పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. విలువలు: కథ నచ్చిన కారణం గురించి తః తః అభిప్రాయం:

    09/18/2012 11:35 am

    ఆంధ్ర విశ్వకళా పరిషత్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ గా పనిచేశారు బసవ రాజు గారు. ఆయన సమవయస్కులైన సహాధ్యాయులైన ఇతర ఉపాధ్యాయులతో వాళ్ళ విద్యార్థి రొజుల్ని “మనం చదువుకోని రోజుల్లొ” అని గుర్తు చేసేవారు.

    తఃతః

  2. విలువలు: కథ నచ్చిన కారణం గురించి swaroopa అభిప్రాయం:

    09/18/2012 6:37 am

    తెలుగుతల్లిని బ్రతికించినందుకు వందనాలు. చాలా బాగున్నాయి.

  3. కిటికీ గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/17/2012 2:50 am

    నేను గుర్తించాను ప్రసాద్ గారూ! నేను మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. నేను చెప్పింది మామూలుగా అనువాదం చెసేటప్పుడు ఎదురయ్యే వివిధరకాల సమస్యలని గురించి మాత్రమే!! అనువాదాల్లో అయినా సరే అనువాదపు భాష తెలుగు కాబట్టి, వాక్యం తప్పకుండా తెలుగు వాక్య నిర్మాణం లోకి వొదగాల్సిందే!!

    అందులో విభేదించవలసిన విషయం ఎవరికైనా ఏముంటుందీ?? మీరు దిద్దిన వాక్యం బాగుంది. శారద గారు సైతం ఒప్పుకున్నారు కదా మీ దిద్దుబాటుని. ఇంక అనువాదాల్ని గురించి మీకున్న అభిప్రాయాలని తప్పక చెప్పండి. కొత్త సూచనలు ఎప్పుడైనా ఎవరికైనా ఉపయుక్తమైనవే అవుతాయి కదా!

    రమ.

  4. ఒక సరళ నిర్వచనం గురించి narayana అభిప్రాయం:

    09/16/2012 7:10 pm

    ‘ఒక సరళ నిర్వచనం’ వెంకటేశ్వర రావు గారు.
    ‘ నారాయణ ‘ అనే నా చివరి పేరుని సరళంగా వ్రాయండి చాలు.

  5. పురూరవ: శ్రవ్య నాటిక గురించి A R K NEOGI అభిప్రాయం:

    09/15/2012 2:59 pm

    పురూరవ శబ్ద నాటకం రేడీయోలో ఏ సంవత్సరమో గుర్తు లేదు కాని ఇటీవల నా కజిన్ ఇచ్చిన cd ద్వారా viన్నాను. శ్రీమతి శారాద శ్రీనివాసన్, ఛిరంజీవి గార్ల నాటకంలో సంభాషణలు నన్ను ఏదొ వూహలొకాల లోకి తీసుకు వెళ్ళింది.

    a r k neogi
    secunderabad

  6. కిటికీ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/15/2012 2:09 pm

    రమ గారూ,
    మీరు, “ప్రసాద్ గారు అనువాదం లో సూచించిన వాక్యం బాగుంది. అయితే సాధారణం గా అనువాద ప్రక్రియ లో ఎప్పుడూ ఒక్కో వాక్యాన్ని రెండు మూడు రకాలుగా రాసే వీలుంటుంది. అక్కడ అనువాదం చెసే వాళ్లకి వాక్య రచనలో స్వేచ్చ ఎంత ఉంటుందో ఇబ్బందీ అంతే ఉంటుంది . ఒక సారి తెలుగు వాక్యం సహజం గా ఉబికి రాగా ఒక్కోసారి అసలు కధలోని వాక్యపు ప్రభావం బుధ్ధి మీద జిడ్డు లాగా పట్టుకుని వదలదు 🙂 అలాంటప్పుడు బయటివాళ్ళు చేసే సూచన ఎక్కువ ఉపకరిస్తుంది. ఇది అనువాద ప్రక్రియలో చాలాసార్లు అనువాదకులని తిప్పలు పెట్టె అంశం! మహా చేయి తిరిగిన అనువాదకులకైనా కూడా ఈ ఇబ్బంది తప్పనిదే !! ” అని అన్నారు.

    అనువాదంలోని అసలు వాక్యం తెలుగు భాష ప్రకారం తప్పు వాక్యం. అందుకనే దాన్ని కరెక్టు చేశాను. అది మీరు గుర్తించారో, లేదో అని అనుమానం. ఒక వేళ, మీరు నాతో ఏకీభవించక పోతే, చర్చించడానికి ఏమీ లేదు. ఒకవేళ ఏకీభవిస్తే, దాని గురించి మాట్టాడుకోవచ్చు ఇంకొంచెం.

    ప్రసాద్

  7. ఒక సరళ నిర్వచనం గురించి Dadala Venkateswara Rao అభిప్రాయం:

    09/15/2012 10:10 am

    ఇది నాగరికతకు సరళ నిర్వచనమా? దాక్టర్ గరిమెళ్ళ నారాయన గారూ !

  8. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి narayana అభిప్రాయం:

    09/14/2012 9:51 pm

    సైన్స్ కు సంబంధించి డాక్టర్ రోహిణి ప్రసాద్ గారు వ్రాసిన వ్యాసాలు చదివాక, ఆయన మీద ఎనలేని గౌరవం ఏర్పడి పోయింది. ఆ వ్యాసాలన్నీ ఒక మితృడో, శ్రేయోభిలాషో ఎంతో ఓపికతో చెబుతున్నట్టు ఉంటాయి. ఎప్పటినుండో ఆయనలో నిక్షిప్తమైన ఆలోచనల నుండి అవలా Spontaneous గా జాలువారిపోతుంటాయి. వాటి అమరికని బట్టే ఆ సంగతి చెప్పవచ్చును.

    మానవాళికి అర్ధవంతమైన తెలివితో కూడుకున్న జ్ఞానం ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎప్పుడూ పరిపూర్ణ నిస్వార్దపరులై ఉంటారు. ఆయన లేని లోటు తీరేది కాదు. చాలా కాలం తరువాత ఒక మనిషి పోవటం గురించి ఈ రకంగా బాధ పడ్డాను.

    నారాయణ గరిమెళ్ళ.

  9. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి srinivasaraov,khammam అభిప్రాయం:

    09/14/2012 12:37 pm

    చాలా బాథ గా వుంది.

  10. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి డా. మూర్తి రేమిళ్ళ అభిప్రాయం:

    09/14/2012 6:04 am

    నమస్తే .
    మీరు ఇచ్నిన DLI వారి “రాధికా సాంత్వనము” లింక్ పనిచెయ్యడము లేదు.
    ఇది చూడండి.