రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రెండు శరీరాలు

రచన: విన్నకోట రవిశంకర్
మే 2025

ఒక శరీరం ఉంటుంది
జీవన వ్యాపారానికి కావలసిన వివిధ విధుల్నీ
అదే క్రమంలో పదేపదే నిర్వహిస్తుంది
సుఖిస్తుంది, దుఃఖిస్తుంది
బాధల్ని పంటి బిగువున సహిస్తుంది

వయసుతో వచ్చే అన్ని మార్పుల్ని మౌనంగా అంగీకరిస్తుంది

పనులతో, బాధ్యతలతో అలసి సొలసి
ఊరట కోసం ఏ నడి రాతిరి వేళకో
నిద్రనాశ్రయిస్తుంది.

మరొక శరీరం ఉంటుంది
దీనికి అలుపు లేదు, ఆశాభంగం లేదు
వయసు లేదు, వృద్ధాప్యం లేదు
ప్రాణమై ప్రవేశించే ఒక పద్య పాదం కోసం
అనంత కాలం నిరీక్షిస్తుంది

అంతర్గత లయను గుండె చప్పుడుగా మార్చుకొంటుంది
ఊహలు ఉచ్చ్వాస, నిశ్శ్వాసాలై ఊపిరి పోస్తాయి
పద చిత్రాలు జవసత్వాలొసగుతూ
సిరలు, ధమనుల్లోకి బిరబిర ప్రవహిస్తాయి

చైతన్యం పొందిన రహస్య శరీరం
విశ్వమంతా యథేచ్ఛగా విహరిస్తుంది

కాలం సైకత తీరం మీద
దాని అడుగు జాడలు చెరిపివేయలేక
మఱపు కడలి నిరాశగా
వెనుతిరుగుతుంది

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • e తరమ్‌ (నాటిక )
  • క్షమాపణ
  • శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు
  • అనావిష్కృతం
  • ఫ్లూ

ఇటువంటివే…

  1. రెండు కవితలు
  2. రెండు కవిత్వాలు
  3. పక్క – రెండు దిక్కులు
  4. Madre: రెండు వాచకాలు
  5. రెండు కవితలు

మే 2025 సంచికలో ...

  • అక్కమహాదేవి వచనాలు – 5
  • అలలు మోసిన వాడు
  • అల్ బిదా హోటల్ వర్క్!
  • అస్తిత్వవాద సాహిత్యం: 3అ. నీచ
  • ఆ గోడకు ఒక కిటికీ ఉండేది!
  • ఆకులేఖలు
  • ఆనందమయదేశంలో నేను
  • ఉపమా రఘోశ్చాపి
  • ఉషోదయం
  • ఎక్కడంటే?
  • ఓ కైక కథ
  • కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్”
  • కలలకి కూడా రెక్కలు రాని కాలమైతే
  • గుప్పెడు మాటలు
  • చివరి కచేరి
  • తయారుగా…
  • పంచేంద్రియాలు: 3 వినికిడి
  • భారతీయులకు హేతు చింతన ఉందా?
  • ముకుల
  • మే 2025
  • మౌనంబంతట మాటలాడె… (2వ భాగం)
  • యూట్యూబ్‍లో ఈమాట: ఏప్రిల్ 2025
  • రెండు శరీరాలు
  • షాంగ్రి-లా – 1
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ముకుల
ఉషోదయం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.