ఆకాశాన్ని నిలువునా చీల్చే
అంతు లేని దుఃఖం
ముంచెత్తినపుడల్లా
ఈ దుర్భరబాధ ఇదే చివరిసారి అని
ఇంకెప్పుడూ కలగదని
అనుకుంటూ ఉంటాను.

అరవై వరకూ వ్యాసాలున్న ఈ సంపుటి మురళీధరరావుగారి సారస్వతప్రేమ, పరిశోధన, పాండిత్యం అనే మూడు నదులు సంగమించిన ప్రయాగ. ఆయన 15 సంవత్సరాలపాటు తెలుగు, హిందీ, సంస్కృతము, ప్రాకృతము, ఆంగ్లముల సాహిత్యాలతో పాటు పలు ప్రపంచభాషా సాహిత్యాల చరిత్రలను కూలంకషంగా, తపస్సువంటి అధ్యయనం చేశారు.

ఈ ఆదివారం రాసిన సుదీర్ఘమైన ఉత్తరంలో తన పెళ్ళినిశ్చయం ప్రకటించాడు: ‘అతి ముఖ్యమైన విషయం ఉత్తరం చివరివరకు వాయిదా వేశాను. కుమారి ఫ్రీడా బ్రెండెన్‌ఫీల్డ్‌తో నా పెళ్ళి నిశ్చయమయింది. అమ్మాయిది బాగా ఉన్నవాళ్ళ కుటుంబం.

ప్రాచీన తమిళ పద సంపద చాలా విస్తారమైనది. క్లుప్తత, గాఢత సంగ కాలపు తమిళ భాష ముఖ్య లక్షణాలు. వాటిని బిగువు చెడకుండా తెలుగు చేయడం కష్టసాధ్యమైన పనే. ‘ఈమాట’ పాఠకులు నా అనువాద ప్రయత్నాన్ని సహృదయతతో స్వీకరిస్తారనే భావిస్తాను.

మహెజబీన్ కవితలు మధుకుల్యలు, తేనె వాకలు. వాక్యం చలువరాయి అయితే, కవిత ఒక చల్లని ఇల్లు. పాఠకులు ఎంతసేపైనా సేదదీరగల అద్భుతమైన సృజనాత్మకత ఈమె సొంతం.

బేలూరులోని ఈ చెన్నకేశవాలయం మానవకళాచాతుర్యానికి పరాకాష్టగా, అవధి లేని అందాన్ని ప్రదర్శించింది. అదొక అత్యద్భుతపు, అశాశ్వతత్వపు విరోధాభాస. కళారూపావిష్కరణ కాలాతీతమే అయినా, కాలం కొట్టే కరుకు దెబ్బలను భరించక తప్పదులెమ్మని చరిత్ర చెప్పడమే ఆ విరోధాభాస.

మేము నడుస్తోన్న దారి క్షేమం కాదనీ, అడుగు ఏమాత్రం తడబడినా దిగువనున్న బుధిగండకి మాకోసం ఎదురుచూస్తోందనీ మా అందరికీ తెలుసు. అంతా కలసి 30 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న దారి… అడుగడుగూ చూసుకుంటూ వెళ్ళవలసిన దారి… సరిగ్గా అదే సమయంలో నా హెడ్ లాంప్ పని చెయ్యడం మానేసింది.

“మరణించినవారి లోకం కంటే బ్రతికున్నవారి లోకం ఎంత అందంగా ఉందో…” అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. ఉదయభానుడి కిరణాల వెచ్చటి స్పర్శకు ఒడిస్సియస్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా సర్సీ కనిపించింది. ఇంద్రధనుస్సులోని సప్తవర్ణాలతో మెరుస్తూన్న ఆమె దుస్తులు ఆమె సహజ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

అయ్యన్నీ వొగ్గేసుకుని ఆడనుండి ఈ బెంగలూరు వట్టుకొచ్చాడయ్య! మా మునసబు గోరి సిన్నోడు లేరయ్య. ఆరు దేవుడండయ్య! నేనే ఆరెంట బడ్డానండి! ఆయన గోరికి సెక్కూరిటీ ఏపారమంటండి. ‘కాపలాలు కాయాలిరా సత్తీ కాస్తావా’ అన్నారండి.

నేను కుక్కను కాలేనా ఏంటి? నేనవుతా. కచ్చితంగా అవ్వగలను. ఇలాంటి చావుతో నా ఉనికి మాసిపోనివ్వను. తరాలకు తరాలు ఉనికి నిలుపుకోవాలనుకుంటున్నాను. నన్నెవరూ ఆపలేరు. మళ్ళీ మొఱిగాడు. ‘భౌ భౌ భౌ…’

ఏదైనా రచన మనకు నచ్చడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ రచనలలోని సార్వజనీనత, ఆ రచన అందించే ఆలోచన, విజ్ఞానం, సంస్కారం – ఇది మొదటి కారణం. ఆ రచనలో మన ప్రతిబింబం కనిపించడం, అందులోని అనుభవాలూ అనుభూతులూ మనవి కూడా అవడం రెండో కారణం. ఈ ‘బ్రతుకాట’ను నేను అనువదించినవుడు ఈ రెండో తరహా అంశాలు ఎంతో తరచుగా తటస్థపడ్డాయి. నాలో అనునాదం కలిగించాయి.

1960 ఆరంభంలో, వేలూరిగారు ఆంధ్రవిశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ ఉన్నత విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయ వేదికపై డిసెంబరు 14, 1960 నాడు సుమారు వెయ్యిమంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించిన ఉత్సవం ఈ కావ్యదహనోత్సవం.

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది.

భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలంనుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం ఒక రకమైన సాంస్కృతిక అపరాధంగా పరిగణించాలి. […]

ప్రవాసాంధ్ర సాహిత్య దిగ్గజం, ఈమాట పత్రిక విశ్రాంత సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సదా ఈమాట పత్రికకు శ్రేయోభిలాషి అయిన డా. వేలూరి వేంకటేశ్వర రావుగారు […]

వెదురుపొదలే కంచెలుగా, ఎక్కడ
పనసచెట్ల వేర్లపై పళ్ళు విరగ కాస్తాయో
ఆ కొండవాలు ప్రాంతపు యువకుడా, నువ్వు సరైన పని చేయి!
ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొండవాలున
చెట్టు సన్నని కొమ్మకు వేలాడే పెద్ద పనసపండు లాగ,
ఆ పిల్లది చిన్ని ప్రాణం! ఐతే నీపై ఆమెకున్న ప్రేమయో? ఎంతో పెద్దది!

పదుల సంవత్సరాలు శ్రమించి, ప్రాచీనశిల్పులు రాతిలో మలచిన అతిలోక సౌందర్యాన్ని వీక్షించటానికి మనుషులకు కళ్ళు ఉండడం – ఆ అదృష్టం. ఆ కళ్ళు రెండు మాత్రమే ఉండడం – అన్యాయం.