ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? నివారించలేను, సవారి గుర్రముసకిలించె నురగతో!! ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను. చేవ్రాలు చేయలేను! ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? […]
Category Archive: కవితలు
ఒక మధ్యాహ్నం ఎండ కనురెప్పలు కాల్చినట్టు గుండ్రని నవ్వుల గోళీలు రాచుకున్నట్టు ఎర్రని మెట్లపై ఎపుడూ పాకే నీరు పలక పగుల గొట్టే బాలుడు […]
వర్షం వచ్చి నిలువునా నన్ను తడిపి వెలిసిపోయింది. తెప్పరిల్లిన ఆకాశం కింద నీ నవ్వులు కాగితప్పడవలై తేలిపోసాగినయ్ .
రాలేనేమో చిన్నీ రాలేనేమో మళ్ళీ అయినా సరే రాత్రి మాత్రం దీపం ఆర్పేయక నా రాకను నీవు గుర్తించగలవు చిన్నీ పరిమళ యామిని పరవశించి […]
పొడి ఆకులను నడిచే పాదాలను పాకే నీడల గోళ్ళతో తాకుతుంది ఎండ. తిండి వనాల్లో తిరుగాడే జంతువులు అంతా బాహిరమైతే ఆత్మకు చోటెక్కడ? వట్టిపోయిన […]
పాపను పడుకోబెట్టినపుడు తనపై పరుచుకున్న నిద్రని దుప్పటిలా తొలగించివచ్చి ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది. కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని కాసిని చన్నీళ్ళతో […]
నిండైన దీని జీవితాన్ని ఎవరో అపహరించారు. దీని బలాన్ని, బాహువుల్ని, వేళ్ళని, వైశాల్యాన్ని, నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని, ఎవరో నిర్దయగా, నెమ్మదిగా, అందంగా అపహరించారు. […]
ఈ కష్టాల్ని భరిస్తూ ఈ కాంప్లెక్సిటీని ఓర్చుకొంటూ ఎన్నాళ్ళిలా సాగిపోదాం ? సముద్రం నుంచి విడిపోవాలనే పడుచు కెరటాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ ఒక్కసారికి […]
ఇసుకను మోసుకపోయే నది ఎండిపోయింది బండరాళ్ళు బయటపడ్డాయి. శబ్దం ఆగిపోతుంది ఆలోచనకు మొదలు అక్కడే.
ఎగురలేని గాలిపటం తోకలా కొబ్బరి చెట్టు నదిపై ఎండ భూతద్దంలో దూరిన కిరణం నీ తలను కాలుస్తుంది పీతలను తరుముతుంది! గుబురు తోపు వెనుక […]
నిద్రించని జలపాతం రాత్రి సమయాల్లో చెవులొగ్గిన శిలల మీద పడి గెంతడంఎవరు చూస్తారు? వడి తగ్గిన దేవాంగ్‌నది శిగపూవులతో చీకటిలోయల్లోకి పయనించడంఎవరు చూస్తారు? నడినెత్తిన […]
సుడిగాలి నెదిరించి వడగళ్ళ వానలో తడిచే వృక్షాన్ని వడలని సూర్యుని విడిది నుండి విడివడ్డ కిరణాన్ని
ఊరి బయట ఆరుతున్న కుంపటి బొగ్గులన్నీ ప్రార్థించిన పిమ్మట నివురుగప్పిన నిప్పు జీరలేని గొంతుకతో ధీరంగా చెప్పింది “చలించక జ్వలించండి”
గది కిటికీ నిశ్శబ్దంగా తెరుచుకుంటుంది శూన్యంలోకి చూపుల వలలు విసిరి తెలియని దేనికోసమో వేట ప్రారంభిస్తుంది హృదయకవాటాలను తోసుకుంటూ జ్ఞాపకాల గాలివాన వస్తుంది గుండెగోడకు […]
పొలిమేరల్లో ఉన్న ఊళ్ళోకొచ్చిన పులిలా చప్పుడుకాకుండా కాలేజీ కేంపస్ లోకి కాలుపెడుతుంది జ్వరం. ఇక్కడి మనుషులు నిరాయుధులని, వీళ్ళ మధ్య యే బలమైన బంధాలూ […]
ఒకొక్కరం ఒకో విధంగా రంగ ప్రవేశం చేసినా, మా బృందనృత్యం ఒక పద్ధతిగానే సాగింది. ఒకరు ప్రపంచాన్ని సమ్మోహింప చెయ్యాలని, ఒకరు ప్రజల మత్తు […]
రంగులు మార్చే కొండను వీడి, నిదురలోయలోకి జారిపోయే రాయిని నేను అలసిపోని సెలయేరు పరుగులెత్తే వేళ్ళతో అరగదీస్తుంది నన్ను
ఘడియఘడియకూ నన్ను చూడకు అప సవ్యదిశలో తిరిగే గడియారాన్ని నేను గడచిన కాలాన్ని వడగట్టి రేడియం కళ్ళతో నడచిపోతాను.
నీతో కలిసి పయనిస్తూ వచ్చిన పెట్టెలను మోస్తూ.. నీ ముందు కూలీ బరువెక్కిన పాదాలతో ఆ వెనుక అనుసరిస్తూ నీవు చేరవలసిన చోటువైపు ఉరకలేసే […]
ఇంకిపోయిన నదిని లేచిరమ్మని కోరకు రాలిపోయిన నవ్వులను తిరిగి జీవించమని కోరకు ఏదో చప్పరిస్తూ..ఏ తీపి మిఠాయినో గుర్తుచేసుకోకు.. బావిలో కదిలే ప్రతిబింబాలను చిత్రించకు […]