పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    09/11/2012 12:48 pm

    హృదయ ప్రధానమైన సంగీతం గురించైనా, మేధ ప్రధానమైన సైన్సు గురించైనా ఒకటి ఎక్కువ ఇంకొకటి తక్కువ అని కాకుండా, రెంటినీ, తెలుగులో, సరళంగా, సాధారణ పాఠకులకి అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా వ్రాసే అతి తక్కువ మంది రచయితల్లో ఒకరైన శ్రీ రొహిణీ ప్రసాద్ గారు ఇక లేరన్న వార్త చాలా విచారకరం. చదివింపజేసే విషయాలతో, ఆలోచింపజేసే అంశాలతో తెలుగు పాఠకలోకాన్ని పరిపుష్టం చేసే కలం ఆగిపోవడం పెద్ద లొటు. వారి రచనలు అభిప్రాయాలు చదివే చోట ఈ వార్తను చదవడం, ఈ మాటలు “ఈ మాట” లో వ్రాయడం కష్టంగా ఉంది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం.
    ==========
    విధేయుడు
    _శ్రీనివాస్

  2. ఎండ గురించి papa rao pendikatla అభిప్రాయం:

    09/11/2012 8:45 am

    కొండల్లో పడివున్న బాలుణ్ణి!

    ఇక్కడ బాలుడెవ్వరు?

    ఏటవాలు కిరణాలు అస్తమించే సూర్యుడికి గుర్తు

    అర్థం కాలేదు

  3. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి తః తః అభిప్రాయం:

    09/11/2012 2:24 am

    రొహిణీ ప్రసాద్ గురించి మొన్ననే అనుకున్నాను ఆయన రచనలూ అభిప్రాయలూ కనిపించడం లెదేమని. ఆయన లేరన్నది పెద్ద వెలితి. ఇంత చిన్నతనం లో యెందుకు వెళ్ళిపొయారాయన ఆయన ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లొ విద్యార్ధిగా హాస్టల్ గది లొ సితారు వాదన గుర్తొస్తొంది. అవును “ఈమాటకు ఆయన లేని లోటు ఇంకెవరూ, ఇంకెప్పటికీ పూడ్చలేనిది.”
    తః తః

  4. కిటికీ గురించి gayathri అభిప్రాయం:

    09/11/2012 1:36 am

    కథ బాగుంది,మీ అనువాదం బాగుంది, ఐతే నాకు కథ చివరిలో అర్థం కాలేదు. comments చూసాక అర్థమయ్యింది. చివరిలో ఇంకొద్దిగా రాసింటే బాగుండు అని అనిపించింది నాకు. 🙂

  5. కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    09/10/2012 6:37 pm

    పోయిన ఏడే రోహిణీ ప్రసాద్ గారు న్యూయార్క్ కి వచ్చినప్పుడు కలవడం జరిగింది. ఆరోగ్యం గా ఉషారుగా ఉన్నేరు. ఇక్కడ హిందుస్తాన్నీ సంగీతం, సినిమా సంగీతం గురించి ఒక చిన్న సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఒక కీ బోర్డు ముందర పెట్టుకుని పాడుతూ, మాట్లాడుతూ, విపులీకరిస్తూ దాదాపు మూడు గంటల సేపు శ్రోతలని అలరించారు. మళ్ళా ఇండియా కి తిరిగిపోయేప్పుడు వస్తానన్నారు, కానీ రాలేకపోయేరు. ఇప్పుడిక ఎప్పటికీ రారు.

    ఒక గొప్ప వ్యక్తికి కొడుకుగా వుండటం లో ఒక పెద్ద సమస్య వుంది. నాన నీడలోనుంచి బయటకు రావడం చాలా కష్టం. అది కూడా కుటుంబరావంత గొప్ప మనిషి నీడ నుంచి బయటపడి, తనకు తనుగా తన పేరు నిలబెట్టుకోవటం ఒక గొప్ప విషయం. సైంటిస్టుగా, సితార విధ్వాంసుడిగా, ఒక హేతువాదిగా, రచయితగా, సంగీతాన్ని, సైన్సు ని పామర లోకానికి పరిచయం చేసిన ఒక గొప్ప మనీషి శ్రీ రోహిణీ ప్రసాద్ గారు.
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  6. కిటికీ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    09/10/2012 5:19 pm

    కిటికీ లోంచీ వెళ్ళడం, కిటికీ లోంచీ రావడం – అర్థం కాలేదు. అదేం పెద్ద విషయం కాదు లెండి. హాస్యం బాగానే వుంది.
    ఇక అనువాదం – “ఆవిడ భర్త తెల్లని కోటులో, ఆవిడ చిన్న తమ్ముడు రోనీ పెద్దగా పాటలు పాడి ఆవిడని విసిగిస్తూ, వాళ్ళ వెంట ఆ రోజు వెళ్లిన చిన్న కుక్క, అన్నీ ఆవిడకి బాగా జ్ఞాపకం.” – ఈ వాక్యం, “తెల్లని కోటులో ఆవిడ భర్తా, పెద్దగా పాటలు పాడి విసిగించే ఆవిడ చిన్న తమ్ముడు రోనీ, వాళ్ళ వెంట ఆ రోజు వెళ్ళిన చిన్న కుక్కా, అన్నీ ఆవిడకి బాగా జ్ఞాపకం.” అని వుంటే, ఇంకా సులభంగా అర్థం అయ్యేది.

    నాకైతే, “చెప్పింది వేరా జాలిగా.”, బదులు, “చెప్పింది వేరా అల్లరిగా.” అనో, “చెప్పింది వేరా నవ్వుతూ.” అనో వుంటే, ఇంకా బాగుండేదనిపించింది.

    ప్రసాద్

  7. కిటికీ గురించి Vanaja Tatineni అభిప్రాయం:

    09/10/2012 12:23 pm

    శారద గారు,

    మంచి కథ చదివించారు. బావుంది..

  8. కిటికీ గురించి sarma అభిప్రాయం:

    09/10/2012 6:17 am

    మంచి కధ చదివించారు

  9. ప్రేమ కవితలు గురించి pournami అభిప్రాయం:

    09/10/2012 3:24 am

    మీ కవితలు చాలా బాగున్నాయి. మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది.

  10. బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు గురించి Ramanath అభిప్రాయం:

    09/09/2012 10:48 pm

    రోహిణీ ప్రసాద్ గారి మరణం భరించడానికి ఎంత వేదాంతవూ పనికిరావడం లేదు. పనికొచ్చే వేదాంతం అని ఆయన నాతో మా ఇంటికి వొచ్చినప్పుడు ఓ చిన్న సరదా చర్చ చేసేరు. ఆలోచన, మాట, ఆచరణ.. ఒక్కటిగా కుదుర్చుకున్న మనిషి. ఇలాటివాళ్ళు చాలా అరుదు. ఇంకా.. ఎన్నో గుర్తులు, అనుభవాలు.. ఇవన్నీ బాధ కలగకుండా నెమరేసుకోడానికి సమయం పడుతుంది. అంతవరకు తప్పదు ఎవరికైనాను.

    – రమానాథ్