హిమనగాలు కరుగుతాయి, రగుల్తాయి, ఆవిరులై
మరుగుతాయి అతడి కోర్కెల వైను
గ్లాసుల్లో మంచు మైదానాలశాంత
జలధరాలు, పయనమెచటికని మాత్రం అడగకు

ఉక్కా గొల్లూ చీకటమ్మా వేసాకాలం ఎండ
బిడ్డల్నాటి అడ్డాలు కాదు ఎవడి దేనిమీదనా మరిలేదు
ఎవడూకానివాడి దీవి దానిమీదేనే ఏమీకాన్దాని దీని మీద
దూరానున్నారు చుక్కలమ్మా పిల్లలంటే ఆకాశ పంట

ఏదో రహస్యం అర్థమయ్యీ కానట్టు
ఏదో వెలుగు లోలో మిణుకు మిణుకుమంటూ
ఇన్నాళ్ళెందుకు సాగిందీ ప్రతీక్ష!

నిర్దిష్టవాక్య నిర్మాణనైపుణ్య నిధి కోసం నిరంతర ప్రయాసను గునపం చేసి తవ్వుతూ పో రచనాకారుడా. చక్కని పదాల కాంతులు అల్లుకున్న చుక్కల పందిరికి లెక్కలేనన్ని భావవిద్యుద్దీపాల వెలుతురు గుత్తులు వేలాడనీ.

కండలు తిరిగిన కుర్రాడొకడు
ఎక్కాడు మొరటుగా రెక్కలు నలిగేట్టు
వాడి చేతిలో చిట్లిన గాజు
చనిపోయిన తన ప్రేయసి పెట్టిన
తొలిముద్దు జ్ఞాపకపు ముక్క

ఎవరన్నారు మనిషంటే ఘన పదార్ధమని?
చెట్టిక్కిన వాడూ మనిషే
ఎక్కిన కొమ్మను నరుక్కున్న వాడు మనిషే
కింద పడి విలవిలలాడి మృత్యువును ముద్దాడిన వాడూ మనిషే

పున్నాగములు కొన్ని మూర్ధంబునందు,
కాంచనంబులు కొన్ని కంఠంబునందు,
మల్లెపూవులు కొన్ని యుల్లంబునందు,
హల్లకంబులు కొన్ని హస్తంబులందు,
పంకజంబులు కొన్ని పాదంబులందు,