పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16471

  1. పాకశాలలో పాణినీయం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    01/29/2017 10:40 pm

    పాణిని, ప్రోగ్రామింగ్

    కథ రక్తి కట్టించింది, భాషపై రచయితకున్న పట్టు ఆకట్టుకుంది. కాని పాణిని సూత్రాలు ఓ పట్టాన అర్థం కాలేదు; అందుకు కొన్నేళ్ళ పాటైనా శ్రమ పడాలనుకుంటాను. నాకు C తెలుసు గాని సంస్కృతం తెలియదు, కథలోనూ వ్యాఖ్యల్లోనూ కంప్యూటర్ ప్రస్తావన ఉండటాన కొందరికైనా ఆసక్తిగా ఉండొచ్చని ఇది వ్రాస్తున్నాను.

    గత శతాబ్దపు మొదటి భాగంలో గణిత పునాదుల మీద ముమ్మరంగా పరిశోధనలు జరిగాయి. 1920 ప్రాంతంలో పాతికేళ్ళయినా నిండని Emil Post అన్న గణిత తార్కికుడు ప్రిన్స్టన్ లో ఉండగా, ఓ production system ప్రతిపాదించాడు. పరిమితమైన గుర్తులని మార్చే సూత్రాల మూలంగా, మౌలికమైన గుర్తులతో మొదలెట్టి, అనేక రూపాలని ఎలా సృష్టించవచ్చో చూపెట్టాడు. మచ్చుకి, రెండు గుర్తులు ( a, b ), అయిదు సూత్రాలు (P->aPa, P->bPb, P->a, P->b, P-> ఎడమ చేతి వైపు ఉన్న దానికి బదులు కుడివైపు ఉన్న దానిని వాడవచ్చు); వీటితో, a, b, aaa, bbb, aba, bab, … ఎటువైపు నుండి చదివినా ఒకే విధంగా ఉండే a, b లతో ఉన్న మాటలన్నిటినీ రాబట్టవచ్చు.

    1950ల మధ్యలో MIT కి చెందిన ముప్ఫై ఏళ్ళ లోపల వయసున్న Noam Chomsky భాషాశాస్త్రంలో పెద్ద దుమారం లేపాడు. సృష్టిలో భాష మానవులకి మాత్రమే ఉందనీ, రెండు మూడేళ్ళకే బడీ, వ్యాకరణ పాఠాలూ లేకుండానే, పిల్లలు మాతృభాష నేర్చుకుంటారనీ, అందుకు వాళ్ళకి సార్వత్రిక వ్యాకరణం (Universal Grammar) సహజ సంపత్తుగా ఉండి ఉండాలనీ, అందువలనే ఎక్కడ పెరిగితే అక్కడి భాషని నేర్చుకుంటారని ప్రతిపాదించాడు. మరి ఆ వ్యాకరణ సూత్రాలు ఎలా ఉండొచ్చు? భౌతిక శాస్త్రవేత్తలు కనుక్కునే సూత్రాలలాగే ఇవీ ఉంటాయని మొదలెట్టాడు. పాణిని ఘనతని ప్రశంసిస్తూనే, ఆధునికమైన Post పరిశోధనలను తీసుకొని ఆ సూత్రాల రూపాలలో ఉండే భేదాలని బట్టి నాలుగు వ్యాకరణాలని నిర్వచించాడు: Unrestricted (type-0), Context-Sensitive (type-1), Context-Free (type-2), Regular (type-3). సహజభాషలని దీంట్లో ఎక్కడ చేర్చవచ్చన్నది పరిశోధనకి వదిలివేశాడు. దీనిని Chomsky Hierarchy అంటారు.

    John Backus (1977 Turing అవార్డు గ్రహీత) అన్న పాతికేళ్ళ కొలంబియా విద్యార్థి న్యూయార్క్ లో IBM కంప్యూటర్ ని చూసి ఉద్యోగం ఇస్తారా అని అడిగితే అప్పటికప్పుడు ఇంటర్వ్యూ చేసి చేరమన్నారు. దానిని ప్రోగ్రామ్ చెయ్యడం చాలా కష్టంగా ఉందని పై స్థాయి భాషలో ప్రోగ్రాములు వ్రాయాలని, యాజమాన్యాన్ని ఒప్పించి రెండేళ్ళలో 1954లో FORTRAN ని విడుదల చేసి, మనందరికీ మెషీన్ భాష లో ప్రోగ్రాం చేసే బాధ లేకుండా చేశాడు. ఈ భాషల వ్యాకరణాన్ని వివరించడానికి Chomsky Hierarchy లో Context-Free Grammar ఆధారంగా ఓ సంకేత పద్ధతిని ప్రవేశ పెట్టాడు. దానిని Backus Normal Form (BNF) అంటారు. అప్పట్లో ALGOL అన్న భాషని వివరించడానికి దీనిని Peter Naur వాడాడు. C, Java, Pascal, ఇలాంటి భాషలన్నీ ALGOL సంతతే. BNF కి Peter Naur (2005 Turing అవార్డు గ్రహీత) దోహదం చెయ్యటానా, దీంట్లో Normal అన్నదానికి అర్థం లేకపోవడానా, Backus Normal Form కి బదులు Backus Naur Form అనాలని Donald Knuth 1967లో ప్రతిపాదించాడు. కాని దీనిని ఎప్పుడో పాణిని కనుక్కున్నాడు కనుక Panini Backus Form అనాలని కొందరు వాదించారు. బహుశా పేరున్న కంప్యూటర్ సైన్సు వాళ్ళ సమర్థన పెద్దగా లేకపోవడాన అది నిలవ లేదు.

    C లో సందిగ్ధానికి తావు లేదన్నారు వేమూరి. అది వాస్తవం కాదు. Dangling else ని ఉదాహరణగా ఇస్తారు: If a then if b then s1 else s2 అన్న దాంట్లో else లోన if కి చెందిందా బయట దానికా అన్నది వ్యాకరణ పరంగా చూస్తే తేలదు. పాణిని పద్ధతిలో అలాంటి అసందిగ్ధతకి తావు లేదని చదివాను [1][2]; రెండూ తెలిసిన చంద్రమోహన్ లాంటి వారెవరైనా వివరిస్తే తెలుసుకోవాలని ఉంది.

    ఏమైనా అంత పకడ్బందీగా ఓ సహజ భాషకి వ్యాకరణం రెండు వేళ ఏళ్ళ క్రితమే సృష్టించారంటే నమ్మలేని సత్యం. అది మన దేశంలో పుట్టిందన్నది గర్వించాల్సిన విషయం.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “On Panini and the Generative Capacity of Contextualized Replacement Systems,” by Gerald Penn and Paul Kiparsky, COLING 2012.
    [2] “Panini’s Grammar and Modern Computation,” by John Kadvany, History and Philosophy of Logic, Jan 2016.

  2. జిక్కి పాడిన మూడు పాటలు గురించి రాజ గోపాల్, ఎస్ అభిప్రాయం:

    01/26/2017 1:42 pm

    రామచంద్ర ‘అన్నా’ చితల్కర్ గారు సీ రామచంద్ర పేరుతొ అనేకానేక చిత్రాలకు చక్కటి సంగీతం అందించారు. పాత పాటల ప్రియులకు వీరు సుపరిచితులే.
    మొదటి జావళి : ఈ వరసకు దగ్గరగా ఉన్న ఇతర గాయనీమణులు పాడిన పాటలు 2 – 3 తగిలినాయి. సంగీతం రాని నేను మిగతావి సవివరణాత్మకంగా చెప్పలేక పోయినా, పోలిక మాత్రం తెలుస్తున్నది.

    పోతే, గొరుసు గారి లేఖకు ఒక చిన్న సమర్పణ: ఒకటి గమనించండి – నత్తి తో బాధ పడేవాళ్ళు కూడా పాట పాడేటప్పుడు నత్తి మరుగున పడిపోతుంది. యాసా అల్లాగే అనుకుంటాను. పైగా సంగీత దర్శకుల శిక్షణ, గాయకుల / కళాకారుల పట్టుదల ఎన్నదగ్గవి.

    మరో చిన్నఅనుమానం – మా ‘ఈమెయిలు’ చిరునామా నా లేక ఈమెయిలే ప్రచురింప బడదా? కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాడనుకోకండి ప్లీజ్.

  3. ఒకనాటి యువ కథ: గోల గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    01/26/2017 12:10 am

    అసలేముందీ కథలో? అన్నారు.
    అసలు కథలో ముఖ్యంగా ఉండవలసినవే పుష్కలంగా ఉన్నాయని సమాధానం.

    ఏమిటవి? చదివించే గుణమూ, స్పందింపజేసే గుణమూను.

    కథల్లో ఇజాలూ, నిజాలూ, వాదాలూ వివాదాలూ దృక్పథాలూ సిధ్ధాంతాలూ రాధ్ధాంతాలూ సందేశాలూ వంటివి కూరి వ్రాసినంత మాత్రాన అవి మంచికథలుగా తయారు కావు.

    ఈమథ్యన చూస్తున్నాను చాలామంది ఏదో ఒక విషయం మీద చిన్నపాటి వ్యాసం ఒకటి తయారు చేసి ఆపైన ఆ విషయాన్నంతా ఒకటి రెండు పాత్రలనోట్లలో క్రుక్కివేసో ఒక లేఖాస్త్రంగా సంధించో అలాంటి మరేదో చిల్లరవేషం వేసి ఆ వ్యాసకళికను కాస్తా కథను చేసిపారేసి హమ్మయ్య అనుకోవటం‌ చేస్తున్నారు. తమాషా ఏమిటంటే అటువంటి దివ్యరచనలకు బహుమతులూ సంపాదించుకుంటున్నారు.

    ఈ చిన్న కథలో తెలుగునాట ఒకనాటి పెళ్ళివారింటి వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. అలనాటి మనుషుల తీరుతెన్నులన్నీ కళ్ళకు కట్టినటుగా చూపించారు.

    మాటతీర్లూ పెళ్ళిలో జరిగే తంతుల్లో తేడాలు వచ్చి ఉండవచ్చును కాని, మనుష్యుల మనస్తత్త్వాలు అలాగే ఉన్నాయా ఏమన్నా మారాయా అన్న ఆలోచన కలుగుతుంది చదువరికి.

  4. పాకశాలలో పాణినీయం గురించి శివగణేష్ అభిప్రాయం:

    01/25/2017 4:39 am

    చాలా బాగుంది.

  5. గడి నుడి – 3 గురించి Mukundala Balasubramanyam అభిప్రాయం:

    01/25/2017 12:03 am

    ఈ పదకేళి చాలా బాగుంది! మరిన్ని పజిల్స్ ప్రచురిస్తారని ఆశిస్తున్నాను.

    ధన్యవాదాలు!

  6. తెగులుకి శిక్ష గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/24/2017 1:19 pm

    వేమూరి గారు

    మీరు, మీ వంటలో అక్కర లేని/యూజ్ చేయని ఇన్ గ్రేడియెంట్సు లిస్టు గివింగు, వై ? 🙂

    ఇది చూడండి.

    https://manaapnews.blogspot.com/2016/09/blog-post_7.html

    సంపాదకులకి – నా బ్రౌజర్లో తెలుగులో టైప్ చేయనీయడం లేదు ఈమాట. అంతకు ముందు వెర్షన్ లో లేఖిని అక్కర్లేకుండా నేరుగా టైప్ చేసే సౌకర్యం ఉండేది. తీసివేసారా?

  7. సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    01/24/2017 12:42 am

    మల్లాది నారాయణశర్మగారికి,
    కట్టా నరసింహులు గారికి,
    ధన్యావాదాలు.

  8. పాకశాలలో పాణినీయం గురించి వీరభద్రం అభిప్రాయం:

    01/22/2017 12:26 pm

    విందువెన్నెల కాదుకదా, ఏ వరాలిచ్చే మారాజో వచ్చి విందువెన్నెల ని “చిరు విందు వెన్నెల” గా మార్చి ఇచ్చినా సరే ఇందులోని విషయం నాబోటివాడికి అర్థం కాదు.

  9. జనవరి 2017 గురించి R.ANNAIAH అభిప్రాయం:

    01/22/2017 7:10 am

    ఈ మాట కొత్త మార్పుల‌కు స్వాగ‌తం.. వెబ్‌పేజీని కొత్త హంగుల‌తో ఆక‌ర్ష‌నీయంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది. కొత్త సంపాద‌క వ‌ర్గానికి అభినంద‌న‌లు. అధ్య‌క్షుల‌వారు మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన ర‌చ‌న‌లు ప‌రిచ‌యం చేయాల‌ని ఆకాంక్షిస్తూ…
    ఆర్‌. అన్న‌య్య,
    క‌ర్నూలు.

  10. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి apparao అభిప్రాయం:

    01/22/2017 6:34 am

    “అవధాన్లు నిక్కుతూ నీలుగుతూ”…
    ఏమిటీ పదజాలం?.యెందులకీ ఆక్రోషం?.
    మీ విశ్లేషణా స్థాయిని ఈ విధానం (మీరు వాడిన పదజాలం) తగ్గిస్తున్నది గురువు గారూ!