మళ్ళీ పాత ముఖంతోనే వచ్చావా వ్యయా!
అంటూ ఎక్స్రే కళ్ళతో సెక్స్ వర్కర్లని
నిరసించినట్టుగా నిస్త్రాణగా గొణుగుతున్నాయి పంచాంగాలు
శీర్షికలు కవితలు
సోదర సోదరీ మణులొద్దు.
స్వామీ, వద్దు, వద్దు
పెళ్ళొద్దు, పెటాకులొద్దు
జింకల కళ్ళూ వాగుల నీళ్ళూ ఊళ్ళో అమ్మించి
రాళ్ళకి పువ్వుల రంగులు వేయించి
పైకం గుళ్ళో పంచుకు తిన్నాము.
గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ –
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
వార్తాపత్రికలూ –
ఎవరిలో ఆదిమ అటవీసౌందర్యాలు విస్తరిస్తుంటాయో
అర్ణవాలు ఘూర్ణిల్లుతుంటాయో
జలపాతసాహసాలు ఉరుకుతుంటాయో
ఎవరికి తెలుసు?
పైపై పూతను కాను
పసరు పూపను కాను.
నేను వచ్చిన తరువాత
మీ దిగుళ్ళలో మీరు,
మీ సంతోషాల్లో మీరు,
మీ రోజువారీ ఈతిబాధల్లో మీరు –
ఏమో! నేను నాకే వొక జ్ఞాపకంలా పడి వున్నాను.
కుర్ర చోదకుండు కులుకులాడితొగూడి
కన్ను మిన్ను గనక కారు నడిపి
కొంప ముంచినాడు గోడెవరితో దెల్పు
పచ్చడాయెకారు పట్ట పగలే
ఆ అద్భుతం ఇమడని
కంటి పాప
అద్దమై
నేను అద్భుతమైపోయి యుంటి
బాల్యం – తుప్పల్లోకి పోయిన బంతి
ఎప్పటికీ మరి కనిపించదు
నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి
చిక్కని నలుపుల చక్కని రమణి.
ఈ “శిలాలోలిత” అనుభూతి, నాది. ఈ “శిలాలోలిత” హృదయం, నాది. ఈ “శిలాలోలిత” గొంతు, నాది కాకపోవచ్చు. ఈ “శిలాలోలిత” భావాలు, నావి కాకపోవచ్చు. […]
నేనెవరినో మీకెవరికీ తెలియదు ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు […]
మరో శిశువు పుట్టగొడుగులా మొలుచుకొచ్చింది ఈ పొగలోకి ఈ చీకట్లోకి ఈ బొగ్గులోకి ఈ మసిలోకి ఈ బురదలోకి ఈ పేడలోకి ఈ మురికిలోకి […]
ఈ రైలు ఆ ఊరెడుతోంది రైల్లో కూచునున్న నేనూ ఆ ఊరే వెడుతున్నానా ఈ రైలుపెట్టెలో అటునుంచిటుకి పాకే ఆ చీమ ఎటెడుతున్నట్లు ఈ […]
పాతిక లాలసాతప్త దేహాల పరిమళాలతో ఐదు మంచుపర్వతాల సౌందర్యాలతో అసంఖ్యాక జంటగోళాల చలన సంగీతంతో వెయ్యి కళ్ళ మమతల నీలి కాంతులతో శతకోటి చల్లని […]
చెప్పేదీ చేసేదీ ఒకటి కానక్కర్లేదంటే అబ్బో చెప్పలేనిదంటూ ఉండదు నేల నుంచీ నింగి దాకా ప్రగల్భించొచ్చు అందుకేగా సాహిత్యం అంత చవకా విలువ తక్కువా
నడిరాతిరి చప్పుడు లేదు వెలుతురు లేదు గాలిలేదు చీకటిలో నిద్రలో నడిరేతిరి నడిరేతిరి నిద్రలో నిద్రరాత్రి మధ్యలో ఎక్కడో ఎవరిదో తల్లికడుపు చీల్చుకొచ్చిన శిశువుకేక […]
నాకు ఆకలేసినప్పుడు కేకలేసే ఓపిక్కూడా లేక సొమ్మసిల్లినప్పుడు ప్రణాలికలన్నారు సస్యశ్యామలమన్నారు సర్వోదయమన్నారు మావోదయమన్నారు ప్రజాస్వామ్యమన్నారు సామ్యవాదమన్నారు రక్తపాతమన్నారు ఓట్లన్నారు వల్లకాడనలేదు ఎన్నో అన్నవాళ్ళేకానీ పట్టెడన్నం […]
తిండిమెక్కుతూ నిద్రపోతున్నారు ఈర్ష్యపడుతూ నిద్రపోతున్నారు పళ్ళికిలిస్తూ నిద్రపోతున్నారు నిప్పులుకక్కుతూ నిద్రపోతున్నారు సంపాదిస్తూ నిద్రపోతున్నారు సంభోగిస్తూ నిద్రపోతున్నారు హత్యలు చేస్తూ నిద్రపోతున్నారు పరిత్యజిస్తూ నిద్రపోతున్నారు చదువుతూ […]