[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- నర్తనశాల
సమాధానం: ఆటపాక
- ఈ పత్రం లేతది
సమాధానం: కవటాకు
- చరిత్ర పరిశోధకులకు ఉపకరిస్తుంది
సమాధానం: దండకవిలె
- ఈ యింటికి మరో రెండు
సమాధానం: పది
- ఇది కానిది
సమాధానం: అది
- ఒక తిధి (8 మైనస్ 1)
సమాధానం: నవమి
- దీని భర్త దీన్ని మోస్తున్నాడు
సమాధానం: కుంభిని
- చిక్కు
సమాధానం: శుష్కించు
- 3లో గేయం
సమాధానం: తరంగం
- భారత భూపతి
సమాధానం: యయాతి
- వైశ్యుల లెక్కలో ఒకటి
సమాధానం: లాభం
- ఆమ్రేడిస్తే పరుగెత్తడం
సమాధానం: లుక
- ఇంతే జీవితం
సమాధానం: గాలిబుడగ
- స్తన శల్యం లాంటిది
సమాధానం: కాకదంతం
- చెట్టుమీద చెట్టు
సమాధానం: బదనిక
నిలువు
- మాట, పాట
సమాధానం: ఆలాపన
- నడిచే నాలుగో వంతు
సమాధానం: పాదం
- దీని వెన్న చంద్రుడు
సమాధానం: కడలి
- కష్టపడి విప్పి, తర్వాత తలలు కలిపి ఇది లభ్యమవుతుంది
సమాధానం: కవిత
- లాగు
సమాధానం: వలె
- కలువ, కొలను
సమాధానం: కుముదిని
- వేగు
సమాధానం: దివసారంభం
- ఎవరివి వాళ్ళని
సమాధానం: అభిప్రాయాలు
- అలనాటి ఆంధ్రావని
సమాధానం: కిష్కింధ
- ఆద్యంతాలు
సమాధానం: తలాతోకా
- – పడతారేమో, జాగ్రత్త?
సమాధానం: తికమక
- బురద నెరిసిందా?
సమాధానం: ఫలితం
- ఈ నిప్పు 3లో వుందంటారు
సమాధానం: బడబ
- గడ్డికి నేస్తం?
సమాధానం: గాదం
- ఒకనాటి గొప్ప ఆయుధం
సమాధానం: గద