌ హీటర్లలో మొహం దాచుకోవచ్చు

గాయాల మరకలు చిట్లి
నెత్తురు పూయకుండా
రంగు రంగుల బొకేలు కప్పవచ్చు

విషాదపు ముడుతలమీద
వెలుతురు పడకుండా
వెనీషియన్‌ బ్లైండ్స్‌
సగం మాత్రమే తెరిచి వుంచవచ్చు

సంభాషణల్లోని
లోతైన శూన్యం వినబడకుండా
ఖాళీ సీసాలని క్షణాలుగా దొర్లించవచ్చు

తుప్పు పట్టిన
సహజాతాలు పెళుసులీనకుండా
ఖరీదైన పెయింట్లతో తళ తళా మెరిపించవచ్చు

అద్దమ్ముందు నిలబడ్డప్పుడల్లా
వెక్కిరించే అపరిచిత ముఖాన్ని
గడ్డీ గాదం డాలర్లూ కూర్చి
ఇంటి ముందు ఆర్భాటంగా నిలబెట్టి
శేష జీవితాన్ని మురిపెంగా గడపొచ్చు!!

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • సందుక
  • మళ్ళీ మొదటికి
  • వాన

ఇటువంటివే…

  1. మళ్ళీ ఇన్నాళ్ళకి
  2. మళ్ళీ అదే సంచిక
  3. మళ్ళీ రాని అవకాశం
  4. మళ్ళీ కొత్తగా…
  5. బుచ్చిగాడి మళ్ళీ పెళ్ళి

జనవరి 2003 సంచికలో ...

  • రుబాయీలు
  • Big Bucks
  • ఇవి
  • ఏదో వెలితి
  • జనవరి 2003
  • జాతకం
  • మధ్యస్తం
  • మళ్ళీ మొదటికి
  • మార్పు
  • విశ్వకవిత: పాల్‌ సెలాన్‌
  • శ్రుతిలయల నందనవనం
  • శ్రోతలు కోరని పాట
  • సర్వం స్వార్ధమయం !
  • సహజం
  • హత్య కేసి వేగంగా
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఏదో వెలితి
ఇవి

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.