కలలా
హెచ్చరిస్తూ
దగ్గరగానో
దూరంగానో
మాటి మాటకి
ఉలిక్కిపడుతూ
శీర్షికలు సంచికలు
ఉదయపు ఆకాశం
ఉతికి ఆరేసిన
అమ్మ నీలం చీరలా
నిశ్చలంగా నిర్మలంగా
మధ్యాహ్నం
శ్రమైకసౌందర్యంతో తడిసిన
ఎర్ర చీరలా గంభీరంగా
చాలా సందర్భాలలో, మీరు చూడకూడదనుకున్నదాన్ని అంతర్జాలం ఏదో విధంగా మీకు చూపిస్తుంది. మీరు ఈ రోజు వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ, దానికి ముందు, బలవంతంగా మీకు కెన్యాలో జరిగిన మారణహోమం గురించి ఒక కథనం చూపించబడుతుంది. మనకు సహజంగా వ్యతిరేకత పట్ల ఉండే ఒగ్గు వల్ల, మన దృష్టిని ఆకర్షించాలని కోరుకునేవాళ్ళు చెడువార్తలనే సృష్టిస్తారు.
నాలుగు కళ్ళగుండా
వేలమైళ్ళ మేటవేసి
తలలో పాతపగను తాకి
మొగ్గలేసిన సమస్య
పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది.
కన్నడ తెలుగు భాషలు గురు లఘువుల భావమును సంస్కృత ప్రాకృత ఛందస్సులనుండి గ్రహించినది. రెండు, మూడు, నాలుగు గురువుల ప్రస్తారమువలన దేశి ఛందస్సులోని గణములను గ్రహించుకొన్నవి. వీటి అసలు పేరులు రతి, మదన, బాణ లేక శర గణములు.
క్రితం సంచికలోని గడినుడి-70కి మొదటి ఇరవై రోజుల్లో పదముగ్గురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-70 సమాధానాలు.
అడ్డం అమృతవల్లి నాగసేనుల మధ్య బంధము సమాధానం: పులిమ్రుగ్గు చుక్క నిజం లేని కల్లబొల్లికబుర్లు సమాధానం: మిధ్యావాదము దిల్ రుబా! యితడడిగినది పానశాలలో నొక […]
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
సృజన స్వేచ్ఛని కోరుకుంటుంది. ఆలోచనలోనూ, వ్యక్తీకరణలోనూ హద్దురాళ్ళు లేని ప్రపంచాన్ని స్వప్నించే సృజనకారులు ఒక మామూలు ఊహకి తమదైన అస్తిత్వాన్ని అద్ది, దానికి నవ్యతనూ ప్రాణశక్తినీ అందజేస్తారు. తరతరాలుగా సృజన బ్రతుకుతున్నది ఈ స్వేచ్చా ఊహల పునాదుల పైనే. ఆలోచనలో కొత్తదనం మాటెలా ఉన్నా, వ్యక్తీకరణలో కొత్తదనాన్ని చూపించగలిగితే, విషయాన్ని నిమిషాల మీద దేశాలను దాటించి వైరల్ చేసేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వేదికలు. ఇన్‍స్టంట్ అటెన్షన్, ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా కొందరు సృజనకారుల మీద పని చేస్తున్న తీరు విపరీతంగా అనిపించడంలో ఏ ఆశ్చర్యమూ లేదు. కొత్తొక వింతలా కొత్త పుంతలు తొక్కుతూ తమ కళలను వేయినొక్క విధాలుగా ప్రదర్శించుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారీ సృజనకారులు. వీళ్ళ సంగతలా ఉంచితే, అన్నిటినీ తమ మనోభావాల మీదుగా వడపోసి చూసుకునే బృందం సమాజంలో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ మనోభావాలకు ఏ రకమైన సప్రమాణికతా లేదు, ఉండదు. ఇంటర్‍నెట్ అప్పనంగా ఇచ్చిన అనామకత్వం తప్ప మరే అర్హతా లేని వాళ్ళు, ఆత్మన్యూనతతో నిండిన అజ్ఞానం తప్ప మరే ఆస్తీ లేని వాళ్ళు, సమయాన్ని ఏ ఏట్లో కలుపుకోవాలో తెలీక దిక్కు తోచనట్టు తిరిగే వాళ్ళు, ఇట్లాంటి విషయాల్లో అభిప్రాయ ప్రకటనలకు, చర్చలకు సదా సిద్ధమంటూ ముందుకొస్తారు. అవసరమున్నా లేకున్నా అసంబద్ధమైన అభిప్రాయాలను గుప్పించి, తద్వారా ఒకరి భావవ్యక్తీకరణ స్వేచ్ఛని అడ్డుకుని, కొండొకచో గెలిచి, దరిమిలా సమాజాన్ని నియంత్రించగలమనుకుంటున్న ఈ కురచ మనస్తత్వాలను చూసి జాలిపడాలో అసహ్యపడాలో భయపడాలో తేల్చుకోలేని స్థితికి చేరుకున్నాం. ఈ రకమైన దౌర్జన్యం మతసాంస్కృతిక విషయాలలో మరింతగా ప్రబలివుంది. ఇటీవలి ఇంకొక ఉదాహరణ, శ్రావణభార్గవి అనే గాయకురాలు చేసిన ఒక వీడియోపై చెలరేగిన సోషల్ మీడియా దుమారం. ఆ గాయకురాలి వీడియో మెలోడ్రమటిక్‍గా ఉండటం సత్యదూరం కాదు. సాహిత్యాన్ని అర్థం చేసుకోకుండా సాగిన ఆమె అపరిపక్వ ప్రదర్శన గురించిన విమర్శలూ సహేతుకమే. కాని, దుమారం లేపిన నైతిక కాపలాదారులకు ఆ గాయకురాలి ప్రదర్శన నచ్చకపోవడానికి ఉన్న వేయి కారణాల్లో ఇవి లేవు. విమర్శల పేరిట వాళ్ళన్న మాటలివీ: ఆమె చీర కొంగు చుట్టుకోలేదు, వెనుక భాగం చూపిస్తూ కెమెరా ముందు నిలబడింది-అది అసభ్యం. ఆమె ఆమె కాళ్ళకు పసుపు పూసుకోలేదు, వేళ్ళకు మెట్టెలు లేవు-ఇది హైందవ సాంప్రదాయం కాదు. దేవుళ్ళకు ఆపాదిస్తే చాలు శృంగారం కూడా అతిపవిత్రమూ ఆముష్మికమూ అయిపోయే మనదేశంలోని కొందరు భక్తులకు ఆ పాట అర్థం సందర్భం ఏమీ తెలియకపోయినా, ఆ ‘దేవుళ్ళ’పాటలో అమ్మవారు తప్ప వేరొకరు కానరావడం తట్టుకోలేని కష్టమయింది. ఈ తీరుగా సాగిన వీళ్ళ అభ్యంతరాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మునుపొకపరి చెప్పినట్టు, తెలుగునాట సహేతుకమైన సంగీత సాహిత్య విమర్శలు ఎలాగూ లేవు, కనీసం సంస్కారం కూడా లేదని నిరూపించడం తప్ప, సోషల్ మీడియా కల్మషాన్ని మరింత ఉత్సాహంగా పదే పదే ప్రసారం చేయడం ద్వారా ఈ పత్రికలు, టి.వి. ఛానెళ్ళు సాధిస్తున్నదేమిటి? ఈ విమర్శలు గుప్పించిన వాళ్ళలో ఎవరైనా, తామెలాంటి నిజాయితీతో, దయతో, ఋజుప్రవర్తనతో బ్రతుకుతున్నామన్న ఆత్మవిమర్శ చేసుకుంటారా? ఇతరుల అభివ్యక్తిని సంస్కృతికి, సంప్రదాయానికి చేటు అని అఘాయిత్యం చేసే వీరు తమ తమ తక్షణ కుటుంబీకులు, సన్నిహితుల దృష్టిలో తామెలాంటివారనిపించుకుంటున్నారో గమనించుకుంటారా? ఇలా వారి వారి నేలబారు బుర్రలకు తోచినట్లుగా ఈ సంస్కృతీసంప్రదాయ పరిరక్షకులు చెప్పే అభ్యంతరాలకు సహేతుకమైన ధార్మిక సాంస్కృతిక ప్రాతిపదికలు ఎన్నడూ లేవు. ఎప్పటికప్పుడు కొత్తగా విషం చిమ్మడానికి కారణాలు వెతుక్కునే వీరిని ఎవరూ సమాధానపరచలేరు. వీరివల్ల సంఘం ఎన్ని రకాలుగా చీలిపోగలదో అన్ని రకాలుగానూ చీలిపోతూనే ఉంది. సమాజంలో నానాటికీ ప్రబలిపోతోన్న ఈ కల్మషం బహురూప శత్రువు. దీనితో యుద్ధం చేయలేం. తెంపిన ప్రతీ తలకూ వెయ్యి కొత్త తలలు వేసే దీనిని అరికట్టలేం. ఇది చేదునిజం. కాని, ఏ లాభమూ లేకున్నా నూరు టంకములు చేసెడి చీరలు కొరికే చిమ్మెటల లాంటి ఈ నైతిక కాపలాదారుల మూర్ఖత్వాన్ని పక్కకు తోసి, కళాకారులు తమ సృజనను కాపాడుకోవడం ఇప్పుడొక సామాజిక అవసరం. కవులు రచయితలు, గాయకులు, నటులు, చిత్రకారులు ఎవరైనా సరే, ధైర్యంగా, ఎవరికీ ఏ సంజాయిషీలు ఇచ్చుకోకుండా, తమ తమ సృజనాప్రపంచాలను ధిలాసాగా ఆవిష్కరించుకోవడం ముఖ్యం.
తేనెటీగల్లా నేనూ ఊహల గదుల గూడు కట్టుకుంటా! తేనెటీగలు పువ్వు పువ్వు దగ్గర్నించీ తేనె పట్టుకొచ్చి గదుల్లో పెట్టుకున్నట్టు ఒక్కొక్క ఊహనీ పట్టుకెళ్ళి ఆ గదుల్లో దాచుకోవాలి! అత్తయ్య ఈతపాయల జడల ఫోటోలు ఎప్పటికీ అట్టే పెట్టుకుని మనవలికి చూపెట్టుకోవాలి అంది కదా! అలా నేనూ నా ఊహల్ని అట్టే పెట్టుకోవాలి.
జేన్‌లో ఉన్న ప్రధానమైన గుణం ఎటువంటి పరిస్థితుల్లోనైనా, తన ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్నీ కోల్పోకపోవడం. ఎంత గొప్పవాళ్ళు, పెద్దవాళ్ళతోనైనా తన మనసులో మాట నిక్కచ్చిగా చెప్పడం. మనసుతో కంటే బుద్ధితో జీవించే గుణం. అందుకే ఈమె ఆ కాలం నాటి కథానాయికల కంటే భిన్నంగా ఉంటుంది.
ఎంత కంట్రోల్ లక్ష్మణా, కంట్రోల్ అని నన్ను సముదాయిందుకుందామనుకున్నా ఈ పిచ్చి హాస్య కథకు తన్మయులైపోతున్న వీరి మధ్య నేను మూడు నెలలు ఎలా గడపగలనని బెంగ పట్టుకుంది. అక్కడ మంగలి కుర్చీలో పడ్డ నారదుడికి, ఇక్కడ, ఈ కీ డ్రాయింగ్ ఆర్టిస్ట్ కుర్చీలో పడ్డ నాకు ఉన్న సారూప్యం గురించి ఆలోచిస్తున్నాను.
“ఉఠో! ఉఠో జల్దీ! దో మినట్ మే బాహర్ ఫాలిన్!” అప్పుడే తెల్లారిందా? దిండుకింద పెట్టిన వాచీ తీసి చూశాను. కళ్ళు మండుతున్నాయి. రెండు కావస్తోంది. రిక్రూట్లందరూ మేలుకుంటున్నారు. ఎందుకు లేపుతున్నాడో తెలీకపోయినా, ఛజ్జూరామ్ కేకలకి తత్తరపడుతూ లేస్తున్నారు. దోమతెరలోంచి బయటికొచ్చి, చకచకా ఫాంటూ షర్టూ స్వెట్టరూ తొడుక్కుని, కింద పీటీ షూస్ తగిలించుకుని బారక్ బయటికి నడిచాను.
కాదు. అది తోడేలు కాదు. మరి? తన అనుమానం గట్టిపడేంతలోనే ఆకలి, చలి రెండూ కలిసి తనని ఆ ఆలోచనకి దూరం చేశాయి. ముందు రెండు కాళ్ళను పట్టుకుని ఆ తోడేలు శవాన్ని ఎత్తి భుజం మీద వేసుకుంది. వింతగా ఆ శవం కంటే తను వేసుకున్న చర్మం ఎక్కువ బరువుగా అనిపించింది తనకి. ఆకలి, చలి, చీకటి కమ్ముకుంటున్న లోయ తెచ్చిపెట్టే ప్రమాదాలు తనను ఆ తోడేలు శవాన్ని పరీక్షగా చూడనివ్వలేదు.
అమ్మ, ఉద్యోగానికి వెళ్ళేది-
అన్నం, పప్పు
ఇవి మాత్రమే చేసేది–
మధ్యాహ్నం స్కూల్ నుంచి
వస్తే, నాకు
ఆ వంటగదిలో, ఒక
నీడ కనపడేది;
మధ్యాన్నం అయ్యేసరికి సూర్యుని ప్రతాపం పెరిగిపోయింది. ఎండ తీక్షణమయింది. వేడి భరించడం కష్టమయింది. మనం వర్ణచిత్రాలలో చూసే ఎడారిలోని ఒంటెల బిడారుల్లో ఈ తీక్షణత గోచరించదు. చిత్రకారుల తూలికలకు అందని అసౌకర్యమది. జీవశక్తిని పీల్చేసే ఆ ఎండల మండిపాటును ప్రత్యక్షంగా అనుభవిస్తే తప్ప ఆ అసౌకర్యాలు మనకు బోధపడవు.
నానమ్మ చాలా ఏళ్ళుగా నిద్ర మాత్ర వేసుకుంటుంది రోజూ. ఆమె నిద్రపోయిందని నిర్థారించుకుని తాతయ్య లేచి ఉంగరం కోసం అంతటా వెదికాడు. వాష్ బేసిన్ దగ్గర, బీరువాలో, బాత్‌రూములో, అన్ని చోట్లా. ఉంగరం పోయిన సంగతి భార్యకు ఎలా చెప్పాలో తెలీడంలేదు ఆయనకి. ఏదైనా వస్తువు పోయిందంటే నానమ్మకి నేరమూ నేరస్తులూ వీటి గురించి చాలా అంచనాలుండేవి. పోగొట్టుకున్నవాళ్ళ అసమర్థత మీద కూడా.
నిలోవ్ గట్టిగా ఒక నిట్టూర్పు విడిచి, నది మీదకి దృష్టి సారించాడు. ఎక్కడా అలల కదలిక లేదు. నీరూ, ఒడ్డూ జంటగా నిద్రపోతున్నట్టున్నాయి. చేప పిల్లల అలికిడికూడా లేదు. అకస్మాత్తుగా నల్లని బంతిలా ఏదో నీడ అవతలిగట్టు మీద దొర్లినట్టు అనిపించింది నిలోవ్‍కి. కళ్ళు చికిలించి చూశాడు. నీడ మాయమయింది. అంతలోనే మరోసారి కనిపించింది. ఈసారి ఆనకట్టమీద అటూ ఇటూ వంకరటింకరగా నడుస్తూ.
శాస్త్రిగారు మాకు బంధువు, చుట్టం అని మా మేనమామ పిలకా రామకృష్ణారావు పదే పదే నాకు గుర్తు చేస్తూ వుండేవాడు. అయినా నేను ఎప్పుడూ కలవడానికి ప్రయత్నం కూడా చెయ్యలేదు. నేను విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చదివే రోజుల్లో ఒకసారి కోర్టులో ఆయన్ని చూసేను. మరి నేనేమి ఆశించేనో గాని, ఆయన వాదన ఆరోజు నాకు నచ్చలేదు.
ఏదో ఒక రోజు గేటు పడుతుంది
వాహనాలన్నీ బుద్దిగా
ఒక వరసలో నిలబడిపోతాయి
కారు వేగంలో అప్పటిదాకా వినబడని
రేడియోలో పాటని వింటూ
బద్దకంగా మెటికలు విరుచుకుంటూ
కిటికీలోంచి బయటకి చూస్తావు