అది
అచ్చెరువు గొల్పు
మహదానందపు
ఉద్యానవనము లోపలి
వినూత్న ప్రాకార లోకంబు
వేల కాంతుల
చైతన్యపు ప్రవాహంబు
ఉత్సాహపు వెల్లువ
చరాచర సృష్టికీ ఆది బిందువు
నీ నా దృష్టికందక
భాష పలకని
ఊహాతీతపు
ప్రపంచపు మొదలు
ఆ అద్భుతం ఇమడని
కంటి పాప
అద్దమై
నేను అద్భుతమైపోయి యుంటి
అది కాంచిన నేను
మరణించి
మరల జీవించి
మరణించి యుంటి
అది
చెప్ప బల్కిన నేను
ఆనంద లోయలో
అడ్డుతో ఆపువారు లేక
ఉన్నపాటుగా
చెట్టు ఆకులా రాలిపోతి