‘స్థితం’ కోరిక, ఒంటరితనం, అనుబంధం, జీవితపు అన్వేషణల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాన్ని లోతుగా ఆవిష్కరించే ఒక తాత్త్విక కథ. ఈ కథకు మూలస్తంభం అస్తిత్వపు ఆందోళన. కథానాయిక తన చుట్టూ ఉన్న సమాజం, సమాజం వేసే అంచనాలు, చివరికి తననుండి కూడా తాను పరాయీకరణకు గురైనట్లు భావిస్తుంది.
శీర్షికలు సంచికలు
కావ్యాన్ని రచించే కవి అన్ని విధాలా రసానికి లోబడియే ఉండాలి. ఇతివృత్తంలో రసానికి అనుగుణంగా లేని స్థితి కనబడ్డప్పుడు ఆ స్థితిని భంగం చేసి అయినా సరే రసానుగుణంగా వేరే కథను సృజించాలి. కవి కేవలం ఇతివృత్తాన్ని నిర్వహిస్తే, అందువల్ల ఏ ప్రయోజనం కలగదు. నన్నయ భట్టారకుడు భారతమును రసనిర్భరమై ధ్వనివిలసితముగా తీర్చిదిద్దెను.
శాంతం పాపం! శాంతం పాపం! రాక్షసులకన్నా తమరే క్రూరులు. ఎందుకంటే,
లక్కయింటిలో నిద్రిస్తున్న అన్నదమ్ములను నిశాచరులు కాల్చనే కాల్చరు. వదిన తలను ఆవిధంగా తాకరు గాక తాకరు. యుద్ధంలో కొడుకును చంపాలన్న ఆలోచన కూడా రాదు వారికి. వికారశరీరులు, ఘోరవర్తనులూ అయినా కరుణను మాత్రం విడిచిపెట్టలేదు వారు.
హైడెగర్ ప్రధానగ్రంథం పేరు, “Being and Time”. Da-sein దేశాన్ని చెబుతోంది. ఈ కల్పితపదం, మనిషి దేశకాలాలకు అతీతమైన తత్త్వం కాడని, మనిషి సక్రియుడని, తన కర్మలచే తనను తాను నిర్మించుకుంటాడని, “బతకడం” మనిషి “ధర్మ”మని, (తత్త్వం కాదని) చెబుతుంది. ఇది హైడెగర్ పదప్రయోగము, అనువాదభాషావిషయము.
భారత యుద్ధం గురించి చదువుతున్నప్పుడు వచ్చే రకం సందేహాలే ట్రోయ్ యుద్ధం గురించి కూడా వస్తాయి. ఈ కథ పురాణమా? ఇతిహాసమా? ఈ యుద్ధం నిజంగా జరిగిందా? జరిగితే ఎప్పుడు జరిగింది?
రామాయణ, మహాభారతాలు చదవకుండా భారతీయ విలువలను, మనస్తత్త్వాన్ని అర్థం చేసుకోవడం ఎంత కష్టమో అలాగే ఇలియాడ్, ఓడిస్సీ గ్రంథాలు చదవకుండా గ్రీసు దేశపు సంప్రదాయాలనే కాకుండా పాశ్చాత్య సంస్కృతిని, పాశ్చాత్య కళలనూ, పాశ్చాత్య ఆలోచనాసరళిని అర్థం చేసుకోవడం కష్టమే.
దాశరథిని ప్రేమించని సాహిత్యకులు తెలంగాణలో లేరు. దాశరథిచే స్వీకరింపబడని కావ్యవస్తువు తెలంగాణాలో లేదు. దాశరథి గీతాలు వినని రసికులు తెలంగాణమందుండరు. దాశరథియే తెలంగాణము – తెలంగాణమే దాశరథి.
ఎవరెస్ట్, అన్నపూర్ణ ట్రెక్‌లలో వారాల తరబడి గడిపాక కూడా మరో రెండు వారాలు మనస్లు ఒడిలో గడపాలన్న నిర్ణయానికి ఇదిగో – ఈ కొండలు, నదులు, అడవులు, గ్రామాలు, మఠాలు, మనుషులు, వాటి పిలుపులే, వారి తలపులే కారణమై ఉండాలి.
పుంభావసరస్వతిగా విద్వద్గణాలచే కొనియాడబడిన సముద్ధండ పండితులు డా॥ కొరిడె రాజన్న శాస్త్రిగారి సుదీర్ఘ సాహిత్య ప్రస్థానం, కవితా వైభవం మరియు వారి జీవన రేఖల గురించి వారి కుమారులు కొరిడె విశ్వనాథశర్మ గారు అందిస్తున్న పరిచయం.
తృణ సస్య తరులందు యినుము కనకములందు
మణి సికత శిలలలో శుని హరిణములలో
గుణ శక్తి వైవిధ్య మనువంశికత నేర్పు
మనకు నన్యోనతను – మంకుతిమ్మ
బాలమురళికి సంగీతం తెలియదనీ, సంగీతానికే బాలమురళి తెలుసనే వారాయన. నాకు సా-పా-సాలు తెలియవు కానీ బాలమురళి తెలుసు.
ఇప్పుడు తెలుగు రాతలలో ఈ విరామస్థానాలు ఒక వరసా, వావీ లేకుండా అస్తవ్యస్తంగా కనబడుతున్నాయి. “సరి అయిన పద్ధతి ఏది?” అని ఎవరిని అడగడమో తెలియడం లేదు. మనకి తెలుగులో ఒక లక్షణ గ్రంథం (style manual) లేదాయె.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
సమాజంలో ఏ ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉండనక్కరలేదు. భిన్నాభిప్రాయాలు ఉండటం, విభేదించడం మానవ సహజం. ఒకప్పుడు భారతదేశపు శాస్త్రసంవాదాల్లో తమ సాటివారితో విభేదించే ముందు, […]
ఎన్నెన్ని విధములో యెదలోన తలపోసి
మారుతాత్మజు డంత మధురముగను
సీతా శుభాంగన చెవిసోకునట్లుగా
ఆలపించ దొడగె రామకథను
రోడ్ల మీద ఇంకా సన్నటి చీకటి పొంచి ఉంది. కాలికి ఒక రాయి తగిలినట్లు కాలు విదిలించుకుంటూ గట్టిగా భూమ్మీదకు తన్ని అడుగేశాడు. అప్పుడు అతని కుడి కాలు నేలను తాకిన చోటునుండి ఒక నీటి ఊట పైకి చిమ్మడం మొదలైంది. అతను నమ్మలేకపోయాడు. ఆ ఊట ఆరడుగుల ఎత్తుకు పైకి చిమ్ముతోంది.
గాలిలో 60 సెకన్ల పాటు ప్రయాణించే ఒకే ఒక్క ఫిరంగి గుండు మార్గాన్ని పూర్తిగా లెక్కించడానికి ఒక హ్యూమన్ కంప్యూటర్ దాదాపు 20 గంటల సమయం తీసుకునేది. అదే లెక్కింపును ఎనియాక్ (ENIAC) కేవలం 30 సెకన్లలో పూర్తి చేసింది.
రాత్రి నగరాన్ని కప్పదు. వివస్త్రను చేస్తుంది. పగలు ధరించిన అబద్ధాల్ని ఒక్కొక్కటిగా విప్పి, అసలు ముఖాన్ని బయటపెడుతుంది… రాత్రి పదకొండు దాటిన తర్వాత నగరం పాత్రలు మార్చుకుంటుంది. పగలు అధికారంతో మాట్లాడిన మనుషులు, రాత్రి ఒంటరిగా నడుస్తారు. పగలు నవ్విన ముఖాలు, రాత్రి ఆలోచనలతో నిండిపోతాయి.
ఆసన్నమైయున్న మహాయుద్ధం నిమిత్తమై మంత్రాలోచన చేసేందుకు సభను ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. భీష్ముడిని తమ సర్వసైన్యాధిపతిగా ఎన్నుకున్న కాస్సేపట్లో పాండవదూతగా శ్రీకృష్ణుడు వచ్చేస్తాడు, సంధి పొసగదన్న నిశ్చయంతోనే. దూతను అమర్యాద చేద్దామనుకున్న దుర్యోధనుడి పథకం కృష్ణమాయ ముందు చతికిలపడుతుంది.
తెలుగు సాహిత్యంలో వ్యవసాయ కార్మికులు, రైతు, రైతుకూలీల పై విస్తృతంగా సాహిత్యం వెలువడింది. కానీ పారిశ్రామిక రంగాలలో పనిచేసే కార్మిక జీవితాలపై వచ్చిన సాహిత్యానికి చాలా తక్కువ పేజీలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ పారిశ్రామిక కార్మికుల జీవితాలపై తెలుగులో వచ్చిన సాహిత్యం చాలా తక్కువనే చెప్పుకోవాలి. వంగపండు మాత్రం తన తొలి రోజుల నుంచే, అనగా 80వ దశాబ్దానికి పూర్వమే, తన రచనల ద్వారా కార్మిక సాహిత్యానికి ఒక స్థానం కల్పించాడు.