సున్నితమైన హాస్యం, బాగుంది! పునరుక్తి ఇక్కడ దోషం కాకపోగా హాస్యాన్ని పంచింది…
(Lydia Davis ఈ కథ ఒక్కో పుస్తకంలో ఒక్కోలాగా ఉంది. Samuel Johnson is Indignant (2001) లో ఎలాంటి టైపోగ్రాఫికల్ దోషాలనీ లేకుండా ప్రచురించగా, The Collected Stories of Lydia Davis (2010) పుస్తకంలో మాత్రం మొదటి వాక్యంలో మాత్రమే ‘dau ghters’ అని ప్రచురించారు. ఇది సజెస్టివ్ గా ఉంది. ఇంతకు మించిన తప్పుల్ని ఆవిడ ఆ మూలకథలో ప్రకటించారో లేదో తెలీదు… )
ఇటువంటిదే లోగడ ఒక కథను చదివాను. అందులో వేటగాడూ పులీ తారుమారు కావటం జరుగుతుందని గుర్తు.
ఈ సర్వవ్యాప్తమైన ఆత్మ అనే భావన భారతీయులకు ప్రత్యేకం కావచ్చును. ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి భావనలు అక్కడక్కడా తలెత్తినా ఒక సిధ్ధాంతస్థాయిలో అవి వృధ్ధి చెందాయని అనుకోను. భారతీయదృక్పథం ఈ భావనను ఒక సిధ్ధాంతంగా ఎంత ఉన్నతస్థాయికి చేర్చినదంటే ఆ ఆత్మనుండే దృశ్యభావ్యమానములైన సర్వమూ దృశ్యభావ్యమానేతరమైన సర్వమూకూడా అదే అని నిరూపించేంతగా.
అనువాదం బాగుంది. ఐతే అనువాదాల్లోనికి స్థానికతను మరింతగా చొప్పించవచ్చును, ముఖ్యంగా చిన్నచిన్న కథల్లో – పాత్రలపేర్లూ స్థలాలపేర్లూ కూడా మార్పు చేయటం ద్వారా. చివరలో విడిగా ఈ సంగతిని చెప్పవచ్చును. లేదా చివరన ఫలాని భాషలోని ఫలాని రచన ఆథారంగా అని చెప్పటం సరిపోతుంది. దానివలన కథలో చదివించేగుణం మరింతగా వృధ్ధిచెందుతుంది. అవేవో తెలుగులోనికి అనువదితమైన మతగ్రంథాల విచిత్రభాషలాగా కాక సహజసుందరమైన తెలుగులోనికి సాహిత్యానువాదాలు చేయటం వీలైనంతగా చేయాలి. ఇదంతా నా ఉబోస మాత్రమే రచయితకాని ఇతరసాహిత్యకారులు కాని పట్టించుకోవాలని వాదించటం కోసం చెప్పిన మాటలు మాత్రం కావు.
(“అతులిత తావకీన మహిమాతిశయోచిత మైన పుణ్యకవ్రత మొనరింపఁగా వలయు వారిజలోచన!” అన్నది పారిజాతాపహరణం లోనిది. “చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలించితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య” అన్నది కూచిమంచి తిమ్మకవి పేరిట ప్రసిద్ధమైన ఒక చాటు పద్యం”)
కృష్ణమోహన్ గారికి నమస్సుమాంజలి
గురువుగారు యతిమైత్రిని నిర్ణయించు పద్దతి తెలుపగలరు.నేను చదివిన మేరకు యతి అనగా వృత్తపద్యమును గానము చేయువానికి ఊపిరి తీసుకొనుటకు గల విరామస్థానం. అట్లయినచో ఛందమున గల అన్ని వృత్తములకు ఒకటే యతి కావలయును.కానీ ఉత్పలమాల, మత్తేభం విషయంలో ఇది పొసగదు. ఇది కాకుండా గాయకులు తమ గాత్ర సాధన బట్టి చాలా సేపు విరామం లేకుండా పాడగలరు. మరి ఈ సందర్భంలో గాయకులును బట్టి విరామ స్థానాల్లో మార్పు రావలసి యున్నది.నాకు గల ఈ సందేహాన్ని మీరు తీర్చగలరని ఆశిస్తున్నాను.అంతేకాకుండా పైన కొత్తగా 34 అక్షరముల వృత్తపద్యమును వివరించారు.మరి దీనికి యతిస్థానాలు ఎలా నిర్ణయంచారు తెలుపగలరు.
చెప్పేదెవరు? గురించి nmrao bandi అభిప్రాయం:
02/02/2017 12:14 am
ప్రోత్సాహానికి ధన్యవాదాలు గురువు గారు.
అవునండి తెలిస్తే అంతకన్నా కావలసినది,
కోరుకునేది కూడా ఏమీ ఉండదు.
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి రమణమూర్తి అభిప్రాయం:
02/01/2017 10:36 pm
సున్నితమైన హాస్యం, బాగుంది! పునరుక్తి ఇక్కడ దోషం కాకపోగా హాస్యాన్ని పంచింది…
(Lydia Davis ఈ కథ ఒక్కో పుస్తకంలో ఒక్కోలాగా ఉంది. Samuel Johnson is Indignant (2001) లో ఎలాంటి టైపోగ్రాఫికల్ దోషాలనీ లేకుండా ప్రచురించగా, The Collected Stories of Lydia Davis (2010) పుస్తకంలో మాత్రం మొదటి వాక్యంలో మాత్రమే ‘dau ghters’ అని ప్రచురించారు. ఇది సజెస్టివ్ గా ఉంది. ఇంతకు మించిన తప్పుల్ని ఆవిడ ఆ మూలకథలో ప్రకటించారో లేదో తెలీదు… )
నాయం హంతి న హన్యతే గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
02/01/2017 10:29 pm
ఇటువంటిదే లోగడ ఒక కథను చదివాను. అందులో వేటగాడూ పులీ తారుమారు కావటం జరుగుతుందని గుర్తు.
ఈ సర్వవ్యాప్తమైన ఆత్మ అనే భావన భారతీయులకు ప్రత్యేకం కావచ్చును. ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి భావనలు అక్కడక్కడా తలెత్తినా ఒక సిధ్ధాంతస్థాయిలో అవి వృధ్ధి చెందాయని అనుకోను. భారతీయదృక్పథం ఈ భావనను ఒక సిధ్ధాంతంగా ఎంత ఉన్నతస్థాయికి చేర్చినదంటే ఆ ఆత్మనుండే దృశ్యభావ్యమానములైన సర్వమూ దృశ్యభావ్యమానేతరమైన సర్వమూకూడా అదే అని నిరూపించేంతగా.
అనువాదం బాగుంది. ఐతే అనువాదాల్లోనికి స్థానికతను మరింతగా చొప్పించవచ్చును, ముఖ్యంగా చిన్నచిన్న కథల్లో – పాత్రలపేర్లూ స్థలాలపేర్లూ కూడా మార్పు చేయటం ద్వారా. చివరలో విడిగా ఈ సంగతిని చెప్పవచ్చును. లేదా చివరన ఫలాని భాషలోని ఫలాని రచన ఆథారంగా అని చెప్పటం సరిపోతుంది. దానివలన కథలో చదివించేగుణం మరింతగా వృధ్ధిచెందుతుంది. అవేవో తెలుగులోనికి అనువదితమైన మతగ్రంథాల విచిత్రభాషలాగా కాక సహజసుందరమైన తెలుగులోనికి సాహిత్యానువాదాలు చేయటం వీలైనంతగా చేయాలి. ఇదంతా నా ఉబోస మాత్రమే రచయితకాని ఇతరసాహిత్యకారులు కాని పట్టించుకోవాలని వాదించటం కోసం చెప్పిన మాటలు మాత్రం కావు.
చెప్పేదెవరు? గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
02/01/2017 9:27 pm
కవిత బాగా వ్రాసారు బండి వారూ. నిర్వేదానికి “ముగింపు ఎక్కడో? ఎన్నడో?” తెలిస్తే అంతకన్నా కావలసినదేముంది?
తాటిపండుకల్లు గురించి nmrao bandi అభిప్రాయం:
02/01/2017 8:56 pm
ఏం జెప్పాలె …
అద్భుత పద విన్యాసం,
భావావిష్కారం.
అభినందనలు…
You’re the best of all my friends, which is why గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
02/01/2017 8:11 pm
చంపకమాలలో నాదో సెంటో!
చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను ప్రస్తుతిం-
చితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య-య
ద్భుతమగు శాస్త్రవిద్యలకు పూర్ణత నొందగజేయు పంతువీ
వతులిత తావకీన మహిమాతిశయోచితమైన రోజునన్!
Happy Birthday, Sir!
(“అతులిత తావకీన మహిమాతిశయోచిత మైన పుణ్యకవ్రత మొనరింపఁగా వలయు వారిజలోచన!” అన్నది పారిజాతాపహరణం లోనిది. “చతురులలోన నీవు గడు జాణ వటంచును నేను గౌగిలించితి నిటు మాఱుమోమిడఁగజెల్లునె యో రసికాగ్రగణ్య” అన్నది కూచిమంచి తిమ్మకవి పేరిట ప్రసిద్ధమైన ఒక చాటు పద్యం”)
బుఱ్ఱకథ నాజర్‌గారి రెండు ఇంటర్‌వ్యూలు గురించి Html అభిప్రాయం:
02/01/2017 4:27 pm
Nazar wikilink is NOT working.
(Fixed – Ed.)
గజేంద్ర మోక్షం: వెక్కిళ్ళ పురాణం గురించి శ్రీహరి అభిప్రాయం:
02/01/2017 2:27 pm
తమాషాగా కొత్తగా బాగుంది
గులకరాళ్ళు గురించి శ్రీహరి అభిప్రాయం:
02/01/2017 7:37 am
చక్కటి కవితలు. సరళమైన పదాలు.
సిరినివాస వృత్తము గురించి విజయకుమార్ గేదెల అభిప్రాయం:
02/01/2017 7:25 am