“కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!” అన్న పేరా తర్వాత, దాని గురించే మరికొంత వివరిస్తూ రెండు పేరాలు రాసిన మీదట, “ఇది ఒక రకమైన అంతర్జాతీయత.” అన్నారు కదా. అంటే “ప్రపంచ భాష”, “అంతర్జాతీయ భాష” అనేవి పర్యాయపదాలే కదా. ఇక్కడ వ్యాసకర్తలు ముందు “ఒక రకమైన” అంతర్జాతీయత గురించి వివరించి, దానికి భిన్నమైన మరొక అంతర్జాతీయత గురించి మాట్లాడారు.
“ఉదాహరణకి, యూదులూ జెర్మన్‌లూ ఫ్రెంచ్ వాళ్లూ, తమ భాషలనీ సాహిత్యాలనీ అమెరికా లోని యూనివర్సిటీలలో ప్రవేశపెట్టి నిలబెట్టడం మూలంగా వాళ్ళ సంస్కృతికి ఒక అంతర్జాతీయ స్థితి సంపాదించగలిగారు. ఈ అంతర్జాతీయత ఎలాంటిది — అది తెలుగుకి వొస్తుందా అన్నది ప్రశ్న.”.
ఇక్కడ వాళ్ళు చెప్పదలుచుకొన్న రెండవ రకం అంతర్జాతీయత గురించి ప్రస్తావించి, ఆ తర్వాత పేరాలో దాన్ని నిర్వచించారు: “ముందు ఒక భాష అంతర్జాతీయ భాష ఎలా అవుతుంది అనే ప్రశ్న మరొకసారి వేసుకుని చూద్దాం.” అంటూ. వచ్చిన చిక్కేమిటంటే, అది ఆ పదానికి తామిస్తున్న నిర్వచనంలా కాకుండా ఆ పదానికున్న సార్వజనీనమైన అర్థాన్ని వివరిస్తున్నట్టుగా ఆ నిర్వచనం సాగింది. సహజంగానే అది పాఠకులను గందరగోళంలోకి నెడుతుంది.
ఇక చైనా విషయానికి వస్తే, చైనాలో రాజకీయశక్తుల కారణంగా ముందు ఇంగ్లీషు భాషా ప్రభావానికి ఆ సమాజం దూరంగా ఉంది. ఆ తర్వాత ప్రపంచంలో తమ శక్తిని పెంపొందించేందుకు శాస్త్రసాంకేతిక రంగాల అభివృద్ధి జరిగింది. అందువల్ల అక్కడ సహజంగానే శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వారి భాషలోనే అభివృద్ధి చెందింది. అంతేకాని తమ భాషను ప్రపంచభాష చేయడం కోసం శాస్త్రసాంకేతిక అభివృద్ధి జరగలేదు. మన సమాజం విషయానికి వస్తే, ఇప్పటికే మనం ఇంగ్లీషు ప్రభావానికి చాలానే గురయ్యాం. ఇక్కడ ఆర్థిక కారణాలకోసం శాస్త్రసాంకేతికాభివృద్ధి జరగవచ్చు. కాని అది తెలుగులో ఎలా జరుగుతుంది? అన్నది ప్రశ్న.
***
నాగరాజుగారూ,
నారాయణరావుగారి పుస్తకాలను నేను ఎక్కువగా చదవలేదు కాని, చదివినంతలో వారంటున్న విజ్ఞానం గురించి నా ఊహ యిది:
మనకంటూ (తెలుగువాళ్ళకు అనుకోండి, లేదా భారతీయులకు అనుకోండి) ఒక ప్రత్యేకమైన ప్రాపంచిక దృక్పథం ఒకటి ఉండేది. సాంఘికవ్యవస్థ, ఆర్థికవ్యవస్థ, కళలు, శాస్త్రాలు, చరిత్ర – ఇలా అనేక విషయాలమీద మనకి యిప్పుడు పాశ్చాత్యదృక్పథమే సర్వేసర్వత్ర వ్యాప్తిలో ఉంది. వీటి గురించి దీనికన్నా విభిన్నమైన ఒక ఆలోచన, దృక్పథం మనకి ఉండేవి. అవి మన సాహిత్యంలో ప్రతిఫలించాయి. పాశ్చాత్యదృష్టితో కాకుండా, ఈ సాహిత్యాన్ని “మనదైన దృష్టితో” పరిశీలిస్తే, మనం పోగొట్టుకొన్న ఆ ప్రాపంచిక దృక్పథంలోని అనేక పార్శ్వాలను మనం గమనించ వచ్చు. తద్వారా ప్రపంచానికి ఒక కొత్త Alternate World View చూపించవచ్చు. అది మనం ప్రపంచానికి అందించే విజ్ఞానంలో భాగమవుతుంది.
ఇది చెయ్యాలంటే, తెలుగుసాహిత్యాన్ని ఇంగ్లీషులోకి అనువదిస్తే సరిపోదు. తెలుగుసాహిత్యాన్ని భిన్నమైన దృష్టితో పరిశోధించి, అందులోని Alternate World Viewని విశ్లేషించి ప్రపంచానికి అందివ్వాలి. ఇలాంటి పరిశోధన విశ్వవిద్యాలయాలలోనే కదా జరగాలి!
ఈ వ్యాసం, దానిపై చర్చలు చదివినప్పుడు, కొంతకాలం క్రితం చదివిన ఒక పేపరు లోని క్రింద వాక్యాలు గుర్తుకొచ్చాయి:
“In this context, it becomes important to distinguish between language maintenance (sustaining an ecology in which a population can continue to speak their language) and language preservation (recording texts from a particular language graphically or mechanically). If the current ecology cannot be changed, should not linguists be more realistic and focus on language preservation rather than on maintenance?” – Colonisation, Globalisation, and the Future of Languages in the Twenty-first Century by Salikoko S. Mufwene.
ధన్యవాదాలు. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చే మాటలు చదువుతూ ఉంటే మరో వ్యాసం రాయాలనిపిస్తోంది.
ఆధునిక గణిత, సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో జరుగుతూన్న పరిశోధనాంశాలని వ్యక్త పరచడానికి తెలుగులో స్థోమత ఉంది సుమా అని ఎత్తి చూపడానికే ఈ వ్యాసం రాసేను. తెలుగుకి అంతర్జాతీయంగా గుర్తింపు రావాలనే విషయం మీద ఇటీవల ఈమాటలో జరుగుతూన్న చర్చలో పాల్గొంటూన్న వారు కూడ ఆధునిక గణిత, సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో వస్తువుని తీసుకుని రాయడం మొదలు పెడితే మన భాష యొక్క పరిధి పెరుగుతుంది. రోజులు మారుతున్నాయి కనుక “యథా ప్రజా తథా రాజా” అని అనుకుంటూన్నట్లే “రచ్చ గెలిచిన తరువాత ఇంట గెలుద్దాం.” – వేమూరి
“సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.”
undoubtedly. ఇప్పటికే అది చాలావరకూ అయిపోయిందేమో! ఒకవేళ తెలుగువారినుండి ఒక కాఫ్కానో, నెరూడానో వస్తే వాళ్ళు ఇంగ్లీషులోనే రాస్తారు.
బ్రిటిష్ వారిమూలంగా మనం ఏంకోల్పోయామో పక్కన పెడితే, ఇంగ్లీషునిమాత్రం మనం లాక్కున్నట్టున్నాం. ఇంకో ఒకటి/రెండు దశాబ్దాలలో ఇంగ్లీషుమీద ఆధిపత్యం భారతీయులదేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు?
ఆంధ్రదేశంలో ప్రస్తుతం తెలుగుయొక్క అధ్వాన్నస్థితిని కండ్లకు గట్టే చక్కని పద్యం. ఆంధ్రదేశంలోనే తెలుగు అంతరించిపోతుంటే అడిగే నాథుడు లేడు. ఇక అంతర్జాతీయతనుగఱించి ఆలోచించడం ప్రస్తుతపరిస్థితిలో అప్రస్తుత మనిపిస్తుంది. ‘ఉట్టి కెగురలేని జెట్టి స్వర్గాని కెగుర గలడా?’ అన్న దానిని ఇది తలపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల అధికారికచిహ్నాలను (official emblems) చూడండి. వానిలో ప్రధానంగా కన్పడేవి ఇంగ్లీషులో వ్రాసిన రాష్ట్రనామాలే. తెలుగులో వ్రాసినపేరు అప్రధానంగా ఒక మూలకు ఉంటుంది. ఇదొక్కటి చాలు తెలుగుపై ఆయా ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉందో గ్రహించడానికి.
తమ్మినేనివారు లేవనెత్తిన ‘కకుభ’పదవిచారం. కకుప్ అనునది స్త్రీలింగ భకారాంతపదం. కకుప్, కకుభౌ, కకుభః – అని ప్రథమావిభక్తిలో ఏక,ద్వి,బహువచనరూపాలు. అందుచేత కకుప్+అంత = కకుబంత అనే పదం నిర్దుష్టమైనపదం. ఐతే కకుభా అనే ఆకారాంతమైన స్త్రీలింగపదం కూడ ఉన్నది. అదివాడితే కకుభాంత అని కావాలి. కాని కకుబంత అనే పదం సాధువే కాక సౌమ్యంగా కూడ ఉన్నందున అది వాడటంలో పొరపాటు లేదు. కకుభశబ్దము పుల్లింగమైనప్పుడు వీణె కరివెకు, మద్దిచెట్టుకు, కకుభరాగానికి పేరౌతుంది. కకుప్ అని స్త్రీలింగమైనప్పుడు శోభ, దిక్కు, సంపంగిదండ ఇత్యాదుల కర్థమౌతుంది.
శ్రీ పప్పు :భారతాన అంగ్లేయుల పాలన అంతరించిన తర్వాత అనతి కాలంలోనే సైన్సూ టెక్నాలజీ ల తో ముడిబడ్డ విపణి తో పెనవేసుకు పోయిన ఒక కల్చురల్ హోమోజనై జషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. దీని ప్రభావాన ఇంగ్లిష్ ను అమెరికన్ మింగేయటం జరిగింది. ఇల్లాలు ,హవ్స్ వైఫ్ , కాఫీ మేకర్ లాగా హోం మేకర్ అయింది .
యూరప్ మెల్లిగా వెనకపడి పోయి – ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో అరవై ఐదు వరకూ అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుంచీ సైన్స్ విద్యార్థులకు జెర్మన్ నిబంధన గా బొధించేవాళ్ళు- పైన చెప్పిన అమెరికన్ ప్రభావం దట్టంగా అలుముకుని అమెరికా కడుపుకు రొట్టె తో బాటు బుఱ్ఱ కు జామూ ఇచ్చే వితరణ శీలిగా అవుపడటం తో భారతీయ భాషలు ఈ వ్యాపార సాంస్కృతిక బానిసత్వ సంకెళ్ళలోకి తమ చేతులు జాచాయి. ఇప్పుడు ‘వగచిన వగచిన యేమి ఫలము’. మీరన్న ఆనువాదాలు కూడా ప్రపంచాన్నంతటినీ కాక ఎసెన్షియల్ గా అమెరికాని ఇంప్రెస్ చేయటానికే సాగినట్టు గా నాకు అనిపిస్తుంది
ఫ్రపంచం చిన్నదయి పోతోందంటే అమెరికా పెద్దదయిపోతోందనేనన్న నిజానికి పది పదిహేనేళ్ళ క్రితం కళ్ళు తెరిచిన వాళ్ళు చైనా వాళ్ళు. అర్జెంటుగా చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా గుర్తించేటట్టు చేయగలిగారు. ఇక ముందు సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.
ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు ఓపికతో పద్యాల అర్థాలు, వాటి కథా సందర్భాలు విశేషాలు అందించినందుకు కృతజ్ఞతలు.
“అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం” అని శీర్షిక పెట్టిన వ్యాసంలో, అసలు దానికి సంబంధించిన పద్యమే కనిపించకపోవడం వెలితిగా ఉంటుందని తోచి ఆ పద్యాన్ని పంచుకోవడం.
—————————————————-
“అత్తఱి నిప్పు ద్రొక్కినటు, లౌదల దేల్దినినట్టు, లావ యు
వ్వెత్తుగ ద్రావినట్లు, విబుధేశుడు మాణవకోగ్రనిష్టకున్
జిత్తమునన్ దపించి, యతిశీఘ్రగతిన్ క్షితికేగుదెంచె, ద
ద్వృత్తము మానపింతునని వృద్ధమహీసుర వేష ధారియై” (పాండురంగ మాహాత్మ్యం పంచమాశ్వాసము)
—————————————————-
రామకృష్ణుని వర్ణనలో, పాత్రచిత్రణలో హాస్యం వ్యంగ్యం రెండూ సమ్మిళితమై కనిపిస్తున్నట్టుంది.
ఆ పద్యంలో శబ్ద పరంగా “కవుల్ వర్ణించి వర్ణించియున్” అని అదే పదాన్ని రెండుసార్లు చెప్తూ వర్ణించడం, చాల సహజంగ ఒప్పిన సొగసు. ఇప్పటికీ తెలుగు ఇళ్ళళ్ళో చాలా సార్లు చెప్పాం అనే అర్థంలో “చెప్పి చెప్పి” బేజారు ఎత్తిపోయాం అనే వాడుకను గుర్తుకుతెస్తుంది.
ఇక అయతుని పాత్ర చిత్రణ. “అన్నం న నింద్యాత్ తద్ వ్రతం” అని ఉపనిషత్తులు, వేదాలు చదువుకున్న అయుతుడు, అన్నాన్ని నిందించను అని చదువుకొని మరీ, అన్నం పెట్టే గృహస్తాశ్రమ ధర్మాన్ని నిందించాడని ఇంద్రుడు అనడం, కాదు, ఇంద్రుని పాత్రచేత చెప్పించడం ఆ చిత్తవృత్తిని రేఖామాత్రంగా కవి ఎత్తి చూపినట్టుంది. ఇక ముసలి బ్రాహ్మణుడి పాత్రచేత శృంగారం యొక్క గొప్పతనాన్ని చెప్పించడం, ఆ ఉదంతంలోకెల్ల హాస్యస్ఫోరకమైన చిత్రణగా కనపడుతుంది. ఇదెట్లా ఉందంటే, బట్టతల వ్యక్తి శీకాకాయ సబ్బుకు advertisement ఇచ్చినట్టుంది. అసలే వృధ్ధుడు. వృధ్ధునికి శృంగార తలపు రావడమే ఒక విపరీత అవస్థ. పండు ముసలి దాని విశిష్టతను ఇంకొకరికి బోధించడం ఇంకా పండిన అవస్థ. అంతేగాక వృధ్ధుని రూపంలో ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడు. అంటే ఎంతో మంది అప్సరసలున్నా ఉపశమింపని శృంగారవాంఛ తో ఎవ్వరూ పొందనివిధంగా నిలువెల్ల పరాభవం పొందిన ఇంద్రుడే దాల్చిన పాత్రతో సైతం శృంగార గొప్పతనాన్ని చెప్పించడం రామకృష్ణుని గడుసుతనం.
———
విధేయుడు
-శ్రీనివాస్
శ్రీ మోహన : తెలుగు ప్రపంచభాష కావడానికి ముందు భారతదేశములో అన్ని రంగాలలో (వాణిజ్య, విద్య, సాంస్కృతిక, సినిమా) విరివిగా వాడబడే భాషగా రూపు దిద్దుకోవాలి. .. ఆంటున్నారు మీరు కానీ కొన్ని సందర్భాలలో రచ్చ గెలిచి ఇంట గెలుస్తాము. ఆమెరికా లో సితార్ కు పేరొస్తే మనం ఇంట్లో రవిశంకర్ ఫొటో గోడకు తగిలించుకుంటాం. ‘ ఫథేర్ పాంచాలి’విషయమూ అంతే- ‘ ముఝే జాన్‌తా నహీ’ అంటే ‘మై నహీ జాన్తీ ‘ అనేనా?
నమస్కారాలతో -తః తః
తెలుగు ప్రపంచభాష కావడానికి ముందు భారతదేశములో అన్ని రంగాలలో (వాణిజ్య, విద్య, సాంస్కృతిక, సినిమా) విరివిగా వాడబడే భాషగా రూపు దిద్దుకోవాలి. కొత్త ఢిల్లీలో, కొల్కత్తాలో, లక్నోలో, ముంబైలో తెలుగు మాట్లాడితే అక్కడి వాళ్లు (ముఝే జాన్‌తా నహీ అనక) తెలుగులో బదులు చెప్పాలి, అనగా హిందీ, వంగ మున్నగు భాషలు తెలియకపోయినా తెలుగు మాత్రమే మాట్లాడి నెగ్గుకో కలగాలి. తెలుగు చిత్రాలకు పదేపదే బహుమతులు రావాలి. తెలుగును ఇతర రాష్ట్రములలోని వారందరఱు కళాశాలలో నేర్చుకోవాలి. తెలుగు పుస్తకాలను, అనువాదాలను వాళ్లు కొనుక్కోవాలి. అప్పుడు తెలుగు భాషకు ఒక స్థానము ఏర్పడుతుంది. విదేశీయులు కూడ ఈ భాషలో ఏదొ గొప్పదనము ఉన్నది, మనము కూడ నేర్చుకొందాము అని కుతూహల పడుతారు. అప్పుడు కూడ అది ఆంగ్లమును తొలగించ జాలదు. ఇలాటి పరిస్థితి భారతదేశములో తెలుగుకు ఏర్పడాలంటే మొదట తెలుగువాళ్లు తెలుగువాళ్లుగా ఉండాలి. కలలు కనడములో తప్పులేదు. విధేయుడు – మోహన
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
06/10/2015 3:09 pm
నమస్తే తఃతఃగారూ.

అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
06/10/2015 2:05 pm
హన్మంతరావు గారూ
ధన్యవాదాలు. ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చే మాటలు చదువుతూ ఉంటే మరో వ్యాసం రాయాలనిపిస్తోంది.
ఆధునిక గణిత, సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో జరుగుతూన్న పరిశోధనాంశాలని వ్యక్త పరచడానికి తెలుగులో స్థోమత ఉంది సుమా అని ఎత్తి చూపడానికే ఈ వ్యాసం రాసేను. తెలుగుకి అంతర్జాతీయంగా గుర్తింపు రావాలనే విషయం మీద ఇటీవల ఈమాటలో జరుగుతూన్న చర్చలో పాల్గొంటూన్న వారు కూడ ఆధునిక గణిత, సాంకేతిక, శాస్త్రీయ రంగాలలో వస్తువుని తీసుకుని రాయడం మొదలు పెడితే మన భాష యొక్క పరిధి పెరుగుతుంది. రోజులు మారుతున్నాయి కనుక “యథా ప్రజా తథా రాజా” అని అనుకుంటూన్నట్లే “రచ్చ గెలిచిన తరువాత ఇంట గెలుద్దాం.” – వేమూరి
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి నాగరాజు పప్పు అభిప్రాయం:
06/10/2015 11:21 am
undoubtedly. ఇప్పటికే అది చాలావరకూ అయిపోయిందేమో! ఒకవేళ తెలుగువారినుండి ఒక కాఫ్కానో, నెరూడానో వస్తే వాళ్ళు ఇంగ్లీషులోనే రాస్తారు.
బ్రిటిష్ వారిమూలంగా మనం ఏంకోల్పోయామో పక్కన పెడితే, ఇంగ్లీషునిమాత్రం మనం లాక్కున్నట్టున్నాం. ఇంకో ఒకటి/రెండు దశాబ్దాలలో ఇంగ్లీషుమీద ఆధిపత్యం భారతీయులదేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు?
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి దేశికాచారి అభిప్రాయం:
06/10/2015 10:35 am
ఆంధ్రదేశంలో ప్రస్తుతం తెలుగుయొక్క అధ్వాన్నస్థితిని కండ్లకు గట్టే చక్కని పద్యం. ఆంధ్రదేశంలోనే తెలుగు అంతరించిపోతుంటే అడిగే నాథుడు లేడు. ఇక అంతర్జాతీయతనుగఱించి ఆలోచించడం ప్రస్తుతపరిస్థితిలో అప్రస్తుత మనిపిస్తుంది. ‘ఉట్టి కెగురలేని జెట్టి స్వర్గాని కెగుర గలడా?’ అన్న దానిని ఇది తలపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణరాష్ట్రాల అధికారికచిహ్నాలను (official emblems) చూడండి. వానిలో ప్రధానంగా కన్పడేవి ఇంగ్లీషులో వ్రాసిన రాష్ట్రనామాలే. తెలుగులో వ్రాసినపేరు అప్రధానంగా ఒక మూలకు ఉంటుంది. ఇదొక్కటి చాలు తెలుగుపై ఆయా ప్రభుత్వాలకు ఎంత మక్కువ ఉందో గ్రహించడానికి.
తమ్మినేనివారు లేవనెత్తిన ‘కకుభ’పదవిచారం. కకుప్ అనునది స్త్రీలింగ భకారాంతపదం. కకుప్, కకుభౌ, కకుభః – అని ప్రథమావిభక్తిలో ఏక,ద్వి,బహువచనరూపాలు. అందుచేత కకుప్+అంత = కకుబంత అనే పదం నిర్దుష్టమైనపదం. ఐతే కకుభా అనే ఆకారాంతమైన స్త్రీలింగపదం కూడ ఉన్నది. అదివాడితే కకుభాంత అని కావాలి. కాని కకుబంత అనే పదం సాధువే కాక సౌమ్యంగా కూడ ఉన్నందున అది వాడటంలో పొరపాటు లేదు. కకుభశబ్దము పుల్లింగమైనప్పుడు వీణె కరివెకు, మద్దిచెట్టుకు, కకుభరాగానికి పేరౌతుంది. కకుప్ అని స్త్రీలింగమైనప్పుడు శోభ, దిక్కు, సంపంగిదండ ఇత్యాదుల కర్థమౌతుంది.
‘కకుభో రాగభేదేఽపి, వీణాంగే, అర్జునపాదపే’ అనియు, ‘కకుప్ శోభా, దిశోః ,శాస్త్రే, ప్రవేణ్యాం, చంపకస్రజి’ అని విశ్వకోశనిఘంటువు.
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:
06/10/2015 4:55 am
శ్రీ పప్పు :భారతాన అంగ్లేయుల పాలన అంతరించిన తర్వాత అనతి కాలంలోనే సైన్సూ టెక్నాలజీ ల తో ముడిబడ్డ విపణి తో పెనవేసుకు పోయిన ఒక కల్చురల్ హోమోజనై జషన్ ప్రపంచాన్ని కమ్మేసింది. దీని ప్రభావాన ఇంగ్లిష్ ను అమెరికన్ మింగేయటం జరిగింది. ఇల్లాలు ,హవ్స్ వైఫ్ , కాఫీ మేకర్ లాగా హోం మేకర్ అయింది .
యూరప్ మెల్లిగా వెనకపడి పోయి – ఆంధ్ర విశ్వ కళా పరిషత్ లో అరవై ఐదు వరకూ అంతకు కొన్ని సంవత్సరాలు ముందు నుంచీ సైన్స్ విద్యార్థులకు జెర్మన్ నిబంధన గా బొధించేవాళ్ళు- పైన చెప్పిన అమెరికన్ ప్రభావం దట్టంగా అలుముకుని అమెరికా కడుపుకు రొట్టె తో బాటు బుఱ్ఱ కు జామూ ఇచ్చే వితరణ శీలిగా అవుపడటం తో భారతీయ భాషలు ఈ వ్యాపార సాంస్కృతిక బానిసత్వ సంకెళ్ళలోకి తమ చేతులు జాచాయి. ఇప్పుడు ‘వగచిన వగచిన యేమి ఫలము’. మీరన్న ఆనువాదాలు కూడా ప్రపంచాన్నంతటినీ కాక ఎసెన్షియల్ గా అమెరికాని ఇంప్రెస్ చేయటానికే సాగినట్టు గా నాకు అనిపిస్తుంది
ఫ్రపంచం చిన్నదయి పోతోందంటే అమెరికా పెద్దదయిపోతోందనేనన్న నిజానికి పది పదిహేనేళ్ళ క్రితం కళ్ళు తెరిచిన వాళ్ళు చైనా వాళ్ళు. అర్జెంటుగా చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా గుర్తించేటట్టు చేయగలిగారు. ఇక ముందు సైన్స్ – టెక్నాలజీలలతో ఆధిపత్యమే సాంస్కృతిక ఆధిపత్యమై తిష్టవేస్తుంది.
నమస్కారలతో
తః తః
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి hanmantharao అభిప్రాయం:
06/10/2015 4:42 am
వేమూరి గారూ,
ఒక గణిత విషయాన్ని ఇంత రంజకంగా చెప్పచ్చని తెలీదు. చాలా బాగుందండీ…..
నాకు నచ్చిన పద్యం: అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
06/09/2015 11:28 pm
ఎప్పటిలాగే మిత్రులు కామేశ్వరరావుగారు ఓపికతో పద్యాల అర్థాలు, వాటి కథా సందర్భాలు విశేషాలు అందించినందుకు కృతజ్ఞతలు.
“అమరపతి చేత ఆవరసం త్రాగించిన కవిదిగ్గజం” అని శీర్షిక పెట్టిన వ్యాసంలో, అసలు దానికి సంబంధించిన పద్యమే కనిపించకపోవడం వెలితిగా ఉంటుందని తోచి ఆ పద్యాన్ని పంచుకోవడం.
—————————————————-
“అత్తఱి నిప్పు ద్రొక్కినటు, లౌదల దేల్దినినట్టు, లావ యు
వ్వెత్తుగ ద్రావినట్లు, విబుధేశుడు మాణవకోగ్రనిష్టకున్
జిత్తమునన్ దపించి, యతిశీఘ్రగతిన్ క్షితికేగుదెంచె, ద
ద్వృత్తము మానపింతునని వృద్ధమహీసుర వేష ధారియై” (పాండురంగ మాహాత్మ్యం పంచమాశ్వాసము)
—————————————————-
రామకృష్ణుని వర్ణనలో, పాత్రచిత్రణలో హాస్యం వ్యంగ్యం రెండూ సమ్మిళితమై కనిపిస్తున్నట్టుంది.
ఆ పద్యంలో శబ్ద పరంగా “కవుల్ వర్ణించి వర్ణించియున్” అని అదే పదాన్ని రెండుసార్లు చెప్తూ వర్ణించడం, చాల సహజంగ ఒప్పిన సొగసు. ఇప్పటికీ తెలుగు ఇళ్ళళ్ళో చాలా సార్లు చెప్పాం అనే అర్థంలో “చెప్పి చెప్పి” బేజారు ఎత్తిపోయాం అనే వాడుకను గుర్తుకుతెస్తుంది.
ఇక అయతుని పాత్ర చిత్రణ. “అన్నం న నింద్యాత్ తద్ వ్రతం” అని ఉపనిషత్తులు, వేదాలు చదువుకున్న అయుతుడు, అన్నాన్ని నిందించను అని చదువుకొని మరీ, అన్నం పెట్టే గృహస్తాశ్రమ ధర్మాన్ని నిందించాడని ఇంద్రుడు అనడం, కాదు, ఇంద్రుని పాత్రచేత చెప్పించడం ఆ చిత్తవృత్తిని రేఖామాత్రంగా కవి ఎత్తి చూపినట్టుంది. ఇక ముసలి బ్రాహ్మణుడి పాత్రచేత శృంగారం యొక్క గొప్పతనాన్ని చెప్పించడం, ఆ ఉదంతంలోకెల్ల హాస్యస్ఫోరకమైన చిత్రణగా కనపడుతుంది. ఇదెట్లా ఉందంటే, బట్టతల వ్యక్తి శీకాకాయ సబ్బుకు advertisement ఇచ్చినట్టుంది. అసలే వృధ్ధుడు. వృధ్ధునికి శృంగార తలపు రావడమే ఒక విపరీత అవస్థ. పండు ముసలి దాని విశిష్టతను ఇంకొకరికి బోధించడం ఇంకా పండిన అవస్థ. అంతేగాక వృధ్ధుని రూపంలో ఉన్నది సాక్షాత్తు ఇంద్రుడు. అంటే ఎంతో మంది అప్సరసలున్నా ఉపశమింపని శృంగారవాంఛ తో ఎవ్వరూ పొందనివిధంగా నిలువెల్ల పరాభవం పొందిన ఇంద్రుడే దాల్చిన పాత్రతో సైతం శృంగార గొప్పతనాన్ని చెప్పించడం రామకృష్ణుని గడుసుతనం.
———
విధేయుడు
-శ్రీనివాస్
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
06/09/2015 10:55 pm
‘ఇంటవెలుగు నింపి ఇకపైన కకుబంత’
‘కకుభాంత’ అని ఉండాలేమో !!
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తః తః అభిప్రాయం:
06/09/2015 9:01 pm
శ్రీ మోహన : తెలుగు ప్రపంచభాష కావడానికి ముందు భారతదేశములో అన్ని రంగాలలో (వాణిజ్య, విద్య, సాంస్కృతిక, సినిమా) విరివిగా వాడబడే భాషగా రూపు దిద్దుకోవాలి. .. ఆంటున్నారు మీరు కానీ కొన్ని సందర్భాలలో రచ్చ గెలిచి ఇంట గెలుస్తాము. ఆమెరికా లో సితార్ కు పేరొస్తే మనం ఇంట్లో రవిశంకర్ ఫొటో గోడకు తగిలించుకుంటాం. ‘ ఫథేర్ పాంచాలి’విషయమూ అంతే- ‘ ముఝే జాన్‌తా నహీ’ అంటే ‘మై నహీ జాన్తీ ‘ అనేనా?
నమస్కారాలతో -తః తః
తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన అభిప్రాయం:
06/09/2015 6:12 pm