“రాజా! ఒక విషయంలో మొదటిసారి పొరపడితే అది అనుభవరాహిత్యం. రెండోసారి పడితే మూర్ఖత్వం. నిన్నటి పొరపాటు ఇవ్వాళ జరగకుండా నువ్వు తీసుకున్న జాగ్రత్త చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. మరీమరీ నీతో ముచ్చటలాడాలనిపిస్తోంది. అదే పని పదేపదే చేస్తున్న నీకు విసుగు కలగకుండా మన అభిమాన పాఠకరావు ధోరణిలో మరో వింత కోణాన్ని ఈ రోజు నీ ముందు ఆవిష్కరిస్తాను. విను.”

2003లో హైదరాబాదులో కె.వి.రావుగారు, మరికొందరు సంగీతాభిమానులు కె.రాణి, ఎ.పి.కోమల, సి. కృష్ణవేణిగార్లను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమం జరిపారు. వ్యక్తిగతంగా ఆ రోజుల్లో నేను, మిత్రులు మధుసూదనశర్మగారితో కె. రాణిగారిని రెండుసార్లు హైదరాబాదులో కలిశాను. చాలా బాగా మాట్లాడేవారు.

క్రితం సంచికలోని గడినుడి 22కి మొదటి పదిరోజుల్లోనే అయిదుగురినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన అయిదుగురు: సుభద్ర వేదుల, శైలజ, జంధ్యాల ఉమాదేవి, విజయాదిత్య, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకు మా అభినందనలు.

గడి నుడి 22 సమాధానాలు, వివరణ.

అడ్డం గాడిద బూడిద రంగే, కాదన్నదెవరు? సమాధానం: ధూసరం సంపదలేవీ యిలా వెంటరావని హరిశ్చంద్రుడు వాపోయాడు సమాధానం: తిరమై మల్ల వాహనుల పేర్లలోని మబ్బు […]

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.

జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.

స్వేచ్ఛాభారతంలో ఇంకొక రోజు, ఇంకొక దౌర్జన్యపర్వం. ఈసారి మళయాళ రచయిత హరీశ్‌పై దాడులు. కారణం? షరా మామూలుగానే మనోభావాలు గాయపడటం. మా స్త్రీలను అవమానించేలా నీ నవలలో ఒక పాత్ర మాట్లాడింది కాబట్టి నీ భార్యాబిడ్డలను బలాత్కారం చేస్తాం, నీ చేతులు నరికేస్తాం అని బెదిరింపులు. ఈ రకమైన న్యాయం మధ్యప్రాచ్య తాలిబన్లకూ, మనదేశపు ధర్మగంగబిందువులకూ మాత్రమే సబబనిపిస్తున్నట్టుంది. ఇది భౌతికమైన దాడి. ఇక రెండవది, మానసికమైన దాడి. ఒక రచన ఆధారంగా రచయిత నైతికత, శీలం అంచనా వేయడం, సోషల్ మీడియా ముసుగులో అవమానాలు, ముద్ర వేయడాలవంటివి. పైకి వేరుగా అనిపించినా ఈ రెండు రుగ్మతలకూ మూలం ఒకటే–తమకు తప్పనిపించే భావాలపై ఉండే విపరీతమైన అసహనం, దానితో వచ్చే క్రూరత్వం. సక్రమమైన రీతిలో స్పందించలేని, వ్యతిరేకించలేని దుర్బలత్వం, దాని ద్వారా వచ్చే అనైతిక ప్రవర్తన, ఇందుకు కారణాలు. ఏ మంచి కోసమైనా సరే, ఎంతమాత్రమూ సమర్థించకూడని లించింగ్ మాబ్ మెంటాలిటీ ఇది. తమను, తమ జీవితపు సంఘటనలను, తమ వాదాభిప్రాయాలను పేలవమైన కథలుగా చెలామణీ చేసే రచయితలు లేరని కాదు కాని, కథలన్నీ రచయిత అనుభవాలుగా, పాత్రల ఉద్దేశాలన్నీ రచయిత అభిప్రాయాలుగా మాత్రమే అనుకోవడం, రచయితకు కాల్పనిక దృష్టి లేదని అవమానించినట్టే. స్పందన వ్యక్తపరచిన అభిప్రాయం గురించి ఉండాలి కానీ వక్త గురించి కాదనేది మౌలిక జ్ఞానం. విమర్శ రచన గురించే తప్ప రచయిత గురించి కాదనేది కనీస మర్యాద. పాఠకుల మాట అటుంచి, కనీసం ఇది విమర్శకులకూ రచయితలకూ అలవడనంత వరకూ సాహిత్యస్పందన దొమ్మిలాట స్థాయిని దాటదు. తమకు నచ్చినట్టే, నచ్చినవే రాయాలి, అనాలి, వినాలి, చూడాలి అనే సాంస్కృతిక నాజీల దౌర్జన్యమూ ఆగదు. రచయితకు, ఆమాటకొస్తే ఏ కళాకారునికైనా తన సృజనను, అది ఎంత వివాదాస్పదమైనదైనా సరే, నిర్భయంగా ప్రకటించగలిగే, ప్రదర్శించగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ తర్వాతే ఏ చట్టబద్ధమైన నిరసనైనా. మనిషిని జంతువు నుండి వేరు చేసే ఒక గొప్ప శక్తి మాట. ఆ మాటకున్న శక్తిని సంపూర్ణంగా గుర్తించేది, దాని విలువను నిలబెట్టగలిగేది సమర్థులైన రచయితలే. వారికి ఆ స్వేచ్ఛనివ్వలేని సమాజం ఒక జంతుసమూహం మాత్రమే.

టేబుల్ మీదున్న రెండు పుస్తకాలు ప్రస్తుతం చదువుతున్నవి. ఒకటి మెక్సికన్ రచయిత నెట్టల్‌ది. వాళ్ళ కథల్లో అఫైర్స్ మనం కొత్త బట్టలు కొంటున్నప్పుడు వేసే ట్రయల్స్ అంత సునాయాసంగా ఉంటాయి. ఒక జంకుండదు. బొంకుండదు. ఇంకోటి ఇస్మత్ చుగ్తాయ్ కథల పుస్తకం. ఆమె అప్పట్లోనే అన్ని ఎలా రాసిందో, అన్ని రాసినా ఆ విషయాలు మామూలైపోకుండా ఎందుకున్నాయో నాకు అర్థం కాని విషయం.

మనకు వట్టిపుణ్యానికి తెలిసిన విషయాలు రెండు కలవు. సూర్యుడు తూర్పున ఎక్కి పడమట దిగుట. దీని గురించి మళ్ళీ ఎప్పుడయినా చెప్పుకుందాం. రెండు బాపూ గొప్పవాడు, బడా చిత్రకారుడు, ఎలా? అంటే ఆయన బొమ్మలు బాగా వేస్తారు, నవ్వించే కార్టూన్లు గీస్తారు. ఆ గీతల వెనుక పనిముట్ల మర్మం, ఈ చిన్న వ్యాసంలో వీలయినంత విప్పిచెప్పే ప్రయత్నం చేస్తా.

జీవితం ఒడ్డుకి చేరి అక్కడే నిలబడిపోయాడు. “కదులు కదులు!” మబ్బులు గర్జిస్తూ చెప్పాయి. “పద పద!” చినుకులు కురుస్తూ తట్టాయి. “రా రా!” పిట్టలు పాడుతూ పిలిచాయి. “మరిచిపో మరిచిపో!” ఆకులు రాలుతూ అన్నాయి. కదలని మరవని అతనికి అవసానదశలో ఒకటే ప్రశ్న. దాన్ని మోసుకుంటూ ఎక్కడెక్కడో వెతకగా చివరికి కలిసింది. ఆమె గుర్తు పట్టాక అడిగాడు “నేను పరీక్షలో నెగ్గానా?”

సాధారణంగా పొద్దున పొద్దున్నే టీవీ పెట్టను. కానీ ఒక్కోసారి పిల్లలు స్కూలుకు వెళ్ళిపోయాక ఏర్పడే నిశ్శబ్దాన్ని శబ్దంతో భర్తీ చేయాలనిపిస్తుంది. సినిమా, ట్రావెల్, ఫుడ్ ఇవి నా ప్రయారిటీలు. శబ్దం మరీ ఎక్కువైందన్నట్టుగా పెట్టగానే ఏదో ఫైట్ వస్తోంది. మహేశ్‌బాబు సినిమా. తలల మీద ఇటుకలు పగులుతున్నాయి. గోడలకు వెళ్ళి గుద్దుకుంటున్నారు.

ఆ మాటలు విన్న విక్రమార్కుడికి, బేతాళుడికి సమకాలీన రాజకీయాలపై కూడా మంచి అవగాహన ఉందనిపించింది. లేకపోతే ఈ స్థాయిలో వ్యంగ్యవ్యాఖ్యలు ఎలా విసరగలడు? పొగడ్తల సంగతి తర్వాత. తనముందు ఉన్న అగడ్త దాటటం ఎలా? చూపును రహదారి మీదనే కేంద్రీకరించి కాసేపు ఆలోచించాడు.

నిసికి గుర్తు ఉన్న ఒక విశేషం ఏమంటే, ఆంటీగారు గైనకాలజిస్ట్ అయివుండి, ఒక ప్రముఖ హాస్పిటల్ ప్రసిడెంట్‌గా ఉండి, ఆ సమావేశానికిగాని, అందునా బ్రస్ట్ కేన్సర్ మీద తన ప్రజెంటేషన్ వింటానికిగాని రాకపోవటం, అమ్మ ఆ సమయంలో ఆంటీగారింటికి వెళ్ళి, ఆవిడకిష్టమని కోడిగుడ్ల పులుసు, బంగాళాదుంపల వేపుడు చేసిపెట్టటం. అందువల్ల ఆంటీగారిని ఆఖరుసారి ఎప్పుడు చూడలేదో నిసికి గుర్తుంది.

“వర్షాలు మొదలయ్యాయి. కొండలు పచ్చగా మెరిసే సమయం. సెలయేళ్ళు గలగల పారే సమయం. ఇంట్లోనే ఉండిపోతే ఎలా?” సలహా, కన్సర్న్, మందలింపు ఆ స్వరంలో. ఎవరదీ? ఎవరదీ? చుట్టూ చూశాను. కనబడలేదు. మరో క్షణానికల్లా అర్థమయింది–గత పది రోజులుగా కురుస్తోన్న వానలు పలుకుతోన్న పలుకులవి.

అంత ఎత్తైన జలపాతం ఒక్క ఉదుటున మనని కొండకొమ్ముకు లాక్కెళ్ళి పోతుంటే, చెవుల్లో జలపాత శబ్దం మనని తనతో ప్రవహింపచేస్తూ. ఆ సీతాకోక చిలుకలు చూడు! ఆ కొండకొమ్ములో తాను జారిపడితే మన గుండె ఆగి కొట్టుకుంటూ ఉంది. అదిగో, ఒక్క నవ్వు పిలిస్తే ఎలా దూకేస్తున్నాడు! ఆ చిరుచీకటిలోనే ఇటు చూసి నవ్వుతాం. నువ్వలా చేయగలవా అనే సవాలు ఇటు నుండి అటు కళ్ళతోనే.

గచ్చు మీద తన నీడనే చూస్తూ
గుమ్మం దగ్గర నిలిచున్న తలుపు

అడుగులతో నడిచొచ్చిన జ్ఞాపికలను దాచుకుని
మూసిన గాజు తలుపుల అరమరలతో
మూగ సాక్షిగా నిలిచిన గది

కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో!

కొందరు సెల్‌ఫోన్‌లు పోగొట్టుకుంటారు, తర్వాత వెతికి పట్టుకుంటారు. కొందరు పెన్ను పోగొట్టుకుంటారు, వెతుక్కుంటారు. కొందరు తాళంచెవి. కొందరు ఇంకేవో. నేను ఒకసారి నా కారుని పోగొట్టుకున్నాను. ఆ రోజు టొరాంటోలో మంచు ఎక్కువగా కురుస్తుందనీ, వాతావరణం తల్లకిందలవుతుందనీ ఎఫ్.ఎమ్. రేడియోలో అనౌన్స్‌మెంట్ వస్తూనే ఉంది. నేను తొందరగా హాస్పిటల్‌కి చేరుకున్నాను.

ఒకరితో ఒకరు
గొడవ పడవలసిన అవసరం
అంతకన్నా లేదు
గోడమీద పిల్లిలాంటివారు
పంచన చేరితే చాలు
అంతరాలెరుగని ఆత్మీయుల మధ్య
తీరని అగాధం ఏర్పడడానికి-

నాకు నచ్చిన వృత్తములలో మందాక్రాంతము ఒకటి. అందులో ఒక గాంభీర్యము, ఒక విభిన్నమైన గతి దాగి ఉన్నాయి. కాలిదాసకవి వ్రాసిన మేఘదూతము ద్వారా ఈ వృత్తము మిక్కిలి ప్రసిద్ధి కెక్కినది. ఈ వృత్తపు పుట్టుక, ఇందులో వ్రాయబడిన సందేశ కావ్యములనుగుఱించి ఇంతకు ముందే నేను ఆషాఢస్య ప్రథమ దివసే అనే వ్యాసములో చర్చించి యున్నాను.