ఈ సంచికలో విశేషాలు:
- ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు గురించి ఒక సమీక్ష, సంపాదకీయం.
- ఈ సాహితీ సదస్సులో వేలూరి వేంకటేశ్వర రావు గారు చేసిన ప్రసంగవ్యాసం: తెలుగు సాహిత్యంలో విమర్శ
- సావిత్రి మాచిరాజు , లైలా యెర్నేని, కే.యస్. వరప్రసాద్, సౌమ్య బాలకృష్ణ గార్ల కథలు, యదార్థ చక్రం నాలుగో భాగం
- ఉదయకళ, రవికిరణ్ తిమ్మిరెడ్డి, పద్మలత, సరిపల్లి ప్రసాద్, ఇంద్రాణి పాలపర్తి గార్ల కవితలు.
- విన్నకోట రవిశంకర్, తిరుమల కృష్ణ దేశికాచారి గార్ల వ్యాసాలు.
ఇంకా, ఏ బ్రౌజర్ లోనైనా ఈమాట చదవగలిగేలా చేయాలన్న మా ఆశయసిద్దికి మరింత చేరువౌతూ, ఈ సంచిక నించి మరికొన్ని సౌకర్యాలు కలిగిస్తున్నాము. అందులో భాగంగా–
- యూనికోడ్ సదుపాయం లేని బ్రౌజర్లలో ఈమాటని డైనమిక్ ఫాంటు ద్వారా చదవడానికి ఎడమవైపు పైన ఉన్న జాబితా మీద క్లిక్ చేసి “Non-Unicode” అన్న ఆప్షన్ ని ఎంచుకుంటే, ఈమాట లో ప్రతి పేజీ మీకు శ్రీ-లిపి ఫాంటులో కనిపిస్తుంది.
- తెలుగు సదుపాయం లేని (లింక్సు లాంటి నాన్-గ్రాఫికల్) బ్రౌజర్లలో ఈమాట ని RTS లో చదవడానికి ఎడమవైపు పైన ఉన్న జాబితా మీద క్లిక్ చేసి RTS అన్న ఆప్షన్ ని ఎంచుకుంటే ఈమాటలో ప్రతి పేజీ మీకు RTS లో కనిపిస్తుంది.
ఈమాట పాత సంచికలన్నీ ఇప్పుడు ఎడమవైపున లింక్ చేయబడ్డాయి. పాత సంచికలనన్నిటినీ యూనికోడ్ లోకి మార్చడం వల్ల వాటిని మీరు పూర్తిగా వెతకడానికి వీలౌతుంది. కొన్ని పాత రచనలను తర్జుమా చేయటంలో ఫార్మాట్టింగ్ సమస్యలు ఏర్పడ్డాయి. వాటిని త్వరలోనే పరిష్కరించగలమని భావిస్తున్నాము.
ఎప్పటిలాగే, ఈమాట కొత్త సంచిక గురించి మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము.