పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/26/2017 10:34 pm

    I have read the translation carefully and the relevant comments. I am not privy to the original preface or the afterword for the novellas, and as such I could not comment on the translation. There might have been a couple of places where the translator/editors might have missed, and that need not create a big debate. (We seem to get lost with a word or two in all our comments.)

    I have a different question.

    What is the motivation to translate the preface of a book that is going to be published in 2018?

    If there is a secret and sacred reason, I would not dwell on it any further.

    If I were to learn and understand something about the novellas, I must admit that it is impossible to do so by reading the translation of the preface alone. At this point I have to agree with Kompella Bhaskar.

    It is my experience that Velcheru Narayana Rao usually writes his ‘thesis’ in the Afterword. In almost all his translations thus far, it is the Afterword that enlightens the reader and makes the reader think. Sometimes, he postulates controversial views, usually that run contrary to the existing run-of the mill-type. That makes his afterwords worth reading, even if one disagrees.

    I am aware of the editor’s note that the translation of the Afterword would be published in the forthcoming issue. But, that still does not answer my primary question.

    I repeat. What is the motivation to translate the preface and afterword of a book primarily intended for the English-reading or the Western audiences?

    Finally, if it makes any sense, please re-publish an article entitled “ Horse –Headed Gods and White-Skinned Men: A Second Look at Viswanatha Satyanarayana’s HA HA HU HU written by Velcheru Narayana Rao in the Journal of South Asian Literature (1981), which would give quite a load of information about one of the novellas that the Penguins are scheduled to publish.

    Veluri Venkateswara Rao

  2. ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    04/26/2017 8:58 pm

    మానస చామర్తి తాను రాసిన సమీక్షపై చాలా రోజుల క్రితం నా అభిప్రాయం వినాలని అడిగారు. ‘ఏవైనా కామెంట్లు వచ్చిన తరువా తప్పకుండా రాస్తాను,’ అని అన్నాను.

    ఆశ్చర్యం!

    మానస, అవ్యయ కవితా సంకలనం పూర్తిగా చదివి, వీలయినంతవరకూ మూలంతో పోల్చిచూసి, విపులంగారాసిన సమీక్షపై ఒక్క కామెంట్‌ రాకపోవడం విచిత్రంగా కనిపించింది. కవిగా, విమర్శకురాలిగా మానస ప్రతిభ ఎన్నదగినది. ఒక్క కామెంటు రాకపోవడానికి కారణం, బహుశా అనువాదకుడిగా నాపేరు ఉండటం కావచ్చు. అంతకన్నా వేరే కారణం నాకు దొరకటల్లేదు.

    సౌభాగ్య వాడిన ప్రతీకల గురించి మీరు చెప్పిన ప్రతి వాక్యమూ నిజమే!

    మీరు పద్యం చదివే పద్ధతి వేరు. పద్యాన్నివ్యాఖ్యానించే పద్ధతి మీ ఆరోచకత్వానికి నిదర్శన.

    ‘కవితల ఎంపికలో అనువాదకుల అభిరుచి సుస్పష్టంగా కనపడింది. అపురూపమైన ప్రతీకలకు అంతే అందమైన తెలుగు పదాలను వాడడం ద్వారా మూలంలోని సౌందర్యాన్ని వీలైనంతగా తెలుగులోనూ ప్రతిఫలింపజేశారు,’ అని మీరు అంటే కాదని ఎట్లా అనగలను?

    మీరు చూపిన కొన్ని వాక్యాల్లో అస్పష్టతకి చాలా కారణాలున్నాయి. వాటినన్నింటినీ ఏకరువు పెట్టటం అనవసరం. ‘ఇవాళ గనుక నగరంలో టెలిగ్రాఫ్ తీగలన్నీ తెగిపోతే,/ ప్రియురాలి ముఖం నీరసంగా కనపడుతుంది, మాటలు అన్నీ/ గాలిలో ఎగిరిపోవు.’ ఇక్కడ ఎగిరిపోవు అన్నది, పోవును అన్న అర్థంలోనే వాడాను. కానీ మీరన్నట్టు పోతాయి అంటే బాగుండేది.

    ‘ అనుసృజన లోని వాక్యం తెలుగు నుడికారానికి మరికొంత దగ్గరగా ఉండి, భాష ఆసాంతమూ ఒకే ఒరవడిలో సాగి ఉంటే, పాఠకులకు ఆ ఇబ్బంది తెలిసేది కాదేమో,’ అని రాసారు. ఒప్పుకుంటాను.

    ‘ఈ పుస్తకంలోని కవితలన్నీ అనుభూతి ప్రధానమైనవి. సౌభాగ్య ఏ అనుభూతినీ మామూలు మాటలతో పాఠకులకు చేరవేయాలనుకోడు. ఎన్ని ప్రతీకలు వాడైనా సరే, తన అనుభూతిలోని గాఢతని పాఠకులకు చేరవేసే తీరుతాడు.

    ఈ ప్రతీకలే సౌభాగ్య కవిత్వానికి అసలైన బలం. ఒక సంఘటనో, అనుభవమో ఇలా ప్రతీకలతో వర్ణించినప్పుడు, అది పాఠకులకు అర్థం కాకపోయే అవకాశాలు తక్కువ. కాబట్టి, ఈ పుస్తకంలో ఎక్కువ భాగం ఇవే ఉన్నాయంటే, ఇది కవితల ఎంపికలో అనువాదకుల శ్రద్ధను, అనువాదంలో ఉండే పరిమితుల పట్ల వాళ్ళకున్న అవగాహననూ చూపెడుతోంది.’ మాకు మీరు మరీ ఎక్కువ గౌరవం ఇచ్చారు. Thanks.

    బ్రతికి ఉన్న కవి కవితలని అనువదించటం లో చాలా ఇబ్బందులున్నాయి. ఆ ఇబ్బందులు ఏకరువు పెట్టి విగించదలచుకోలేదు.

    ఆఖరిగా ఒక్కమాట: ఈ కవితలపై, న్యాయపతి శ్రీనివాస రావు (వాసు) పుస్తకమ్.నెట్ లోను, వాడ్రేవు చిన వీరభద్రుడు ఫేస్‌బుక్‌ లోను, తమ్మినేని యదుకులభూషణ్‌, ఈమాట లోనూ సమీక్షించారు. మీరు ప్రస్తావించిన ప్రతీకలు, అనుభూతులూ, అనుసృజనలో మంచీ-చెడూ, సౌభాగ్య కవితలలో కనిపించే ప్రాంతీయత, ఆథునికత, వాళ్ళు కూడా విపులంగా చర్చించారు.

    నలుగురు లబ్ధప్రతిష్టులైన కవి-విమర్శకులు నా సంకలనాన్ని సమీక్షించి/విమర్శించడం నాకెంతో గర్వకారణం.

    అందరికీ నా అభినందనలు.

  3. వసంతతిలకము గురించి Chaithanya అభిప్రాయం:

    04/25/2017 5:49 am

    మోహన రావు గారికి,

    నాదొక చిన్న సందేహం. మీరు తెలుగు వచనం రాసేటప్పుడు పత్రికల్లో, పుస్తకాల్లో సాధారణంగా వాడే ఆధునిక వ్యావహారిక భాషను పూర్తిగా వాడకుండా కొన్ని గ్రాంథిక రూపాలు వాడడానికి కారణం ఏంటి?

    ఉదాహరణకు, సున్నాకు బదులు మువర్ణం – పరిచయం/పరిచయము; దీర్ఘానికి బదులు ‘ములు’ – వృత్తాలు/వృత్తములు; దానికి/అందులకు.

    నేను ‘ఈమాట’ ఈమధ్యే చదువుతున్నాను. ఈ ప్రశ్న కేవలం ఆశ్చర్యం కొద్దీ అడుగుతున్నాను, మిమ్మల్ని విమర్శించాలని కాదు.

    చైతన్య

  4. వింజమూరి శివరామారావు లలితగీతాలు గురించి Vinjamuri Venkata apparao. అభిప్రాయం:

    04/22/2017 9:39 am

    శివరామరావుగారు మా బాబయ్యగారు. వారు రాసిన రామయణం నేను యు ట్యూబ్ లో upload చేశాను. అది పాడింది బొడ్డుపల్లి సుబ్బలక్ష్మి గారు. సుబ్బలక్ష్మి గారు మాసోదరి బాల మురళి ప్రియ శిష్యురాలు. ఆవిడ పాడిన మరి కొన్ని పాటలు కూడా నాచాన్నేల్లో చూడవచ్చు. కృష్ణశాస్త్రి గారి కవితలు కూడా అప్లోడ్ చేసాను.

  5. విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు గురించి Bh. కామేశ్వరరావు అభిప్రాయం:

    04/21/2017 6:46 pm

    ఈ అప్రస్తుతప్రశంస గురించి యింత ప్రసంగం అప్రస్తుతం! 🙂

    ప్రశంస అంటే పొగడడం అనే అర్థంతో పాటు ప్రసక్తి అనే అర్థం కూడా ఉంది. అప్రస్తుతప్రశంస అనే ఒక అలంకారం ఉంది, అక్కడ ప్రశంస అంటే ప్రసక్తి అనే అర్థమే. వాడుకలో కూడా అప్రస్తుత విషయాన్ని ప్రస్తావించడాన్ని అప్రస్తుత ప్రశంస అని అనడమూ ఉంది. అంచేత ఈ అనువాదంలో నాకు పెద్ద దోషమేమి కనిపించ లేదు.

    ఇంకా తప్పుపట్టాలి అంటే “అతి మనోబుద్ధ్యహంకృతుల్” అనే పద్యానికిచ్చిన అర్థాన్ని తప్పుపట్టాలి. “ఉపనిషత్తులకూ వేదాలకూ ఆకృతి ఇచ్చిన వారు” అనే అర్థం పద్యంలో కానీ, ఇంగ్లీషు అనువాదంలో కానీ లేదు.

  6. You’re the best of all my friends, which is why గురించి lyla yerneni అభిప్రాయం:

    04/21/2017 10:34 am

    A Cento

    The Tree of life is bitter,
    Torture us, please
    Five, Six, Seven
    Final freedom is that state of no pain
    In agony, the champaka blossom wondered
    “Is he a good lover?”

    – Lyla

    PS:
    (Why doesn’t Veluri simply tell us to go to page 209 – Index of First Lines, in this book?
    It is a very good book, cover to cover.
    Good cento, vrv!)

  7. వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్! గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    04/18/2017 9:42 pm

    ధన్యవాదాలు మంజరి లక్ష్మిగారూ….

  8. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి తమ్మినేని యడుకుల భూషణ్ అభిప్రాయం:

    04/16/2017 10:47 pm

    తెలుగులో ఒక సైగల్ జన్మించనందుకు ఎప్పుడూ విచారపడుతుండే వాణ్ణి. పలువురు పెద్దలు విశ్వనాథ గళ ప్రాశస్త్యాన్ని ఉగ్గడించినా నాకు వినే భాగ్యం కలుగలేదు. కిన్నెరసాని పాటలు మహాకవి గొంతుకలో వినడం ఒక అద్భుతం .తెలుగులో సైగల్ లేని లోటుని తీర్చారు విశ్వనాథ. సుబ్బులక్ష్మి కర్ణాటక సంగీత వైదుష్యం జగమెరిగినదే. ఆ లలితమైన స్వరం ముందు పలువురి గొంతులు రాసబ స్వరాలే. గాయకుడు అనగా భాష వెనుక లోతులను ఎరిగి, ఉద్వేగపు టెత్తులను తడిమి అవలీలగా హృదయగతం చేయగలిగిన వాడు. సంగీతంలో కేవలం తాళ లక్షణాలను, రాగ జ్ఞానాన్ని ఒదిగించడం లో లేదు గాయకుని నేర్పు -అది చాలా ప్రాథమిక స్థాయి. ఛందోబద్దంగా పద్యం రాసి అదే కవిత్వమని భ్రమసి అదే కొలమానంతో నలుగురు మహాకవుల మారు మూల పద్యాల్లో యతి లేదు అని అల్పానందంతో మిడిసిపడే స్థాయి. లైలా గారి విశ్లేషణ కొద్దో గొప్పో వంగకవి రవీంద్రుని విషయంలో నిజం.

    విశ్వనాథ రసైక జీవి, సైగల్ ని వినడం అలవడితే విశ్వనాథను అందుకోవడం కష్టం కాదు. పాశ్చాత్య సంగీతం మాటకొస్తే Haydn, Beethoven ల మధ్య భేదాలను చక్కగా గుర్తుపట్టగలిగితే నేను క్లుప్తంగా రాసిన నాలుగు మాటలు వేగంగా అర్థమవుతాయి.

  9. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/16/2017 10:26 pm

    <> Rest of the insightful comment deleted for brevity.
    Lyla: I am completely with you! On a personal note, I was inspired to collect the poets’ voices in Telugu following a 78rpm disc of T.S. Elliott that I have seen during my early college days. A short time later came across a disc of Sarojini Nayudu reciting her own poetry. So, I started looking for such recordings in Telugu. The real motivation to submit them to eemaaTa came when I happened to visit British Library. Even today BL sells a CD of famous writers/poets voices :-). I am pretty sure that it was also the motivation for late Dr. Gutala Krishnamurti when he brought out SriSri’s (London) “mahaaprasthaanam” in 1980 with SS reciting his own poems.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను.

    Here I have come across people who believe that only the poet can bring out the beauty in his/her recitation. A cousin of mine hated the film version of “aanandam arNavamaitE” but liked SS’s version.

    Nitpicking: Are you referring to (Bedrich) Smetana’s Moldau (Vltava in Czech)?

    Thanks for a good piece of writing! — Sreenivas

  10. విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు గురించి lyla yerneni అభిప్రాయం:

    04/15/2017 7:12 pm

    ఈలాటి శబ్ద తరంగాలు ‘సెలెబ్రిటీ’ మోజు ఉన్నవారి కోసం. అంతే కాని ఇవి కవిత్వ ప్రియులను, సంగీత ప్రియులను రంజింప చేయలేవు.

    ఉంటుంది, మనుషులకు కుతూహలం ఉంటుంది. అందమైన వర్ణ చిత్రాలను చూసినా, రచనలు చదివినా, ఆ కళాకారుడు ఎవరు, అతని ఫొటో చూడాలనో, స్వయంగా కలవాలనో ఉంటుంది. చూడొచ్చు, కలవొచ్చు. విశ్వనాథ సాహితీ ప్రియులకు కొందరికి ఆయన కంఠంలో ఆయన కవిత వినాలని ఉంటుంది. పాఠకుల విభిన్న మనస్తత్వాలను, ఇష్టాలను గ్రహించగలిగిన సంపాదకులు బహుశా ఆ కారణం చేత వీటికి ఈ పత్రికలో స్థానం ఇస్తూ ఉంటారు.

    కాని, కవితా పఠనం బాగు ఓగుల దృష్యా చూస్తే, కిన్నెరసాని లోని ఊహకు, ఇక్కడ విశ్వనాథ కంఠం నుండి వెలువడే ధ్వనికి సమగ్ర సంయోగం లేదు. కవి -ప్రియురాలా! జవరాలా! అంటూ అస్పష్టపు కూనిరాగాలు తీస్తూ, కవిత చదువుతూ, ఆపుతూ, మధ్య మధ్యలో ఆ కిన్నెరసాని వాగు కథ చెపుతున్నారు. ఆయన మెదడులో ఉన్న ఆ దృశ్యం, ఆ ధ్వని, మన కళ్లకూ, చెవులకూ చేరే దృశ్యం, ధ్వనీ -ఒకటి కావు. మనలో చాలామందిమి, పాడుకుంటున్నప్పుడు జరిగేది ఇదే.

    ఉదాహరణకు: నేను (లైలా)
    “శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ, శ్రీమన్నారాయణ
    నీ శ్రీపాదమే శరణు ఊ…..”
    అని పాడుతుంటే, నాకు మెదడులో అప్పటికే రికార్డ్ ఐపోయి ఉన్న నా కిష్టమైన శ్రీమతి సుబ్బులక్ష్మి పాట వినిపిస్తుంటుంది, నామటుకి నేను ఒక ఆనంద ప్రపంచంలో ఉంటాను. నా పాట వింటున్న పక్క వాళ్లు, ముందు నేలమీద మొదలై, అకస్మాత్తుగా ఆకాశాన్నంటి, మళ్లీ గబుక్కున పాతాళంలోకి పోయి, స్వరానికీ స్వరానికీ పొంతన లేని అపశృతి మయమైన కఠోర శబ్దాలు వింటుంటారు. సుబ్బులక్ష్మి పాటనే కాక, నా పాట కూడా రికార్డ్ చేసుకుని నేను వింటే తప్ప, ఆవిడ అత్యంత మధురంగా పాడిన ఆ అన్నమాచార్యుని కీర్తనకు నేను ఎంతదూరంలో ఉన్నానో తెలియదు.

    అది తెలియక, ఇంకా అదే చాపల్యంతో;
    “కమలాసతీ ముఖ కమల కమల హిత, కమల ప్రియే, కమలేక్షణా
    కమలాసన హిత, గరుడగమన, శ్రీ కమల నాభ! నీ పదకమలమే శరణు ఊ….”
    అని నే పాడేస్తుంటాను.

    నా అదృష్టవశాత్తు, నే వినేది నా మెదడులో, సుబ్బులక్ష్మి పాటనే. సంగీతం లక్షణాలలో, దాని పుణ్యమా అని, అది ఒకటి.

    అదే విశ్వనాథకు కూడా జరుగుతున్నది. ఆయన తన కాలంలో చాలా మధుర గాయకులను వినే ఉంటారు. తన కిన్నెరసాని కవితను ఈ సభలో అలా పాడుతున్నాను అనుకుంటున్నారు. వాస్తవం అది కాదు. ఆ పఠనం అంత గొప్పగా లేదు.

    ఒక కవిత్వం లోని అందాన్ని చూపలేని, పైగా తగ్గించే -ఈ కవన పఠనం, ఇప్పుడు ఎందుకు వింటం? అనుకుంటాను నేను. ఎప్పుడో ఒక సభలో ఆయనకు కవిత చదివే అవకాశమిచ్చారు. అప్పటి శ్రోతలు విన్నారు. దాని ఆవశ్యకత అంతటితో తీరిపోయింది. ఫేమస్ ఐన వాళ్ల ఒకప్పటి మాటలు పాటలు ఎట్లా ఉన్నాగాని కలెక్టబుల్స్ అనుకుని, ఆ route లో, నాస్టాల్జియా కలెక్షన్గా, ఇలా ఇప్పటి పత్రికలో వచ్చి చేరతాయి, కొన్ని గరగరల, అపశబ్దాల ఆడియోలు.

    కళ మీద ఆసక్తి ఎక్కువ, వ్యక్తి మీద drooling తక్కువ ఉంటే, కిన్నెరసాని ఆకస్మిక కోపం, దు:ఖం, ఆమె నీరవటం, భర్త బండవటం, సముద్రుడు ఆమెకోసమై ఎగసిపడటం, ఆమె కళవళపడి గోదావరిలో లయించటం – ఈ గాథను ఇప్పటి గాన గంధర్వులతో పాడించి, లేదా మంచి వాయిద్యకారులతో సింఫొనీ మ్రోగింపచేయిద్దామని వారిని నియోగించి, ఆ కొత్త రికార్డింగ్ బాగుంటే విడుదల చెయ్యొచ్చు.

    లేదూ, విశ్వనాథ కిన్నెరసాని దాని దోవన అది చదువుకుని, అప్పుడో మరోసారో, Edward Greg- Solveig’s song విన్నా. Svetlana – Moldau విన్నా, సుఖం ఉంది. ఆ సంగీత నదీ ప్రవాహాల చలనాలకి హృదయం కరిగి పోతుంది.
    చక్కని శబ్దానికి, ఎక్కడిదైతేనేం మంచి శ్రోతగా మారితే చాలదా?

    Lyla