తెలుగు కావ్యాలను ఈ విధంగా కూలంకషంగా పరిశీలించి మౌలిక ప్రతిపాదనలను చేయడానికి పూనుకుంటున్నవారిని చూస్తే సంతోషం కలుగుతుంది.వ్యాసంలో అనేక విషయాలను పరిశీలించి చక్కగా వివరించారు.
రసస్వరూపావగాహన లేని ఆధునిక కవులు ఎన్నో కావ్యాలను ఈ విధంగా అధిక్షేపించారు. గతశతాబ్దం నుంచే ఇది మొదలైందనుకుంటాను. దానివల్ల తర్వాతి తరాలకు ఆ కావ్యాల భాషాపరమైన ఇతరప్రయోజనాలు కూడా లేకుండా పోతున్నాయి. వ్యాసకర్త తథ్యమిథ్యా వివేచన బాగున్నది.
దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? అని అనామకుడు గారన్నది వాస్తవం.(ఈ నాటి కవిత్వానికి ఉన్న పెద్ద లోపం అదే కదా.)అందువల్ల ఔచిత్య విచారణ విషయంలో మాత్రం ఇంకొంచెం అనుమానం మిగిలే ఉన్నది.
శ్రీహర్ష ప్రణీతంబైన శృంగార నైషధము తెలుగు వారి పుణ్యఫలము వలన శ్రీనాథునిచే ఆంధ్రీకరించ బడింది. కావ్యోపసంహారపు పలుకు లసంబద్ధమనియు యవి శ్రీనాథుల వారివి కావనియు సోదాహరణముగా శ్రీమురళీధరరావు గారు విశదీకరించడములో కృతకృత్యులయి యాంధ్రశృంగార నైషధమునకు, శ్రీనాథులకు నెంతో మేలు చేసారు.
ఈ సుదీర్ఘ ప్రసంగము చదువుట కాసక్తి కరముగా నున్నా నా వంటి పామరులకు నిఘంటు పరిశోధన తఱచు అవసర ముంటుంది. ఆంధ్రభారతి వారికి నా కృతజ్ఞతలు. ఏమైనా చదువుతే నా కందులో విషయ పరముగానో, లేక భాషాపరముగానో కొంత ప్రయోజనము కలగాలని యాశిస్తాను. ఏల్చూరి వారి వ్యాసములు, ప్రసంగములు నాకా మేలుని సమకూరుస్తాయి. శరీరవ్యాయాయ శ్రమకును, మస్తిష్కాధ్యయన శ్రమకును వయోపరిమితి లేదని నా బోటి వారు నిరూపిస్తూనే ఉంటాము గదా !
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వంటి విబుధులు , విజ్ఞానులు యీ కాలములో కూడా మన మధ్య ప్రవర్తిల్లడము మన అదృష్టము. వారికి , వారి యతులిత విద్వత్తుకు నా సుమాంజలి. భగవంతుడు వారికి దీర్ఘాయు రారోగ్య సౌభాగ్యములు సమకూర్చాలని నా శుభాకాంక్షలు .
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి యీ ప్రసంగ సాంగత్యము వలన ఎప్పటి వలె నేను కొన్ని క్రొత్త పదాలు నేర్చుకున్నాను. అవి మస్తిష్కములో యెన్ని దినాలు నిలుస్తాయో తెలియదు కాని యా క్రొత్త పదాల కర్ధాలు మిగిలిన పాఠకుల సౌలభ్యము కొఱ కిక్కడ నిలుపుతున్నాను.
నేను నా వ్యాసం క్లుప్తంగా ఉంచుదామన్న ఉద్దేశంతో బాబ్ డిలన్ ‘ప్రేమ’ కవితల గురించి రాయలేదు. చినవీరభద్రుడుగారు, ఆ ప్రస్తావనతెచ్చి, ప్రేమ కవితలగురించి చెప్పవలసిన అవసరం సూచించారు.
1965 లో లాస్ యాంజెలస్ లో పత్రికాముఖంగా డిలన్ చెప్పిన మాటలు:
What does the word protest mean to you?
“To me? Means uh — singing when I don’t really wanna sing.”
What?
“It means singing against your wishes to sing.”
Do you sing against your wishes to sing?
“No, no.”
Do you sing protest songs?
“No.”
What do you sing?
” I sing love songs.”
….
Of course, the song, Lay, Lady, Lay ‘has become one of Dylan’s best-known love songs, almost by accident.’ — (From the note in the album ‘Biograph.’)
In addition, “On a Night Like This,” is also equally worth listening to. Both the poems are available on Bob Dylan’s web page.
డిల్లన్ పేరు చాల రోజులబట్టి వింటున్నాను కాని ఇంత సమగ్రంగా తెలుసుకోలేదు. తెలుగు సాహిత్యకారుల గురించే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇతర భాషలలోని సాహిత్య చరిత్రని కూడ తెలుసుకోవడం మంచిది కదా! వ్యాసం బాగుంది.
చాలా చక్కటి వ్యాసం. డిలన్ కి నోబెల్ బహుమతి వచ్చిన తరువాత, ఇంత సవివరంగా, సమగ్రంగా ఉన్న వ్యాసం ఇంటర్నెట్ లో మరెక్కడా (ఇంగ్లీషులో) కూడా కనిపించలేదు. పాట,పద్యం- ఈ రెండింటి గురించీ శ్రీశ్రీ చాలా స్పష్టంగా చెప్పాడు: Poetry that is spoken and poetry that is sung. అని. ఆయన కవిత్వప్రస్థానమంతా పాడుకునే కవిత్వం నుంచి మాటాడుకునే కవిత్వం వైపు నడిచింది. తిక్కన పద్యం రాసినా, అది మాటాడుకునే తరహాలోనే ఉంటుందనీ, నన్నయ, కృష్ణశాస్త్రి వంటి కవులు పాడుకునే తరహాలో రాసారనీ శ్రీశ్రీ భావన. అయితే ఆయన ఆధునిక కవి. ఆధునికానంతర కాలంలో కవిత్వం తిరిగి మాటాడుకునే తరహానుంచి పాడుకునే తరహాకు మలుపు తిరిగింది. తెలుగులో ఇది విరసం ఆవిర్భావంతో మొదలయ్యింది. డిలన్ కవిత్వం పాటనే గాని, అది మాట్లాడినట్టే ఉంటుంది. బహుశా ఆ కవిత్వం సమ్మోహనీయంగా ఉండటానికి అది కూడా కారణమనుకుంటాను. ఇక డిలన్ కేవలం సామాజిక నిరసన కవి మాత్రమే కాదు, అంతకన్నా కూడా అరుదైన ప్రేమకవి. సమకాలికప్రపంచంలో ప్రేమ కవిత్వానికి అతడొక కొత్త డిక్షన్ ఇచ్చాడు. డిలన్ లోని ఆ అపురూపమైన పార్శ్వాన్ని ఈ వ్యాసం చాలా స్పష్టంగానూ, ఆవశ్యకంగానూ పైకెత్తి చూపింది. తెలుగు సాహిత్య, కళా ప్రశంసలకు వేలూరి అందిస్తున్న ఉపాదానం వెలకట్టలేనిది.
ఫ్రాగ్మెంట్స్ గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/08/2016 4:28 am
బాబా గారు చాల బావుంది కవిత ప్రాగ్మేంట్ గా
ఆకు గురించి సాంఘిక అభిప్రాయం:
11/07/2016 8:59 am
“గాలి సాయంతో
గలగలమని నవ్వాను”
ఎంతో బాగుంది!
ఆకులతో అనుభూతి..
సాంఘిక
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:
11/07/2016 3:22 am
తెలుగు కావ్యాలను ఈ విధంగా కూలంకషంగా పరిశీలించి మౌలిక ప్రతిపాదనలను చేయడానికి పూనుకుంటున్నవారిని చూస్తే సంతోషం కలుగుతుంది.వ్యాసంలో అనేక విషయాలను పరిశీలించి చక్కగా వివరించారు.
రసస్వరూపావగాహన లేని ఆధునిక కవులు ఎన్నో కావ్యాలను ఈ విధంగా అధిక్షేపించారు. గతశతాబ్దం నుంచే ఇది మొదలైందనుకుంటాను. దానివల్ల తర్వాతి తరాలకు ఆ కావ్యాల భాషాపరమైన ఇతరప్రయోజనాలు కూడా లేకుండా పోతున్నాయి. వ్యాసకర్త తథ్యమిథ్యా వివేచన బాగున్నది.
దోషవిచారణ చేయగలిగిన పండితులు లేకపోవడం – కావ్యపు గుణాన్ని ఉత్కర్షించే కారణం కాజాలదు కదా? అని అనామకుడు గారన్నది వాస్తవం.(ఈ నాటి కవిత్వానికి ఉన్న పెద్ద లోపం అదే కదా.)అందువల్ల ఔచిత్య విచారణ విషయంలో మాత్రం ఇంకొంచెం అనుమానం మిగిలే ఉన్నది.
నమస్కారములు.
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
11/06/2016 7:07 pm
శ్రీహర్ష ప్రణీతంబైన శృంగార నైషధము తెలుగు వారి పుణ్యఫలము వలన శ్రీనాథునిచే ఆంధ్రీకరించ బడింది. కావ్యోపసంహారపు పలుకు లసంబద్ధమనియు యవి శ్రీనాథుల వారివి కావనియు సోదాహరణముగా శ్రీమురళీధరరావు గారు విశదీకరించడములో కృతకృత్యులయి యాంధ్రశృంగార నైషధమునకు, శ్రీనాథులకు నెంతో మేలు చేసారు.
ఈ సుదీర్ఘ ప్రసంగము చదువుట కాసక్తి కరముగా నున్నా నా వంటి పామరులకు నిఘంటు పరిశోధన తఱచు అవసర ముంటుంది. ఆంధ్రభారతి వారికి నా కృతజ్ఞతలు. ఏమైనా చదువుతే నా కందులో విషయ పరముగానో, లేక భాషాపరముగానో కొంత ప్రయోజనము కలగాలని యాశిస్తాను. ఏల్చూరి వారి వ్యాసములు, ప్రసంగములు నాకా మేలుని సమకూరుస్తాయి. శరీరవ్యాయాయ శ్రమకును, మస్తిష్కాధ్యయన శ్రమకును వయోపరిమితి లేదని నా బోటి వారు నిరూపిస్తూనే ఉంటాము గదా !
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి వంటి విబుధులు , విజ్ఞానులు యీ కాలములో కూడా మన మధ్య ప్రవర్తిల్లడము మన అదృష్టము. వారికి , వారి యతులిత విద్వత్తుకు నా సుమాంజలి. భగవంతుడు వారికి దీర్ఘాయు రారోగ్య సౌభాగ్యములు సమకూర్చాలని నా శుభాకాంక్షలు .
శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:
11/06/2016 5:39 pm
శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారి యీ ప్రసంగ సాంగత్యము వలన ఎప్పటి వలె నేను కొన్ని క్రొత్త పదాలు నేర్చుకున్నాను. అవి మస్తిష్కములో యెన్ని దినాలు నిలుస్తాయో తెలియదు కాని యా క్రొత్త పదాల కర్ధాలు మిగిలిన పాఠకుల సౌలభ్యము కొఱ కిక్కడ నిలుపుతున్నాను.
అనుష్ఠానము = నడవడి, ఆచారము ; ఉపలక్షించు = వీక్షించు, చూచు
అతిరిక్తము = మించినది, హెచ్చినది ;
అభిధేయము = శబ్దార్ధములు, గ్రంధ ప్రాతిపదిక విషయము, పేరు
అతివేలము = హెచ్చు ; ఉపస్కారము = సంబారము
సంతరించు = ఆదరించు ; ప్రకల్పించు = కలిగించు ; సుభగము = మనోహరము
ఆకీర్ణము = సంకీర్ణము , కలిసినది , వ్యాపించినది,
అధికరణము = ఆధారము ; నైయాయికుడు = న్యాయశాస్త్ర కోవిదుడు ;
ఆత్మప్రత్యయము = ఆత్మవిశ్వాసము ; (అ) సమీచీనము = ( అ ) పరిశుద్ధము
అధ్వము = త్రోవ ; వివక్షితము = చెప్పదలచిన విషయము
శీర్షణ్యము = శిరస్త్రాణము, తలమానికము ; వ్యపదేశము = కపటము, ఆంతర్యము ;
ముకుటము = మకుటము ; స్థగితము = కప్పపడినది
అనుస్యూతి = కూర్పు
Yippee! I’m a poet, and I know it గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:
11/06/2016 4:44 pm
వాడ్రేవు చినవీరభద్రుడు గారికి,శ్యామ్ గారికీ కృతజ్ఞతలు.
నేను నా వ్యాసం క్లుప్తంగా ఉంచుదామన్న ఉద్దేశంతో బాబ్ డిలన్ ‘ప్రేమ’ కవితల గురించి రాయలేదు. చినవీరభద్రుడుగారు, ఆ ప్రస్తావనతెచ్చి, ప్రేమ కవితలగురించి చెప్పవలసిన అవసరం సూచించారు.
1965 లో లాస్ యాంజెలస్ లో పత్రికాముఖంగా డిలన్ చెప్పిన మాటలు:
What does the word protest mean to you?
“To me? Means uh — singing when I don’t really wanna sing.”
What?
“It means singing against your wishes to sing.”
Do you sing against your wishes to sing?
“No, no.”
Do you sing protest songs?
“No.”
What do you sing?
” I sing love songs.”
….
Of course, the song, Lay, Lady, Lay ‘has become one of Dylan’s best-known love songs, almost by accident.’ — (From the note in the album ‘Biograph.’)
In addition, “On a Night Like This,” is also equally worth listening to. Both the poems are available on Bob Dylan’s web page.
Regards,
Veluri Venkateswara Rao
Yippee! I’m a poet, and I know it గురించి Rao Vemuri అభిప్రాయం:
11/06/2016 12:21 pm
డిల్లన్ పేరు చాల రోజులబట్టి వింటున్నాను కాని ఇంత సమగ్రంగా తెలుసుకోలేదు. తెలుగు సాహిత్యకారుల గురించే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇతర భాషలలోని సాహిత్య చరిత్రని కూడ తెలుసుకోవడం మంచిది కదా! వ్యాసం బాగుంది.
Yippee! I’m a poet, and I know it గురించి Chinaveerabhadrudu అభిప్రాయం:
11/05/2016 11:11 pm
చాలా చక్కటి వ్యాసం. డిలన్ కి నోబెల్ బహుమతి వచ్చిన తరువాత, ఇంత సవివరంగా, సమగ్రంగా ఉన్న వ్యాసం ఇంటర్నెట్ లో మరెక్కడా (ఇంగ్లీషులో) కూడా కనిపించలేదు. పాట,పద్యం- ఈ రెండింటి గురించీ శ్రీశ్రీ చాలా స్పష్టంగా చెప్పాడు: Poetry that is spoken and poetry that is sung. అని. ఆయన కవిత్వప్రస్థానమంతా పాడుకునే కవిత్వం నుంచి మాటాడుకునే కవిత్వం వైపు నడిచింది. తిక్కన పద్యం రాసినా, అది మాటాడుకునే తరహాలోనే ఉంటుందనీ, నన్నయ, కృష్ణశాస్త్రి వంటి కవులు పాడుకునే తరహాలో రాసారనీ శ్రీశ్రీ భావన. అయితే ఆయన ఆధునిక కవి. ఆధునికానంతర కాలంలో కవిత్వం తిరిగి మాటాడుకునే తరహానుంచి పాడుకునే తరహాకు మలుపు తిరిగింది. తెలుగులో ఇది విరసం ఆవిర్భావంతో మొదలయ్యింది. డిలన్ కవిత్వం పాటనే గాని, అది మాట్లాడినట్టే ఉంటుంది. బహుశా ఆ కవిత్వం సమ్మోహనీయంగా ఉండటానికి అది కూడా కారణమనుకుంటాను. ఇక డిలన్ కేవలం సామాజిక నిరసన కవి మాత్రమే కాదు, అంతకన్నా కూడా అరుదైన ప్రేమకవి. సమకాలికప్రపంచంలో ప్రేమ కవిత్వానికి అతడొక కొత్త డిక్షన్ ఇచ్చాడు. డిలన్ లోని ఆ అపురూపమైన పార్శ్వాన్ని ఈ వ్యాసం చాలా స్పష్టంగానూ, ఆవశ్యకంగానూ పైకెత్తి చూపింది. తెలుగు సాహిత్య, కళా ప్రశంసలకు వేలూరి అందిస్తున్న ఉపాదానం వెలకట్టలేనిది.
తెగులుకి శిక్ష గురించి Lalitha TS అభిప్రాయం:
11/05/2016 8:19 pm
మీ – “పచిసూ శిక్ష”, “భస్మ ఖచిత తృణ సింహాసనం” – లకు చప్పట్లు.
బావుందండీ మీ తెలుగు బ్లాగుల వి”శ్లేష”ణ 🙂
ఫ్రాగ్మెంట్స్ గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
11/05/2016 8:34 am
ధన్యవాదాలు అండి. మీ వ్యాఖ్య నాకు చాలా విలువైనది సర్.