డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి రచనలు
ఇదిగో అదిగో అంటూనే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై ఏళ్ళ వయసొచ్చేసింది. సాహితీ సమితి సంబరాలకు తోటి సాహిత్యాభిమానులతో కలిసి సదస్సు నిర్వహించుకోవడంకన్నా సబబైనది మరొకటి ఉండబోదు. అందుకే తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్‌కు ఆహ్వానిస్తున్నాం.
మా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరితో సమావేశమై ఒక వారాంతమంతా తెలుగు సాహిత్యపు వెల్లువలో మునిగి తేలాలని కోరిక కలిగింది.