మళ్ళీ… నవ్వేయాల్సొస్తుంది
గడ్డకట్టిన ముఖాన్ని చీల్చుకుని
నుదుటిమీద జీవితం తుఫుక్కున
ఉమ్మిన తడి నిజాలు జారిపోతుండగా
మళ్ళీ… ముడి విప్పాల్సొస్తుంది
ఛెళ్ళున తగిలిన చెంపదెబ్బ
మనసుని మండిస్తుండగా
శీర్షికలు కవితలు
అంగలతో వాడెవడో
నింగి కత్తిరిస్తుంటే
అంతులేని వర్షమొకటి
అవని నంత ముంచుతోంది
తలలు లేక జనమంతా
తలోదిక్కు పోతుంటే
కనిపించని వాసుకికై
సురాసురులు ఒకటైరి
బిస్మిల్లాఖాన్‌నో
ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మినో
కిశోర్ కుమార్‌నో
నువ్వు ఆస్వాదించే వేళ
బుజ్జిగాడి హోమ్‌వర్క్‌తోనో
మాసిన బట్టలతోనో
నేను కుస్తీ పడుతుంటాను
ఏమీ తోచక
నా తల చుట్టూ చమ్కీరేకులు చుట్టుకుని
వంటి నిండా తళుకులు పూసుకుని
కాసేపు గంతులు వేస్తాను
వీళ్ళు దాన్ని నాట్యం అని చప్పట్లు కొడతారు
అర్ధరాత్రులు ఒంటరి క్రేంకారం విని ఉలిక్కిపడి నువ్వు నిద్రలేస్తావు
పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు
నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి.
గాజు తలుపులు, మెరుపు వెలుగులు
నిన్ను పరివేష్టించి ఉంటాయి.
ఇక్కడ ఆకలిదప్పులే కాదు,
నిద్ర కూడా నిన్ను పలకరించదు.
నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక
నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు.
ప్రాంగణంబులయందున ప్రమదలెల్ల
రంగురంగుల వ్రాసిన రథములందు
యానమొనరించి యేతెంచె నదిగొ కనుడు
మకరసంక్రాంతిలక్ష్మి సమ్మదముతోడ
అయినా విషాదాన్ని మోశాం అకారణంగానే. నిరంతర దుఃఖితులుగా బతికాం ఆయాచితంగానే. ఇప్పుడీ తటస్థ బిందువు మీద నిశ్చలంగా, ఈ గాలిబుడగలో పదిలంగా ఎదురుచూస్తున్నాం. లోతుగా లోతుగా మెలాంకొలిగ్గా జీబురు జీబురుగా ఏళ్ళకేళ్ళు సాగదీశాక ఒక్కపూట, ఒక్కపూట కావాలనే, అదేంటో చూద్దామనే ఢమఢమ మెరుపుల్ని లౌడ్‌స్పీకర్లో వేసి గదిగోడలతో పిచ్చినాట్యాలు చేయించాం.
ప్రేమ వర్షం కురిపిస్తుందనుకున్న మేఘం
నిర్దయగా పిడుగుల్ని విసిరినా
వెలుగు నిస్తుందనుకున్న దీపం
వేల మిణుగురులుగా మారి
అనంత శూన్యంలోకి అదృశ్యమయినా
ఆగకు
నెత్తుటి నూనె
రాసుకుని
మిలమిలలాడుతున్న
ద్రౌపది కురులను
స్మరించు
బాలా, చీకటి మాంసాన్ని
తినిపించు
ప్రేమని వివరించాలని ఆపేక్షని పూయాలని
నువ్వంటే నాకిష్టమని అంతా నీకోసమేనని
మొత్తం కళ్ళతోనే సంపూర్ణంగా
ఆర్తిగా చూస్తూ ఆర్ద్రంగా అల్లుకుంటూ
అప్పుడప్పుడూ గింజలకని గూట్లోకి చేరీ
పక్కగదిలోకెళ్ళినా శక్తికొద్దీ పిలుస్తూ
అదే పనిగా కూస్తూ అన్న మాటలు అప్పగిస్తూ…
ఊహ కందని ఉదాసీనత
బరువుకాని బరువై
ఎద మీద వాలుతున్నప్పుడు
మూసీ మూయని నా కనురెప్పల మాటున
కదలీ కదలని ఒంటరి మౌన మేదో
దైన్య చిత్రాలను చెక్కుతుంటుంది.
కాలాన్ని ఒడ్డి ఈ గులక రాళ్ళను ఏరుతున్నాను
శక్తిని పోసి ఈ నౌకను నీళ్ళపై నిలుపుతున్నాను
సంకల్పాల పాచికలను నక్షత్రాల వీథుల్లోకి విసురుతున్నాను
పాలపుంతల దారుల్లో నీ పేరే పిలుస్తున్నాను
కాంతిల్లు నీ ఎఱుకలో అమ్మా, రేణువులుగా విడిపోతున్నాను.
నీ పచ్చని నవ్వుల నాట్యం
మొగ్గలు తొడిగే కొమ్మ చివర్లు
ప్రసరించే రంగుల మేళవింపు
నేల గుండెపై పసిపాదాల తప్పటడుగులను
గుర్తు చేస్తే, మళ్ళీ అదే ప్రశ్న-
అసలేం చేశానని?!
రోజూ కనిపిస్తే ఊరికే వినిపిస్తే
మర్చిపోవడం దృష్టి మరల్చుకోవడం
ఖాయమే కానీ…
అందుకోవాలని లేదు అంతులేనిదనీ కాదు
ఆశువుగా చిప్పిల్లిన అలవిగాని ముదమేదో
అంతటా నిండి అలరిస్తుంటే…
మార్కులూ, ఎంగిల్‌లూ,
మావోలూ, మిన్హాలూ
బ్రాహ్మణీయం భూస్వామ్యం
సమాజాల వాచాలం
విప్లవీకం వర్వరీయం
ఒకటేమిటి, అన్నీ అన్నీ
విన్నాన్ విన్నాన్ చదివాన్ చదివాన్!
ముఖమా? అరవిందమా?
అరబిందెనా?
పూర్తి బిందెనా?
ఎటో వెళ్ళిపోతోంది మనసూ…
ఎందుకిలా బ్రో?
బ్రో…చే…వారెవరురా బ్రో…
ఆ కొండకొమ్మున నిలబడ్డ
దిగులు మేఘం
కురవబోయిన ప్రతిక్షణం
హత్తుకుని ఓదార్చలేని ప్రేమ
కన్నీరు తుడవలేని స్పర్శ
తనివితీరా మాట కాలేని మౌనం
ఒక చిత్రమనిపించే నవ్వు
పలవరింతలాంటి పలకరింత
ఏదో చోటనించి కబురెంతో కొంత
చిన్నదైనా పర్లేదు మంత్రదండం
పెద్దదైనా పర్లేదు అబద్ధ వాత్సల్యం
బరువైనా పర్లేదు గుప్పెడాలోచన
ఇంటిబెల్లు గొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి. పిట్టలు రాయబారం మోసుకొచ్చే యాల్లయితాంటది. ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది. ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది. కండ్లనీళ్ళొత్తుకునుడే దక్కువ.
మిట్టమధ్యాహ్నం
అన్ని కిరణాలు పోగుచేసుకుని
జమ్మి చెట్టు మీద పెట్టుకున్నా
ఎవడైనా
నా జోలికొస్తే
అస్త్ర శస్త్రాలు సిద్ధం