1.
మలిసంధ్య కాంతి చెప్పే ఆఖరి రహస్యం కోసం
మహా పర్వతాన్ని అధిరోహించడానికి పూనుకుంటావు
శిఖరాగ్రాన్ని చేరేసరికి
చీకటి పడిపోతుంది
రాత్రికంటే
రహస్యమైనది ఏది?
2.
ఒక్కో పదం కోసం
ఆ పాదాలకి
తలకొట్టుకుంటూ
జన్మజన్మాలు
ఆమె కరుణించినప్పుడు మాత్రం
అక్షరంలో దాగిన అణుశక్తి
అనుభవంలోకి
బొమ్మా బొరుసుల్లాగే
వరమూ శాపమూ కూడా!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి:
2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొక దివ్వెగా” నవల (2019), “సెలయేటి సవ్వడి” కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.
...
పూర్తిగా »