పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16472

  1. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి Lakshmanna Vishnubhotla అభిప్రాయం:

    01/14/2017 7:26 am

    This is in rAgaM hiMdOLaM.

    Regards,

    Lakshmanna Vishnubhotla

  2. తానొకటి తలచిన… గురించి Naga Muralidhar namala అభిప్రాయం:

    01/13/2017 11:09 pm

    Stuffed egg plant curry అని మా ఇంటిలో చేసారు. పంపమంటారా గురూజీ

  3. భర్తృహరి అభాషితం గురించి A S Murthy అభిప్రాయం:

    01/13/2017 5:08 pm

    గొప్ప కథ.

  4. జిక్కి పాడిన మూడు పాటలు గురించి గొరుసు అభిప్రాయం:

    01/13/2017 12:37 pm

    శ్రీనివాస్ గారూ, ధన్యవాదాలు. మొదటి పాట నా సిస్టం లో వినిపించలేదు. మిగతావి అద్భుతం. ఒకసారి పాడుతా తీయగాలో బాలు గారు చెప్పారు – జిక్కిగారి ఇంటికి వెళితే అచ్చమైన (తెలుగు+తమిళం కలిసిన ) మాండలికం లో మాట్లాడే వారని . – ఆమెకు ఆ పలుకుబళ్ళు తప్పించి నాజూకుగా మాట్లాడ్డం వచ్చేది కాదట . “వస్తిరా .. రాండి , రాండి . బువ్వ తిని పోండన్నా ” అనేవారట . అదే జిక్కి పాట పాడితే పరవళ్ళు తొక్కాల్సిందే భాష ! గమ్మత్తుగా లేదూ 🙂

  5. అలనాటి నటి ఎస్. వరలక్ష్మితో ముఖాముఖీ గురించి GKK అభిప్రాయం:

    01/13/2017 6:16 am

    S Varalakshmi garu was a great singer with strong base in carnatic music. She should have sung more songs. Had she taken up play back singing, we would have had the fortune of many more classic songs. Nonetheless, she has left an indelible impression with the few songs sung with immaculate precision.

  6. రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి GVL SESHA SAI అభిప్రాయం:

    01/13/2017 5:03 am

    గురువుగారు,

    నమస్కారం. “మనసే అందాల బృందావనం” ఏ రాగంలో ఉంది? దయచేసి తెలుపగలరు.

    జి‌వి‌ఎల్ శేషసాయి. తెనాలి.

  7. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి తిరువాయిపాటి వరదయ్య అభిప్రాయం:

    01/12/2017 8:27 pm

    నేను తెలుగు పండితునిగా పనిచేయునపుడు జాషువాగారి శిశువు పద్యాలను విద్యార్థులకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తాను. ఇంతబాగా చెప్పడం ఇంకొక కవికి సాధ్యపడదేమో అన్నంతగా నన్నలరించాయి. జాషువాగారు పద్యరచనలో నాకు మార్గదర్శి. నేను భగవద్గీతను ఆటవెలదిలో అనువాదం చేశాను. మచ్చుకు గీతలోని అర్జున విషాద యోగం 17వ శ్లోకం గమనిస్తే –

    కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
    ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకి శ్చాపరాజితః

    ఘనమగు విలుఁ గలుగు కాశిరాజు శిఖండి-
    సాత్యకియు విరాట జనపతియును
    దళపతి ద్రుపదుపతి తనయుఁ డు తమతమ-
    దరములూద రవము దరముగొలిపె.

    అని వ్రాయడం జరిగింది.

  8. తానొకటి తలచిన… గురించి dv hanumantha rao అభిప్రాయం:

    01/12/2017 2:24 am

    చాలా బాగుంది, సుబ్రహ్మణ్యంగారు. సైంటిస్ట్ గారికి మరో సైంటిఫిక్ కూర అన్నమాట. సునందగారితో ఆగిపోయాయా ప్రయోగాలు, మరెవ్వరైనా చేసి రుచి చూపారా?

  9. ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    01/11/2017 7:58 am

    good review

  10. తెగులుకి శిక్ష గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    01/10/2017 12:28 am

    వేమూరి వెంకటేశ్వరరావు గారు టీవీ తెలుగు భాష మీద బాగానే పట్టు సాధించినట్లున్నారు. పైన వంటకం వండడం గురించి ఇచ్చిన వివరణ టీవీ వంటల కార్యక్రమానికి ఎంపిక చెయ్యదగినది. ఒక చిన్న సవరణ చేస్తే టీవీ కి మరింత అనుకూలంగా ఉంటుంది. “తయారు చేసే పద్ధతి” అన్నారు. దాన్ని ఎక్కువగా “ప్రోసెస్” అంటారు టీవీ వారు.

    తెలుగు టీవీ కార్యక్రమాల్లో (ముఖ్యంగా వంటల కార్యక్రమాల్లో) భాష – మాట్లాడే వాక్యంలో క్రియ తప్ప మిగిలిన పదాలన్నీ వీలయినంత వరకు ఇంగ్లీషువే అయ్యుండాలి అనే సూత్రానికి కట్టుబడుంది అనిపిస్తుంది. అలాగే వంటకం పేరు హిందీలో ఉంటే మరింత గొప్ప అనే తపన కనిపిస్తుంటుంది.

    “చరిత్ర ఎరుగని మహా పాతకము మా దేశానికి పట్టినదా” అని ఒక పాత సినిమాలోని పాట.