తెలుగు అనువాదకుని వాక్యాలు బాగున్న ఈ వ్యాసం తాలూకు శీర్షికని “ఆధునిక తెలుగు రామాయణాలు…” తో మొదలు పెట్టి ఉండి ఉంటే బాగుండి ఉండేది. విశ్లేషణ మొత్తం వలసవాదుల భావాలతో ప్రేరణ పొందిన వివిధ కులాల “ఆధునిక” విద్యావంతులు రాసిన రామాయణాలని గురించిన పరిశీలనా, విశ్లేషణా కాబట్టి.
తెలుగులో వచ్చిన ఆధునిక [అంటే యంత్ర నాగరికతతో అబ్బిన ఆలోచనా విధానం జీవన విధానం అన్నట్టు అనుకోవాలి మనం బ్రిటీషు వారి ప్రస్తావన వలన] నారాయణ రావు చేసిన రామాయణాంశాల పరిశీలన కూడా ఒక “ఆధునిక ” దృక్పధం తోనే సాగడం వలన కాబోలు మనకి తెలుగులో వచ్చిన ప్రాచీన రామాయణాలన్నీ లేదా ఆ అనువాదాలన్నీ కూడా వట్టి మత పూరితమూ, భక్తి మయమూ అన్న ఒకే ఒక ఆలోచనని ప్రతిపాదించడంతో ముగిసిపోవడం గమనించవచ్చు.
మనం అసలు ప్రతిని లేదా మూల ప్రతినీ పోల్చి చదివినప్పుడు కధ మనకి బోధపడే తీరు వేరుగా ఉండే వీలుంటుంది. పోతన భాగవతంలో కృష్ణుడిని వర్ణించిన తీరే ఇందుకు ఉదాహరణ. పోతన ఏ “ఆధునిక” పోకడలు లేని వాడూ, తెలియనివాడూను. [చూడండి వ్యాసం: “భాగవతంలో కృష్ణుడు,” మార్గము-మార్గణము, జయప్రభ].
వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు. మిగిలినవి ఎవరి ఊహపోహలకి అనుగుణంగా సాగినవే. అందువలన ఇలాంటి విశ్లేషణలు పాఠకులని మరింత అయోమయ పరిచేవిగా ఉంటాయే తప్ప స్పస్టత ని ఇవ్వలేవు. ఇటువంటి క్లుప్తీకరణల వల్ల ఏర్పడే ప్రశ్నలకి జవాబులుండవు. ప్రపంచం లోని అతిప్రాచీన రచనలని వేటినైనా తీసుకుని అక్కడ ఎటువంటి దృష్టితో “ఆధునిక”మైన విశ్లేషణ లు వెలువడ్డాయో కూడా మనకి తెలిసే వీలుండాలి కదా ? పాత కొత్త బైబిళ్ల లోని ఏసు పాత్రని “ఆధునిక” ఐరోపా సమాజాలు ఎలా అర్ధం చేసుకున్నాయో తెలిపే విశ్లేషణలు గనక మనకి అందుబాటులో ఉంటే అప్పుడు బ్రిటీషు పాలనా, వారి విద్యల వలన ఆయా దేశాలలో వచ్చిన మార్పులూ, అర్ధం కాగల వీలుంటుంది. ఇవి స్పష్టంగా తెలియకుండా “ఆధునికంగా” చేసే ఇటువంటీ విశ్లేషణల వలన ఏ స్పష్టతా రాదు. అనేక బైబిల్స్ విశ్లేషణలో ఏమేం విషయాలని వారు ఏ పధ్ధతిలో “ఆధునికంగా” చర్చించారో మనకి అర్ధమైతే ఏయే విషయాలని మనం ఇవి “ఆధునిక” మనీ ఇవి మతపరమనీ ఇవి సాహిత్యమనీ అనుకునేదీ స్పష్టపడగలదు. బ్రిటీషు లో జరిగిన మార్పులకి అనుగుణంగా వచ్చిన భావాల విశ్లేషణలో ముందు మూలంలో జరిగిన వింతలని గురించి కూడా ఈ వ్యాసంలో చర్చించి ఉండి ఉండవలసింది. అప్పుడు ఈ వ్యాసపు శీర్షికకి ఒక న్యాయం జరిగేది. అది లేకపోతే మరి అది పాక్షికమైన విశ్లేషణ గానే మిగులుతుంది.
పదాల గారడితో నవ్వించే ప్రయత్నం బాగుంది. నొప్పించడం నచ్చలేదు.
హైదరాబాద్ లో “గలీ గలీ” కాదు, “గల్లీ గల్లీ” అంటారు.
“కోడలు
నెమలి కంఠం రంగు
చీర కట్టుకుందేమో
పురి విప్పినట్టుంది గొంతు” అన్నారు. అదే చీర కూతురు కట్టుకుంటే? నెమలి అందంతో కోకిల పాడినట్టుంటుందేమో! ఎందుకు?
ఎందుకంటే, “అన్నంలో తెల్ల వెంట్రుక తీయటం కష్టమైంది.” అన్న కూతురును ఒక్క మాట సైతం అనని, కాదు, అననివ్వని మమకారం.
“భూమి ఆకార మెట్లుండును?” కు ఇప్పటి జవాబు
“భూమి మీది చాలా జనులవలె మధ్యలో లావుగుండును”
======
విధేయుడు
శ్రీనివాస్
కవిత బాగుంది! కాకపొతే కాస్త భారంగా గంభీరంగా ఉంది.
ఆఖరి మజిలి అందరికి చావే కాబట్టి, తప్పని మరణాన్ని తలుచుకుంటూ కుచించుకు పోవడం కన్నా,
ఉన్నన్ని రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బతకడమే ఉత్తమం.
తః తః గారి కవిత తహ తహ లాడుతూ చదివాను.
కొంత కవిత్వం, మరికొంత పైత్యం , కాస్త సామాజిక స్ప్రుహ కనిపించింది ఈ కవిత గాని కవితలో!
“గలీ గలీ గలీజుకు లీజు కిచ్చేశారు” – బాగుంది!
పాస్‌పోర్ట్ గురించి Sowmya అభిప్రాయం:
08/06/2012 8:13 am
ఏవిటో, ఈ కథ ద్వారా ఏదన్నా చెప్పాలన్న ఉద్దేశ్యం ఉండి ఉంటే, నాకు అది అర్థం కాలేదు.
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
08/05/2012 1:49 pm
తెలుగు అనువాదకుని వాక్యాలు బాగున్న ఈ వ్యాసం తాలూకు శీర్షికని “ఆధునిక తెలుగు రామాయణాలు…” తో మొదలు పెట్టి ఉండి ఉంటే బాగుండి ఉండేది. విశ్లేషణ మొత్తం వలసవాదుల భావాలతో ప్రేరణ పొందిన వివిధ కులాల “ఆధునిక” విద్యావంతులు రాసిన రామాయణాలని గురించిన పరిశీలనా, విశ్లేషణా కాబట్టి.
తెలుగులో వచ్చిన ఆధునిక [అంటే యంత్ర నాగరికతతో అబ్బిన ఆలోచనా విధానం జీవన విధానం అన్నట్టు అనుకోవాలి మనం బ్రిటీషు వారి ప్రస్తావన వలన] నారాయణ రావు చేసిన రామాయణాంశాల పరిశీలన కూడా ఒక “ఆధునిక ” దృక్పధం తోనే సాగడం వలన కాబోలు మనకి తెలుగులో వచ్చిన ప్రాచీన రామాయణాలన్నీ లేదా ఆ అనువాదాలన్నీ కూడా వట్టి మత పూరితమూ, భక్తి మయమూ అన్న ఒకే ఒక ఆలోచనని ప్రతిపాదించడంతో ముగిసిపోవడం గమనించవచ్చు.
మనం అసలు ప్రతిని లేదా మూల ప్రతినీ పోల్చి చదివినప్పుడు కధ మనకి బోధపడే తీరు వేరుగా ఉండే వీలుంటుంది. పోతన భాగవతంలో కృష్ణుడిని వర్ణించిన తీరే ఇందుకు ఉదాహరణ. పోతన ఏ “ఆధునిక” పోకడలు లేని వాడూ, తెలియనివాడూను. [చూడండి వ్యాసం: “భాగవతంలో కృష్ణుడు,” మార్గము-మార్గణము, జయప్రభ].
వాల్మీకమూ అవాల్మీకమూ అయిన రచనలని పోల్చి చూసి వచ్చిన మార్పులని సవివరంగా తెలిపే పరిశీలన మనకి రాలేదు. మిగిలినవి ఎవరి ఊహపోహలకి అనుగుణంగా సాగినవే. అందువలన ఇలాంటి విశ్లేషణలు పాఠకులని మరింత అయోమయ పరిచేవిగా ఉంటాయే తప్ప స్పస్టత ని ఇవ్వలేవు. ఇటువంటి క్లుప్తీకరణల వల్ల ఏర్పడే ప్రశ్నలకి జవాబులుండవు. ప్రపంచం లోని అతిప్రాచీన రచనలని వేటినైనా తీసుకుని అక్కడ ఎటువంటి దృష్టితో “ఆధునిక”మైన విశ్లేషణ లు వెలువడ్డాయో కూడా మనకి తెలిసే వీలుండాలి కదా ? పాత కొత్త బైబిళ్ల లోని ఏసు పాత్రని “ఆధునిక” ఐరోపా సమాజాలు ఎలా అర్ధం చేసుకున్నాయో తెలిపే విశ్లేషణలు గనక మనకి అందుబాటులో ఉంటే అప్పుడు బ్రిటీషు పాలనా, వారి విద్యల వలన ఆయా దేశాలలో వచ్చిన మార్పులూ, అర్ధం కాగల వీలుంటుంది. ఇవి స్పష్టంగా తెలియకుండా “ఆధునికంగా” చేసే ఇటువంటీ విశ్లేషణల వలన ఏ స్పష్టతా రాదు. అనేక బైబిల్స్ విశ్లేషణలో ఏమేం విషయాలని వారు ఏ పధ్ధతిలో “ఆధునికంగా” చర్చించారో మనకి అర్ధమైతే ఏయే విషయాలని మనం ఇవి “ఆధునిక” మనీ ఇవి మతపరమనీ ఇవి సాహిత్యమనీ అనుకునేదీ స్పష్టపడగలదు. బ్రిటీషు లో జరిగిన మార్పులకి అనుగుణంగా వచ్చిన భావాల విశ్లేషణలో ముందు మూలంలో జరిగిన వింతలని గురించి కూడా ఈ వ్యాసంలో చర్చించి ఉండి ఉండవలసింది. అప్పుడు ఈ వ్యాసపు శీర్షికకి ఒక న్యాయం జరిగేది. అది లేకపోతే మరి అది పాక్షికమైన విశ్లేషణ గానే మిగులుతుంది.
రమ.
అంతరం గురించి Venkat Chitta అభిప్రాయం:
08/05/2012 11:47 am
The finishing is great!!
చందవరం, ప్రకాశం జిల్లా గురించి అనంత్ మల్లవరపు అభిప్రాయం:
08/03/2012 1:02 pm
బహు బాగుంది చందవరపు కవిత. మా చిన్ననాట తాత గారి ఊరిలో నులక మంచాలు గుర్తుకు తెచ్చారు!
“బజనలు చేయుట మా బారం
మా బాదలు తీర్చుట మీ బారం”
“భజనలు చేయుట మా భారం
మా బాదలు తీర్చుట మీ భారం”
వత్తులు తీసి కాస్త భారం తగ్గించారు.
వేసవి గురించి అనంత్ మల్లవరపు అభిప్రాయం:
08/03/2012 12:22 pm
మీ గోళీ సోడాతో , కూజాతో మా చిన్న నాటి వేసవిని గుర్తు చేసి మనస్సుని చివుక్కుమనిపించారు!
ఇటు నేనే – అటు నేనే గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
08/03/2012 12:20 pm
పదాల గారడితో నవ్వించే ప్రయత్నం బాగుంది. నొప్పించడం నచ్చలేదు.
హైదరాబాద్ లో “గలీ గలీ” కాదు, “గల్లీ గల్లీ” అంటారు.
“కోడలు
నెమలి కంఠం రంగు
చీర కట్టుకుందేమో
పురి విప్పినట్టుంది గొంతు” అన్నారు. అదే చీర కూతురు కట్టుకుంటే? నెమలి అందంతో కోకిల పాడినట్టుంటుందేమో! ఎందుకు?
ఎందుకంటే, “అన్నంలో తెల్ల వెంట్రుక తీయటం కష్టమైంది.” అన్న కూతురును ఒక్క మాట సైతం అనని, కాదు, అననివ్వని మమకారం.
“భూమి ఆకార మెట్లుండును?” కు ఇప్పటి జవాబు
“భూమి మీది చాలా జనులవలె మధ్యలో లావుగుండును”
======
విధేయుడు
శ్రీనివాస్
ఆఖరి మనిషి గురించి ananth mallavarapu అభిప్రాయం:
08/03/2012 12:11 pm
కవిత బాగుంది! కాకపొతే కాస్త భారంగా గంభీరంగా ఉంది.
ఆఖరి మజిలి అందరికి చావే కాబట్టి, తప్పని మరణాన్ని తలుచుకుంటూ కుచించుకు పోవడం కన్నా,
ఉన్నన్ని రోజులూ ఉత్సాహంగా, ఉల్లాసంగా బతకడమే ఉత్తమం.
ఇటు నేనే – అటు నేనే గురించి ananth mallavarapu అభిప్రాయం:
08/03/2012 11:53 am
తః తః గారి కవిత తహ తహ లాడుతూ చదివాను.
కొంత కవిత్వం, మరికొంత పైత్యం , కాస్త సామాజిక స్ప్రుహ కనిపించింది ఈ కవిత గాని కవితలో!
“గలీ గలీ గలీజుకు లీజు కిచ్చేశారు” – బాగుంది!
శివోహం! శివోహం! గురించి Chudamani అభిప్రాయం:
08/03/2012 4:33 am
శ్రీనివాస్ గారు,
నా చిన్నతనంలో ఆకాశవాణి భక్తిరంజనిలో “ఏది ఏది నీ దయా వీక్షణం” అనే గీతం విన్నాను. పాడినవారి వివరాలు తెలియదు. ఆ పాటను అందించగలరా?
మరొక విన్నపం. ధనుర్మాసంలో పాడే ఆండాళ్ హారతులు ఇంకా మిగిలిన పాటలు ఆకాశవాణిలో వచ్చేవి. ఆవి కూడా అందచేస్తే సదా కృతజ్ఞులమవుతాం.
ధన్యవాదాలు.
చూడామణి
తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి pavan santhosh surampudi అభిప్రాయం:
08/02/2012 2:54 pm
రామాయణం అనే కథలో ఎంత ప్రత్యేకత ఉందో కదా. ఇన్ని సాంఘిక స్థితిగతుల్ని, ఉద్యమాలని, ప్రసారమాధ్యమాలని అది ఎంతో ప్రభావితం చేసి ఒక ఊపుఊపుతూనే ఉంది.