పురాణ కథలు ఎందుకు చదవాలి? అవి మనకు ఏమిటి బోధిస్తాయి? అవి చదవడంవల్ల మనం మన ప్రస్తుత జీవితాలను ఎలా మలుచుకోగలం? పురాణకథలలో ఉన్న నీతులు, బోధలు అర్థం చేసుకుని మనం ఈ కాలంలో ఏ విధంగా లబ్ధి పొందగలం? కాలం మారింది. విలువలు మారేయి కదా. ఎప్పుడో శతాబ్దాల క్రితం హోమర్ రాసిన ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు ఇప్పుడు చదవడంవల్ల లాభం ఏమిటి?
శీర్షికలు సంచికలు
రాజమండ్రి గౌతమీ ఘాట్‌లో
తప్పిపోయిన నన్ను
కరీంనగర్లో దిగువ మానేరు తల్లి
ప్రేమగా ఒడికట్టుకుంది
తల్లి ఎక్కడైనా తల్లే
యవ్వనంలో స్నేహితుని భుజం మీది చేయిలోనో,
ప్రియురాలి చూపులోనో కరిగిపోయినపుడూ,
జీవననేస్తం తొలి కౌగిళ్ల నమ్మకమైన స్పర్శలో,
బిడ్డల అమాయకపు లేత చూపుల్లో,
వాళ్ళు నీ కొనసాగింపనే ఉద్వేగంలోనూ
నువ్వుగా ఉంటావు
యుద్ధం చేయడమే
ఇష్టమైతే
నేను రోజూ చేసేదే యుద్ధం
ఆలస్యం దేనికి,
నన్ను ప్రేమించు
ఏది ఏమైనా
ఈ అనిదంపూర్వస్థితిని వదలలేను
ఈ చిత్తశాంతిని కాదనలేను
ఏవేవో ఎండమావులు
భ్రమించి పరుగులు తీస్తాం
ఎడారి చిగురిస్తుందని
తాపగ్రస్తమైన దీని విశాల దేహం మీద
ఎక్కడైనా ఒక తడికన్ను రెప్ప విప్పుతుందని
అదృష్టం ఎలా ఉందో చూద్దాం,’ అని కిటికీ పరదా పక్కకు తప్పించగానే చంద్రకాంతిలో మిలమిలలాడుతోన్న మనస్లు శిఖరం హలో చెప్పింది. క్షణాల్లో రెండు మూడు పొరల ఉన్ని బట్టలు వేసేసుకుని నేనూ గిరీషూ మేడమీదికి చేరిపోయాం… పువ్వుకు తావిలాగా ఆ బంగారు శిఖరం నడికొప్పున పల్చని మబ్బు తెర జయకేతనంలా నిలచి, శిఖరంతోపాటు తానూ రంగులు మార్చుకోసాగింది.
ఆధునికతనుండి అత్యాధునిక యుగానికి దారిలో అడ్డంగా నిలబడిన మేరువు హైడెగర్. అతన్ని దాటడం కష్టం. దాటకుండా యీ యుగంలోకి నడవడం కష్టం. అతడి ప్రభావం ఒక రంగంలో కాదు. తత్త్వశాస్త్రం అటుంచి, మనస్తత్త్వశాస్త్రం, మానసికవైద్యం, సాహిత్యవిమర్శ, సాంకేతికత, పర్యావరణము-బహుశా అతడి ప్రభావంలేని ఆధునికరంగం లేదేమో!
ఒడిస్సియస్ ధనుస్సును సుతారంగా నిమిరేడు. దానిని నిలువునా నిలబెట్టి సునాయాసంగా వంచి నారితాటిని బిగించేడు. బిగించి, సరిగ్గా ఉందో లేదో చూడడానికి, వీణ తీగను మీటినట్లు మీటేడు. వానకోయిల కూజితంలా శబ్దం ధ్వనించింది. దానికి ప్రతిధ్వనిలా ఆకాశంలో ఉరుములు ఉరిమేయి.
సమస్తమూ ఈశ్వరునిలో చేరియున్నదే. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు లోకభేదాలన్నీ ఆత్మలో ఎలా ఐక్యమవుతాయో, సాగరంలోని తరంగంలా జీవుడు పృథక్త్వ భావాన్ని వీడి పరమాత్మతో ఎలా మమేకం కావాలో డి.వి.గుండప్ప గారి ఈ పద్యాలు అద్వైత వేదాంత సారాన్ని అత్యంత సులభంగా వివరిస్తున్నాయి.
వాడ్రేవు చినవీరభద్రుడు తన తొలి కవితా సంపుటి అంటే “నిర్వికల్ప సంగీతం” వెలువరించి నలభయ్యేళ్ళయింది. ఈ నలభయ్యేళ్ళలో ఆనాడే అజంతా జ్యోతిష్యం చెప్పినట్టుగా తెలుగు సాహిత్య ప్రపంచంలో భవిష్యత్తంతా ఇతనిదే అయింది… తలుపులు బార్లా తెరిచి అజరామరమైన ప్రకృతిని లోపలికి ఆహ్వానించాల్సిన అవసరమేదో ఈ కవిని మేల్కొల్పింది.
గాలి నాసరరెడ్డికి లేఖలు’ పుస్తకంలో 56మంది కవులు, పండితులు, కవితాప్రియులు రాసిన 84 ఉత్తరాలు సంకలింపబడ్డాయి… మొత్తం మీద ఈ లేఖా సంకలనంలోని బడాబాబుల పొడి మాటలూ, సన్నజీవాల తడి తలపులూ పాఠకుల హృదయాల్ని కదిలిస్తాయి; కొండొకచో కలవరపరుస్తాయి కూడా.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!
మన తత్వశాస్త్రాన్ని మార్చగలిగే, భౌతికశాస్త్రాన్ని తలకిందులు చేయగలిగే విస్తృతమైన ఆలోచనలు కూడా, చాలా చిన్నదిగా కనిపించే ఒక ప్రయోగ ఫలితం నుంచే పుట్టొచ్చు.
తెలుగు భాష పూర్వకాలంలో రాజభోగాలను చవిచూసింది. “తెలుగొకండ” అన్న కృష్ణదేవరాయలు తనను తాను “కన్నడరాయ” అని అభివర్ణించుకున్నా తెలుగుకే పట్టం కట్టాడు. ఇది చాలామటుకు […]
కాఫ్కా రచనల్లో ప్రధానంగా గమనించవలసింది అతని రచనా విధానంలోని మర్మం. జీవిత వాస్తవం బుద్ధికి అందడం లేదు. ఈ అందని అసంబద్ధతను చెప్పడానికి అతడు అవ్యక్తాన్ని ఆశ్రయిస్తాడు. అవ్యక్తం (subconscious) స్వప్నంలో వ్యక్తమయ్యేది. అసంబద్ధ వాస్తవాన్ని వ్యక్తంచేయడానికి ఈ అవ్యక్తాన్ని, స్వాప్నిక వాస్తవాన్ని ఆలంబనం చేసుకుంటాడు. ఈ “తీర్పు” కథలో ముగింపు అటువంటి స్వాప్నిక వాస్తవం.
మహాభారతంలో పాత్రలను వాడుకున్నా ఈ నాటకపు కథ స్వతంత్రమైన కల్పనే. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకును వదులుకోవాల్సిన క్లిష్టపరిస్థితి ఏర్పడ్డప్పుడు తల్లిదండ్రులు రెండవ కొడుకును వదులుకునేందుకు సిద్ధపడడం అనే ఊహకు, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే శునశ్శేఫుడి కథకు సామ్యం కనిపిస్తుంది.
‘ఈ నాటకాలన్నింటినీ ఒకే రచయిత వ్రాసాడా, అనేకులా?’, ‘ఒకే రచయిత అయిన పక్షంలో, ఆ రచయిత భాసుడేనా?’, ‘ఇప్పుడు లభ్యమవుతున్న కృతులన్నీ మూలకృతులేనా, లేక అంతకు మునుపు వ్రాయబడ్డ కృతులకు అనుసరణాలా?’ వంటి ప్రశ్నలపై పెద్దయెత్తున వివాదాలు చెలరేగాయి. ఆంగ్లంలో, భారతీయభాషల్లో ఈ విషయమై వేల కొలది పుటల్లోకి విస్తరించిన చర్చోపచర్చలను ‘భాససమస్య’గా వ్యవహరిస్తారు.
నేను దేవుణ్ణి కాదు, టెలెమాకస్! నువ్వు ఎవరి కోసం రాత్రి, పగలు కలవరిస్తున్నావో, ఎవరి రాకకోసం ఇరవై ఏళ్ళబట్టి ఎదురు చూస్తున్నావో ఆ వ్యక్తిని నేనే. నేను నీ తండ్రిని!