రెండు కవితలు

1.

నీ తడి అక్షరాలు కొన్ని
భద్రంగా దాచుకున్నాను
నా గదిలో అద్దాన్ని
బయట పారేస్తాను

2.

పాతాళంలో పడి ఉన్న
పెళుసు లోహాన్ని నేను

గునపంతో తవ్వు
బురదంతా కడుగు
నిప్పుల కొలిమిలో
నిలువునా కాల్చు

సమ్మెటతో మోది
సన్నగా సాగదీసి
నన్నొక కడియంగా చేసి
నీ పాదానికి తొడుక్కో!

రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. \"ఏటి ఒడ్డున\" కవితా సంపుటి (2006), \"ఆత్మనొక దివ్వెగా\" నవల (2019), \"సెలయేటి సవ్వడి\" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్‌పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్‍లో ఫేకల్టీగా పని చేస్తున్నారు. ...