పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/07/2015 3:09 pm

    ‘దేవుణ్ణి చూడాలనుకునేవారికి ‘,’దేవుడే అని తెలిసుకున్నవారికి ‘ లమధ్య తేడాని చూడండి.

    నిజమే తేడా ఉంది. కాని, ఇది ప్రస్తుత వ్యాసాంశానికి సంబంధంలేని విషయం కాబట్టి, ఇంకా కొనసాగించడం ఇంకో పక్కదోవలోకి దారితీయడం.
    ———
    విధేయుడు
    -శ్రీనివాస్

  2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    06/07/2015 12:06 am

    సందేహానికి మెలిక పడితే సమాధానికీ మెలిక పడుతుంది శ్రీనివాస్ – ‘దేవుణ్ణి చూడాలనుకునేవారికి ‘,’దేవుడే అని తెలిసుకున్నవారికి ‘ లమధ్య తేడాని చూడండి. పైగా , సందేహానికి ముందువాక్యం ,’ వాటి పని వాటిని చేసుకు పొనిద్దాం’ అన్నది వ్యవస్థమీద ఏవగింపు ఏమీ లేదని చెపుతున్నదని అనుకుంటాను.నమస్కారాలతో – తః తః
    తా.క. పేర్లూ, ఇంటి పేర్లూ తెలుగు లో ఉంటే సంబోధనలు (రాత లో) సులువు అవుతానుకుంటాను- తః తః

  3. నాయుడు – రాయుడు గురించి రవిచంద్ర అభిప్రాయం:

    06/06/2015 1:49 pm

    బాగుంది మీ ప్రయోగం. కథంతా చదివిన తరువాత చివర్లో ఏదో గగుర్పాటు. రాయుడు కేవలం డబ్బుకోసం ఆశపడి జీవితాంతం మూగవాడిగా ఎందుకు ఉండాలనుకున్నాడో పాఠకుల ఊహకే వదిలేశారన్నమాట.

  4. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/06/2015 12:19 pm

    విశ్వవిద్యాలయాలూ వాటిల్లో తెలుగు శాఖలూ అక్కరలేదని ఎవరు గానీ ఈ అభిప్రాయ వేదికలో అన్నారని నాకనిపించటం లేదు.

    బహుశా చూడకపోవచ్చు. తెలుగు నేర్పించడానికి, తెలుగులో పరిశోధన చేయడానికి విశ్వవిద్యాలయాలు అవసరం అంటే, ఎందుకు హిందీ ప్రచారసభలు మేలైన కృషి చేస్తున్నాయి, ఫలానావారు ఏ విశ్వవిద్యాలయాల ప్రమేయం లేకుండానే ఫలాన భాషను నేర్చేసుకున్నారు అని అంటే, దానికి స్పందిస్తూ తెలుగుకు విశ్వవిద్యాలయాల వ్యవస్థల అవసరం గురించి చెప్పడం, వాదాన్ని పక్కదోవ నుంచి సరైన దారికి మళ్ళించడానికి మాత్రమే. ఎవరన్నా ఆరునెల్లల్లోనే నేర్చేశాం అంటే, Learn Telugu in 30 days, Learn Tamil in 30 Days పుస్తకాలు గుర్తుకొచ్చి, నెలలోనే నేర్చేసుకోగలిగిన దానికి ఆరునెలలు ఎందుకు పట్టిందో అర్థం కాక, బహుశా ఆ పుస్తకాలు దొరకనందు వల్లనేమో అని తోచి రాసింది.

    వ్యాసం చివరి వాక్యంతో నాదీ విభేదించిన అభిప్రాయమే.

    అన్నట్టు, దేవుణ్ణి చూడాలనుకునేవారికి పురోహిత వ్యవస్థ తో ఎంత అవసరం ఉంటుంది?

    కనిపించేదంతా దేవుడే అని తెలిసుకున్నవారికి పురోహిత వ్యవస్థతో ఏవగింపు ఏం ఉంటుంది?

    ———–
    విధేయుడు
    -శ్రీనివాస్

  5. శేషు మావయ్య గురించి శంకర్ అభిప్రాయం:

    06/06/2015 10:30 am

    ప్రపంచలోని అతి తీపి పదార్థాలలోని ( మాటల లోని) అతి ముఖ్యమైనది మేన మామ అనే మాట! అందులో ఎంత ప్రేమ ! ఆ మామయ్య (మావఁయ్య)ఒక వింత అనుభూతికి సంబంధించిన సంబంధం! ఆ సంబంధం ఆ అనుభూతి బాబయ్య దగ్గర అంతగా కనబడవు! మామయ్యతో సంబంధం అత్తయ్య కి కూడా విస్తరిస్తుంది!అదో వింతయిన తీపి అనుబంధం -మన కుటుంబాలలో – మావఁయ్య అత్తయ్యల దగ్గరి స్వాతంత్ర్యం ఒక వింత ప్రపంచం! ఆ ప్రపంచాన్ని కన్నులకి కట్టడం- ఒక కథ లోనో నవల లోనో – చాలా చాలా కష్టమయిన ప్రయాస, ప్రక్రియ , ప్రయత్నం మూనూ! ఆ అనుభూతికి అందరూ లోనయినా చెప్పగలిగిన వారెందరు?! దాన్ని సాక్షాత్కరించడం అందరికీ సాధ్యమేనా?!అదీ ఒక సుతి మెత్తని సమస్య చుట్టూ అల్లి చూపించడం-సాధ్యం అయింది మన ఆర్ దమయంతి గార్కి ! కొండకచో మావఁయ్యల అవతారాలను తుండు గుండలోనూ చెవిలోని జందెం లోనూ అల్వోకగా కళ్ళముందు నిలబెట్టారు! అలా ఒక పాత్రను కళ్ళముందు నిలబెట్టడం సునిశితమైన కళ్ళకే సాధ్యం! ఆహా…… ! తన కొడుకు కోడలికి అడుగులకు మడుగులొత్తడం పాపం ఆ అమ్మ మాటలలో ఆ అమ్మ కన్నా మావఁయ్య పాత్రే కనబడింది కానీ అమ్మ పాత్ర కాదు ! రచయిత్రి కూడా అదే అలోచించారని నా మనసు లోని భావన! ఫొటో లోని ముగ్గురి చిత్రాలనూ చూపించడంలోని రచయిత్రి నేర్పు తెరవెనుక కథ చెప్పడం లోని ఆమె నేర్పునే సూచిస్తోంది! అత్తయ్య నవ్వు ని వర్ణించినపటి రచియిత్రి కథనం లో కూడా మావఁయా ముఖ్యంగానూ అత్తయ్య అంతే ముఖ్యంగానూ కనబడ్డారు! ఫోటోకి కారణమయిన కథ ‘నవ్వు’ వర్ణన లోనే పిండేసారు రచియిత్రి! ఆ నేర్పు ఆవిడకు ఎలా …….?! ఇహ కథనం విషయానికొస్తే ……?! మంచి ….. కాదు ఉదాత్త మయిన కథకు అంతే ఉదాత్తమయిన సముద్రమంత గంభీరమయిన పోకడ …?!

  6. ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి కామేశ్ చి. అభిప్రాయం:

    06/04/2015 11:24 pm

    చక్కటి రాజభవనపు పునాదులని శ్పృసిస్తూ, నేల మాళిగల్లో ఉన్న మూలనిధులు తెరిచి చూసుకుంటున్న అనుభూతి కలిగింధి.
    కొన్ని ఏళ్ళుగా వారి ప్రచురణల ద్వారా సురెశ్ గారు , జెజ్జల గారు, వెల్చేరు గారు, ఇలా ఈమాట లో చూస్తున్నా, ఇంత చరిత్ర ఉందని ఇప్పుదే తెలిసింది.
    ఈమాట మూలపురుషులందరికీ నమస్కారాలు. ఆ ప్రస్థానంలో, తెలుగులో ఇలా రాయగలగదానికి దోహదం చేసిన అందరికీ మరోసారి జై. ఈమాట మరో దశాబ్ధం, కాదు కాదు, మరో శతాబ్ధం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటూ.

    కామేశ్

  7. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:

    06/04/2015 9:12 am

    శ్రీనివాస్ నాగులపల్లి : మీరు వాదాన్ని పక్కదారి పట్టిస్తున్నారేమో ! విశ్వవిద్యాలయాలూ వాటిల్లో తెలుగు శాఖలూ అక్కరలేదని ఎవరు గానీ ఈ అభిప్రాయ వేదికలో అన్నారని నాకనిపించటం లేదు. తెలుగు భాష అంతర్జాతీయతను సంపాదించుకునే స్నాతకం విశ్వవిద్యాలయ తెలుగు శాఖల్లో జరగాలన్నది నవ్వు పుట్టిస్తోందని నా అభిప్రాయం. వ్యవస్థలు సమాజంలో తప్పదు . వాటి పని వాటిని చేసుకు పొనిద్దాం. అన్నట్టు, దేవుణ్ణి చూడాలనుకునేవారికి పురోహిత వ్యవస్థ తో ఎంత అవసరం ఉంటుంది?నమస్కారాలతో – తః తః

  8. పునరపి గురించి sujala అభిప్రాయం:

    06/04/2015 4:33 am

    కధ బాగు౦ది ఇలా౦టివాళ్ళి౦కా ఉన్నారా అ౦టే ఉన్నారనే నా మాట. అమెరికా అయినా ఆకాశమైనా మగవాళ్ళల్లో తాము ఆధిక్యులమన్న భావన పోవట౦లేదు. దానికి కారణాలు చెప్పడ౦ కష్ట౦ ఆడవాళ్ళ డామినేషన్ ఉన్న ఫామిలీస్ లేవని చెప్పలే౦ కానీ ఎక్కువ మ౦ది ఇళ్ళల్లో కాపర౦ నిలబడాల౦టే ఆడదే సద్దుకుపోవాలి.దీన్ని గురి౦చి చర్చి౦చాల౦టే సమయ౦ సరిపోదు. నా ఫ్రె౦డ్ కొడుకు చిన్నప్పుడు ఏ మాత్ర౦ చల్లారినా తి౦డి తినేవాడు కాడు.అలా౦టిది ఇప్పుడు ఫ్రిజ్ లోది తీసుకుని వేడి కూడా చేసుకోకు౦డా తి౦టాడు.వాడికిష్టమైన విషయాల్లో మాత్ర౦ భార్యకు చాలా కోపరేట్ చేస్తాడు. కానీ ఇష్ట౦ లేకపోతే రాయే. కానీ ఆడదైన పాపానికి ఆ అమ్మాయి అన్నీ భరి౦చాలి.ఇక్కడ ఆ అమ్మాయి ఇష్టాఇష్టాలకు విలువ లేదు. భర్త చేసేద౦తా దేముడి కరుణ అనుకోవాలా? ఒక్కసారైనా ఆమె కోరికేమిటో తెలుసుకున్నాడా?
    ఇ౦క కధకు పునరపి అని ఎ౦దుకు పెట్టారన్న మాటకు. ఆ ఇల్లాలు రోజూ పునరపి జనన౦ పునరపి మరణమే కదా!తెల్లవారాక మళ్ళి కొత్త జన్మ లాగానే ఆమె జీవిత౦

  9. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    06/04/2015 3:49 am

    బహుశా ఒక్క వెల్చేరు గారు తప్ప మనలో అందరమూ – రచయితలైనా పాఠకులైనా- తెలుగు విశ్వవిద్యాలయాలకు వెళ్ళి తెలుగు చదువుకోలేదు, నేర్చుకోలేదు అనుకుంటాను. వెయ్యేళ్ళపై బడ్డ భాషను, ఎంతో మంది కవులు, కళాకారులు, మేధావులు, దార్శనికులు వాడిన భాషను “నేర్చుకోవడం” అంటే ఏమిటో కూడా మనం ప్రశ్నించుకోవాలేమో. ఇప్పుడున్నాయో లేదో కాని, కొన్నేండ్ల కింద వరకు రైల్వే స్టేషన్లలో పుస్తకాల బండి మీద “Learn Telugu in 30 days, Learn Tamil in 30 days” అన్నవి కనపడేవి. కేవలం నెల రోజుల్లోనే తెలుగు నేర్చుకోగలిగితే, అదీ ఒక చిన్న పుస్తకంతోనే సాధ్యమైపోతే ఇక వేరే పుస్తకాలు, కోర్సులు, టీచర్లు, విశ్వవిద్యాలయాలు ఎందుకు? నేర్చుకునేవాళ్ళు ఎట్లా నేర్చుకున్నా, నేర్పించడానికి, ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియనివి నేర్చుకోగలగడానికి వ్యవస్థలు అవసరం.

    వ్యవస్థలో ఎన్ని లోపాలున్నా, లోపాలు దిద్దుకుంటాం కాని వ్యవస్థలే అవసరం లేదు అనలేము. “విశ్వవిద్యాలయం” అన్న పదం పుట్టకముందే తెలుగు పుట్టింది, పెరిగింది. కాని, ఇప్పడున్న కాలంలో, తెలుగు నేర్పే వ్యవస్థల పేర్లేవైనా, నిర్వహించే సంస్థలేమైనా, కొంత నిలకడ, నిబద్ధత ప్రజల పైసలతో ప్రభుత్వ సహకారంతో నడిచే విశ్వవిద్యాలయాలలో కనిపించడానికే అవకాశం ఎక్కువుంది. అంటే చిత్తశుద్ధితో నడిచే, నడిపించే వేరే సంస్థలు తక్కువా అని కాదు.

    రామానుజన్ యూనివర్సిటీకి పోకుండానే గణితంలో మేధావి అయ్యాడు అని మన పిల్లలను యూనివర్సిటీలకు పంపడం మానుకోము, మనం చదివిన బడులు, యూనివర్సిటీలలో లోపాలు బాగా మనకు తెలుసు కాబట్టి, వాటిని మూసేసుకోము. లోపాలు లేని వ్యవస్థలు లేవు. కాని తెలుగు భాషకు వ్యవస్థలే లేవు అన్న లోపం మాత్రం లేకుండా, రాకుండా చూసుకోవాల్సిన దార్శనికత, బాధ్యత తెలుగు వారందరిదేమో అనిపిస్తుంది.
    ———–
    విధేయుడు
    -శ్రీనివాస్

  10. తరువాతేమిటి? గురించి హెచ్చార్కె అభిప్రాయం:

    06/02/2015 4:35 pm

    తహ తహ గారు, నమస్తే, మీ వ్యాఖ్యను ఆప్పుడెందుకు చూడలేదో ఏమో చెప్ఫలేను. పద్యంలో ‘వ్యర్థంగా’ వ్యర్థ పదమే. థాంక్యూ.