పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మహాలయం గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    03/04/2015 6:09 pm

    చంద్ర కన్నెగంటి గారికి కాళిదాసు తెలుసునని నేనిదివరకే నిరూపించాను; ఆయన ప్రచురించిన కవితాసంకలనం లో కొన్ని పద్యాలని ఉదహరిస్తూ! మానస చామర్తి గారు కూడా కాళిదాసు చదువుకున్నారని నాకు ఇప్పటివరకూ తెలియదు. #Mea Culpa#

    మార్చి 2015 ఈమాటలో వీళ్ళిద్దరి పద్యాల ప్రారంభ శబ్దాలు వినపడగానే – భోజరాజు తన ఆస్థానకవులకిచ్చిన సమస్య – దానికి కాళిదాసు పూరణ జ్ఞప్తికి వచ్చాయి.

    భోజరాజు ఇచ్చిన సమస్య:

    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    (తెలుగు లో రాస్తే ‘మ్’ అక్కరలేదు; తెలుగు వాడికి చక్కగా సున్న ఉన్నదిగదా!)

    కాళిదాసు పూరణ:

    రాజాభిషేకే మదవిహ్వలా యా
    హస్తా చ్యుతో హేమ ఘటో యువత్యా,
    సోపాన మార్గేషు కరోతి శబ్దమ్
    టమ్ టమ్ ట టమ్ టమ్ ట ట టమ్ ట టమ్ టమ్.

    చాటువు చదివి ఆనందించడానికి ఆ చాటువు పూర్వకథ తెలియాలి. ఇదిగో ఆ అపూర్వ కథ.

    రాజుగారు స్నానం చేయడానికి నీళ్ళు తెమ్మన్నాడట. బంగారపుబిందెలో నీళ్ళు మోసుకొస్తున్న యువతి, రాజుగారి శరీర సౌందర్యానికి సమ్మోహిత అయ్యింది. పుటుక్కున చేతిలో ఉన్న బంగారు బిందెని జార విడిచింది. ఆ బిందె మెట్లమీదపడి టం టం టమ్మన్న శబ్దం చేసిందిట!

    (మిగిలిన వివరాలు మీరు ఉహించుకోండి!)

    వేలూరి వేంకటేశ్వర రావు
    తెలుగులో ఢం ఢం, — ఇక్కడ సంస్కృతంలో సున్నితంగా — టమ్ టమ్.

  2. సై కిల్ గురించి okAnokaDu అభిప్రాయం:

    03/04/2015 3:02 pm

    నేను పడుకోబోయే ముందు చదివాను. ఒకటే మొద్దు నిద్ర పట్టేసింది. కలా లేదు, భయంలేదు. మరి లైలా గారికలా ఎందుకనిపించిందో. ఏమో లెండి రెండు మూడ్రోజుల్లో నాక్కూడా కలలోకొస్తుందేమో? కధ బావుంది.

  3. వచనానికి ఒక జాబు గురించి okAnokaDu అభిప్రాయం:

    03/04/2015 2:59 pm

    మొగుడు పోయినావిడని భాగీరథీ సమానులని రాయడం తెలుగునాట ఉన్న వొక అలవాటు. వచనంగార్ని అలా సంబోధించారు కనక వచనం గారు ఒక మొగుడు పోయిన ఆవిడ అనో దిక్కుమాలినదనో అనుకోవాలా? శివుడు మొగుడైతే గంగని అలా ఎందుకంటారో మరి? అయినా గంగ అన్నా భాగీరథి అన్నా ఒక్కటే కదండీ? రెండూ కలిపేసారు. ఇది కూడా ఈశ్వరానుగ్రహమేనా? 🙂

    మొత్తం మీద కడుపుబ్బ నవ్వించారు.

  4. వచనానికి ఒక జాబు గురించి sivasankar అభిప్రాయం:

    03/04/2015 12:33 pm

    వంశీ గారు – మీ వ్యంగ్య రచన చాలా బాగుంది. మీనుంచి మరికొన్ని రచనలు ఈమాటలో ప్రచురించగలరని ఆశిస్తూ ఉన్నాము.

  5. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి Rangaiah అభిప్రాయం:

    03/04/2015 12:05 pm

    పరుచూరి శ్రీనివాస్ గారికి, చాల బాగా ఉందండి ఎస్. వరలక్ష్మి గారి మాటలు అభిప్రాయాలు. మీరు చేసిన సేకరణ మరియూ సంఖ్యికరణం(digitalization)ఎంతో అభినందనీయం.

    with Regards.
    రంగయ్య.

  6. స్టార్‌బక్స్ కథలు: పచ్చబొట్ల కాఫీ కప్పు గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:

    03/03/2015 8:53 am

    స్టార్‌బక్స్ లో కథలు అని అనుకుని మీరు వ్రాస్తుంటే ఫరవాలేదు. కాని స్టార్‌బక్స్‌లో ఒక బారిస్టా అనుభవాలుగా వ్రాస్తుంటే మాత్రం, ఒక “స్త్రీ” గానో ఒక “పురుషుడు” గానో వ్రాస్తే బాగుంటుందేమో!

    Esperanza is the Spanish word for “హొప్”. 🙂

  7. మహాలయం గురించి S A Rahman. అభిప్రాయం:

    03/03/2015 4:16 am

    ఒక్క మాటలో చెప్పాలంటే చిన్ని కవిత చాలా ముచ్చటగా ఉంది.

  8. బ్రౌన్ పురస్కారం 2014 గురించి వంగూరి చిట్టెన్ రాజు అభిప్రాయం:

    03/03/2015 12:12 am

    చాలా మంచి నిర్ణయం. శాస్త్రి గారికీ, మీకూ అభినందనలు.

  9. సై కిల్ గురించి lyla yerneni అభిప్రాయం:

    03/02/2015 11:11 pm

    బాగా రాశారు.

    ఇంత భయపడి చచ్చేదాన్ని, రాత్రిపూట మిస్టరీలు ఎందుకు చదువుతానో తెలియదు. ఐనా అవే ఎక్కువ చదువుతాను. -లైలా

  10. నెగడు చుట్టూ నాట్యం గురించి మోహన అభిప్రాయం:

    03/02/2015 7:00 pm

    బాగుంది! అది నేనే ఇది నేనే అది స్వాహా ఇది స్వాహా జ్ఞాపకము వచ్చినది. – మోహన