ఓ కొండచిలువ రాత్రి
నాలుగు వగరు బీర్లు ఖర్చవనిదే
ఓ స్నేహం చిక్కబడదు

ఒక శీతాకాలపు సాయంత్రం
కొన్ని అయస్కాంతపు చూపులు నలగనిదే
మంచం సద్దు చేయదు

చేతులారంగ తెలుగును జేయ హత్య
దివురుచున్నవి పత్రికల్ దినము కొన్ని!
వాక్యనిర్మాణ చాతుర్యవాంఛ వ్యాక
రణము దొరగుచు కావ్యలక్షణము మరచి!

ఎప్పుడో చూశాను ఇవే గోడల్ని, ఇదే, ఈ ఆకలి గొన్న శునకాన్ని
నన్ను గిరాకీ అనే ఒక సర్వనామంతో సంభావించే చోదక నేత్రాల్ని
ఎప్పుడో చూశాను ఈ గోడల్ని సరిగ్గా ఇవే గొడవల్ని, ఇది మామూలే.

బోడిగుండంత సుఖం లేదని తెలిసినా
జులపాల జుత్తు పెంచుకున్న వాణ్ణి.
ఊరుకున్నంత ఉత్తమం లేదని తెలిసినా
కంద దురదా కత్తిపీట దురదా
కలిపి కళ్ళకద్దుకుని
నాలుకకు రాసుకున్న వాణ్ణి…

ఒకసారి వెళ్ళి ఆ దాక్కున్న నదిలో
మునకేసివద్దామా?
ఇక్కడ ఎవరికి ఎవరు ఏమైయ్యారని
మురికి అవయవాల మధ్య మలినమైన
బ్రతుకు వివరాలన్నీ ఏ భాగీరథిలో
కలిశాయని అడుగుదాం.

ఇక్కడ ఒకడుగు
అక్కడ రెండడుగులు
నేలమీద నేను
నేలా నింగీ తను
పరుగుల పందెం

రెక్కల్లా చేతులు చాచి
తనకోసం పరుగెడుతూ నేను.

కటిక నేల. చెయ్యి దిండు.
సగం మూసిన కనులు. సగం తెరచిన నోరు.
ఆదమరచిన శరీరం. ఆవులిస్తూ ఆవు.
చెట్టు తొర్రలో కదలని ఉడుత.

అగ్గిపెట్టెల్లోంచి ఎగిరిపోయి
బంతాకులు నెమరేస్తూ
కలల్ని వెదజల్లుతున్న బంగారిపురుగులు
హరివిల్లు లోంచి రంగులను తెచ్చి
పూలతోట కద్దుతున్న సీతాకోకలు

పదములు
పాడెదన్,
పిలిచి వలపుల
పీటను వేతు,
పుల్కలన్ బెదరుచు
పూతు గంధమును,
పృథుకము
పెట్టెద నావుపాలితో ముదమున,
పేద
పైదలియు
పొగడ సరాలను
పోహణింతు, నీ సుదినము
పౌర్ణమిన్ బ్రదుకు శుభమవ,
పండ త–
పః ఫలమ్ము రా!

లయ తెలుసు నీకు. అనుగుణంగా అడుగు తీసి అడుగు. ఊగుతూ నడుం. ఊపుతూ చేతులు. ముందుకీ వెనక్కీ. కవ్విస్తూ దగ్గరగా ఒరిగి అందకుండా దూరంగా జరిగి. కదలికకు బదులుగా కదలిక. ఉబికే కండరం మీద నిగనిగలాడుతూ వెచ్చటి తడి.

ఆ రాత్రి,
ముక్కలయే కాలం ముందు
మౌనం నిశ్శేషంగా నిలబడ్డ రాత్రి,
వెన్నెలను శ్వాసిస్తున్న చీకట్లోనే
లోకం సుస్పష్టంగా కనపడ్డ రాత్రి

విమానాన్ని చూసిన ప్రతిసారీ
వినమ్రంగా చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది

ఎగిరే రేకుల డబ్బాలా కాక
చేపా హంసలు ఒక్కటై దర్శనమిచ్చే
దేవతా సోయగంలా అనిపిస్తుంది

సంజీవ పర్వాతాన్ని అమాంతంగా
మోసుకు పోతున్న హనుమంతుడి
కార్యోన్ముఖుత ని గుర్తుకు తెస్తుంది

ఎన్ని వసంతాల వంచనకు వడలి
రేకులుగా రాలిపడుతోందో
లోలోపలెంతగా దహించుకుపోయి
దావాగ్నిలా ఎగసిపడుతోందో
దూరం నుండి చూస్తున్నవాడివి