ఆ పిల్లవాడేమో అల్లరివాడు, ఎప్పుడూ ఇటూ అటూ ఆడుతూనే ఉంటాడు. కానీ వసంతానికి అతడు ముద్దులబాలుడు. అందుకే వాడిని మురిపెంగా జోలపాడి బజ్జో పెట్టాలన్న తాపత్రయం. ఆ సన్నివేశాన్ని చాలా అందంగా మన ముందుంచాడు భట్టుమూర్తి. వసంతశోభ అంతా పచ్చదనంతో మిసమిసలాడే చెట్లలోనే కనిపిస్తుంది.
శీర్షికలు సంచికలు
మనం రోజూ మాట్లాడుకుంటూనే ఉంటాం
ఎప్పుడో ఒక క్షణంలో మాత్రం చందన పుష్పాల్లా
మాటలు మన మధ్య కొత్తగా గుబాళిస్తాయి.
కిక్కిరిసిపోయిన జనం మధ్య కూడా
వాడికి తోడు ఒంటరితనమే
వాడి చూపుల దారిలో ఎవరూ నడవరు
ఏ కంటిపాపలోనూ వాడు నవ్వడు.
నాకెప్పుడూ నువ్విలాగే కనపడాలి!
సౌందర్యం రెపరెపలాడింది.
నన్నొక్కసారి ముద్దుపెట్టుకోవూ?
ప్రేమ ఆర్తిగా పెనవేసుకుంది.
ఆ ఇంటికి నిండుగ
కొలువు తీరినవి
నిక్కి నిక్కి
చూస్తూ ఉన్నవి
బారులు తీరి
రంగు రంగుల
పిట్టల బొమ్మలు
నాకు వెండీ డానిగర్ పుస్తకంలో హిందువులను అవమానపరిచే అంశాలు గాని, హిందూ మతాన్ని పనిగట్టుకొని కించపరిచే ఉద్దేశం గాని ఏ కోశానా కనిపించలేదు. ప్రతి పేజీలోను ఒక పరిశోధకురాలు తాను ఎన్నుకున్న అంశంపై అన్నీ దృక్కోణాలను విశ్లేషించడానికి, అన్నీ ప్రత్యామ్నాయ కథనాలను వీలైనంతగా చర్చించడానికి పడే తాపత్రయమే కనబడింది.
క్షేమేంద్రుని కలావిలాసానికి తెలుగు కళావిలాసము నిజంగా అనువాదం అవునా? కాదా? అన్నది ప్రధాన సమస్య. పై ఉదాహరణలో మానవల్లి వారు ఏయే గ్రంథాలలో ఈ కళావిలాసములోని పద్యాలు ఉదాహరింపబడి ఉన్నాయని సూచించారో – ఆ గ్రంథాల పూర్వాపరచరిత్ర తెలిస్తే కాని ఈ సమస్య స్వరూపం, అందుకు పరిష్కారం అర్థం కావు.
సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే సంస్కృతప్రాకృతములలో, సుమారు 1300 సంవత్సరాలకు ముందు కన్నడములో, సుమారు 1100 సంవత్సరాలకు ముందు తెలుగులో కంద పద్యములు ఉండినవి, ఆంధ్ర మహాభారతములో మూడింట ఒక పద్యము కంద పద్యమే. అందుకే కంద పద్యమును అందముగా వ్రాయని, వ్రాయరాని, వ్రాయలేని వాడు కవి కానేరడు అంటారు.
జీవితప్రతిబింబమే కావ్యమని విశ్వసించి, తాదాత్మ్యభావంతో తనచుట్టూ ఉన్నవారి అనుభవపరంపరను పరిశీలించి, సారవిచారం చేసి, కవిత్వాన్ని ఉపదేశాత్మకంగా దిద్దితీర్చిన మహాకవి క్షేమేంద్రుడు. కాశ్మీరదేశంలో ధర్మవృక్షానికి చీడ […]
‘నన్నెచోడుని కుమారసంభవము ప్రాచీనగ్రంథమా?’ అన్న విమర్శగ్రంథాన్ని 1983లో ప్రకటించిన ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారు ఈ కళావిలాస కావ్యకర్తృత్వం విషయాన్ని కూడా చర్చించి, ప్రబంధరత్నాకరములోని కళావిలాసము, […]
కళావిలాసము కావ్యకర్త నన్నెచోడుడు గాక బద్దె భూపాలుడు కావచ్చునా? ఇదొక సరికొత్త సమస్య. కళావిలాసము నన్నెచోడుని రచనమే గాని, ఆ నన్నెచోడుడు సుప్రసిద్ధమైన కుమారసంభవ […]
నన్నెచోడుని కళావిలాసము లభింపకపోయినప్పటికీ, అందులోని పద్యాలు – 1) కవిసంజీవని, 2) రత్నాకరము, 3) అథర్వణచ్ఛందము, 4) గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణి అన్న నాలుగు […]
సంగీతం, గానం: నచికేత యక్కుండి
స్ఫూర్తి: రవీంద్ర సంగీతం నుండి అగునేర్ పొరోష్మొని అనే గీతం.
రాగం: శుభపంతు వరాళి
తాళం: మిశ్ర చాపు
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
ఆయన ప్రఖ్యాత రచన ‘శివతాండవా’న్ని ఆయనే గానం చేశారు. ఈ రచనని చాలా మంది చాలా రీతుల్లో ప్రదర్శించ ప్రయత్నించారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినది 1993లో నాగపద్మినిగారు ‘శివతాండవాన్ని’ రేడియో ప్రసారణ కోసం చేసిన అనుసరణ.
మరల నిదేల పుట్టపర్తి వారి గళంబన్నచో … ఇది నారాయణాచార్యులవారి శతజయంతి సంవత్సరం. ఆయన గురించిన చాలా వివరాలు అందరికీ అందుబాటులో వున్నాయి. కానీ మీకు ఇక్కడ వినిపించబోయే జ్ఞాపకాలు వారి శతజయంతి సందర్భంలో నా నివాళి.
!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!
ఈమాట నవంబర్ 2013 సంచికలో ప్రచురించిన ఏల్చూరి మురళీధరరావు సాహిత్యవ్యాసం పైన పాఠకులు ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సంచికలో ఆ వ్యాసానికి ప్రతిగా తమ విమర్శలను వ్యాస రూపంలో జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. ఇలా సాహిత్య వ్యాసాలపై స్పందనలు, ప్రతిస్పందనలు సామరస్యంగా తెలుపుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. ముందు ముందు ఇలాంటి సాహిత్య చర్చలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంచికలో కొత్త రచయితలు ఈమాటను తమ రచనలకు వేదికగా చేసుకొనడం చూస్తుంటే ఈమాట మరింతగా ఎదుగుతోందని మాకు నమ్మకం కలుగుతోంది. నాకు నచ్చిన పద్యం, పలుకుబడి లాంటి శీర్షికలు, సాహిత్య పరిశోధనాత్మక వ్యాసాలు, ఆడియోలు ఈమాటకు వన్నె తెస్తున్నాయి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, అందిస్తున్న ప్రోత్సాహాలతో ఈ సాహితీప్రయాణం ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తున్నాం.
ఈ సంచికలో: మానస, భగవంతం, ఇంద్రాణి, కనకప్రసాద్, హెచ్చార్కె, నారాయణ, దేశికాచారి, ప్రసూన, భాస్కర్, అట్లూరి ప్రసాద్, తఃతః, బివివి ప్రసాద్‌ల కవితలు; మూలా సుబ్రహ్మణ్యం, బులుసు సుబ్రహ్మణ్యం, దమయంతి, సాయి పద్మ, ఆర్. శర్మల కథలు; సాయి బ్రహ్మానందం, మోహన రావు, శ్రీనివాస్, తలిశెట్టి రామారావుల వ్యాసాలు; కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం; సురేశ్ పలుకుబడి; శబ్దతరంగాలలో సాలూరి జనరంజని, చెలియలికట్ట రేడియో నాటిక. …