రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సాయం ఛాయ

రచన: పాలపర్తి ఇంద్రాణి
మే 2020

నేనూ ఒకప్పుడు యువకుడినే
అన్నాడు మామయ్య
పడక్కుర్చీలో వెనక్కి వాలుతూ
జంధ్యాన్ని ముందుకు తోస్తూ

నా పద్యాలకు
ఒన్స్‌ మోరులు హోరెత్తేవి
నా పాటలకు
జనం విజిళ్ళు జోరెత్తేవి
నా కొంటె మాటలకు
యంగ్ గరల్స్ హార్ట్స్
అయిస్‌ క్రీముల్లా కరిగిపోయేవి!

మన ఇలాకాలో మొనగాడిని
బంగారు పతకాల వేటగాడిని
ఏమనుకున్నావ్, మామయ్యంటే?
ఆ పురవీథుల్లో యువసింహాన్ని
నా బ్లాక్‌ అండ్ వైట్‌ కాలానికి
నేనే ఈస్టమన్ కలర్ హీరోని!

మామయ్య ఆ రోజుల్లో కథలన్నీ
వెయ్యిన్నొకటోసారి విని
ఎండ, ఎండ ముందు ఎండ
ఎండ, ఎండ వెనకాల ఎండ
మళ్ళొస్తానని మళ్ళిపోతే

కుర్చీ కింది
మూడంకె నల్లపిల్లి
మునివేళ్ళ మీద
సందె చీకట్లలోకి
జారిపోతే

నాలిక పీక్కుపోతోంది
కాఫీ పట్రావే అని
ఇంట్లోకి ఓ కేకేసి

సుదూర ఆకాశంలోకి
సాలోచనగా
చూ–పు సారించి

నేనూ ఒకప్పుడు యువకుడినే
ముక్తాయించాడు మామయ్య
బొజ్జ నిమురుకుంటూను
బొద్దు మీసాలు సవరించుకుంటూను

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    కె.కె. రామయ్య May 1, 2020 9:53 am

    సాయం సంధ్యలో ఉన్న మావయ్య మీన ఆన… వారు ప్రస్థావించిన ఒన్స్‌ మోరులతో హోరెత్తిన పద్యాలు, జనం విజిళ్లతో జోరెత్తిన పాటలు గురించి కూడా చెప్పు పాలపర్తి ఇంద్రాణి తల్లీ.

    గతం పునాదుల మీదే భవిష్యత్తు భవనాలు వెలుస్తాయని … సంస్కృతాంధ్ర అంగ్ల భాషా సాహిత్యాలు అధ్యయనం చేసి ఆధునిక సమసమాజాన్ని ఆవాహనం చేసిన మహాకవి శ్రీశ్రీని తలుచుకుని కూడా చెప్పు వర్ధమాన తరం కవయిత్రి తల్లీ.

    జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నే
    దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
    గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
    క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!

    ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
    కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
    యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
    యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
    యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

    ‘కళ్లెత్తితేసాలు, కనకాబిసేకాలు ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌’

    యెనక జన్మములోన యెవరిమోనంటీ
    సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
    ముందు మనకే జల్మముందోలె యంటి
    తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
    యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
    కంట నీరెట్టింది జంట నా యెంకి

  2. 2
    nagamurali May 10, 2020 11:36 pm

    బాగుంది కవిత. నా కూతురికి (పదమూడేళ్ళు) చదివి వినిపించాను డ్రమటిక్ గా. ఇద్దరం బాగుందని నవ్వుకున్నాం.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • Walmart
  • కాళీ పదములు 5
  • కోటిగాని కతలు: బత్తాయిలు పోయినాయి
  • నేపథ్య సంగీతం
  • మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి

ఇటువంటివే…

  1. హైకూలు
  2. అమానుషి
  3. వర్ష రచన
  4. కెహర్వా!
  5. మౌనవిపంచి

మే 2020 సంచికలో ...

  • (అ)పరిచితుడు
  • ఈమాట సంపాదకుల పద్ధతి
  • ఏవో మాటలు కొన్ని
  • ఒకానొక ఊట కోసం
  • ఓడిపోయిన యోధుడు
  • కలయిక
  • కెహర్వా!
  • గడినుడి – 43
  • గ్రీకు పురాణ గాథలు 5
  • పరిపాకం
  • పుస్తక పరిచయాలు
  • మారిపోయిన చెన్నపట్నం: 1750-1796
  • మెట్లు, దృక్పథం
  • మే 2020
  • మౌనవిపంచి
  • రెండు ప్రపంచాలు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 43
  • సాయం ఛాయ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మెట్లు, దృక్పథం
ఏవో మాటలు కొన్ని

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.