కౌముదివెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2017కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము.
బహుమతులు
పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలకు ఒక్కొక్కదానికీ రూ. 1500, అత్యుత్తమ కథ (ఒక కథకి) రూ.5000 బహుమానంగా ఇవ్వబడతాయి.
వివరాలు, నియమాలు
- కథాంశం ఏదైనా – కుటుంబ సంబంధాలకీ, మానవీయ విలువలకీ, నవ్యతకీ, సృజనాత్మకతకీ పెద్ద పీట వేసే రచనల్ని ఆహ్వానిస్తున్నాం.
- ఇంతకు ముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో కానీ, వెబ్ పత్రికలలో కానీ, వ్యక్తిగత బ్లాగులలో కానీ) ప్రచురితం కాని రచనలని మాత్రమే పోటీకి పంపించండి.
- ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు కూడా పోటీకి అర్హం కావు.
- పై అంశాలని ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి. హామీ పత్రం లేని రచనలు పరిశీలించబడవని గమనించగలరు.
- ప్రచురణకు అంగీకరించని వ్రాతప్రతులని త్రిప్పి పంపడం సాధ్యం కాదు. వాటి కాపీలు తీసి ఉంచుకోవడం మంచిది.
- రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత/త్రి అసలు పేరు, పూర్తి చిరునామా తప్పనిసరిగా వ్రాయాలి.
- పోటీలలో ఏ బహూతి పొందిన కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత రచయిత/త్రి వెనక్కి తీసుకునే అవకాశం లేదని గమనించండి.
- వ్రాతలో కథ 10 పేజీలు మించకుండా ఉంటే మంచిది.
- పోటీ ఫలితాలు కౌముది.నెట్ లోనూ, రచన మాసపత్రిక (మే 2017 సంచిక) లోనూ ప్రచురించబడతాయి.
- బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుతరాలకు అవకాశం లేదు.
- బహుమతి పొందిన కథలు కౌముది వెబ్ పత్రికలోను, రచన మాసపత్రికలోను ప్రచురించబడతాయి. బహుమతికి ఎంపిక కాని కథలలో కొన్నింటిని సాధారణ ప్రచురణకు తీసుకోవడం జరుగుతుంది.
- పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2017. ఫలితాల ప్రకటన: మే 1, 2017.
మీ రచనలు పంపించాల్సిన చిరునామా:
రచన మాసపత్రిక
1-9-286/2/p
విద్యానగర్
హైదరాబాదు, 500 044.
లేదా
Koumudi
4251 ESCUDO Ct,
DUBLIN, CA 94568
The U.S.A.
ఇ-మెయిల్లో పంపించే కథలు యూనికోడ్ ఫార్మాట్ లో పంపించండి. Email: editor@koumudi.net