అప్పుడప్పుడూ
నీ ఉత్తరాల్లో సువాసనలు
అక్షరాలౌతాయి.

లోతులేకపోవటం క్రమక్రమంగా అలవాటైపోతుంది. తడిసీ తడవని పాదాలతో నడక సాగిపోతుంది. నాలుగో పరిమాణం దాకా సాగిన ఒకప్పటి ఆలోచన రెండో పరిమాణం దగ్గరే ఆగిపోతుంది. […]

బిగదీసి కళ్ళెం ఉరికించు గుర్రం పులికన్ను రక్తం ఒలికించునేమో.. ముదురు చీకటి క్షణకాల మాత్రం పొదరింట నేత్రం పసిగట్టునేమో.. వదులు కురులు సవరించు హస్తం […]

గోడ కడుతున్నారు ఇంతకు ముందో గోడ ఉంది అది దేవుడి గోడ దానిముందు ప్రార్థనలు చేస్తారు కొందరు గట్టిగా దీని వెనకాతల ఏడుస్తారు మరికొందరు […]

లోపలి ధ్యానంలో మెట్లు కనిపించవు మెల్లగా వొక తీగని చేతులకు చుట్టుకుని శిఖరం కొసకి చేరుకుంటాం అక్కడి నిశ్శబ్దం చివరిమీంచి ఈదురుగాలుల హోరులోనో అందీ […]

వెనక్కి రాదు దూరాల సొరంగంలోకి జారిపోయాక, రైలు. కాసేపే ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ ఎదురుచూపులూ తలపోతలూ చివరి ఎడబాటు దాకా. వస్తున్నప్పుడు ఎంత […]