రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నేనెవరు?

రచన: పాలపర్తి ఇంద్రాణి
అక్టోబర్ 2018

పొద్దస్తమానం దేశంలోని వార్తలన్నీ వడబోస్తూ ఉంటావు.

కాశ్మీరు సైనికుడి రక్తమంటిన అరువు రాయి
అటవీ అధికారులపై ఎర్ర చందనం కూలీ రాయి
వాహన చోదకుని రక్తమంటిన నిర్లక్ష్యపు రాయి
స్థలాల దురాక్రమణల్లో కాళ్ళొచ్చిన రాయి
మృత కథలని మోస్తున్న చరిత్ర రాయి
మోసులెత్తిన ఆశలను మోస్తున్న పునాది రాయి

ప్రతీ వార్త పాల మనసులో ఉప్పురాయి.
బేల మనసుకు అంటురాయి.
జవాబు లేని ఒరిపిడి రాయి.

దేశపు వొళ్ళంతా నిండిన రాళ్ళన్నీ మోసుకుంటూ
మొరాయిస్తావే కదలడానికి?

సగం కాలిన కాష్ఠాల్లాంటి ఆశలన్నీ ఏరుకుంటూ ఉంటావు.

పొందరాని దానికై పోరాటం
అందరాని వాటికై ఆరాటం
చెందరాని చోట్లలో చెలగాటం
చెప్పలేని మాటల్లో ఇరకాటం
అవదూ జీవనమకటావికటం?

పాటల పడవలో జీవన నౌకని కుదుపుల్లేకుండా నడుపుకుపోవాలని రహస్యంగా ఆశపడతావు.

వలపుల ఊటలు ఊరే పాటలు
పాల కంకులుగ ఊగే పాటలు
మెల్లని గాలిగ వీచే పాటలు

పిట్టలు దాగిన పచ్చని తోపులు
చల్లని వీవెన వీచే మాపులు
కన్నుల కాంతుల కన్నె కలుపులు
తీరని దాహపు తియ్యని మలుపులు

తీరుస్తాయంటావా నిజ జీవన వెతలు?

పుస్తకాల మేడమీదనించి లోకాన్ని తొంగి తొంగి చూసి అర్థం చేసుకోవాలని ఆరాటపడతావు.

పుస్తకాలు మస్తకాలు
ఆలోచనల అంపకాలు
భావనల పంపకాలు
మాటల అౘ్చకాలు
మేధకు ఆరెకాలు

ఈ పగిలిన జీవన శకలాలు
ప్రతిఫలిస్తాయా సాకల్యంగా
రంగులు అలదిన జీవన చిత్రాలు?

అర్థంపర్థం లేని సందేహాలతో సతమతమౌతూ ఉంటావు.

పెరట్లో కూచున్నా
వాకిట్లో నుంచున్నా
అదే గనక నాకైతే
ఇదే గనక నాకొస్తే
అనుకుంటూ
అదిరిపోతూ
లేని పులి
మీద పడినట్టే
బెదిరిపోతూ
క్షణక్షణం
అనుక్షణం
అదే గనక నాకైతే
ఇదే గనక నాకొస్తే
అనుకుంటూ అనుకుంటూ
క్షణ క్షణం
అనుక్షణం.

పేరుకున్న సందేహం
అంతరాభవ దేహం
పురాతన అగ్గి దాహం.

అన్నింటినీ మోసుకుంటూ
అన్ని దిక్కులూ చూసుకుంటూ
ఆయాసాన్ని అణచుకుంటూ
నడు. నడు ముందుకి.
అరుణారుణ కాంతులతో
కనిపిస్తుంది అదిగో అరుణాచలం.

ఆ రాళ్ళన్నీ విసురు కొండ మీదకి.
ఆ కాష్ఠాలను.
ఆ పూరేకులని.
ఆ పుస్తకాలని.
ఆ మందపాటి సందేహాలని.

అప్పుడు అరువు అరుణాచలం ప్రతిధ్వనించేటట్టు.

నేనెవరు?
నేనెవరు?
నేనెవరు?

తిరిగి ఆ ఎర్రెర్రని కొండ నిన్నే అడుగుతుంది.
గిరగిరా తిరిగి తిరిగి.

నేనెవరు?
నేనెవరు?
నేనెవరు?

ఆ ప్రశ్ననే జపించుకుంటూ
పదే పదే తలుచుకుంటూ
అటూ ఇటూ చూడకుండ

తిరిగి రా ఇంటికి.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • తిరణాల
  • ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 2వ భాగం
  • కాళీ పదములు 3
  • వాళ్ళు రాక ముందు
  • పట్టుకో పట్టుకో

ఇటువంటివే…

  1. తెరచాటు-వులు: 5. కో హమ్ – నేనెవరు?
  2. నాకే గనక తెలిస్తే
  3. గాయం
  4. గురుతు
  5. ఒంటరి ప్రపంచం

అక్టోబర్ 2018 సంచికలో ...

  • Portrait
  • అక్టోబర్ 2018
  • అహోరాత్రం
  • ఏకవీర నవలకు, నవలానాయికకు ఆ పేరే ఎందుకు?
  • కాళీ పదములు 3
  • గడినుడి – 24
  • గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5
  • గురుతు
  • ది సర్జ్
  • నాకు నచ్చిన పద్యం: సోమన తెలుగు జాతీయాల సొబగు
  • నేనెవరు?
  • పోర్ట్‌లాండ్, మెయిన్
  • బలిసిన మేకను పట్టుకుంటాను
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 5
  • రజని పాటలు మరికొన్ని
  • విముక్తి
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 24
  • శ్లోకము
  • సమవుజ్జీ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

బేతాళ కథలు: కథన కుతూహలం – 5
బలిసిన మేకను పట్టుకుంటాను

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.