ఎండా కాలం మా మద్దులేటి వాగు పక్కన
చిన్ని చేతులతో ఇసుక తవ్వి
తీసిన చెలిమ లోంచి కడవ లోనికి
లోటా లోటా తోడుకున్న చల్లని నీళ్ళలో
ఒకే ఒక్క లోటా చాలు
మరి అరవయ్యేళ్ళు బతికేస్తాను జీవనదినై
Category Archive: కవితలు
విద్రావవ్యవధానమీక, సమదాభీలాంగలక్ష్యంబులన్…
వైదేహీ, వినుమోయి! మాకిదె బృహద్వార్తావిశేషంబయెన్…
లంకాపట్టణమేమి సృష్టియొ! భువిన్ రాజిల్లు వైచిత్రి…
రామరసాయనము పేరిట రాసిన ఈ పద్యాలలో ఒక్కొక్క పద్యమూ శాంతబీభత్సాద్భుతరౌద్రాది నవరసాలలో ఒక్కొక్క రసానికి ఉదాహరణ.
సమయం ఎనిమిది కావస్తున్నట్లుంది
పరుచుకుంటున్న తెల్లటి ఎండా
వెచ్చనౌతున్న ఎండాకాలపు గాలీ
గుచ్చుకునీ గుచ్చుకోకుండా వుండే
రాత్రి నీవు కురిపించిన
మౌనమో మాటలో కన్నీరో నవ్వులో-
ఏదో లీలగా ఒక అలికిడి చేస్తూ…
నీలో ప్రతిబింబించేది తనేననీ
నన్నో
ప్రశ్నార్థకంగా మారుస్తూ అంతలోనే
జవాబుల్నీ నానుండే విడదీస్తుందనీ
ఆలోచనల పదునుపెట్టడం
అసహనాలని కత్తిరించడానికేననీ…
“కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ” మండ్రు టెలివిజనుల
నవ్వు, ఏడ్పు వచ్చు నాకొక్కసారిగా
రామచంద్ర పుత్ర! రామభద్ర!
నిద్రపోక ఏం చేస్తాడు?
నిద్దట్లో మాత్రమే జీవిస్తున్న వాడు
ఎంతో కొంత తనకు తాను లేనప్పుడే
నిజంగా వుంటుంటాడు ఈ మాత్రమైనా
పేటిక మూసుకోవాలి ఇంకా
ఎవ్వరయినా సరే!
‘బావిదగ్గిర నీళ్ళకోసం’
మరొక కొత్త బొమ్మ గీయాలి.
లేకుంటే, ఏ ఆస్కార వైలుడో
రాజరాజనగరంలో పాతబొమ్మని
చీరి చింపేయచ్చు.
తనతో నడుస్తూ ఉంటే
కబుర్లన్నీ మారాకు వేస్తాయి
ఒక్కో మొగ్గ పూవై విరుస్తుంది
తన నుండి వీచే గాలిని కప్పుకుని
పూలన్నీ పరిమళం అద్దుకుంటాయి
మనసూ కొత్తగా గొంతు సవరించుకుంటోంది
వసంత మొస్తున్నదేమో!
ఎపుడూ వుండే
చేదు మాటలూ పులుపు గుర్తులూ
వుంటూనే వున్నై,
ఇప్పుడైనా
కొంచెం తియ్యదనాన్నీ కలిపి చూద్దాం!
స్వాదుసౌందర్య దీప్తుల్ని వెలయించే
కళాకర్పూరగంధి కోసం కలవరిస్తే
నిత్యనిస్సారవికారాకారంతో
ప్రత్యక్షమైంది కవితాలలామ
నీ ప్రేమలా ఆరిపోయింది నా కళ్ళ వెలుగు,
మూసుకొని ఉన్న నా కళ్ళల్లో చిరుచేపలా నీ జ్ఞాపకం.
ఎడారిలో ఏకాకిగా భారంగా సంచరించే బాటసారిని నేను
కాని, నేను స్వయంగా చూశాను నీ ఆ ఇంటి వెలుగు
అవును, నా నిర్జీవ కఠిన వేదన కల్పనే కావచ్చు;
ఎప్పుడో ఒకవేళ మెరుస్తూ చంచలానురాగంతో మలయమారుతం వస్తే,
మెడపట్టిగెంటినట్టు వెనక్కి తిరిగిపోతుంది;
రూపసీ! నీవు తనని క్షమిస్తావు, క్షమించడం నీ సహజ లక్షణం
ఏదో ఒక పచ్చనిచెట్టుపై పగలూ రాత్రీ ఎన్నెన్నో పక్షులు
పాటలు పాడుతూ ఉంటే, నా మనసు కూడా
ఆ పక్షుల పాటల కోసం ఎన్నడూ ఆలసించదు.
తిరిగి వచ్చే ఏడు కృష్ణచూడా ఇలాగని నవ్వుతుంది.
ఒకవేళ నీ యవ్వనంగాని ఒకసారి జారిపోతే, హాహా!
అది మళ్ళీ తిరిగి వస్తుందా? నీ లిప్‌స్టిక్ ఏం చెయ్యగలదు?
అలసిన దేహం, నిశ్చల చింతనకి బలహీనం
రెండవఝాము ఎండ తుక్కునంతా కడుగుతుంది
నది ఒడ్డున ఉల్లాసంగా వినపడుతుంది వంశీరవం
పూలై వికసిస్తుంది ల్యాండ్‌స్కేప్, నామనశ్శాఖలో.
థియొడోర్ గెయ్‌సెల్ (Theodore Geisel) ప్రపంచప్రసిద్ధి గాంచిన కార్టూనిస్ట్, ఆనిమేటర్, ఆర్టిస్ట్. కానీ ఆయన ఎవరికీ తెలియదు. అదే డాక్టర్ సూస్ అనండి, ఆయన తెలియనివారూ ఉండరు! పిల్లలకోసం కలకాలం నిలిచిపోయే ప్రపంచాన్ని సృష్టించిన సాహిత్య మేరునగం డాక్టర్ ౙాయిస్ (Dr. Seuss) జన్మదిన ( మార్చ్ 02, 1904) సందర్భంగా ఒక తెలుగు గేయం, ఆడియోతో సహా.
నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను
“పక్షుల కలరవాలను విన్నాను
రాలినపడిన పండుటాకులపై మృగాల
సయ్యాటలు విన్నాను
మూగవైన గట్లతో నది ఆపక సలిపే
మధుర సంభాషణలు విన్నాను
పూల తపస్సును భంగపరుస్తున్న
తుమ్మెదల ఝంకారాన్ని విన్నాను
గజరాజును వెదుకుతున్న
కరిణి ఘీంకారాన్ని విన్నాను”