పూర్వరంగం
వ్యాయోగం
సంస్కృతరూపకాలు దశవిధాలు: నాటకము, ప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవాకారము, వీథి, అంకము, ఈహామృగము.
వ్యాయోగ లక్షణాలు: ఇతివృత్తం ప్రఖ్యాతమై ఉండాలి; స్త్రీపాత్రలు తక్కువగా, పురుషపాత్రలు ఎక్కువగా ఉండాలి; నాయకుడు ప్రఖ్యాతుడై ఉండాలి, రాజర్షి కానీ దివ్యుడు కానీ అయి ఉండవచ్చు, ధీరోదాత్తుడు అయి ఉండాలి; హాస్యం, శృంగారం, శాంతం తప్ప మిగతా రసాలు ప్రధానంగా ఉండవచ్చు; కలహం ఉండవచ్చు, ఆ కలహానికి స్త్రీ కారణం కాకూడదు; ఒకే అంకాన్ని కలిగి ఉండాలి. గర్భవిమర్శ సంధులు ఉండకూడదు. కైశికీవృత్తి ఉండకూడదు.
కథాసంగ్రహం
అడవిలోంచి ప్రయాణిస్తూ ఉన్న ఒక బ్రాహ్మణకుటుంబానికి ఘటోత్కచుడు ఎదురవుతాడు. తన తల్లి ఏకాదశీ ఉపవాసవిరమణభోజనార్థం నరమాంసం తెద్దామని బయల్దేరాడు అతడు. ఎవరు వెళ్ళాలని కాస్త చర్చ జరిగాక బ్రాహ్మణుడి రెండవ కొడుకు – ముగ్గురు పుత్రుల్లో మధ్యముడు – వెళ్ళాలని నిశ్చయం అవుతుంది. అతడు ఆత్మతర్పణం చేస్తానని చెప్పి ఒక చెరువు దగ్గరకు వెళ్ళి తిరిగిరావడం ఆలస్యమవగా – ఘటోత్కచుడు – వాడి పేరు తెలియనందున – “మధ్యమా” అని కేక వేస్తాడు. ఆ పిలుపు విని ఆ మధ్యమకుమారుడు తిరిగి వస్తాడు. ఆ పిలుపుకు స్పందించి, సమీపంలోనే ఉన్న భీముడూ వస్తాడు (కుంతీపుత్రుల్లో మధ్యముడు కదా!).
భీముడు ఘటోత్కచుణ్ణి గుర్తుపడతాడు, ఘటోత్కచుడు భీముణ్ణి గుర్తుపట్టడు. ఆ పిల్లవాణ్ణి వదలమని భీముడు, వదలనని ఘటోత్కచుడు కలహించుకుంటారు. ఇద్దరి మధ్య ఒక చిన్న యుద్ధం జరిగాక మధ్యముడి స్థానంలో భీముడే వెళతాడు. హిడింబకు ముందే తెలుసు, భీముడు ఈ పరిసరాల్లోనే ఉన్నాడని. తనను కలవాలన్న కోరికతో నరమాంసం మిషతో ఘటోత్కచుడిని పంపిందామె. ఆ ఇద్దరి సమాగమంతో కథ సుఖాంతమవుతుంది.
కొన్ని విశేషాలు
- సరళమైన కథ, చురుకైన కథనం! సంభాషణలు క్లుప్తంగా ఉండి ప్రేక్షకుల/పాఠకుల ఉత్కంఠను నిలిపి ఉంచుతాయి — ముఖ్యంగా, భీముడూ ఘటోత్కచుడూ వడివడిగా మాటలు రువ్వుకుంటూ కథను వేగంగా నడిపిస్తారు. రెండు సందర్భాలలో, ఘటోత్కచుడు సగంలో నిలిపిన శ్లోకాన్ని భీముడు అందుకొని పూరించడం ఒక విశేషం.
- మహాభారతంలో పాత్రలను వాడుకున్నా ఈ నాటకపు కథ స్వతంత్రమైన కల్పనే. ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకును వదులుకోవాల్సిన క్లిష్టపరిస్థితి ఏర్పడ్డప్పుడు తల్లిదండ్రులు రెండవ కొడుకును వదులుకునేందుకు సిద్ధపడడం అనే ఊహకు, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపించే శునశ్శేఫుడి కథకు సామ్యాన్ని ప్రొఫెసర్ ధ్రువ గుర్తించారని చెప్పారు డా.పుసాల్కర్ తన భాసాధ్యయనగ్రంథంలో.
మహాభారతపాత్రలతో స్వతంత్రంగా కల్పించిన కథ – అందునా ఘటోత్కచుడు పాత్రగా ఉన్న కథ – అనగానే తెలుగువాళ్ళకు మాయాబజార్ సినిమా గుర్తుకు వస్తుంది. నాకైతే, ఈ నాటకంలో చిత్రితమైన ఘటోత్కచుడి దుడుకుతనం, అమాయకత్వం, మాటల్లోని హాస్యస్ఫురణ, మాతృభక్తి మాయాబజార్ సినిమాలోని ఘటోత్కచాశ్రమపు సన్నివేశాలను స్ఫురింపజేసాయి.
- ఈ నాటకంలో ఘటోత్కచభీములకు మంత్రం చదివేందుకు నీళ్ళు అవసరమవుతాయి. కొండను అడిగి ఒకరు, బ్రాహ్మణుణ్ణి అడిగి మరొకరూ నీటిని తెప్పించుకుంటారు. ఇట్లా రంగస్థలంపై నీటిని రప్పించడం భాసనాటకాల్లోనే కనిపించే విషయమని, అతడి ఏడు నాటకాలలో పదకొండు సందర్భాలలో ఇలాంటి సంఘటనలు ఉన్నాయని అంటారు పుసాల్కర్.
- మాయాపాశంతో కట్టివేయబడ్డ భీముడిని ఘటోత్కచుడు “తాళ్ళతో కట్టిన ఇంద్రధ్వజం”తో పోలుస్తాడు. ఈ ఇంద్రధ్వజం పోలిక రామాయణంలోనూ కనబడుతుంది. ఇంద్రధ్వజం అంటే? ఒకప్పుడు, రాజులు దుర్భిక్షాలనుంచి, వ్యాధులనుంచి శత్రువులనుంచి తమ రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఇంద్రధ్వజోత్సవాన్ని నిర్వహించేవారట. ఈ ఉత్సవం భాద్రపదశుక్లపక్షంలో పన్నెండు రోజులపాటు చాలా వైభవోపేతంగా జరిగేదట. చెట్టంత మనిషి కాబట్టి భీముడికి నప్పే ఉపమానమే ఇది.
- నాకు నచ్చిన మరొక ఉపమానం ఘటోత్కచుణ్ణి అనుసరిస్తున్న భీముడిని ఉద్దేశించి చెప్పినది: జడివానను దులుపుకున్న ఎద్దులాగా నెమ్మదిగా విలాసంగా వెళుతున్నాడట భీముడు! భీముడి పరాక్రమాన్ని, నిర్భీతిని చూసినవారికి కలిగిన ముచ్చటను క్లుప్తంగా, అందంగా చెప్పిందీ ఉపమానం.
- చదవబోయేవారికి పూర్వధారణను కల్పించడం నా ఉద్దేశ్యం కాదు కానీ ఇక్కడ ఒక మాట చెప్పక తప్పదు: భాసనాటకచక్రం గురించి ఇటీవల వ్రాస్తున్నప్పుడు వాడ్రేవు చినవీరభద్రుడుగారు “…సమాజంలో ‘నిమ్న’వృత్తులకు చెందిన మనుషుల పట్ల తక్కువ చూపు భాసనాటకాల్లో పాత్రలు తమకు తెలియకుండానే కనపరుస్తాయి. ఏళ్ళకిందట నేను మొదటిసారిగా ‘మధ్యమ వ్యాయోగం’ నాటకం చదివినతరువాత చాలాకాలం పాటు భాసనాటకాల్ని మళ్ళా తెరవడానికి మనసు ఇచ్చగించక పోవటానికి కారణమదే.” ఈ అనువాదం చేస్తున్నప్పుడు నాకు అది తట్టలేదు కానీ తిరిగి చదువుతున్నప్పుడు ఇందులో బ్రాహ్మణాధిక్యతాభావం స్ఫుటంగానే కనిపించింది.
అయితే, ఏ పుస్తకమైనా దాని రచయిత కాలంలో ప్రాచుర్యంలో ఉన్న భావాల ధ్వనులను ప్రతిధ్వనులను ఇముడ్చుకోక మానదు కదా. వాటినన్నింటినీ మనసులో పెట్టుకుంటూనే, వాటికి అతీతంగా ఉంటూ, పుస్తకాన్ని చదవడం, రచయిత ప్రతిభను గుర్తించడం, రసస్ఫూర్తిని అనుభవంలోకి తెచ్చుకోవడం, ఎంతో కొంత నేర్చుకోగలగడం సాధ్యమే కాదు, అవసరం కూడా, అని అనుకుంటాను. ఆ ఆలోచనాబిందువుపై ఈ ఉపోద్ఘాతాన్ని ముగిస్తున్నాను.
పాత్రలు
వృద్ధుడు – కేశవదాసుడు అనే బ్రాహ్మణుడు
వృద్ధుడి భార్య
పెద్ద కొడుకు
రెండవ కొడుకు -– మధ్యముడు
చిన్న కొడుకు
ఘటోత్కచుడు
భీమసేనుడు
హిడింబ
సూత్రధారః:
పాదో హరేః కువలయామలఖడ్గనీలః ।
యః ప్రోద్యతస్త్రిభువనక్రమణే రరాజ
వైడూర్యసంఙ్క్రమ ఇవామ్బరసాగరస్య ॥ 1 ॥
ఏవమార్యమిశ్రాన్విజ్ఞాపయామి । అయే కిం ను ఖలు మయి విజ్ఞాపనవ్యగ్రే శబ్ద ఇవ శ్రూయతే? అఙ్గ, పశ్యామి ।
భోస్తాత! కో ను ఖల్వేషః?
సూత్రధారుడు:
కువలయామల ఖడ్గంపు ఛవిని మెరిసి
ముజ్జగమ్ముల వర్ధిల్లి మురిసి పొలయ
రోదసి వెలసిన మణి వారధిని బోలు
విష్ణు పదము మిమ్ముల గాచు ప్రీతితోడ! (1)
అసురుల భార్యల హృదయాలకు దుఃఖాన్ని కలిగించేది, నల్లకలువ వలె మెరుస్తున్నది, నల్లని ఖడ్గమువలెనున్నది, ముల్లోకాలను కొలిచేందుకు పైకెత్తినప్పుడు – ఆకాశము అనే సముద్రం మీద వైడూర్యాలతో నిర్మించిన వంతెనవలె వెలిగినదీ అయిన విష్ణుపాదం మిమ్ములను కాచుగాక!
పూజ్యులైన మీకు (ప్రేక్షకులకు) ఇలా విన్నవించుకుంటున్నాను, అరె, ఇదేమిటి? నా మనవి వినిపించబోతుండగా – ఏదో శబ్దం వినబడుతున్నది? చూస్తాను.
ఓ తండ్రీ! ఎవడు వీడు?
సూత్రధారః:
భోః శబ్దోచ్చారణాదస్య బ్రాహ్మణోఽయం న సంశయః ।
త్రాస్యతే నిర్విశఙ్కేన కేనచిత్పాపచేతసా ॥ 2 ॥
భోస్తాత! కో ను ఖల్వేషః?
సూత్రధారుడు:
“ఓ” యని పలికిన విధమున నాతడు
విప్రుండేనని తెలుయును నిక్కము
జాలిని మాలిన పాపాత్ము డొక్కడు
ఇతనిని భయపెడుతున్నాడు (2)
భావం: “ఓ” అన్న మాటను పలికిన తీరును బట్టి – ఇతడు నిస్సందేహంగా బ్రాహ్మణుడే! ఎవడో పాపచిత్తుడు ఇతడిని పీడిస్తున్నాడు.
ఓ తండ్రీ! ఎవడు వీడు?
సూత్రధారః:
శ్రాన్తైః సుతైః పరివృతస్తరుణైః సదారో
వృద్ధో ద్విజో నిశిచరానుచరః స ఏషః ।
వ్యాఘ్రానుసారచకితో వృషభః సధేనుః
సన్త్రస్తవత్సక ఇవాకులతాముపైతి ॥ 3 ॥
స్థాపనా।
సూత్రధారుడు:
ఆవుల దూడల వృషభము పగిదిని
భార్యా పుత్రుల తోడను బాపడు –
బెబ్బులి తరిమిన వృషభము పోలిక
రక్కసు గనుగొని వెక్కసమాయెను! (3)
పులి తరుముతుండగా, పీడకు లోనైన దూడలతో, ఆవుతో సహా వస్తున్న వృషభమువలె – రాక్షసుడిచేత వెన్నాడబడుతూ భయభ్రాంతులైన భార్యాపుత్రులతో వృద్ధబ్రాహ్మణుడు ఇటే వస్తున్నాడు.
స్థాపన సమాప్తము
బ్రాహ్మణః:
తరుణరవికరప్రకీర్ణకేశో
భ్రుకుటిపుటోజ్జ్వలపిఙ్గలాయతాక్షః ।
సతడిదివ ఘనః సకణ్ఠసూత్రో
యుగనిధనే ప్రతిమాకృతిర్హరస్య ॥ 4 ॥
బ్రాహ్మణుడు:
తరుణరవిరేఖల వలెను పరచు కురులు
భృకుటి పుటమున యెఱ్ఱగ బెళుకు కనులు
మేన కనకపు హారము మెరుపు మబ్బు
ప్రళయ కాలపు రుద్రుని ప్రతిమ వోలె (4)
భావం: వెదజల్లబడిన ఉదయరవికిరణాలవంటి జుట్టు ఉన్నవాడు, కనుబొమలను ముడివేసుకున్నవాడు, భగభగలాడే ఎర్రని మిడిగుడ్ల వాడు. మెడలో బంగారు గొలుసును ధరించి మెరుపుతోనున్న వానమబ్బువలె ఉన్నవాడు, యుగాంతకాలశివుడిని తలపిస్తున్నవాడు.
ప్రథమః:
గ్రహయుగలనిభాక్షః పీనవిస్తీర్ణవక్షాః
కనకకపిలకేశః పీతకౌశేయవాసాః ।
తిమిరనివహవర్ణః పాణ్డరోద్వృత్తదంష్ట్రో
నవ ఇవ జలగర్భో లీయమానేన్దులేఖః ॥ 5 ॥
పెద్ద కొడుకు:
గ్రహయుగళమును బోలిన కంటివాడు
పీన సువిశాల వక్షపు పేర్మి వాడు
పసిడికావి కురులు పైన పచ్చవలువ
చంద్రవంకను దాచిన చామమబ్బు
తెల్ల కోరల మెరిసేటి నల్లవాడు (5)
గ్రహాల జంటవంటి కళ్ళు ఉన్నవాడు, బలిష్ఠమైన పెద్ద రొమ్ము ఉన్నవాడు, పసుపు-ఎరుపు రంగు జుట్టు ఉన్నవాడు, పచ్చని పట్టుబట్టలు కట్టుకొన్నవాడు, పొడుచుకొచ్చే తెల్లని కోరలతో, చిమ్మచీకటి రంగుతో –- నెలవంకను తనలో లయం చేసుకుంటున్న నల్లమబ్బువలె ఉన్నవాడు.
ద్వితీయః:
కలభదశనదంష్ట్రో లాఙ్గలాకారనాసః
కరివరకరబాహుర్నీలజీమూతవర్ణః ।
హుతహుతవహదీప్తో య స్థితో భాతి భీమ-
స్త్రిపురపురనిహన్తుః శఙ్కరస్యేవ రోషః ॥ 6 ॥
రెండవ కొడుకు:
గున్నయేనుగు కోర; కోటేరు ముక్కు;
కరటి తుండము చేయి; కావిరి మేను;
కణకణమనుచు భీకరుడు వెలిగెను;
త్రిపుర దహనుడైన త్రినయను బోలె (6)
పిల్ల ఏనుగు దంతాలవంటి కోరలు ఉన్నవాడు, నాగలిని పోలిన ముక్కు ఉన్నవాడు, శ్రేష్ఠమైన ఏనుగు యొక్క తొండమును పోలిన చేతులు ఉన్నవాడు, నల్లమబ్బు రంగువాడు, ఆహుతులు వ్రేల్చబడిన అగ్నివలె వెలుగుతున్నవాడు, త్రిపురాసురనగరాలను ధ్వంసం చేస్తున్న శివుడి కోపమువలె భయంకరుడై నిలిచి ఉన్నవాడు.
తృతీయః:
వజ్రపాతోఽచలేన్ద్రాణాం శ్యేనః సర్వపతత్రిణామ్ ।
మృగేన్ద్రో మృగసఙ్ఘానాం మృత్యుః పురుషవిగ్రహః ॥ 7 ॥
చిన్న కొడుకు:
అచలములకును వజ్రపు టదటు వోలె
పిట్టలకు నెల్ల డేగల పిలుపు వోలె
మృగములకును మృగేంద్రుని నెగవు వోలె
నరుల పాలిట మృత్యువే ననగ నిలిచె (7)
పర్వతరాజముల పాలిట వజ్రాయుధము వంటివాడు, పక్షులన్నింటికీ డేగ వంటివాడు, లేళ్ళ గుంపుకు సింహంవంటివాడు, మనిషి రూపెత్తిన మృత్యువులా ఉన్నవాడు…
బ్రాహ్మణీ:
(ఆర్య! క ఏషోఽస్మాన్ సన్తాపయతి?)
బ్రాహ్మణి:
ఘటోత్కచః:
కిం యాసి మద్భయవినాశితధైర్యసారో
విత్రస్తదారసుతరక్షణహీనశక్తే ।
తార్క్ష్యాగ్రపక్షపవనోద్ధతరోషవహ్ని-
తీవ్రః కలత్రసహితో భుజగో యథార్తః ॥ 8 ॥
భో బ్రాహ్మణ! న గన్తవ్యం న గన్తవ్యమ్ ।
ఘటోత్కచుడు:
భయము చేతను ధైర్యము బాసి నీవు
భార్య బిడ్డల గావగ బల్మి లేక
గరుడ విహగపు గాలిచే కనలు రేగి
పాము వోలెను భార్యతో పరుగు లేల! (8)
నా భయంవల్ల ధైర్యం నశించినవాడివై, భీతార్తులైన భార్యాపుత్రులను రక్షించే శక్తిని కోల్పోయినవాడివై – గరుత్మంతుడి రెక్కల కొసలచేత ఎగదోయబడిన తీవ్రమైన రోషాగ్నితో రగులుతున్న భార్యాసహితసర్పంవలె – దుఃఖితుడివై పరుగెత్తుతున్నావెందుకు?
ఓ బ్రాహ్మణా! పోవద్దు, పోవద్దు!
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
జానామి సర్వత్ర సదా చ నామ
ద్విజోత్తమాః పూజ్యతమాః పృథివ్యామ్ ।
అకార్యమేతచ్చ మయాద్య కార్యం
మాతుర్నియోగాదపనీయ శఙ్కామ్ ॥ 9 ॥
ఘటోత్కచుడు:
విప్రు లెప్పుడు పూజ్యులు పృథ్వి యందు
సత్య మిది నాకు దెలియును సకల దిశల
అరమర విడిచి నేనిపు డట్టిపనిని
తల్లి యాజ్ఞను బాటించ మల్లడింతు! (9)
“ఈ భూమి మీద ఎక్కడైనా, ఎప్పుడైనా బ్రాహ్మణోత్తములు అత్యంతపూజనీయులు,” అని నాకు తెలుసు. అయినప్పటికీ, నా తల్లి ఆజ్ఞ కారణంగా, ఈ రోజు నేను చేయకూడని పనిని నిస్సంకోచంగా చేసితీరాలి.
వృద్ధః:
వృద్ధుడు:
బ్రాహ్మణీ:
(కిమిదానీమార్యో మధ్యస్థవర్ణ ఇవ దృశ్యతే?)
బ్రాహ్మణి:
వృద్ధః:
వృద్ధుడు:
బ్రాహ్మణీ:
(నను విక్రోశామః ।)
బ్రాహ్మణి:
ప్రథమః:
ఇదం హి శూన్యం తిమిరోత్కరప్రభై-
ర్నగప్రకారైరవరుద్ధదిక్పథమ్ ।
ఖగైర్మృగైశ్చాపి సమాకులాన్తరం
వనం నివాసాభిమతం మనస్వినామ్ ॥ 10 ॥
పెద్ద కొడుకు:
దీప్తి నరికట్టు గిరులచే తిమిర భూమి
పక్షి మృగములు విరివిగ పరగు భూమి
శూన్య వనమున వాసము సుళువు కాదు
ధీర జనులకు మాత్రమే దీమమౌను (10)
చీకటి గుట్టలుగా పేరుకుపోయి, రకరకాల చెట్లతో అన్నివైపుల మార్గాలు మూసుకుపోయి, నానాజంతువులతో, పక్షులతో నిండియున్న ఈ నిర్జనారణ్యం ఎంతో గుండె ధైర్యం ఉన్నవారికి (మాత్రమే) నివాసయోగ్యం.
వృద్ధః:
యుద్ధప్రియాశ్చ శరణాగతవత్సలాశ్చ
దీనేషు పక్షపతితాః కృతసాహసాశ్చ ।
ఏవంవిధప్రతిభయాకృతిచేష్టితానాం
దణ్డం యథార్హమిహ ధారయితుం సమర్థాః ॥ 11 ॥
వృద్ధుడు:
పాండవులు యుద్ధప్రియులు, శరణాగతవత్సలురు, దీనులయెడ పక్షపాతము ఉన్నవారు, సాహసికులు. ఇట్లా భయపెట్టే రూపాల వారికి, చేష్టల వారికి తగిన దండనను వేయగలిగిన సమర్థులు.
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
పత్న్యా చారిత్రశాలిన్యా ద్విపుత్రో మోక్షమిచ్ఛసి ।
బలాబలం పరిజ్ఞాయ పుత్రమేకం విసర్జయ ॥ 12 ॥
ఘటోత్కచుడు:
శీలవతియైన భార్యతో, ఇద్దరు పుత్రులతో నానుంచి విడుదల కావాలని నీకు కోరిక ఉన్నదా? ఉంటే – బాగోగులను ఆలోచించుకొని, నీ కొడుకులలో ఒకరిని నాకు వదిలిపెట్టు.
వృద్ధః:
బ్రాహ్మణః శ్రుతవాన్ వృద్ధః పుత్రం శీలగుణాన్వితమ్ ।
పురుషాదస్య దత్త్వాహం కథం నిర్వృతిమాప్నుయామ్ ॥ 13 ॥
వృద్ధుడు:
ఘటోత్కచః:
సకుటుమ్బః క్షణేనైవ వినాశముపయాస్యసి ॥ 14 ॥
ఘటోత్కచుడు:
వృద్ధః:
కృతకృత్యం శరీరం మే పరిణామేన జర్జరమ్ ।
రాక్షసాగ్నౌ సుతాపేక్షీ హోష్యామి విధిసంస్కృతమ్ ॥ 15 ॥
వృద్ధుడు:
బ్రాహ్మణీ:
(ఆర్య, మా మైవమ్ । పతిమాత్రధర్మిణీ పతివ్రతేతి నామ । గృహీతఫలేనైతేన శరీరేణార్యం కులం చ రక్షితుమిచ్ఛామి ।)
బ్రాహ్మణి:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
వృద్ధః:
వృద్ధుడు:
ప్రథమః:
రక్షణార్థం కులస్యాస్య మోక్తుమర్హతి మాం భవాన్ ॥ 16 ॥
పెద్ద కొడుకు:
ద్వితీయః:
జ్యేష్ఠః శ్రేష్ఠః కులే లోకే పితౄణాం చ సుసంప్రియః ।
తతోఽహమేవ యాస్యామి గురువృత్తిమనుస్మరన్ ॥ 17 ॥
రెండవ కొడుకు:
తృతీయః:
జ్యేష్ఠో భ్రాతా పితృసమః కథితో బ్రహ్మవాదిభిః ।
తతోఽహం కర్తుమస్మ్యర్హో గురూణాం ప్రాణరక్షణమ్ ॥ 18 ॥
3వ కొడుకు:
ప్రథమః:
ఆపదం హి పితా ప్రాప్తో జ్యేష్ఠపుత్రేణ తార్యతే ।
తతోఽహమేవ యాస్యామి గురూణాం ప్రాణరక్షణాత్ ॥ 19 ॥
పెద్ద కొడుకు:
తండ్రి ఆపదలో ఉన్నప్పుడు అతడిని దాటించవలసింది పెద్ద కొడుకే. కనుక తల్లిదండ్రుల ప్రాణరక్షణార్థము నేనే వెళతాను.
వృద్ధః:
వృద్ధుడు:
బ్రాహ్మణీ:
(యథార్యో జ్యేష్ఠమిచ్ఛతి తథాహమపి కనిష్ఠమిచ్ఛామి ।)
బ్రాహ్మణి:
ద్వితీయః:
రెండవ కొడుకు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
ద్వితీయః:
బన్ధుస్నేహాద్ధి మహతః కాయస్నేహస్తు దుర్లభః ॥ 20 ॥
రెండవ కొడుకు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
ద్వితీయః:
రెండవ కొడుకు:
వృద్ధః:
వినిమాయ గురుప్రాణాన్ స్వైః ప్రాణైర్గురువత్సల ।
అకృతాత్మదురావాపం బ్రహ్మలోకమవాప్నుహి ॥ 21 ॥
వృద్ధుడు:
పెద్దల ప్రేమను చూరగొన్నవాడా, నీ తల్లిదండ్రుల ప్రాణాలకు బదులుగా నీ ప్రాణాలను సమర్పిస్తున్న నీవు, ఆత్మను అదుపులో పెట్టుకోగలిగిన వారికి తప్ప అందని బ్రహ్మలోకాన్ని పొందుతావు.
ద్వితీయ:
రెండవ కొడుకు:
బ్రాహ్మణీ:
(జాత ! చిరం జీవ ।)
బ్రాహ్మణి:
ద్వితీయ:
రెండవ కొడుకు:
ప్రథమః:
పరిష్వజస్వ గాఢం మాం పరిష్వక్తః శుభైర్గుణైః ।
కీర్త్యా తవ పరిష్వక్తా భవిష్యతి వసున్ధరా ॥ 22 ॥
పెద్ద కొడుకు:
తృతీయః:
మూడవ కొడుకు:
ద్వితీయః:
రెండవ కొడుకు:
తృతీయః:
మూడవ కొడుకు:
ద్వితీయః:
రెండవ కొడుకు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
ద్వితీయః:
తత్ర మే ప్రకల్పితపరలోకస్య పిపాసాప్రతీకారం కరిష్యామి ।
రెండవ కొడుకు:
ఘటోత్కచ:
ఘటోత్కచుడు:
ద్వితీయః:
రెండవ కొడుకు:
వృద్ధః:
యస్త్రిశృఙ్గో మమ త్వాసీన్మనోజ్ఞో వంశపర్వతః ।
స మధ్యశృఙ్గభఙ్గేన మనస్తపతి మే భృశమ్ ॥ 23 ॥
హా పుత్రక! కథం గత ఏవ!
తరుణ! తరుణతానురూపకాన్తే!
నియమపరాధ్యయనప్రసక్తబుద్ధే!
కథమివ గజరాజదన్తభగ్న-
స్తరురివ యాస్యసి పుష్పితో వినాశమ్ ॥ 24 ॥
వృద్ధుడు:
మూడు శిఖరాలతోనున్న చక్కని పర్వతంవలె ఉండేది నా కుటుంబం. ఇప్పుడు నడుమనున్న శిఖరం విరిగిపడి, నన్ను మిక్కిలి బాధిస్తున్నది.
హా పుత్రా, వెళ్ళిపోయావా నాయనా?
పడుచువాడా! కోడెవయసులో మిసమిసలాడుతున్నవాడా! నియమబద్ధంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో బుద్ధిని మగ్నం చేసినవాడా! గజరాజు యొక్క దంతాలచేత పెకలించబడ్డ పూలచెట్టువలె నాశనమవబోతున్నావే!
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
ప్రథమః:
పెద్ద కొడుకు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
ఖగశతవిరుతే విరౌతి తారం
ద్రుమగహనే దృఢసఙ్కటే వనేఽస్మిన్ ।
జనయతి చ మనోజ్వరం స్వరోఽయం
బహుసదృశో హి ధనఞ్జయస్వరస్య ॥ 25 ॥
భీముడు:
దట్టమైన చెట్లతో నిండిన ఈ దుర్గమారణ్యంలో, వందలాది పక్షుల కలరవాల నడుమ, నా హృదయాన్ని కలవరపెడుతున్నదీ స్వరం. అచ్చం అర్జునుడి గొంతులా ఉన్నది.
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
సింహాస్యః సింహదంష్ట్రో మధునిభనయనః స్నిగ్ధగమ్భీరకణ్ఠో
బభ్రుభ్రూః శ్యేననాసో ద్విరదపతిహనుర్దీప్తవిశ్లిష్టకేశః ।
వ్యూఢోరా వజ్రమధ్యో గజవృషభగతిర్లమ్బపీనాంసబాహుః
సువ్యక్తం రాక్షసీజో విపులబలయుతో లోకవీరస్య పుత్రః ॥ 26 ॥
భీముడు:
సింహపు ముఖము, సింహపు కోరలు, తేనె రంగు కళ్ళు, ప్రీతిగొలిపే గంభీరమైన కంఠస్వరం, ఎర్రని కనుబొమలు, గద్ద ముక్కు, గజరాజు దవడలు, వెలుగులు చిమ్ముతున్న వదులొదులు వెంట్రుకలు, విశాలమైన రొమ్ము, వజ్రం లాంటి నడుము, గజశ్రేష్ఠగమనము, కండలు తిరిగిన పొడవైన చేతులు… ఎవరో రాక్షసికి అతిబలశాలిగా విఖ్యాతుడైన వీరుడివలన పుట్టాడని తెలుస్తూనే ఉన్నది.
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
సింహాకృతిః కనకతాలసమానబాహు-
ర్మధ్యే తనుర్గరుడపక్షవిలిప్తపక్షః ।
విష్ణుర్భవేద్వికసితామ్బుజపత్రనేత్రో
నేత్రే మమాహరతి బన్ధురివాగతోఽయమ్ ॥ 27 ॥
భో మధ్యమ! త్వాం ఖల్వహం శబ్దాపయామి ।
ఘటోత్కచుడు:
సింహపు ఆకృతి. బంగారు తాటిచెట్లవంటి చేతులు. సన్నని నడుము, దువ్వి నునుపు చేసిన గరుత్మంతుడి రెక్కలవంటి పక్కభాగాలు, వికసితపద్మనేత్రుడైన విష్ణువే కాబోలు. బంధువువలె వచ్చిన ఇతడు నా కళ్ళను ఆకట్టుకుంటున్నాడు.
ఓ మధ్యమా! నిన్నేనయ్యా, పిలుస్తున్నది.
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
మధ్యమోఽహమవధ్యానాముత్సిక్తానాం చ మధ్యమః ।
మధ్యమోఽహం క్షితౌ భద్ర భ్రాతౄణామపి మధ్యమః ॥ 28 ॥
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
మధ్యమః పఞ్చభూతానాం పార్థివానాం చ మధ్యమః ।
భవే చ మధ్యమో లోకే సర్వకార్యేషు మధ్యమః ॥ 29 ॥
భీముడు:
వృద్ధః:
అస్మాన్మోక్తుమిహాయాతో దర్పాన్మృత్యోరివోత్థితః ॥ 30 ॥
వృద్ధుడు:
మధ్యమః:
అస్యామాచమ్య పద్మిన్యాం పరలోకేషు దుర్లభమ్ ।
ఆత్మనైవాత్మనో దత్తం పద్మపత్రోజ్జ్వలం జలమ్ ॥ 31 ॥
భోః పురుష! ప్రాప్తోఽస్మి ।
రెండవ కొడుకు:
ఈ తామర కొలనులోని నీటిని ఆచమనం చేయటం ద్వారా, పరలోకంలో దుర్లభమైనది, తామరపూరేకులతో మెరుస్తున్నటువంటిదీ అయిన జలాన్ని నాకు నేను అర్పించుకున్నాను.
(ఘటోత్కచుడిని సమీపించి) అయ్యా! వచ్చేసాను.
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
భీముడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
భీముడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
భీముడు:
వృద్ధః:
సజలజలదగాత్రః పద్మపత్రాయతాక్షో
మృగపతిగతిలీలో రాక్షసః ప్రోగ్రదంష్ట్రః ।
జగతి విగతశఙ్కస్త్వద్విధానాం సమక్షం
ససుతపరిజనం భో! హన్తుకామోఽభ్యుపైతి ॥ 32 ॥
వృద్ధుడు:
నీటితో నిండిన మబ్బులాంటి శరీరము గలవాడు, తామరరేకులవలె విశాలమైన కన్నులు ఉన్నవాడు, సింహమువలె విలాసంగా కదలాడేవాడు, భయంకరమైన కోరలు ఉన్నవాడు, నీవంటి వారు ఈ లోకంలో ఉన్నారనే భయం లేనటువంటివాడు అయిన ఈ రాక్షసుడు, పిల్లాజెల్లాతో సహా నన్ను చంపాలని చూస్తున్నాడు.
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
పుత్రనక్షత్రకీర్ణస్య పత్నీకాన్తప్రభస్య చ ।
వృద్ధస్య విప్రచన్ద్రస్య భవాన్ రాహురివోత్థితః ॥ 33 ॥
భీముడు:
పుత్రులు నక్షత్రాలవలె తన చుట్టూ ఉండగా, భార్య వెన్నెలవలె వెలుగుతూ ఉండగా, చంద్రుడివలె ఉన్న ఈ విప్రుడి మీదికి రాహువులా వచ్చావు నువ్వు.
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
నివృత్తవ్యవహారోఽయం సదారస్తనయైః సహ ।
సర్వాపరాధేఽవధ్యత్వాన్ముచ్యతాం ద్విజసత్తమః ॥ 34 ॥
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భ్రాతృణాం మమ సర్వేషాం కోఽయం భో! గుణతస్కరః ।
దృష్ట్వైతద్ బాలశౌణ్డీర్యం సౌభద్రస్య స్మరామ్యహమ్ ॥ 35 ॥
(ప్రకాశమ్) భోః పురుష! ముచ్యతామ్ ।
భీముడు:
ఎవడితడు? నా అన్నదమ్ముల గుణాలన్ననింటినీ దొంగిలించినట్లున్నాడు. ఇతడి పసితనపు గర్వాన్ని చూస్తూ ఉంటే నాకు అభిమన్యుడు గుర్తుకు వస్తున్నాడు.
(పైకి) వదలవోయీ!
ఘటోత్కచః:
ముచ్యతామితి విస్రబ్ధం బ్రవీతి యది మే పితా ।
ముచ్యతే న తథా హ్యేష గృహీతో మాతురాజ్ఞయా ॥ 36 ॥
ఘటోత్కచుడు:
భీమః:
మాతా కిల మనుష్యాణాం దైవతానాం చ దైవతమ్ ।
మాతురాజ్ఞాం పురస్కృత్య వయమేతాం దశాం గతాః ॥ 37 ॥
(ప్రకాశమ్) భోః పురుష! ప్రష్టవ్యం ఖలు తావదస్తి ।
భీముడు:
మనుషులకైనా, దేవతలకైనా తల్లియే దైవము. అమ్మ మాటను ఔదలదాల్చినందుకే కదా మేము ఈనాడు ఈ గౌరవనీయమైన స్థాయికి చేరుకున్నాము.
(పైకి) ఒకటడగాలని ఉన్నదోయ్!
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
కౌరవ్యకులదీపేన పాణ్డవేన మహాత్మనా ।
సనాథా యా మహాభాగా పూర్ణేన ద్యౌరివేన్దునా ॥ 38 ॥
ఘటోత్కచుడు:
భీమః:
రూపం సత్త్వం బలం చైవ పితృభిః సదృశం బహు ।
ప్రజాసు వీతకారుణ్యం మనశ్చైవాస్య కీదృశమ్ ॥ 39 ॥
(ప్రకాశమ్) భోః పురుష! ముచ్యతామ్ ।
భీముడు:
(పైకి) వాళ్ళను వదిలేయవయ్యా!
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ద్వితీయః:
త్యక్తాః ప్రాగేవ మే ప్రాణాః గురుప్రాణేష్వపేక్షయా ।
యువా రూపగుణోపేతో భవాంస్తిష్ఠతు భూతలే ॥ 40 ॥
రెండవ కొడుకు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
జ్ఞాతుం తదిచ్ఛామి భవత్సమీపే ।
కిం రూపమేతద్వద భద్ర తస్య
గుణాగుణజ్ఞః సదృశం ప్రపత్స్యే ॥ 41 ॥
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
అయం తు దక్షిణో బాహురాయుధం సహజం మమ ॥ 42 ॥
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
విశ్వకర్తా శివః కృష్ణః శక్రః శక్తిధరో యమః ।
ఏతేషు కథ్యతాం భద్ర కేన తే సదృశః పితా ॥ 43 ॥
భీముడు:
బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, స్కందుడు, యముడు – వీరిలో ఎవరితో పోల్చదగ్గవాడు నీ తండ్రి, నాయనా?
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
శైలకూటం మయా క్షిప్తం ప్రాణానాదాయ యాస్యతి ।
ఘటోత్కచుడు:
నేను విసరబోయే ఈ కొండకొమ్ము నీ ప్రాణాలను తీసి తీరుతుంది…
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
నన్వహం భీమసేనస్య పుత్రః పౌత్రో నభస్వతః ।
తిష్ఠేదానీం సుసన్నద్ధో నియుద్ధే నాస్తి మత్సమః ॥ 45 ॥
(ఇత్యుభౌ నియుద్ధం కురుతః ।)
ఘటోత్కచుడు:
భీమసేనుడి కొడుకును, వాయుదేవుడి మనుమడిని కాదా నేను? ఆగక్కడే. సిద్ధంగా ఉండు. మల్లయుద్ధంలో నాకు సమానమైనవాడు లేడు.
(ఇద్దరూ మల్లయుద్ధం చేస్తారు.)
ఘటోత్కచః:
వ్రజసి కథమిహ త్వం వీర్యముల్లఙ్ఘ్య బాహ్వో-
ర్గజ ఇవ దృఢపాశైః పీడితో మద్భుజాభ్యామ్ ।
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
(పైకి) సావధానంగా ఉన్నావా?
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
వ్యపనయ బలదర్పం దృష్టసారోఽసి వీర!
న హి మమ పరిఖేదో విద్యతే బాహుయుద్ధే ॥ 46 ॥
భీముడు:
వీరుడా! నీ సత్తువెంత ఉన్నదో చూసాను. నీ బలగర్వాన్ని పక్కనబెట్టు. ఉత్తి చేతులతో చేసే యుద్ధంలో నాకు ఓటమి లేదు.
ఘటోత్కచః:
మాయాపాశేన బద్ధస్త్వం వివశోఽనుగమిష్యసి ।
రాజసే రజ్జుభిర్బద్ధః శక్రధ్వజ ఇవోత్సవే ॥ 47 ॥
(ఇతి మాయయా బధ్నాతి ।)
ఘటోత్కచుడు:
ఓయీ! మంత్రపాశంతో బంధించబడిన నీవు ఇంక చేయగలిగినది ఏమీ లేక నన్ను అనుసరిస్తావు. ఉత్సవసమయంలో తాళ్ళతో కట్టిన ఇంద్రధ్వజంలాగా ప్రకాశిస్తావు.
(మాయతో బంధిస్తాడు)
భీమః:
భో బ్రాహ్మణకుమార! ఆనయ కమణ్డలుగతా ఆపః ।
భీముడు:
మహేశ్వరుడు ప్రసాదించిన మాయాపాశమోక్షమనే మంత్రం నా వద్ద ఉన్నది. దానిని జపిస్తాను. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఓ బ్రాహ్మణకుమారా! కమండలములోని నీళ్ళు ఇలా తీసుకొని రా…
వృద్ధః:
(భీమః ఆదాయాచమ్య మన్త్రం జప్త్వా మాయామపనయతి ।)
వృద్ధుడు:
(భీముడు నీటిని తీసుకొని, ఆచమనం చేసి మంత్రాన్ని జపించి మాయనుంచి బయటపడతాడు)
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
(ఉభౌ పరిక్రామతః ।)
భీముడు:
(ఇద్దరూ బయలుదేరుతారు)
వృద్ధః:
ఆక్రమ్య రాక్షసమిమం జ్వలదుగ్రరూప-
ముగ్రేణ బాహుబలవీర్యగుణేన యుక్తమ్ ।
ఏష ప్రయాతి శనకైరవధూయ శీఘ్ర-
మాసారవర్షమివ గోవృషభస్సలీలమ్ ॥ 48 ॥
వృద్ధుడు:
భయంకరమైన బాహుబలమూ ధైర్యమూ కలిగి భగభగలాడుతున్న ఉగ్రరూపంతో ఉన్న ఈ రాక్షసుడితో తలపడి, జడివానను దులుపుకున్న ఎద్దులాగా నెమ్మదిగా విలాసంగా వెళుతున్నాడు.
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
జాత! చిరం జీవ ।
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
జాత, కీదృశో మానుష ఆనీతః?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
కిం బ్రాహ్మణః?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
అథవా స్థవిరః?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
కిం బాలః?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
యద్యేవం పశ్యామి తావదేనమ్ । (ఉభౌ పరిక్రామతః ।)
హిడింబ:
హిడిమ్బా:
కిమేష మానుష ఆనీతః?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
ఉన్మత్తక! దైవతం ఖల్వస్మాకమ్?
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
తవ చ, మమ చ ।
హిడింబ:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
హిడిమ్బా:
అయం ప్రత్యయః! జయత్వార్యపుత్రః ।
హిడింబ:
భీమః:
అస్మాకం భ్రష్టరాజ్యానాం భ్రమతాం గహనే వనే ।
జాతకారుణ్యయా దేవి! సన్తాపో నాశితస్త్వయా ॥ 49 ॥
హిడిమ్బే! కిమిదమ్?
భీముడు:
దేవీ, రాజ్యాన్ని కోల్పోయి దట్టమైన అడవుల్లో తిరుగుతూ ఉండటంవలన కలిగిన నా దుఃఖం, కరుణామయివైన నీ కారణంగా నశించిపోయింది.
అవునూ, ఇదేమిటి హిడింబా?
హిడిమ్బా:
(కర్ణే) ఆర్యపుత్ర! ఈదృశమివ ।
హిడింబ:
భీమః:
భీముడు:
హిడిమ్బా:
ఉన్మత్తక! అభివాదయ పితరమ్ ।
హిడింబ:
ఘటోత్కచః:
ఆజ్ఞానాత్తు మయా పూర్వం యద్భవాన్నాభివాదితః।
అస్య పుత్రాపరాధస్య ప్రసాదం కర్తుమర్హసి ॥ 50 ॥
అహం స ధార్తరాష్ట్రవనదవాగ్నిర్ఘటోత్కచోఽభివాదయే । పుత్రచాపలం క్షన్తుమర్హసి ।
ఘటోత్కచుడు:
అజ్ఞానం చేత ఇంతకు ముందు మీకు నమస్కరించలేదు. ఈ పుత్రుడి తప్పును మీరు మన్నించాలి.
ధార్తరాష్ట్రులనే అడవి పాలిట కార్చిచ్చునైన ఘటోత్కచుడిని, నమస్కరిస్తున్నాను. ఈ పుత్రుడి మంకుతనాన్ని క్షమించండి.
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
భీముడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ధుడు:
ఘటోత్కచః:
ఘటోత్కచుడు:
వృద్ధః:
వృద్ఢుడు:
భీమః:
ఆశ్రమోఽదూరతోఽస్మాకం తత్ర విశ్రమ్య గమ్యతామ్ ॥ 51 ॥
భీముడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
భీముడు:
వృద్ధః:
వృద్ధుడు:
భీమః:
యథా నదీనాం ప్రభవః సముద్రో
యథాహుతీనాం ప్రభవో హుతాశనః ।
యథేన్ద్రియాణాం ప్రభవం మనోఽపి
తథా ప్రభుర్నో భగవానుపేన్ద్రః ॥ 52 ॥
మధ్యమవ్యాయోగోఽవసితః ।
భీముడు:
నదుల కెట్లు సముద్రుడు నాథు డగునొ
హోమమునకెట్లు నగ్నియె హోత యగునొ
ఇంద్రియములకెట్లు మనసు యేలికవునొ
అటుల మనలకు విష్ణువె యధిపుడగును (52)
నదులకు సముద్రుడు ఎలాగో, ఆహుతులకు అగ్ని ఎలాగో, ఇంద్రియములకు మనస్సు ఎలాగో, అలాగే ఉపేంద్రుడైన విష్ణువు మనకు ప్రభువు.
మధ్యమవ్యాయోగము పూర్తయ్యింది.