పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి ఇమ్మడిశెట్టి ఉమాకాంత రావు అభిప్రాయం:

    05/02/2017 3:30 am

    భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,

    ప్రణామములు.

    చరిగొండ ధర్మన్న గారి చిత్రభారతం లోని మీకు నచ్చిన పద్య వివరణ బాగుంది అంటే చాలా చిన్న మాటే. అసలు సాంబ్రాణి తేజి అనడమే చాలా గొప్ప కవి ఊహ. ఇప్పటి కవులకు ఇది అందే అవకాశమే లేదనడం అతిశయోక్తి కాదు.

    తర్వాత, చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకర పద్యంప్రారంభ పాదం సత్య హరిచ్చంద్ర పద్య నాటకంలో కనిపిస్తున్నది. చరిగొండ ధర్మన్న ప్రభావం బలిజేపల్లిపై కూడా ఉందన్న సత్యాన్ని ఎరుక పరుస్తున్నది కదా!

    పద్యాల సొబగులను వివరిస్తున్నందుకు ధన్యవాదములు.

  2. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి సుందరం అభిప్రాయం:

    05/02/2017 1:29 am

    “ఒక నిర్ధూమ సజీవాగ్ని శైలహస్తాల్లో
    నా కవిత్వాన్నుంచి బెరుగ్గా ఎదుట నిల్చున్నాను
    చిన్ని గడ్డిపోచ
    వసంత స్పర్శ తననెట్లా తలమున్కలు చేసిందీ
    వచ్చీరాని భాషలో చెప్తే ఎవరికర్థమవుతుంది
    ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప”
    ఎంత ‘ఎదిగినా’ ఇంతకంటే “ఒదిగి” వుండటం మరొకరికి సాధ్యమా!
    ఒక్క భద్రుడి గారికి తప్ప

    “మహానగరాల్లో తను ఏకాకేమో గానీ ఆ శరభవరం పక్కనున్న అడవిలో ఆ జాతర్ల గుంపులో భద్రుడు ఎప్పుడూ ఏకాకి కాడు. అక్కడెక్కడ తనని మనం వదలిపెట్టినా చక్కగా గోధూళివేళకి ఇల్లు చేరుకోగలడు.”
    మీ ఇద్దరి సాహితీ సాన్నిహిత్యానికి ఇంక వేరే ఋజువులెందుకు?

  3. అదీ నేనే… గురించి Suparna mahi అభిప్రాయం:

    05/02/2017 1:24 am

    చాల చక్కని పోయెమ్. అభినందనలు.

  4. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి renuka ayola అభిప్రాయం:

    05/02/2017 12:26 am

    ఆద్భుతమైన సమీక్ష వీరభద్రుడి గారి కవిత్వంలా ….

  5. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Swathi Yakasiri అభిప్రాయం:

    05/01/2017 11:27 pm

    వారి కవిత్వానికి తగిన అద్భుతమైన సమీక్ష!

  6. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Vijay Koganti అభిప్రాయం:

    05/01/2017 9:40 pm

    భద్రుడుగారి అద్భుత కవిత్వానికో విరిదండ యీ సమీక్ష.

  7. సగమే పూర్తయిన ఓ కవిత గురించి Vadrevu Chinaveerabhadrudu అభిప్రాయం:

    05/01/2017 9:19 pm

    చక్కని కవిత.

  8. రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి మోహన అభిప్రాయం:

    05/01/2017 12:51 pm

    “పదులు నూర్లు వేలు పద్యాలె గాదయా
    వరలు కావ్య మొక్క వాక్యమైన
    చెప్పగలుగ రసము చిప్పిలునట్లుగా”

    వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు అందుకే పెద్దలు. బాగున్నాయి మీ పద్యాలు! నమస్సులతో – మోహన

  9. రామచంద్ర పుత్ర! రామభద్ర! గురించి వాణి దుగ్గరాజు అభిప్రాయం:

    05/01/2017 12:14 pm

    వాగ్వధూటి కెన్ని భాష లున్నను నామె
    పలుకు సంస్కృతమ్ము, కులుకు తెలుఁగు
    సొగసు లూరు వాక్కు సొంతమైనది “నీకు”
    రామభద్ర పుత్ర! వాసుదేవా!

    అందుకె అంత బావుంది!!

  10. తెలుగు భాషా ప్రాచీనత గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    05/01/2017 10:35 am

    పులుమావిస అని మీరు చెప్పినట్టే గౌతమస, కాశ్యపస అంటూ గోత్రాల పేరు చెప్పడం ఇలాగే వచ్చిందేమో. అయితే కొన్నిటికి స కలువదు, వశిష్ఠ మొదలైన గోత్రాలలో.