ఏల్చూరి మురళీధరరావుగారు నవంబర్ 2013 ఈమాటలో ప్రచురించిన ‘కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన అన్న వ్యాసం ద్వారా కుమారసంభవం కావ్యం రాసిన కవి నిజంగా ఎవరు? అతని కాలం ఏది? అనే వాదనను మళ్ళీ తెరపైకి తెచ్చారు. ఇలాంటి కాల, కర్తృనిర్ణయాలపైన నా ఆక్షేపణలను ఈ వ్యాసంలో వివరిస్తాను.
శీర్షికలు సంచికలు
డా. ఏల్చూరి మురళీధరరావు నవంబరు 2013 ఈమాటలో వ్రాసిన ‘కుమారసంభవంలో … ‘ అన్న వ్యాసానికి ప్రతిగా నా ఈ వ్యాసంలో నన్నెచోడుడు ప్రబంధయుగము తఱువాతవాడు కాదని, కవిజనాశ్రయ ఛందోగ్రంథమునకు ముందే కుమారసంభవమును వ్రాసినాడని వివరిస్తున్నాను.
ఆభారతకుమారులు రాజ్యములను స్థాపించుటయే కాక హిందూ విజ్ఞానమును, మతమును ప్రజలలో ప్రతిష్ఠించి, మహానిర్మాణములను భారతీయశైలిని నిర్మించి, తమ మాతృభూమియొక్క ఖ్యాతిని వ్యాపింపజేసి, నిజమగు భారతపుత్రులుగ నుండిరి.
కర్ణాటక సంగీతజ్ఞులకి వెస్ట్రన్ మ్యూజిక్ పరిచయం 1800 కాలంలోనే ప్రారంభమయ్యింది. ఇంగ్లీషు బ్యాండు చాలామంది సంగీత కారులకి పరిచయం ఉంది. ప్రముఖ వాగ్గేయకారులు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ ఇంగ్లీషు బ్యాండ్ ప్రభావంతో కొన్ని పాటలు కట్టారు.
ఆలిండియా రేడియో విజయవాడ వారు నాటిక రూపంలో ప్రసారం చేసిన విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖ రచన చెలియలికట్ట అపురూపమైన ఆడియో.
ఆలిండియా రేడియో హైదరాబాద్ కేంద్రం వివిధభారతి కార్యక్రమం ద్వారా సంగీత దర్శకుడు శ్రీ సాలూరి రాజేశ్వరరావు సమర్పించిన ప్రత్యేక జనరంజని కార్యక్రమం ఈమాట పాఠకులకోసం అందిస్తున్నాను.
శ-, ష-, స- అక్షరాలు మూడు ప్రత్యేక వర్ణాలుగా పలు భారతీయ భాషలలో కనిపించినా, ఈ అక్షరాల ఉచ్చారణ విషయంలో అన్ని భాషలవారిలోనూ కొంత అయోమయం కనిపిస్తుంది. సంస్కృత భాష ఆధారంగా తయారైన వివిధ వర్ణమాలలలో వీటిని మూడు ప్రత్యేక అక్షరాలుగా పేర్కొన్నా, ఇవి మూడు విభిన్న ధ్వనులుగా ఏ దేశభాషలోనూ స్థిరత్వం పొందలేదు.
క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం.
ఎస్. మీనాక్షిసుందరం (12 అక్టోబర్ 1913 – 13 ఆగస్ట్ 1968): గణితశాస్త్ర ప్రపంచంలో పేరెన్నిక గన్న ప్రతిభావంతులలో ఒకరైన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం శతజయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూ, గణితంలో ఆయన విశేషకృషిని వివరిస్తూ వాసుదేవరావు ఎరికలపూడి రాసిన శాస్త్రీయ వ్యాసం, ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం; నన్నెచోడుని కుమారసంభవంలో లలితాస్యాంబురుహంబు పద్యం గురించి మానవల్లి రామకృష్ణకవి విమర్శను ప్రస్తావిస్తూ ఆ వివాదం ఆ కావ్యపు కర్తృ – కాల నిర్ణయాలకు ఎలా మూలచ్ఛేదనం అయిందో వివరిస్తూ ఏల్చూరి మురళీధరరావు సాహిత్య వ్యాసం, నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన; నాగరాజు పప్పు, పరుచూరి శ్రీనివాస్ పరిశోధనాత్మక చారిత్రక వ్యాసం రెండవ భాగం, భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు ఈ సంచికలో ప్రత్యేకం.
ఇంకా ఈ సంచికలో: పాలపర్తి ఇంద్రాణి, ఎలనాగ, మలినేని క్రాంతికుమార్, మానస చామర్తి, దాసరాజు రామారావు, జెజ్జాల కృష్ణ మోహన రావుల కవితలు; మాగంటి వంశీ మోహన్, తాడికొండ శివకుమార శర్మ, బులుసు సుబ్రహ్మణ్యం, ఆర్. శర్మ దంతుర్తి, లైలా యెర్నేనిల కథలు; జెజ్జాల కృష్ణ మోహన రావు, రాళ్ళపల్లి సుందరం, సురేశ్ కొలిచాలల వ్యాసాలు; భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం; శబ్దతరంగాలలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న మేఘసందేశం – సంగీత రూపకం తెలుగులో, చా.సో.తో ముఖాముఖీ; కనక ప్రసాద్ శబ్దసాహిత్యం…
మీనాక్షిసుందరం మత పరమైన ఆచారాలనూ సంప్రదాయాలనూ పాటించకపోయినప్పటికీ వాటి సారాన్ని చదివి తెలుసుకున్న వ్యక్తి. ఆయనతో ఆపెన్ హైమర్, హెర్మన్ వైల్ భారతీయ తత్త్వ విషయాలను ఆయనతో చర్చించే వారు. ఆపెన్ హైమర్ అమెరికా ఆటం బాంబ్ ప్రాజెక్టుకు నాయకుడు. మొట్ట మొదటి సారిగా విస్ఫోటనం జరిగినప్పుడు ఆ కాంతిని చూసి భగవద్గీత పదకొండవ అధ్యాయం లోని ‘వేయి సూర్యుల కాంతి’ శ్లోకాన్ని చదివిన వాడు.
పియానో వద్ద కూర్చోటం దగ్గర్నుంచి, ఆ పోశ్చర్‌లో, ఆ చేతులు కదలించటంలో ఎంత గ్రేస్ ఉంది. ఎంత పధ్దతి, ఎంత సైన్స్, ఎంత ఆర్ట్. ఆమెకు పాఠం గంట నిమిషంలాగా గడిచి పోయింది. మొదట్లోనే ఇన్ని నేర్చుకోవాల్సినవి ఉంటే, పోను పోనూ, ఇంకా ఎంత కాంప్లెక్సిటీ పెరుగుతుందో. నా మెదడుకూ నా చేతులకూ కావాల్సినంత పని…
హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నుంచి ‘అలబేలా సజన్ ఆయో రీ’ అనే గీతం ఆధారంగా. ఈ గీతాన్ని సృజించినది మొగల్ చక్రవర్తి రోషన్ అఖ్తర్ (మొహమ్మద్ షా) ఆస్థానంలో భూపత్‌ఖాన్ అనే విద్వాంసుడని, ఆయన కలం పేరు ‘మనరంగ్’ అనీ చరిత్ర.
పాలగుమ్మి విశ్వనాథం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన సంగీత దర్శకత్వంలో వెలువడిన ఈ సంగీత రూపకాన్ని అందిస్తున్నాను. ఇది 1964 ప్రాంతంలో ‘కాళిదాసు జయంతి సందర్భంగా తొలిసారి ప్రసారమయ్యింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు కేంద్రాల సమిష్టి కృషి.
ఆకాశవాణిలో ప్రసారమయిన ఒక చా.సో. ఇంటర్వ్యూ దానికి అనుబంధంగా చా.సో కథ వెనుక నేపథ్యం గురించి మాట్లాడిన కొన్ని మాటలు; రచయితగా, వ్యక్తిగా చాసోని అర్థం చేసుకోవడానికి ఈ ఆడియోలు సాహిత్య చరిత్రకారులకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.
ఇక పద్యంలోని కవిత్వలోతుల వైపు దృష్టి సారిస్తే, తిక్కన కవిత్వంలో ప్రధానంగా కనిపించే గుణం ధ్వని. కవిత్వంలో ధ్వనిని రకరకాల మార్గాల ద్వారా వ్యక్తం చేయవచ్చు. శబ్దం ద్వారా, అలంకారాల ద్వారా, వర్ణనల ద్వారా, కథాకథనం ద్వారా, యిలా అనేక మార్గాలు. ఒకో కవిది ఒకొక్క ప్రత్యేక మార్గం.
కుమారసంభవ పద్యాన్ని అనుసరింపబోయి తన భావనాశక్తి లోపాన్ని వెలిపెట్టుకొన్న ఛాయోపజీవిగా తెనాలి రామలింగకవిని ఆక్షేపించే తొందరపాటులో రామకృష్ణకవి ఈ పద్యానికి మూలమైన శ్లోకం ఒకటున్నదనే సత్యాన్ని ఊహింపలేకపోయారు. కుమారసంభవం లోని పద్యాలను ఎంతోమంది తెలుగు కవులు అనుకరించారని ఆయన చూపిన పద్యాలన్నీ ఈ విధమైన మౌలికతాపరీక్షకు గుఱి కాగలవని కూడా ఆయన ఊహించి ఉండరు.
ఆ దంపతులు పెళ్ళి యేర్పాట్ల సన్నాహంలో తలమునకలుగా ఉన్నారట. విశ్వనాథ సత్యనారాయణ గారిచేత పెళ్ళికి ఆశీర్వాద పద్యాలను చెప్పించుకొంటే పెళ్ళి నూరేళ్ళ పంట అవుతుందని, మౌక్తికోపమానంగా వంశవర్ధకమైన సంతానం కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఇంటికి వచ్చి అడిగారట.
2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.