నెచ్చెలి కథల పోటీ 2022

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కథల పోటీ-2022కి కథలకు ఆహ్వానం!

బహుమతులు

  • రెండు మొదటి బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.2500/-
  • రెండు ద్వితీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1500/-
  • రెండు తృతీయ బహుమతి కథలు ఒక్కొక్కటికి రూ.1000/-
  • సాధారణ ప్రచురణకు 20 కథలు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు ‘నెచ్చెలి’లో నెలనెలా ప్రచురింపబడతాయి.

నిబంధనలు

ఇతివృత్తం: యువతులు-సమస్యలు

  • కథతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు స్వీకరించబడవు.
  • కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
  • ఒక్కొక్కరు ఒక్క కథ మాత్రమే పంపాలి.
  • ఈ-మెయిలు మీద “అర్చన అకాడమీ & నెచ్చెలి కథల పోటీ-2022కి” అని రాసి editor@neccheli.comకు, rachanalu2022@gmail.comకు రెండిటికీ పంపాలి.
  • కథలు చేరవలసిన ఆఖరుతేదీ: మే 10, 2022..
  • గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
  • బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తరప్రత్త్యుత్తరాలకు తావులేదు.
  • పోటీ ఫలితాలు “నెచ్చెలి” 3వ జన్మదిన సంచికలో జులై 10న వెలువడతాయి.

నిర్వాహకులు:

డా. కె.గీత, సంస్థాపక సంపాదకులు, నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక.
కోసూరి ఉమాభారతి, డైరక్టర్, అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్.