వచ్చే వెళ్ళే రైళ్ళను చూస్తున్నా ..మధురంగా..కాస్త బాధగా సంగీతులు వినిపిస్తున్నాయి ఏదో సాయంత్రం సరిగా ఎండ చొరని..గుబురు వృక్షాల ఆకుల వెనుక దాగిన బరువూ […]

తేనెటీగలు లేచిపోతాయి… కబోదికళ్ళతో మైనం తుట్టె మిగిలిపోతుంది విందు ముగిసిపోతుంది… ఖాళీగాజు గ్లాసు స్వగతం వినిపిస్తుంది బస్సూ బయలుదేరి వెళ్ళిపోతుంది… అరటితొక్క కాలుజారి పడే […]

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు ఒళ్ళంతా పువ్వులతో తనను తాను తిరిగిపొందే ఈ వేళ, ఒక నవ నాగరికుడు అలవికాని రంగుల్లో […]

ఎక్కడో వర్షాలు ఏటికి నీళ్ళొచ్చాయి. ఎండిపోయినా నిండుగా పారిన రోజులను మరచిపోదు ఏరు. కదిలిపోయిన నీరు ఎగుడుదిగుడు దిబ్బలను నిమిరి వెళ్ళింది.

తలుపు తీసి చూడు కళ్ళల్లో తెల్లవారుతుంది ఇసుకనేల దాహం సముద్రమే తీరుస్తుంది తీగ కదిపి చూడు రాత్రి కన్నీరు రాలుతుంది పొగలు పోయే ఆకలి […]

తుఫాను లెన్నో చూసి శిథిలమై తీరాన్నిచేరి, ఏకాంతంలో సాగరపవనాలు నేర్పిన చదువు ఇసుక రేణువులకు విసుగులేని కెరటాలకు అవిశ్రాంతంగా బోధిస్తోంది ఈ సముద్రనౌక

ఇతనికెవరూ వీరత్వాన్ని వెన్నతో పెట్టి తినిపించలేదు. ఒళ్ళో కూచోబెట్టుకుని, సాహస గాధల్ని ఓపిగ్గా వినిపించలేదు. అయినా, ఉదయమయ్యేసరికల్లా ఈ పసివాడు మృత్యువు గుహలోకి నడిచిపోతాడు. […]

పదాన్ని పట్టితెచ్చి.. పెడరెక్కలు విరిచికట్టి నల్లటి ముసుగు తొడిగి ఉరి తీసెయ్‌. మరణిస్తూ మరణిస్తూ గొంతు పెగల్చుకొని.. తన అర్థం చెప్పి జారుకొంటుంది. శవపేటిక […]

మంచుకప్పిన కొండశిఖరం ఎక్కలేనిక ఎదురుగాడ్పులు చెప్పిరాదుగ చేటుకాలం లోయదాగిన ఎముకలెన్నో! ఒక్క కిరణం నక్కి చూడదు ఉడుకు నెత్తురు పారుటెప్పుడు? కునుకు పట్టదు నడుమ […]

గదిలో ఫాన్‌తిరగదు బల్లి నాలుకపై జిగురు ఆరదు పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు చీమలు […]

నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది. వీడైతే దానిని నూరేళ్ళూ మోయవలసినవాడు. ఇంకా నీ బెల్టు చారల్ని, వేళ్ళ ఆనవాళ్ళని కూడా ఎక్కడ […]

తడిచేతుల సముద్రం తడిమి తలబాదుకొంటుంది శిలలపై.. బడితెలేని బడిపంతులు పొడవాటి ఒడ్డు అదిలిస్తోంది చదవలేని కెరటాలను పచార్లు చేసేవారిని విచారం లేని చలిగాలి వీచి,పరామర్శిస్తుంది. […]

నీ గదిలోకి ఎవరూ రారు టేబుల్‌సొరుగును తెరవరు ఆకుపచ్చని ఏకాంతాన్ని అనుభవించు. పొద్దుతిరుగుడు పూలు నిద్దురలో,కలలో సద్దు చేయవు. అరాచక ఆకాశాన్ని విరిగిన చంద్రుని […]

ఒక్క రాత్రిలో పర్వతాలను కదిలించకు మహావృక్షాలను పెకలించకు నిశాగానం విను అరమూసిన కన్నులతో నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు నురగల అంతరంగం..అలల సద్దు మెరిసే […]