ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు చక్కని పద్యాన్ని, చక్కని వివరణతో అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
“లతాంగి” అని సంబోధిస్తూ మేలుకొలుపడానికి ఉత్పలమాల ఛందాన్ని ఎన్నుకోవడం కూడా ఔచిత్యంగా ఉంది. కోడి కూతలో హెచ్చరికున్నది అని అంటూ, పొద్దున పొద్దున్నే వట్టి హెచ్చరికతో కాకుండా, మేలుకొని మధుపూర్ణపాత్రని అందుకోమని ముగించడం, కరుణశ్రీ గారు అదనంగా కూర్చిన, కాదు, కూర్చాలని చూపిన, సొగసు లాలిత్యం అని అనిపిస్తుంది.
ఎవరో ఒక కుర్రవాన్ని ఒక్కరోజులో ఇన్ని తప్పులు ఎట్లా చేసావు అని కోప్పడితే, ఏమీ లేదు నేను చాలా పొద్దున్నే నిద్రలేస్తాను అని అన్నాడట! మేలుకోవడం ఒక్కటే కాదు, మేలుకొని మధుపూర్ణపాత్రను అందుకోవడం అని చెప్పడం నిండుగా ఉంది.
ఈ పద్యం చదివితే- ఆయుష్షు తగ్గిపోతుంది, యౌవనం తరిగిపోతుంది, గడిచిన రోజులు తిరిగి రావు, కాలం అన్నింటినీ మింగేస్తుంది, అని ఇది మరవడం అనే అపరాధాన్ని మన్నించి శివున్ని రక్షించమని పలికిన ఆది శంకరుల “శివాపరాధక్షమాపణ స్తోత్రం” లోని ఈ శ్లోకాన్ని గుర్తుకుతెచ్చింది.
————————–
“ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాత్త్వాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా”
————————–
కాలాన్ని ఎంతో సద్వినియోగపరుస్తే కూడా సాధ్యమా అనిపించే కార్యాలెన్నో చేసిన శంకరులే దీన్ని చెప్పడం విశేషం.
=========
విధేయుడు
_శ్రీనివాస్
‘ఈమాట’మే, 2014 వెబ్ మ్యాగజైన్లో సుజాత గారు ‘అంపశయ్య మరోసారి, కొత్తగా’ పేరుతో రాసిన వ్యాసాన్ని నేను చాలా ఆలస్యంగా, ఒక వారం రోజుల క్రితమే సి.హెచ్.వేణు అనే సాహితీ మిత్రుడు నా ఐపాడ్ కు, నా ఇమెయిల్ ఐడికి పంపించటం వల్ల చూడగల్గాను. ఆ నవల వెలువడిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఆ నవలను గూర్చి ఇలాంటి లోతైన విశ్లేషణాత్మక విమర్శా వ్యాసాలు రచింపబడ్తున్నందుకు ఆ నవలా రచయితగా చాలా సంతోషిస్తున్నాను.
అయితే సుజాత గారు ఆ వ్యాసాన్ని ముగిస్తూ ఆ నవల మీద చేసిన రెండు వ్యాఖ్యానాలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి.
అందులో ఒకటి: నవల ముగింపు నాటకీయంగా, బలవంతంగా జరిగింది; నవల మొత్తం వాతావరణంలో ఈ ముగింపు ఇమిడలేదని-
రెండవది: రమేష్ రత్తిని గురించి వివరంగా చెప్పడంలో కూడా ఈ బలవంతమే కనిపిస్తుంది.
1969లో అంపశయ్య వెలువడినప్పట్నించి ఈ నవలను గురించి చాలామంది చాలా విషయాల్ని చెప్పారు. కానీ సుజాత గారు చూపించిన ఈ రెండు అంశాల్ని ఎవరూ ప్రస్తావించలేదు.
నవలలో రవి అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యాడన్న విషయాన్ని సుజాత గారు కరెక్ట్ గానే చెప్పారు. అతడు ఒంటరిగా ఉన్నంతకాలం బలహీనుడే- సుజాత మాటల్లో దుర్బలుడుగానే కనిపిస్తాడు. అలాంటివాడు ఒక సమూహంలో ఉన్నప్పుడు ఎలా బలవంతుడుగా మారాడో చెప్పడానికే నవలను అలా ముగించాను. నవలలోని ఈ ముగింపు నాటకీయంగా కనిపిస్తుందన్నారు సుజాత గారు. ప్రతీ నవలలో అనేకచోట్ల ఎంతో కొంత నాటకీయత ఉంటుందని సుజాత గారికి తెలియని విషయం కాదనుకుంటా! ‘వైయక్తికమైన ప్రయాణం ఉన్నట్టుండి సామాజికం అవుతుంది’ అన్నారు సుజాత గారు. ఏ వైయక్తిక ప్రయాణమైనా సామాజికం కాక తప్పదు. పూర్వం ఎప్పుడో అరిస్టాటిల్ ‘Man is a social animal’ అన్నాడు. దీనికి సుజాత గారు నాటకీయమని అభ్యంతరపెట్టటం ఆశ్చర్యమే. నవలలో ఈ ముగింపు చాలా Spontaneous గా ఉత్పన్నమైనదేనని అనేకమంది పాఠకులు భావించారు.
ఇక రత్తిని గురించి రవి రమేష్ కు వివరంగా చెప్పడాన్ని సుజాత గారు బలవంతంగా జరిగిందని వ్యాఖ్యానించటం ఇంకా ఆశ్చర్యపరిచింది. నవల ప్రారంభం నుండి రత్తి ప్రసక్తి వస్తూనే ఉంది. నవల ముగిసేలోగా రత్తి ఉదంతాన్ని ఎక్కడో అక్కడ వివరంగా రచయిత చెప్పబోతున్నాడనే పాఠకులు అనుకుంటారు. రత్తిని గూర్చి రవి అనుక్షణం ఒక అపరాధ భావనకు లోనవుతున్నాడు. ఆ విషయాన్ని రమేష్ లాంటి అతని మిత్రునితో చెప్పుకుంటే తప్ప అతని హృదయంలో స్థిరపడిన ఆ అపరాధ భావన తొలగిపోయి అతని హృదయం తేలికపడదు. తన హృదయభారాన్ని తొలగించుకోవటం కోసమే రవి రమేష్ తో రత్తిని గురించి అంత వివరంగా చెప్పాడు. దీంట్లో ‘బలవంతం’ యేమీ లేదు.
ఆ తెలిసీ తెలియని వయస్సులో రవి రత్తిని ప్రేమించానన్న భ్రమకు లోనయ్యాడే గానీ ఆమెను నిజంగా ప్రేమించలేదని పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది. నిజంగా ప్రేమిస్తే ఆమెను తన స్వంతం చేసుకోవడానికి రవి ఎంతకైనా తెగించేవాడు. కానీ రత్తి పట్ల అతనికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆమెకు జరిగిన అన్యాయంలో తను కూడా భాగస్వామి అయ్యానేమోనన్న ఫీలింగ్ కారణంగా అతనిలో తీవ్రమైన అపరాధ భావం చోటుచేసుకుంది. రమేష్ కు ఈ ఉదంతాన్ని వివరంగా చెప్పుకోవడంతో ఆ అపరాధ భావన తొలగిపోయింది.
సుజాత గారూ ! నవలలో పాత్రలు తప్ప రచయిత కనిపించకూడదన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ముగింపులోనూ, రత్తిని గూర్చి రవి రమేష్ కు వివరంగా చెప్పిన ఘట్టంలోనూ రచయితే కనిపించాడని మీరంటున్నారు. కాని ఈ రెండు సందర్భాల్లోనూ రవే కనిపిస్తాడు తప్ప రచయిత కనిపించలేదే! ఒకవేళ మీరు రవే రచయిత అనుకుంటున్నారేమో దయచేసి ఆలోచించండి.
యేదేమైనా , మీరు ‘అంపశయ్య ’ మీద ఇంత లోతైన విశ్లేషణ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
తెలుగు మాటలు కరువైతున్న రోజులు
తెలుగంటెనె వదంటుపరుగులుపెడుతున్న రోజులు
పుస్తకాలు విప్పి చదవలేకపోతోన్నా రోజులు
వాట్సప్, ఫెస్ బుక్,స్క్యప్ అంటూ పరుగులు పెడుతున్న రోజులు
ఇలాంటి రోజులలో ఇంత అందమైన కవిత్వపరిభాషలో ‘పిరదౌసి’ ప్రాతిపదికంగా ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని మీదైన కొత్తచూపుతో రూపుకట్టిన మీకు “మానసా”రా అభినందనలు!
శ్రీ మేగావత్ జాన్య
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఇంద్రకల్
నాగర్ కర్నూల్,మహబూబ్ నగర్ జిల్లా
ఓ చల్లని సాయంత్రం ఓ చక్కని సాహిత్య ప్రసంగం విన్న అనుభూతినిచ్చిన వ్యాసాన్ని అందించినందుకు మానసగార్కి అభినందనలు. వింటున్నంత (చదువుతున్నంత) సేపూ పోతనామాత్యులవారి ‘ఇమ్మనుజేశ్వరాధముల…’పద్యం జ్ఞప్తికి రావడం అసహజం కాదు కదా!
భాషా సంస్కృతులు ఇలా ఏడుస్తున్నాయని తెలిసిన వాళ్లు ఏడవడమే తప్ప ఎవరూ అమాంతం ఏమీ చేయలేని స్థితి. ఇలాంటి ఎన్నో రచనలు రాగా రాగా సినిమాల వాళ్లూ మీడియా వాళ్లూ కూడా పుణ్యం కట్టుకుంటే కొంత ‘సహజత్వం’ బతుకుల్లోకి వచ్చే అవకాశం వుందని ఆశిస్తూ, చక్కగా రాస్తున్న అమ్మ గార్కి అభినందనలు తెలియచేస్తున్నాను.
వ్యాసం బాగుంది. రవిగారు చెప్పినట్లు చదువుతుంటే చాలా బాధగా అనిపించింది. తెలుగు రాదు అని చెప్పుకోవటం ఒక గొప్ప అనుకుంటే, వంట రాదు అని చెప్పుకోవటం డబ్బు చాలా ఎక్కువైపోయినప్పుడు పలికే పలుకులు. ఐతే, బహుశా అందరూ ఇలా లేరేమో అనుకుంటున్నా. మా అక్కల, అన్నల పిల్లలు చాలామంది అమెరికాలో ఉన్నారు. మరీ ఇలా ఐతే లేరు.
ఏది ఏమైనా, తెలుగును, తెలుగు సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి.
చిత్ర గీతములలో ఛందస్సు గురించి రవి అభిప్రాయం:
02/17/2015 12:29 am
చాలా అందమైన వ్యాసం. పాడుకునే ప్రతీ పాటలోని మాత్రాగణాల అమరికనూ పరిశీలించాలనిపించే ఉత్సుకత కలుగుతూంది, ఈ వ్యాసం చదివితే. ధన్యవాదాలు.
నాకు నచ్చిన పద్యం: ఒక వెచ్చని హెచ్చరిక గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
02/15/2015 3:03 am
ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు చక్కని పద్యాన్ని, చక్కని వివరణతో అందించినందుకు చాలా కృతజ్ఞతలు.
“లతాంగి” అని సంబోధిస్తూ మేలుకొలుపడానికి ఉత్పలమాల ఛందాన్ని ఎన్నుకోవడం కూడా ఔచిత్యంగా ఉంది. కోడి కూతలో హెచ్చరికున్నది అని అంటూ, పొద్దున పొద్దున్నే వట్టి హెచ్చరికతో కాకుండా, మేలుకొని మధుపూర్ణపాత్రని అందుకోమని ముగించడం, కరుణశ్రీ గారు అదనంగా కూర్చిన, కాదు, కూర్చాలని చూపిన, సొగసు లాలిత్యం అని అనిపిస్తుంది.
ఎవరో ఒక కుర్రవాన్ని ఒక్కరోజులో ఇన్ని తప్పులు ఎట్లా చేసావు అని కోప్పడితే, ఏమీ లేదు నేను చాలా పొద్దున్నే నిద్రలేస్తాను అని అన్నాడట! మేలుకోవడం ఒక్కటే కాదు, మేలుకొని మధుపూర్ణపాత్రను అందుకోవడం అని చెప్పడం నిండుగా ఉంది.
ఈ పద్యం చదివితే- ఆయుష్షు తగ్గిపోతుంది, యౌవనం తరిగిపోతుంది, గడిచిన రోజులు తిరిగి రావు, కాలం అన్నింటినీ మింగేస్తుంది, అని ఇది మరవడం అనే అపరాధాన్ని మన్నించి శివున్ని రక్షించమని పలికిన ఆది శంకరుల “శివాపరాధక్షమాపణ స్తోత్రం” లోని ఈ శ్లోకాన్ని గుర్తుకుతెచ్చింది.
————————–
“ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యౌవనం
ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః
లక్ష్మీస్తోయతరంగభంగచపలా విద్యుచ్చలం జీవితం
తస్మాత్త్వాం శరణాగతం శరణద త్వం రక్ష రక్షాధునా”
————————–
కాలాన్ని ఎంతో సద్వినియోగపరుస్తే కూడా సాధ్యమా అనిపించే కార్యాలెన్నో చేసిన శంకరులే దీన్ని చెప్పడం విశేషం.
=========
విధేయుడు
_శ్రీనివాస్
బిల్హణీయము గురించి kvnarasimha rao అభిప్రాయం:
02/15/2015 2:30 am
చాలా బాగుంది. మొదటిసారి చది వేను. అద్భుతంగా తోచింది.
అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి అంపశయ్య నవీన్ అభిప్రాయం:
02/14/2015 5:57 am
‘ఈమాట’మే, 2014 వెబ్ మ్యాగజైన్లో సుజాత గారు ‘అంపశయ్య మరోసారి, కొత్తగా’ పేరుతో రాసిన వ్యాసాన్ని నేను చాలా ఆలస్యంగా, ఒక వారం రోజుల క్రితమే సి.హెచ్.వేణు అనే సాహితీ మిత్రుడు నా ఐపాడ్ కు, నా ఇమెయిల్ ఐడికి పంపించటం వల్ల చూడగల్గాను. ఆ నవల వెలువడిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఆ నవలను గూర్చి ఇలాంటి లోతైన విశ్లేషణాత్మక విమర్శా వ్యాసాలు రచింపబడ్తున్నందుకు ఆ నవలా రచయితగా చాలా సంతోషిస్తున్నాను.
అయితే సుజాత గారు ఆ వ్యాసాన్ని ముగిస్తూ ఆ నవల మీద చేసిన రెండు వ్యాఖ్యానాలు నన్ను చాలా ఆశ్చర్యపరచాయి.
అందులో ఒకటి: నవల ముగింపు నాటకీయంగా, బలవంతంగా జరిగింది; నవల మొత్తం వాతావరణంలో ఈ ముగింపు ఇమిడలేదని-
రెండవది: రమేష్ రత్తిని గురించి వివరంగా చెప్పడంలో కూడా ఈ బలవంతమే కనిపిస్తుంది.
1969లో అంపశయ్య వెలువడినప్పట్నించి ఈ నవలను గురించి చాలామంది చాలా విషయాల్ని చెప్పారు. కానీ సుజాత గారు చూపించిన ఈ రెండు అంశాల్ని ఎవరూ ప్రస్తావించలేదు.
నవలలో రవి అనేక మానసిక సంఘర్షణలకు లోనయ్యాడన్న విషయాన్ని సుజాత గారు కరెక్ట్ గానే చెప్పారు. అతడు ఒంటరిగా ఉన్నంతకాలం బలహీనుడే- సుజాత మాటల్లో దుర్బలుడుగానే కనిపిస్తాడు. అలాంటివాడు ఒక సమూహంలో ఉన్నప్పుడు ఎలా బలవంతుడుగా మారాడో చెప్పడానికే నవలను అలా ముగించాను. నవలలోని ఈ ముగింపు నాటకీయంగా కనిపిస్తుందన్నారు సుజాత గారు. ప్రతీ నవలలో అనేకచోట్ల ఎంతో కొంత నాటకీయత ఉంటుందని సుజాత గారికి తెలియని విషయం కాదనుకుంటా! ‘వైయక్తికమైన ప్రయాణం ఉన్నట్టుండి సామాజికం అవుతుంది’ అన్నారు సుజాత గారు. ఏ వైయక్తిక ప్రయాణమైనా సామాజికం కాక తప్పదు. పూర్వం ఎప్పుడో అరిస్టాటిల్ ‘Man is a social animal’ అన్నాడు. దీనికి సుజాత గారు నాటకీయమని అభ్యంతరపెట్టటం ఆశ్చర్యమే. నవలలో ఈ ముగింపు చాలా Spontaneous గా ఉత్పన్నమైనదేనని అనేకమంది పాఠకులు భావించారు.
ఇక రత్తిని గురించి రవి రమేష్ కు వివరంగా చెప్పడాన్ని సుజాత గారు బలవంతంగా జరిగిందని వ్యాఖ్యానించటం ఇంకా ఆశ్చర్యపరిచింది. నవల ప్రారంభం నుండి రత్తి ప్రసక్తి వస్తూనే ఉంది. నవల ముగిసేలోగా రత్తి ఉదంతాన్ని ఎక్కడో అక్కడ వివరంగా రచయిత చెప్పబోతున్నాడనే పాఠకులు అనుకుంటారు. రత్తిని గూర్చి రవి అనుక్షణం ఒక అపరాధ భావనకు లోనవుతున్నాడు. ఆ విషయాన్ని రమేష్ లాంటి అతని మిత్రునితో చెప్పుకుంటే తప్ప అతని హృదయంలో స్థిరపడిన ఆ అపరాధ భావన తొలగిపోయి అతని హృదయం తేలికపడదు. తన హృదయభారాన్ని తొలగించుకోవటం కోసమే రవి రమేష్ తో రత్తిని గురించి అంత వివరంగా చెప్పాడు. దీంట్లో ‘బలవంతం’ యేమీ లేదు.
ఆ తెలిసీ తెలియని వయస్సులో రవి రత్తిని ప్రేమించానన్న భ్రమకు లోనయ్యాడే గానీ ఆమెను నిజంగా ప్రేమించలేదని పాఠకులకు సులభంగానే అర్థమవుతుంది. నిజంగా ప్రేమిస్తే ఆమెను తన స్వంతం చేసుకోవడానికి రవి ఎంతకైనా తెగించేవాడు. కానీ రత్తి పట్ల అతనికి విపరీతమైన సానుభూతి ఉంది. ఆమెకు జరిగిన అన్యాయంలో తను కూడా భాగస్వామి అయ్యానేమోనన్న ఫీలింగ్ కారణంగా అతనిలో తీవ్రమైన అపరాధ భావం చోటుచేసుకుంది. రమేష్ కు ఈ ఉదంతాన్ని వివరంగా చెప్పుకోవడంతో ఆ అపరాధ భావన తొలగిపోయింది.
సుజాత గారూ ! నవలలో పాత్రలు తప్ప రచయిత కనిపించకూడదన్న మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ముగింపులోనూ, రత్తిని గూర్చి రవి రమేష్ కు వివరంగా చెప్పిన ఘట్టంలోనూ రచయితే కనిపించాడని మీరంటున్నారు. కాని ఈ రెండు సందర్భాల్లోనూ రవే కనిపిస్తాడు తప్ప రచయిత కనిపించలేదే! ఒకవేళ మీరు రవే రచయిత అనుకుంటున్నారేమో దయచేసి ఆలోచించండి.
యేదేమైనా , మీరు ‘అంపశయ్య ’ మీద ఇంత లోతైన విశ్లేషణ చేసినందుకు మీకు కృతజ్ఞతలు.
జాషువా – పిరదౌసి గురించి జాన్య అభిప్రాయం:
02/13/2015 10:47 pm
తెలుగు మాటలు కరువైతున్న రోజులు
తెలుగంటెనె వదంటుపరుగులుపెడుతున్న రోజులు
పుస్తకాలు విప్పి చదవలేకపోతోన్నా రోజులు
వాట్సప్, ఫెస్ బుక్,స్క్యప్ అంటూ పరుగులు పెడుతున్న రోజులు
ఇలాంటి రోజులలో ఇంత అందమైన కవిత్వపరిభాషలో ‘పిరదౌసి’ ప్రాతిపదికంగా ఆయన జీవితాన్ని, సాహిత్యాన్ని మీదైన కొత్తచూపుతో రూపుకట్టిన మీకు “మానసా”రా అభినందనలు!
శ్రీ మేగావత్ జాన్య
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,ఇంద్రకల్
నాగర్ కర్నూల్,మహబూబ్ నగర్ జిల్లా
జాషువా – పిరదౌసి గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
02/13/2015 5:29 am
ఓ చల్లని సాయంత్రం ఓ చక్కని సాహిత్య ప్రసంగం విన్న అనుభూతినిచ్చిన వ్యాసాన్ని అందించినందుకు మానసగార్కి అభినందనలు. వింటున్నంత (చదువుతున్నంత) సేపూ పోతనామాత్యులవారి ‘ఇమ్మనుజేశ్వరాధముల…’పద్యం జ్ఞప్తికి రావడం అసహజం కాదు కదా!
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం గురించి మల్లికార్జున శర్మ దేవరకొండ అభిప్రాయం:
02/13/2015 2:21 am
భాషా సంస్కృతులు ఇలా ఏడుస్తున్నాయని తెలిసిన వాళ్లు ఏడవడమే తప్ప ఎవరూ అమాంతం ఏమీ చేయలేని స్థితి. ఇలాంటి ఎన్నో రచనలు రాగా రాగా సినిమాల వాళ్లూ మీడియా వాళ్లూ కూడా పుణ్యం కట్టుకుంటే కొంత ‘సహజత్వం’ బతుకుల్లోకి వచ్చే అవకాశం వుందని ఆశిస్తూ, చక్కగా రాస్తున్న అమ్మ గార్కి అభినందనలు తెలియచేస్తున్నాను.
సీత గడియ గురించి ravi అభిప్రాయం:
02/12/2015 12:53 pm
Sir, May I request you to write an Article on VAMANAGUNTALU? స్త్రీల రామాయణపు పాటలూ is read by me recently and understand inner meaning. Thank you.
with regards
ravi
పొరుగు తెలుగు గురించి krushna kumar అభిప్రాయం:
02/12/2015 11:13 am
కృతజ్ఞతలు. మీ పరిశోధన గతం లో కూడా చదివాను. తొలిసారి తెలుంగులో వత్తుతున్నాను.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: కొత్త తరం గురించి chudamani అభిప్రాయం:
02/11/2015 9:03 am

చూడామణి.