ACP శాస్త్రిగారిగా చిరపరిచితులైన అందుకూరి చిన్నపొన్నయ్య శాస్త్రిగారు రేడియో నాటక రచయిత. పలు చారిత్రక, సాంఘిక నాటకములు వ్రాసి ఉన్నవారు. సంగీత సాహిత్య పరిజ్ఞానం కలిగినవారు. వసుచరిత్రలోని సంగీతశాస్త్రీయత గురించి 2004లో ప్రసారం చేయబడిన వారి రేడియో ప్రసంగమును ఈమాట పాఠకులకై అందిస్తున్నాను. ఈ ప్రసంగం స్వయానా శాస్త్రిగారే ఈమాట పాఠకుల కోసం పంపినారు.
సమర్పణ: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయ్
రచయిత అందుకూరి చిన్నపొన్నయ్య శాస్త్రి గురించి:
అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి (ఎ.సి.పి.శాస్త్రి) బహుముఖ ప్రజ్ఞాశాలి. కంచుఘంటలాంటి స్వరంతో వేదాలనుంచి వేమన పద్యాలవరకూ ఏ విషయంలోనైనా అనర్గళంగా మాట్లాడగల నేర్పు గలవారు. శాస్త్రంనుంచి శాస్త్రీయ దృక్పధాన్ని పిండగల ఓర్పూ నేర్పు గలవారు. ఏది చెప్పినా, మాట్లాడినా ఋషిప్రోక్తంగా భాసి౦పజేసే వాక్కు ఆయన స్వంతం. నాటక రచనలో సిద్ధ హస్తులు. వృత్తి రీత్యా రిజర్వ్ బాంక్ ఉద్యోగమే కాని ప్రవృత్తిపరంగా సాహిత్య సంగీతాలలో కూడా తన ప్రతిభను చాటుతూ సార్ధకంగా జీవిస్తున్న పెద్దలు శ్రీ అందుకూరి చిన పున్నయ్య శాస్త్రి గారు.