పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. సై కిల్ గురించి lyla yerneni అభిప్రాయం:

    03/09/2015 1:27 pm

    చురక ఫొటోకి అంటించినారా?

    సంభాషణ కూడా మారుపేరుతో,ముసుగు లోంచి ఆ ఫొటోతోనే చెయ్యరాదా. మారుపేరుతో రాయటంలో ఏమైనా అదనపు లాభాలు ఉన్నాయేమో ఆ బొమ్మతోనే చెప్పండి. కథ! ‘బొమ్మలు చెప్పిన కమ్మని కధలు’ అక్కడే వినగలరేమో.

    నిజానికి ‘చురక అంటించటం’ అనే ఎక్స్ప్రెషన్ నాకు నచ్చదు. మోటుగా, సేడిస్టిక్ గా అనిపిస్తుంది. నేను వాడలేను. కాని మీరు స్నేహపూరితంగా చేస్తున్నారు, అది నాకు తెలుసు. కాబట్టి, మీరు మార్చుకోనవసరం లేదు.

    ఎంతమంది స్నేహితులుంటే జీవితం, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది. రకరకాల కల్చర్స్ నుండి వచ్చిన నా ఫ్రెండ్స్ రకరకాలుగా నాతో మాట్లాడుతారు. స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంది. నా సంబరం కూడా!

    కాని, ఇలాటి సందర్భాలలో ఆ స్నేహం ఎవరితో చేస్తున్నానో తెలియకుండా ఎలా చెయ్యటమో తెలియటం లేదు.

    ఇంతకు ముందు మీరు సూచించిన విశ్వనాథ కథలు బాగున్నవి. చిన్న కథలు కూడా బాగా రాశాడాయన. – లైలా

  2. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి రవి అభిప్రాయం:

    03/09/2015 12:30 pm

    అత్యద్భుతమైన వ్యాసం. ఈ విధమైన వ్యాసం బహుశా నేడు ఎవరూ వ్రాయలేరేమో.ఈ మాట వారికి వేల కృతజ్ఞతలు.

    రెఫరెన్స్ పుస్తకాల జాబితా, వీలైతే లంకెలు ఇచ్చి ఉంటే బావుండేది.

    మొదటి పద్యంతోనే అర్థశక్త్యుద్భవ వస్తుధ్వని, అపహ్నవం, వ్యాజోక్తి, ఉపసర్జనీకృతత్వం, అనుమితి వాదం వంటివి ప్రస్తావించి ఆయా విషయాలకు సంబంధించిన పుస్తకాలను చదువుకునే ఆసక్తి కలిగించారు. ఈ వ్యాసపు సారాన్ని యథాతథంగా స్వీకరించే తెలివిడీ, పాండిత్యమూ, ఎలానూ లేవు కనుకా, ప్రస్తావించిన విషయాల గురించీ బయట ఎక్కడా తెలుసుకోవడం కుదరదు కనుకా కొన్ని సంశయాలు.

    1. “వాతెఱ గంటిఁ గంటి కెవ్వారికిఁ గెంపు రాదె;” – అని చక్కగా పరిష్కరించారు. అయితే వాతెఱ గంటిన్ – అన్న ద్వితీయా విభక్తి ప్రత్యయంతో వచ్చే ఒకింత క్లిష్టాన్వయం కన్నా “వాతెఱగంటి కంటికెవ్వారికిఁ గెంపు కాదె” – అనుకుంటే సరళాన్వయం దొరుకుతుంది కదా. అలా చదువుకోగల వీలుందా?

    2. అంబరసీమఁ దారలు…శంభుడు మిమ్ము బ్రోవుతన్ – ఈ పద్య విచారణలో

    >>శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం >>లోనిదన్న నిర్ణయానికి ప్రతిబంధకంగా ఉన్నది…..ఆశీరర్థకమైన మంగళం ఆశీరర్థంలో >>లూణ్మధ్యమంలో అక్కడా విధాయకం కాదు. ”

    అన్నారు. అమరుశతకం ఆరంభశ్లోకం

    జ్యాకృష్టిబద్ధకటకాముఖపాణిపృష్ఠ
    ప్రేఙ్ఖన్నఖాంశు చయసంవళితో మృడాన్యాః
    త్వాం పాతు మఞ్జరితకర్ణపూర
    లోభభ్రమద్భ్రమరవిభ్రమ భృత్కటాక్షః ||

    అందులో “త్వాం పాతు” అన్న యుష్మదర్థ లోట్ ప్రయోగం ఉంది కదా? ఇంకా కొన్ని నాటకాదుల నాందిలో ఇలాంటి ప్రయోగం ఉన్నది కదా,విధాయకం ఎందుకు కాదు? ఆ కారణమేమిటి?

    3. లచ్చీ దుహిఅ…ఈ శ్లోక ప్రస్తావనలో
    “ఆనందవర్ధనుడు చెప్పిన అభిధా లక్షణా వృత్తులను అంగీకరిస్తూనే వ్యంజనకు గల ప్రాధాన్యాన్ని తిరస్కరించి,మహిమభట్టు..”

    మహిమభట్టు శబ్దానికి లక్షణ వృత్తిని తిరస్కరించాడని వ్యక్తివివేకం ప్రథమ విమర్శలో ఒక పాఠం విన్నాను. మమ్మటుని కావ్యప్రకాశంలో వివరించిన ముఖ్యార్థబాధ, ముఖ్యార్థ సంబంధాలను తిరస్కరించి “గంగాయాం ఘోషః” ఉదాహరణ కూడా అనుమితికిలోబడి ఉందని వ్యాఖ్యానించినట్టు ప్రథమ విమర్శ. (శబ్దః పునః స్వార్థాభిధానమాత్రవ్యాపారపర్యవసితసామర్థ్యః). శబ్దానికి అర్థాంతరం ఉంటుందనడం కుసుమం వికసించడానికి పూలతీవెకు నీరు పోసిన కుండ చేసిన కుంభకారుడు కారణం అన్నట్టు ఉంటుందని ఆయన విసురు విసిరాడని విన్నది.ఈ పరంపర లో భట్టలోల్లటుడు ప్రతిపాదించిన అభిధా వృత్తికి గల దీర్ఘదీర్ఘతరవ్యాపారఖండన కూడా రోచకమైన పాఠం.

    ఇది మీరు వ్రాసిన “లచ్చీ దుహిఅ..” పద్యార్థానికి సంబంధించని విషయమయినా, ఏదో ఆసక్తి కలిగి వ్యాఖ్య వ్రాశాను.

    పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శ్రీనాథుని వాచ్యకవి అని నొక్కి చెప్పి వ్యాఖ్యానించారు. శ్రీనాథుని ధ్వనిప్రధాన గాథాపద్యాలను మీరు వివరిస్తూంటే ఆశ్చర్యానందాలు కలుగుతున్నాయి. మరో పది పదిహేను మార్లు నిదానంగా చదువుకుని అర్థం చేసుకోవాలి.

  3. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    03/09/2015 12:15 pm

    నమస్కారములండి.
    మీరు ప్రకటించిన రోజే ఆ వ్యాసము (చిన్ని పుస్తకము) చదివి ఉన్నాను. మీ విశ్లేషణలో అన్ని రకాల కోణాలను చక్కగా మీరు నిరూపించడం ప్రతీ సారీ నన్ను ఆశ్చర్యానందాలలో ముంచివేస్తుందనడంలో ఎటువంటి రెండో అభిప్రాయం లేదు. బాగుందని చెప్పడం కన్నా ఎక్కువ వ్యాఖ్యానించగలిగే అర్హత గానీ, ప్రాచీన కావ్యాలతో పరిచయం గానీ నాకు లేకపోవడంతో నేను ఊరుకున్నాను. ఇదివరకటి మీ వ్యాసాలలో అర్థం చేసుకొనేంత పాండిత్యం లేక కొన్ని సంశయాలను ధైర్యం చేసి మీతో ప్రస్తావించడం జరిగింది.

    ఈ వ్యాసంలో ఎక్కడా ఎటువంటి సంశయమూ కలుగలేదు.ప్రాచీన సాహిత్య పరిచయమూ, విమర్శనాత్మక ధోరణిలో రచనానైపుణ్యమూ ఉన్నవారు మీతో చర్చించడం చదువుతూ మురిసిపోతుంటాను. మీ రచనలను చదువకుండా వాయిదా కూడా వేయలేను. వెంటనే చదువుతూ ఉంటాను. మీ దగ్గర సాహిత్యంలో పరిశోధన చేయగలిగే భాగ్యం లేనందుకు చింతిస్తూ ఉంటాను. ఈ విధంగా ప్రాచీన కావ్యాలను వెలికి తీసి మా వంటి భాషాభిమానులకు నిధులుగా తోడి తీసి మీ విమర్శనాత్మక వ్యాసాలతో మెరుగులు దిద్ది సమకూర్చినందుకు మేము, ముందుతరాల వారు మీకు ఋణపడి ఉంటామన్న మాట తప్ప ఇంకేమీ చెప్పలేని అల్పురాలను.

    మరొక్కమాట మాత్రం ప్రతీసారి మనవి చేయాలనుకుంటాను. మీ భాషాసంపత్తి ఈ కాలంలో అనన్యసామాన్యమైనదనే చెప్పుకోవాలేమో నాకు తెలిసిన పరిధిలో ఈమధ్య అప్పుడప్పుడూ మీరు జనసామాన్యమైన భాషలో వ్రాస్తున్నట్టనిపిస్తుంది. కానీ నా అభ్యర్థన ఏమంటే … దయచేసి మీ ప్రత్యేకతను మీరు నిలుపుకొనవలసినది. భాష సౌందర్యాన్ని ఇంత సమర్థవంతంగా చూపించే అలవాటు మానవద్దు. అర్థం కాని పదాలు, సమాసాలు ఉన్నంత మాత్రాన పరిశోధనాభిరుచులున్నవారు కొత్త(పాత) పదాలను పరిచయం చేసుకోకుంటే ఎలా కుదురుతుంది? ఇంక అది విద్యార్థిత్వం ఎలా అవుతుంది? కాబట్టి తప్పక ఇటువంటి మంచి తెలుగునే ఇక మీదట కూడా కొనసాగించవలసినదని మనవి.

    నమస్కారములతో…లక్ష్మీదేవి.

  4. సై కిల్ గురించి okAnokaDu అభిప్రాయం:

    03/09/2015 10:39 am

    అబ్బే లేదండి. మీరు కాదు కలలోకి వచ్చేది. ఆ సైకిల్ మీద దెయ్యం వస్తుందేమో అని. అయినా మీ ఫోటో ఈమాటలో చూసాను. కలలోకి వచ్చేంత (!) గొప్పగా కనపళ్ళేదు లెండి. 🙂 ఇలా చురక అంటిస్తున్నందుకేమీ అనుకోకండేం?

    ఆంజనేయ దండకం చదువుకోవడం మొహానికి విభూది రాసుకోవడం తెలుసు; బొడ్డుకి మసి రాసుకోవడం అనేది ఇంతకు ముందు విన్నట్టు లేదు. ఏమా కధ?

  5. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:

    03/08/2015 4:46 pm

    ఈ వ్యాసమును తొలుత పై పై చదివి మెచ్చుకోలు ప్రకటించినా ఇప్పుడే వారాంతపు ప్రణాళికగా పూర్తిగా చదివాను. ఈ వ్యాసముపై శ్రీ కామేశ్వర రావు గారి వ్యాఖ్యను ఇతర ప్రముఖుల వ్యాఖ్యలను కూడా చదివాను. ఈ విశ్లేషణను వ్యాసమనడము సమంజసము కాదు. ఇది ఒక చిరుగ్రంధమే ! అద్భుతముగా నుంది. శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారి విద్వత్తు తఱచు ప్రయుక్తమై యీ వయస్సులో కూడా మేధ నుత్తేజ పఱచింది. అందుబాటులో నున్న ఆంధ్రభారతి తెలుగు నిఘంటువును చాలా పర్యాయము లాశ్రయించినా వారి వాక్పటిమకు భాషాసంపత్తికి ముగ్ధుడ నయ్యాననే చెప్పుకోవాలి.
    వా రుదహరించిన అన్ని పద్యాల విశ్లేషణ బాగుంది.

    అంబరసీమఁ దారలు, జటాటవి మల్లెవిరుల్, భుజాంతరా
    ళంబున హారసంతతు లిలాస్థలిఁ బువ్వుల వర్షముల్ ప్రసూ
    నంబులు సత్కృతాంజలి ననం దగి మౌక్తికతుల్యమౌళిగం
    గాంబుకణంబు లుట్టిపడ నాడెడు శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్.
    పద్యమును నేను కూడా శ్రీ భైరవభట్ల కామేశ్వర రావు గారి వలె శంభుని మౌక్తికతుల్య గంగాబుకణములే గగనసీమలో తారలు , మల్లెవిరులు, హారసంతతులు , ఇలాస్థలి పుష్పములు ,అంజలిలో ప్రసూనములైనట్లు అర్ధము చేసుకున్నాను. కాని శ్రీ ఏల్చూరి వారి వేమభూపాలుని వ్యాఖ్యావలంబనముగా నిచ్చిన వివరణ అర్ధవంతముగా నుంది. ఈ వ్యాసములో పుష్టి ఉంది. మరోసారి చదువుకోవాలి. మరో వ్యాసము వెలువడే లోపల ఒక నెల ఉందిగా !

  6. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి lyla yerneni అభిప్రాయం:

    03/07/2015 9:48 pm

    “అంబరమున దారల్…” పద్యం గురించి:
    In this poem, the poet is using a white on white palette. It is gorgeous.

    This landscape painter is a nature lover. The canvas is extremely large. I will imagine as big as I can. Don’t bother to frame it. Nor hang it on your wall. This is not a calendar God. The God Siva in here is a pagan. A roamer. A primitive God.

    Siva is dancing on mountain tops, slopes, and valleys – studded with flowing waterfalls, studded with flowering forests. White flowers are constantly dropping all around him, over him. Are they flower garlands over his shoulders, around his neck? Or are they twirling snakes? Who can tell?

    Why is Siva dancing? Because of the beauty around him. Because he cannot contain his joy. During this joyous dance, when he brings his hands together, in rapture, in appreciation of beauty around him, flowers drop into his hands also.

    Who will not go crazy with that kind of contact? That kind of a gesture from nature. So soft. So scented. So beautiful. Siva spins around himself, dances around more vigorously. More joyously.

    The mighty Ganges on his head spills. There is now water all around him. Can you not see, hear, the swirling, splashing water? It’s pearliness? The white pearls and white petals. What a sensuous touch. Wouldn’t Siva be ecstatic?

    When he is dancing in such ecstasy, because of the dancer’s swirling, it will appear to the dancing figure that the skies are moving. Stars in the sky are dancing. The flowering forests are dancing.

    What prevents any one from imagining such a beautiful natural scene? ఏమి అడ్డం పడుతున్నది? “అనం దగు” అను ఒక్క మాట? హు. శివుడి నాట్యమెక్కడ? అనవుడు, నావుడు లాటి మాటలు ఎక్కడ? Why would I let a mere filler word like ‘అనందగు’ destroy/ alter such cosmic beauty? Why would I, the spectator, re-arrange/subjugate my entire thought, trying to accommodate, to justify, this measly word? I won’t. Not for yati. Not for prasa. Not for సూర్య గణములు, ఇంద్ర గణములు, చంద్ర గణములు, ప్రమధ గణములు. And I will not think of any prescribed ప్రార్ధనా క్రతువులు, రీతులు, నిష్ఠలు in this poem. Nor will I let any first wife, second wife, रखेल related thoughts enter this painting. No such modern, social, human pre-occupations. No. No.

    ఆ ‘అనందగు’ ను తీసివేసి, సత్కృతాంజలిని చిందగ, అనో లేకుంటే సత్కృతాంజలి నటించగ,’ అనో ‘చలించగ’ అనో చదువుకుని, శివుని నాట్యం చూస్తాను.

    The pagan Siva is dancing under the stars. I will not miss it for one word or the world.

    లైలా

  7. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    03/07/2015 9:01 pm

    చాలా అద్భుతమైన వ్యాసం. మురళీధరరావు గారి కృషి బహుధా ప్రశంశనీయం.

    “తెలుగే సరిగా రాదు, ఇక సంస్కృతం నిల్లు” అని ముళ్ళపూడి ఓ సినిమాపాత్ర చేత అనిపించినట్టు ఏ ఏడాదికోసారో ఒక తెలుగు పద్యం చదివటానిక్కూడ తీరక లేని నాబోటి వాళ్లు సంస్కృతాంధ్ర ప్రాకృతాల్లో లోతైన పాండిత్యం అవసరమైన ఇలాటి వ్యాసాన్ని అర్థం చేసుకోవటమే గొప్ప విషయం. కనుక ఇందులో విషయాన్ని గురించి చర్చించే సాహసం చెయ్యను. ఐతే, ఒక పరిశోధకుడిగా నాకర్థమైంది ఇది –

    1. కొన్ని పద్యాల్ని ఇదివరకు కొందరు శ్రీనాథుడి శాలివాహనసప్తశతి లోనివిగా “ఊహించారు”
    2. ఇప్పుడీ వ్యాసంలో మురళీధరరావు గారు ఆ పద్యాల్ని ఒక్కొక్కటి తీసుకుని అవి అ) సప్తశతి కి చెందినవేనా? ఆ) ఐతే అవి శ్రీనాథకృతాలేనా? అని పరిశీలుస్తున్నారు.
    3. ఇందుకు వారు ఎంచుకున్న మార్గం – ఒక పద్యం సప్తశతిలోదైతే దానికి హాలుడి మూలం ఒకటుండాలి. ఉంటే అదేమిటి, మూలానికీ ఈ పద్యానికీ సామ్యాలు, తేడాలు ఏమిటి అని తరచి చూసి అది సప్తశతికి చెందిందా కాదా అని నిర్ణయించటం.
    4. శ్రీనాథుడిదా మరొకరిదా అని తేల్చటానికి ముఖ్యంగా శ్రీనాథుడి శైలిని, శ్రీనాథుడి ఇతర ప్రయోగాల్ని పోల్చిచూసి నిర్ణయించటం.

    వీటిలో నాకు సప్తశతి పద్యాలా కావా అనే పరీక్ష సమంజసంగానే అనిపించింది. కాని శ్రీనాథుడిదా కాదా అనే పరీక్ష మాత్రం కాదు. ఐతే ఒకటి చెప్పుకోవాలి, ఇంతకు ముందు ఎంతో లబ్ధప్రతిష్టులైన పరిశోధకులు ఇంతకన్నా చాలా తక్కువ తర్కంతో కేవలం వారి ఊహలే ఆధారంగా ఇంతకన్నా పెద్ద విషయాల్నే సిద్ధాంతీకరించారు.

    ఉదాహరణకి మొదటి పద్యం తీసుకుందాం –

    వారణసేయ దావగొనవా నవవారిజమందుఁ దేటి క్రొ
    వ్వారుచు నంట నీ వెఱుఁగవా ప్రియ హా తెఱగంటి గంటి కె
    వ్వారికిఁ గెంపు రాదె తగవా మగవారల దూఱ నీ విభుం
    డారసి నీ నిజం బెఱుఁగునంతకు నంతకు నోర్వు నెచ్చెలీ.

    ఇందులో ఒక విషయం చాలా తేలిగ్గా గమనించవచ్చు – ప్రతిపాదం లోనూ కనిపించే (17 – 19 శతాబ్దాల మధ్య పద్యాల్లో విపరీతంగా ప్రచారంలో వున్న) శబ్దాలంకారం. తొలిపాదంలో “గొనవా నవవా”, రెండో పాదంలో “తెఱగంటి గంటి”, మూడోపాదంలో “తగవా మగవా”, నాలుగో పాదంలో “నంతకు నంతకు”. నాకు తెలిసినంతవరకు ఇది శ్రీనాథుడి శైలి కాదు, బహుశ వసుచరిత్రకు ముందు లేనిది. ఈ తర్కం ప్రకారం ఇది శ్రీనాథుడి పద్యం కానేకాదు. ఎవరో పద్దెనిమిదో శతాబ్ది కవి రాసింది.

    అలాగే ఉదహరించిన వాటిలో కొన్ని పద్యాలు కథాధారితాలు కావు. అలాటప్పుడు అవి సప్తశతికి అనువాదాలని చెప్పటమే సాహసం అని నా అభిప్రాయం.

  8. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    03/07/2015 8:58 pm

    మురళీధరరావు గారికి నమస్కారాలతో –

    చాన్నాళ్ళుగా రాద్దామనుకుంటూ వెనకడుగు వేస్తూ వచ్చాను. మీరు ఆచార్యులు, పండితులు. ముఖ్యంగా తెలుగు చదువు చెప్పిన వారు.

    మీ వ్యాసాలలో ముడి సరుకు చాలా గొప్పదయినా, అవి చదవడానికి చాలా కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి మధ్యలో వదిలేయాల్సి వస్తోంది. దీనిక్కారణం మీ వ్యాసాలలో మీరు వాడే భాష. అది ఓ పట్టాన మింగుడు పడడం లేదు. సుదీర్ఘ సమాసాలూ, నోరు తిరగని సంధి ప్రయోగాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి.

    ఉదాహరణకి – ఈ వ్యాసంలో ఒక చోట – ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షకు, గమ్యమానౌపమ్యంతో తుల్యయోగితకు స్వతఃప్రమాణమై హృద్యమైన ఈ పద్యాన్ని అధర్వణ భారతం విరాటపర్వం ప్రథమాశ్వాసం లోనిదిగా నేటికొక శతాబ్ది క్రితం ముమ్మొదటిసారిగా సుగృహీతనామధేయులు శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వెలుగులోకి తెచ్చారు.

    అలాగే ఇంకోచోట: ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాదినిర్వహణపూర్వకంగా – భరత నాట్యశాస్త్రానువాదం కాబట్టి కావ్యారంభంలో నాట్యాధిష్ఠానదైవతమైన శంభుదైవతస్తుతి భావ్యమే కాని, పైని పేర్కొన్న అంబరసీమఁ దారలు … పద్యాంతంలోని ‘శంభుఁడు మిమ్ముఁ బ్రోవుతన్’ అన్న యుష్మదర్థకాశీర్వాక్యం ఇది భారతీయకావ్యం –

    ఇలా ప్రతీ చోటా పాఠకుడికి (ముఖ్యంగా నాలాంటి పామరుడికి) చాలా కష్టంగా ఉంటోంది. మీరు చెప్పిన, లేవనెత్తిన అంశాలు చూస్తే చదవాలని రెండడుగులు ముందుకేస్తే, మీ వాక్యాలు పదడుగులు వెనక్కి నెట్టేస్తున్నాయి. మీ రచనల్లో సంస్కృత పదాలు ఉబ్బడిముబ్బడిగా వాడడం వలన అర్థాలు తెలీక నానా అవస్థా పడి చదవాల్సి వస్తోంది. నేను పుల్లెల శ్రీరామచంద్రుడి గారి వ్యాసాలూ, విశ్వనాధవారి పీఠికలూ, రాళ్ళపల్లి వారి వ్యాసాలూ ఎంతో అపురూపంగా దాచుకుని తరచు చదువుకుంటూ ఉంటాను. వారి భాషతో ఎప్పుడూ ఇబ్బంది రాలేదు. మీరా ఆ కాలం వారు కాదే? వస్తు పరంగా మీకూ ఆ స్థాయి ఉంది. తెలుగు చదివే వాళ్ళే పల్చబడి పోతున్నారని ఒక పక్క కొంతమంది గగ్గోలు పెడుతున్నారే? ఇలాంటి మంచి రచనలు కేవలం వాడే భాష వలన దూరం అయిపోతున్నాయి కదా అన్న బాధతో రాస్తున్నాను. అంతే తప్ప మరో దురుద్దేశం లేదు. మీ రచనల్లో ప్రస్తావించిన అంశాలు ఇష్టంగానే చదువుతాను. మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.

    (ఇది రాసే ముందు నాకు తెలుసున్న కనీసం పదిమందిని అడిగాక ఇది రాస్తున్నాను. మరోసారి ఇలా రాసినందుకు క్షమించేయండి.)

    మీరు మంచి తెలుగు రాయలేక కాదు. వ్యాసం చివర్న మీరిచ్చిన సూచికల్లో అందరికీ అర్థమయ్యే అందమైన వాక్యమే రాసారు కదా? మరెందుకు అది వ్యాసంలో అవి తొంగిచూడడం లేదో అర్థం కావడం లేదు.

    నమస్కారాలతో –
    బ్రహ్మానందం గొర్తి.

  9. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి కామేశ్వరావు అభిప్రాయం:

    03/07/2015 9:53 am

    మురళీధరరావుగారూ,
    సంవాదంలో విశేషింపదగినది అయినా కాకపోయినా, నాకు మీరు గురుతుల్యులే. కారణం, మీ వ్యాసాల ద్వారా అనేక విషయాలను నేను తెలుసుకోగలడం. ఈ వ్యాసం కూడా దానికి ఏమాత్రం మినహాయింపు కాదు. ఒక పద్యతాత్పర్యంతో నాకు విభేదం ఉన్నంత మాత్రాన, యిందులో మీరు పొందుపరచిన విస్తృత విషయ గౌరవాన్ని అది కించిత్తు కూడా తగ్గించదు.

    ఆ గురుభావంతోనే నాకున్న కొన్ని సందేహాలను మీముందుచుతున్నాను. ధ్వనిప్రస్థానం నాకెప్పుడూ అయోమయమే! ధ్వని విషయమై మీరీ వ్యాసంలో చెప్పిన (మొదటి పద్యం వివరణలో) కొన్ని అంశాలపై మరికొంత వివరణ అర్థిస్తున్నాను.

    1. “ఇది స్వతస్సిద్ధ అర్థశక్తిమూలకృత వస్తుధ్వని అని పెదకోమటిభూపాలుడు వివరించాడు. గాథాలక్షణమైన గుణీభూతవ్యంగ్యాన్ని సహృదయ హృదయాహ్లాదకరంగా ఆవిష్కరించి రసాలంకారాలను కావ్యార్థంలో అంతర్భవింపజేయగల వ్యాఖ్యాతలు ఆయన వంటివారు ఎంతోమంది ఉండరు.”

    ఇది నాకు సరిగా బోధపడలేదు. గుణీభూతవ్యంగ్యం ఉన్నచోట ధ్వని ఉండదు కదా? ఇక్కడున్నది వస్తుధ్వనియా గుణీభూతవ్యంగ్యమా? ఉన్నది గుణీభూతవ్యంగ్యమైనా, పెదకోమటిభూపాలుడు దాన్ని ధ్వనిగా సమర్థించాడన్నది మీ భావమా?

    2. ఇంతకీ యీ పద్యంలో ఉన్నది కేవల అలంకారమా, గుణీభూతవ్యంగ్యమా, ధ్వనియా? పద్మాన్ని ఆఘ్రాణించడం, తేటి కాటుకి గురికావడమనే వాచ్యార్థం నాయిక పరంగా ఎలానూ వివక్షితం కాదు. అంచేత నాయికపరంగా, అక్కడ ఉపపతి చేసిన దంతక్షతం అన్నది లక్ష్యార్థం అవుతుంది కదా? దాన్ని మించి అక్కడున్న వ్యంగ్యార్థం ఏమిటి? అది దేని ద్వారా కలుగుతోంది?

  10. శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన గురించి డా. తాడేపల్లి పతంజలి అభిప్రాయం:

    03/07/2015 7:48 am

    శ్రీనాథుని శాలివాహన సప్తశతి: తథ్యమిథ్యావివేచన ”వ్యాసాన్ని చదివాను.
    అసలు ఈ మధ్య కాలంలో ఇటువంటి కండ కలిగిన వ్యాసాలు చాలా తక్కువ వస్తున్నాయి.

    వారణసేయఁ దావిగొనవా… పద్యాన్ని వారు శ్రీ నాథకృతముగా నిర్థారించిన తీరు బాగుంది.

    ఈ సందర్భములో ఈ శ్లోకానికి రాళ్లపల్లి వారి ఈ అనువాద పద్యము కూడా గుర్తుకు వచ్చింది.

    ఎవరి కలుక గలుగదే ప్రియురాలి కె
    మ్మోవి కాటుగన్న? ముగుద! తేంట్లు
    ముసరియున్న తమ్మి మూరుకొంటివి వల
    దన్న వినక! సైపవమ్మ యిపుడు.

    అరుదైన ప్రయోగాలతో, ప్రతిపాదనలతో వ్యాసాన్ని వివేచించిన మురళీధరరావుగారికి, ప్రచురించిన మీకు ధన్యవాదములు.